21, డిసెంబర్ 2011, బుధవారం

చమత్కార పద్యాలు - 152

                                చాటు శ్లోకం

విరాజరాజపుత్రారేః
యన్నామ చతురక్షరమ్
|
పూర్వార్ధం తవ శత్రూణాం
పరార్ధే తవ సంగరమ్
||

భావం -
‘విరాజరాజపుత్రారి’కి సంబంధించిన నాలుగక్షరాల పేరులోని మొదటి సగం నీ శత్రువులకు, తరువాతి సగం నీకు యుద్ధంలో సంభవించును గాక!


అర్థాలు - 

వి = పక్షులకు
రాజ = ప్రభువైన గరుత్మంతునికి
రాజ = నాయకుడైన విష్ణువు యొక్క
పుత్ర = కుమారుడైన మన్మథునికి
అరేః = శత్రువైన శివునికి సంబంధించిన
యత్ + నామ = ఏ పేరు
చతురక్షరం = నాలుగక్షరాలు కలిగి ఉందో
పూర్వార్ధం = (అందులో) మొదటి సగం
సంగరే = యుద్ధంలో
తవ శత్రూణాం = నీ శత్రువులకు
పరార్ధం = రెండవ సగం
తవ = నీకు (సంభవించును గాక!)


వివరణ - 
శివునికి సంబంధించిన నాలుగక్షరాల పేర్లలో ‘మృత్యుంజయః’ ఒకటి. యుద్ధంలో నీ శత్రువులకు ‘మృత్యువు’, నీకు ‘జయం’ చేకూరుతాయని భావం. 

(శ్రీ శ్రీభాష్యం విజయసారథి గారు సేకరించిన ‘ప్రహేళికలు’ గ్రంథం నుండి)

3 కామెంట్‌లు:

  1. మననము జేసిన మంత్రము
    మనుగడకే స్ఫూర్తి నిచ్చు మహామాన్వితమై
    మనన మె తను బ్రతి కించును
    మననము నున్ జేయుమయ్య ! మృత్యుం జయమున్ .

    రిప్లయితొలగించండి
  2. సుబ్బారావు గారూ,
    మృత్యుంజయమంత్రం గురించిన చక్కని పద్యం చెప్పారు. ధన్యవాదాలు.
    రెండవపాదంలో ‘మహిమాన్వితమై’ అనేది టైపాటు వల్ల ‘మహామాన్వితమై’ అయినట్టుంది. నాల్గవ పాదంలో యతి తప్పింది.
    ‘మననమె బ్రతికించును న
    మ్మిన మననమ్ము సేయ మృత్యుంజయమున్’ అంటే ఎలా ఉంటుంది?

    రిప్లయితొలగించండి
  3. శ్రీ శంకరయ్య గారికి నమస్కారములు.
    రెండవ పాదము లో 'మీరు సూచించినట్లు "మహిమాన్వితమై"నే
    టైపు చేయడం లో వచ్చిన తప్పు.ఇక నాలుగ వ పాదము
    మీరు సూచించినట్లు గానే మార్చు కొం దును

    రిప్లయితొలగించండి