21, డిసెంబర్ 2011, బుధవారం

నా పాటలు - అయ్యప్ప పాట

                            అయ్యప్ప దేవుడు


దేవుడంటె దేవుడు - అయ్యప్ప దేవుడు
దీక్షగొన్న స్వాములకు తిరుగులేని దేవుడు          || దేవుడంటె ||


శంకరహరి పుత్రుడు - శశిభాస్కర నేత్రుడు
సుబ్రహ్మణ్య గణపతులకు సోదరుడగు దేవుడు
భూతసంఘ నాథుడు - పూర్ణపుష్కలేశుడు
పందళరాజ్యాధినేత భవ్యదత్తపుత్రుడు                   || దేవుడంటె ||

శబరిగిరి నివాసుడు - సదమల దరహాసుడు
శరణు కోరువారి నెల్ల కరుణించే దేవుడు
మహిమలున్న దేవుడు - మణికంఠ నాముడు
ఆర్తులైన భక్తులను ఆదుకొనే దేవుడు                   || దేవుడంటె ||

పంచగిరి విహారుడు - పానవట్ట బంధుడు
వావరుని మన్నించిన పదునెట్టాంబడి విభుడు
విల్లాలి వీరుడు - మహిషి ప్రాణహారుడు
శుభము లిచ్చి కాపాడే జ్యోతిస్వరూపుడు              || దేవుడంటె ||

4 కామెంట్‌లు:

  1. ఈ మాసమంతా అయ్యప్ప స్వామి పాటలు చదివి , విని , తరించ గలుగు తున్నాము. ఈ పుణ్య మంతా మీదే . ధన్య వాదములు తమ్ముడూ !

    రిప్లయితొలగించండి
  2. గురువుగారు మీ విల్లాలి వీరుని పాట మళ్ళి మళ్ళి వినాలి అనేటట్లున్నది

    రిప్లయితొలగించండి
  3. గురువుగారు మీ విల్లాలి వీరుని పాట మళ్ళి మళ్ళి వినాలి అనేటట్లున్నది

    రిప్లయితొలగించండి