30, డిసెంబర్ 2011, శుక్రవారం

సమస్యాపూరణం - 576 (ఏడడుగుల బంధ మౌర)


కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది
ఏడడుగుల  బంధ మౌర ! యేటికి బంపెన్.
ఈ సమస్యను పంపిన 
శ్రీ పోచిరాజు సుబ్బారావు గారికి
ధన్యవాదాలు.

26 కామెంట్‌లు:

  1. పీడగ దలచెను భర్తను
    వీడా నా సరని చేయి వీడగ నెంచెన్
    గోడకు నెట్టెను సుద్దులు
    ఏడడుగుల బంధ మౌర ! యేటికి బంపెన్

    రిప్లయితొలగించండి
  2. మాడుగుల శేష మాంబకు
    పేడియ యగు వాని తోడ బెండిలి కాగా
    వీడగ ప్రాణము నయ్యెడ
    ఏడడుగుల బంధ మౌర ! యేటికి బంపెన్.

    రిప్లయితొలగించండి
  3. చీమ తుమ్మెను ,బెదరెను సిం హగణము
    ----------
    బాల లందరు సభలోన బాడు చుండ
    బేల యొక్కడు బుడగను బేల్చగాను
    పాఱి పోయిరి మంత్రులు భయము తోడ
    చీమ తుమ్మెను బెదరెను సిం హ గణము

    రిప్లయితొలగించండి
  4. మంగళకరమైన భావముతో పూరణ మంచిది కదా!

    ఈడును జోడు తగినదగు
    నేడడగుల బంధమౌర ! యేటికి బంపెన్
    వేడుకతో జలకమ్ముల
    నాడగ క్రొంగవ పితరులానందముతో

    రిప్లయితొలగించండి
  5. ఈ పూరణలో ఆఖరి పాదములో క్రొంగవను అని సరిజేసికొనాలి.

    రిప్లయితొలగించండి
  6. వెంకట రాజారావు . లక్కాకులశుక్రవారం, డిసెంబర్ 30, 2011 9:05:00 AM

    పాడు బడె నేమికాలమొ !
    కోడళ్ళును కొడుకు లేచ కుములుచు ముదిమిన్
    తోడుగ ముసలిది నడువగ
    నేడడుగుల బంధమౌర ! యేటికి బంపెన్

    రిప్లయితొలగించండి
  7. మా యూరిలో ఓ పతివ్రత దీన గాధ !

    ఏడవ మొగుడును గూడా
    మూడవ వానికిని బోలె మూఢుడు కాగా
    మేడలు మిద్దెలు వ్రాయగ
    నేడడుగుల బంధమౌర యేటికిఁ బంపెన్ !

    రిప్లయితొలగించండి
  8. యమునా తటిలో ఓ రాధ

    రాడేలొ చిన్నికృష్ణుడు
    వేడెదగా మ్రోయు మనుచు వేణువుఁ బ్రీతిన్
    దోడయిన నీడ వాడని
    యేడడుగుల బంధమౌర యేటికి బంపెన్

    రిప్లయితొలగించండి
  9. డా. మూర్తి మిత్రమా! దీన పతివ్రతగాధలో ఎనిమిదవ స్థానం ఖాళీగా వుంటే చెప్పండి సార్ :-)

    రిప్లయితొలగించండి
  10. చింతామణి దగ్గరికి వెళ్లి యాస్తులు పోగొట్టుకొన్న ఒక బాధితుడు తన స్నేహితుడితో:
    ఏడేడు జన్మలదిరా
    ఏడడుగుల బంధ మౌర యేటికి బంపెన్
    వేడుకకత్తె మణికడకు
    నూడఁ బెఱకును మనయాస్తు లొందిలి మిగులున్!
    మనవి: యేటికి = దేనికి అనే అర్థంలో

    రిప్లయితొలగించండి
  11. శుభాకాంక్షలు

    మిత్రులారా! నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు:

    నవ వర్షాగమ పర్వ వైభవ మహానందాతిరేకాన్వితో
    త్సవ సంరంభమయాంతరంగ జనితోత్సాహమ్ముతో మిత్ర బాం
    ధవ సందోహము విందులొందగ లసత్ సాహిత్య సౌగంధ పూ
    ర్ణవచస్సుమ రాజితో తెలుపుదున్ భాగ్యప్రదాకాంక్షలన్

    రిప్లయితొలగించండి
  12. నేమాని పండితార్యా అద్భుతంగా శుభాకాంక్షలను తెలిపినారు. ధన్యవదాములు.

    రిప్లయితొలగించండి
  13. నా పై వ్యాఖ్యలో ధన్యవాదములుగా చదువుకో మనవి.

    నేడీ సణుగుడ దేటికి
    నాడేటికి నవలి యూరి నచ్చిన పిల్ల-
    న్నీడని చేకొని దాటుము
    యేడడుగుల బంధమౌర యేటికి బంపెన్.

    రిప్లయితొలగించండి
  14. మూర్తి మిత్రమా మీ దగ్గర మంచి మంచి రెఫరెన్సు లున్నాయి.
    ఆ మధ్యన మీ మిత్రుడేమో మద్దెల హనుమంతుని గురించి చెప్పారు.

    రిప్లయితొలగించండి
  15. మిత్రులారా ఈనాటి నా శుభాకాంక్షల పద్యములో 3వ లైనులో "సౌగంధము"నకు బదులుగా "సౌగంధ్యము" అని చదువుకోవలెను.

    రిప్లయితొలగించండి
  16. చాలాకాలం తర్వాత సభలో ప్రవేశించుచున్నాను. పెద్దలందరికీ నమస్కారములు.


    వీడిరి దంపతులిప్పుడు
    ఏడడుగుల బంధ మౌర ! యేటికి బంపెన్
    నాడాతడు ధర్మములను,
    పీడగ తల్చుచు విడివడె వెలదియు నాడే! (ఆనాడే)

    రిప్లయితొలగించండి
  17. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    రెండవపాదంలో ‘సరి + అని’ అన్నప్పుడు సంధి లేదు, యడాగమం వస్తుంది.
    ఆ పాదాన్ని ‘వీడా సరి నా కని చెయి వీడగ నెంచెన్’ అంటే బాగుంటుంది.
    *
    సుబ్బారావు గారూ,
    చక్కగా ఉంది మీ శేషమాంబ పూరణ. అభినందనలు.
    ‘చీమ తుమ్మెను ...’ పూరణ చమత్కారంగా ఉంది. అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    ప్రశస్తమైన పూరణ మీది. అభినందనలు.
    సుమధుర పదబంధాలతో రసబంధురంగా మీరు చెప్పిన నూత్నసంవత్సర శుభాకాంక్షలకు ధన్యవాదాలు.
    *
    లక్కాకుల వెంకట రాజారావు గారూ,
    కరుణరసాత్మకంగా ఉంది మీ ప్రశంసనీయమైన పూరణ. అభినందనలు.
    *
    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    చక్కగా ఉన్నాయి మీ రెండు పూరణలు. అభినందనలు.
    చంద్రశేఖర్ గారు మిమ్మల్నేదో అడిగారు. అలా అడిగినట్లు వాళ్ళ ఆవిడకు చెప్పండి. :-)
    *
    చంద్రశేఖర్ గారూ,
    మంచి పూరణ. అభినందనలు.
    అయినా కష్టనష్టాలు తెలిసికూడా ఎనిమిదో స్థానం కోసం మూర్తి గారిని ఎందుకు అడుగుతున్నారు? :-)
    *
    మిస్సన్న గారూ,
    చక్కని పూరణ. అభినందనలు.
    *
    మందాకిని గారూ,
    బహుకాల దర్శనం. మిమ్మల్నీ, వసంత కిశోర్ గారిని జ్ఞాపకం చేసుకున్నాను ఈరోజే. ‘వందేమాతరం’లో మీ వ్యాఖ్యను చూసాను కూడా.

    రిప్లయితొలగించండి
  18. మూడడుగులు యిచ్చి తినని
    వేడుకగా దివికి తరలె వేలుపు బలియౌ !
    ఏడేడు జన్మ లనుచును
    ఏడడుగుల బంధ మౌర ! ఏటికి బంపెన్ !

    రిప్లయితొలగించండి
  19. ఏడాది కొకపరియని
    వేడుకగా వెడలె నంత పెనిమిటి తోడన్ !
    ఏడేడు నగము లెక్కిరి
    ఏడడుగుల బంధ మౌర ! యేటికి బంపెన్ !

    రిప్లయితొలగించండి
  20. మనతెలుగు-చంద్రశేఖర్శుక్రవారం, డిసెంబర్ 30, 2011 9:53:00 PM

    మాస్టారూ, ధన్యవాదాలు. ఎనిమిదో స్థానం నా కోసం కాదండీ, ఏదో పరోపకారం మిత్రుల కోసం.అంతే! మేము పరిశుద్ధాత్ములమండీ:-)

    రిప్లయితొలగించండి
  21. శంకరార్యా ! చక్కని సవరణకు ధన్యవాదములు.
    చంద్ర శేఖర్ గారూ ! మూర్తి గారిని కోరి మరీ "అష్ట" కష్టాలు పడాలను కుంటున్నా రేమిటండీ... ..
    మందాకిని గారూ ..బహుకాల దర్శనం..సంతోషం.
    అవునూ..మందా వారూ... ఎక్కడండీ...

    రిప్లయితొలగించండి
  22. రాజేశ్వరి అక్కయ్యా,
    మీ రెండు పూరణలూ బాగున్నాయి. అభినందనలు.
    మొదటి పూరణ మొదటి పాదంలో ‘మూడడుగు + ఇచ్చితి నని’ అన్నప్పుడు సంధి జరిగి యడాగమం రాదు. ‘మూడడుగు లొసంగితి నని’ అంటే సరి!
    *
    వసంత కిశోర్ గారూ,
    బాగున్నారా? అప్పుడప్పుడు అస్వస్థతకు లోనవుతున్నా నన్నారు. ఇప్పుడెలా ఉంది? మీ లోటు బ్లాగులో కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. మీకు ఆయురారోగ్యాలను సమకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను.
    *
    మంద పీతాంబర్ గారూ,
    ఎలా ఉన్నారు? మీ పూరణలు లేక ఏదో వెలితి గోచరిస్తున్నది. శుభమస్తు!

    రిప్లయితొలగించండి
  23. ధన్య వాదములు తమ్ముడూ !
    సోదరులందరికీ , సోదరి మందాకిని గారికీ " నూతన సంవత్సర శుభా కాంక్షలు "

    రిప్లయితొలగించండి
  24. పూజ్యనీయులు అన్నయ్యగారు శ్రీ పండిత నేమాని వారి నూతనవత్సర శుభాసీస్సుల పద్యము మనోహరముగా ఉన్నది. పెద్దలకు మిత్రులకు సోదరీమణులకు నూతనవత్సర శుభాకాంక్షలు.

    నా మొదటి పూరణను ఉపసంహరిద్దా మనుకొని మూడు పర్యాయములు గణన యంత్రము లోనికి వెళ్ళి యీ మధ్య అంతా గంభీరముగా ఉంటున్నారనే మిత్రులు చంద్రశేఖరుల వారు నాతో చెప్పిన మాటలు తలచి ఆ పూరణ నలాగే వదిలేసాను. మిత్రులను కోరి అష్ట కష్టాలలోనికి నెట్టననే భరోసా మాత్రము నిస్తాను.

    రిప్లయితొలగించండి
  25. ఏడవ పది వయసందున
    వేడుచు లుబ్ధావధాని వేడుక మీరన్
    ఏడేండ్ల సుబ్బి గోరగ
    ఏడడుగుల బంధ మౌర ! యేటికి బంపెన్

    రిప్లయితొలగించండి
  26. ఆడుచు చెట్టా పట్టను
    పాడుచు కాశీని గంగ బరబర పారన్
    చూడగ ప్రేమపు యాత్రన్
    ఏడడుగుల బంధ మౌర ! యేటికి బంపెన్

    రిప్లయితొలగించండి