వారాంతపు సమస్యాపూరణం
కవిమిత్రులారా,
ఈ వారాంతానికి పూరించవలసిన సమస్య ఇది
యోగులు కాని నాయకులె
యోగ్యులు భారతభూమి నేలగన్.
(ఆకాశవాణి- విజయవాడ వారి సౌజన్యంతో)
కవిమిత్రులారా,
ఈ వారాంతానికి పూరించవలసిన సమస్య ఇది
యోగులు కాని నాయకులె
యోగ్యులు భారతభూమి నేలగన్.
(ఆకాశవాణి- విజయవాడ వారి సౌజన్యంతో)
భోగముగోరు వారు మరి బొక్కిన దానిని దాచ నెంచుచున్
రిప్లయితొలగించండిరోగములెన్ని యున్న యవ రోధము లేకనె లేకి బుధ్ధితో
వాగెడు వారు జూడ తన ప్రక్కన మూగెడు దుష్ట మిత్ర సం
యోగులు కాని నాయకులె యోగ్యులు భారతభూమి నేలగన్.
వేగమునొప్పుచున్, కలుగు విఘ్నములెల్లను రూపుమాపుచున్,
రిప్లయితొలగించండిచేగల కార్యసాధక సుశిక్షిత సైన్యమువెంటనుండ, భూ
భాగము శాంతిసౌఖ్యముల వర్ధిలజేయుచునుండను
ద్యోగులుకానినాయకులె యోగ్యులు భారత భూమినేలగన్.
అనుద్యోగులు = ప్రయత్నము చేయనివారు,
త్యాగపు చింత గల్గి తన ధర్మము వీడక నుండు వారు, యే
రిప్లయితొలగించండిభోగము లన్నమోహమును పొందని వారగు నిత్యతృప్తులున్,
వేగము తోడకార్యములు పెక్కులు చేసెడి వారు, దుష్టసం
యోగులు కాని నాయకులె యోగ్యులు భారతభూమి నేలగన్.
గురువుగారు, పుస్తకాలతో తిరిగి వచ్చారనుకుంటాను.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ ‘దుష్టమిత్త్ర సంయోగులు కాని నాయకుల’ పూరణ బాగుంది. అభినందనలు.
*
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
మంచి భావంతో సమస్యను పూరించారు. బాగుంది. అభినందనలు.
అక్కడ ‘అనుద్యోగులు’ అని రాదు. ‘చేయుచునుండన్ + ఉద్యోగులుకాని’ అని అవుతుంది. ‘వర్ధిలజేసెడివా రను/ద్యోగులుకాని’ అంటే సరి!
*
మందాకిని గారూ,
మీ ‘దుష్టసంయోగులు కాని’ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
యోగులు నెహ్రు గాంధి బహు యోగ్యుడు లాల్ బహదూరు చూడగా
రిప్లయితొలగించండియోగి యజాదు సింగులును యోధుడు నల్లురి రామ రాజు నౌ
యోగులు దేశభక్తి యొక యోగము వీరికి నిత్య సాధకుల్
యోగులు, కాని నాయకులె, యోగ్యులు, భారతభూమి నేలగన్
యోగము భారతీయమని హోరుగ పల్కుచు రాజధానిలో
రిప్లయితొలగించండిసాగుచు వీధులందునను సంబర మొందుచు మోడి చెంతనున్
వేగమె గోవు మాంసమును వేడిగ కుమ్ముచు త్రాగుబోతులౌ
"యోగులు" కాని నాయకులె యోగ్యులు భారతభూమి నేలగన్