1, డిసెంబర్ 2011, గురువారం

ఓం నమశ్శివాయ

ఓం నమశ్శివాయ

ఓం నమశ్శివాయ భవ్య యోగదాయకాయతే
నం నమశ్శివాయ దేవనాథ సంస్తుతాయతే
మం నమశ్శివాయ సర్వమంగళాన్వితాయతే
శిం నమశ్శివాయ శైల శృంగమందిరాయతే
వం నమశ్శివాయ లోక భద్రకారణాయతే
యం నమశ్శివాయ సంతతాభయప్రదాయతే

నమో నమో నమశ్శివాయ నాదనందితాయతే 
నమో నమో నమశ్శివాయ నాగభూషణాయతే
నమో నమో నమశ్శివాయ నందివాహనాయతే  
నమో నమో నమశ్శివాయ నారదస్తుతాయతే

మహీధరేంద్ర రమ్య శృంగ మందిరాయ తేనమః 
మహీధరేంద్రజాన్వితాయ మద్ధితాయ తేనమః 
మహేశ్వరాయ దివ్యరూప మండితాయ తేనమః
మహాద్భుతార్థ దాయకాయ మంత్రనూర్తయే నమః

శివాయ సర్వలోకనాథ సేవితాయ తేనమః
శివాయ శీత శైలరాజ శృంగ వాసినే నమః
శివాయ చిత్ప్రభాకరాయ శ్రీకరాయ తేనమః
శివాయ శంకరాయ యోగ సిద్ధిదాయ తేనమః

వారిజాక్ష సేవితాయ భద్రమూర్తయేనమః
వారిజాసనాదిదేవ వందితాయ తేనమః
వాహినీధరాయ భక్తవత్సలాయ తేనమః
వాగ్విశేష సంస్తుతాయ భాగ్యదాయ తేనమః

యజ్ఞ పూరుషాయ పావనాలయాయ తేనమః
యక్షరాట్సఖాయ సంశ్రితార్తిహాయ తేనమః
యామినీశ శేఖరాయ హర్షదాయ తేనమః
యత్నసిద్ధిదాయ వాసవర్చితాయ తేనమః

ఓం తత్ సత్
శ్రీ పండిత నేమాని రామజోగి సన్యాసి రావు గారు

2 కామెంట్‌లు:

  1. మన తెలుగు - చంద్రశేఖర్గురువారం, డిసెంబర్ 01, 2011 10:55:00 AM

    శ్రీ నేమాని మహాశయులకు నమస్సులు. పంచాక్షరీ పంజర రంజితాభ్యాం అన్నట్లు శివుడిని మీ పంచాక్షర స్తోత్రంలో బంధించేశారు. చాలా భక్తి ప్రదంగా వుంది. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  2. పూజ్యులు , గురువులు , శ్రీ నేమాని పండితుల వారి , రస రమ్యమైన శివ స్తోత్రం రోజూ ఒకసారి పఠించ గలిగితే , అంత కంటె పుణ్యం మరొకటే ముంది ? ధన్య వాదములు.

    రిప్లయితొలగించండి