17, డిసెంబర్ 2011, శనివారం

సమస్యాపూరణం - 562 (పలికి చేసి చూచి కొలిచి)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది
పలికి చేసి చూచి కొలిచి యలరు.
(శ్రీ పండిత నేమాని వారి ‘క్రమాలంకార సౌలభ్యము’ స్ఫూర్తితో)

25 కామెంట్‌లు:

  1. కలికి రుక్మిణి యదుకుల తిలకు వలచి
    చెలుల తోడ వాని చేష్ట లనును
    బొమ్మ చేసి చూచు పూజ చేయు నిటుల
    పలికి చేసి చూచి కొలిచి యలరు.

    రిప్లయితొలగించండి
  2. పసి వయస్సు నందె బాల ప్రహ్లాదుడు
    హరిని చక్రి శౌరి నార్తి హరుని
    నోట చేత కంట నొవ్వక మనసున
    పలికి చేసి చూచి కొలిచి యలరు.

    రిప్లయితొలగించండి
  3. కవిమిత్రులారా,
    ఈ రోజు హైదరాబాదులో ‘బుక్ ఫెయిర్’కు వెళ్తున్నాను. మళ్ళీ ఏ రాత్రికో తిరిగి రావడం. దయచేసి మిత్రులు పరస్పరం పూరణల గుణదోష విచారణ చేయండి.
    మిత్రులెవరైనా ఈ సాయంత్రం నెక్లెస్ రోడ్, పీపుల్స్ ప్లాజాలో బుక్ ఫెయిర్ లో e-తెలుగు స్టాల్ దగ్గరికి వస్తే కలుసుకునే అవకాశం ఉంది.

    రిప్లయితొలగించండి
  4. మిస్సన్న గారి ,హనుమఛ్ఛాస్త్రి గారి పూరణలు అద్భుతముగా నున్నాయి.

    సత్య మొకటె నిలుచు నిత్యమై లోకమ్ము
    నరయ దైవ మదియె ననుచు గాంధి
    మనము దలచి, వినుచు ననయమ్ము సత్యమ్ము
    పలికి చేసి చూచి కొలిచి యలరు .

    రిప్లయితొలగించండి
  5. రామ నామ మరయ రమ్యమైన యదియ
    పరుల హితము కోరి పలుకు మిపుడు
    నోట ,చేత ,కనుల నూరుమా రులుగను
    పలికి చేసి చూసి కొలిచి యలరు .

    రిప్లయితొలగించండి
  6. తిరుమల రాయనికి లేవు తిండియు సుఖమున్
    --------------------------------------------
    వరముల నిచ్చుచు నరులకు
    నరు లిచ్చెడి ధనము తోడ నప్పులు దీర్చన్
    సరివోని ధనము కలిగిన
    తిరుమల రాయనికి లేవు తిండియు సుఖమున్ .

    రిప్లయితొలగించండి
  7. నోరార భజన , విధ్యను
    సారముగా షోడశోపచారములన్ శ్రీ
    ద్వారక మాయిన్ సాయిన్
    కోరి పలికి చేసి చూచి కొలిచి యలరుదున్

    రిప్లయితొలగించండి
  8. రామ నామ మెపుడు రమ్యము గఁ బలికి
    కార్యమాచరించు ఘనత పొందు
    శిల్పి, కఠిన శిలల చెక్కుతరుణమందు
    పలికి చేసి చూచి కొలిచి యలరు.

    రిప్లయితొలగించండి
  9. త్రికరణముల శుద్ధి దీపించుచుండగా
    ఇంద్రియములు త్రిభువనేశు వివిధ
    రీతులుగ భజించి శ్రేయముల్ గాంచును
    పలికి చేసి చూచి కొలిచి యలరు

    రిప్లయితొలగించండి
  10. మిత్రులార!
    అందరి పూరణలు శోభిల్లుతూ ఉన్నవి. భావము భక్తి పరంగా ఈయబడినది. అయితే తమ్ముడు డా. చి.నరసింహమూర్తి పంథా వేరు. గాంధీ పరముగా ఉంది - చక్కని భావము, ప్రత్యేక ప్రశంసలు.

    రిప్లయితొలగించండి
  11. Freshers Day లో ఒక కళాశాల విధ్యార్థి ప్రవర్తన:-

    ముద్దు గుమ్మ యొకటి ముందరుండెను గాన
    చెంత చేరి దాని చెలిమి కోరి
    వలపు తెలిపి చేయి కలిపి వచ్చెను వాడు
    పలికి చేసి చూచి కొలిచి యలరు!!

    రిప్లయితొలగించండి
  12. ఈనాడు ఇప్పటి వరకు వచ్చిన పూరణలు చూచేను.
    1.శ్రీ మిస్సన్న గారి రుక్మిణీ విలాసము బాగున్నది. ఇందులో మొదటి పాదము తేటగీతికి ఆటవెలదికి కూడా సరిపోతుంది. బళా.
    2.శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారి బాల ప్రహ్లాదుడు భక్తపుంగవుడు బాగున్నాడు.
    3. మా తమ్ముడు చి.నరసింహమూర్తి : నీ పద్యమును ఇలా సరిజేస్తున్నాను:
    సత్యమొకటె నిలుచు నిత్యమై లోకాల
    నరయ దైవమదియె యంచితముగ
    యనుచు దలచు వినుచు ఆ గాంధి సత్యమున్
    బలికి చేసి చూచి కొలిచి యలరు
    4. శ్రీ సుబ్బారావు గారు: మీ ప్రయత్నము బాగున్నది. ఇంకా మీరు బాగుగా ప్రయత్నించాలి.
    5. శ్రీ రాజారావు గారు: శాయి ద్వారకామాయి సాకు మిమ్ము. భేష్.
    6.శ్రీమతి మందాకిని గారు: మీ శిల్పము రమణీయముగా ఉన్నది. భళా.
    7. శ్రీ జిగురు సత్యనారాయణ గారు: ముద్దు గుమ్మ యొకతె అంటే బాగుంటుంది. కాలేజి పోకడలు బాగున్నయి. హాయిగా ఉంది పద్యము.
    అందరికి మరీ మరీ అభినందనలు.

    రిప్లయితొలగించండి
  13. జిగురు సత్యనారాయణ గారూ
    మీ పూరణ "ముద్దు గుమ్మ యొకటి ముందరుండెను గాన" బాగుంది. నేమాని వారు చెప్పినట్లు "యొకటి" బదులు "యొకతె" అంటే ఇంకా బాగుంటుంది.

    రిప్లయితొలగించండి
  14. శ్రీపతిశాస్త్రిశనివారం, డిసెంబర్ 17, 2011 8:10:00 PM

    శ్రీగురుభ్యోనమ:

    కష్టనష్టములకు కన్నీరు కార్చక
    ధర్మ పథము విడక కర్మ యోగి
    సత్య ధర్మములను సమ దృష్టితో గాంచి
    పలికి చేసి చూచి కొలిచి యలరు

    రిప్లయితొలగించండి
  15. మట్టి బొమ్మ జేసి మనసార పూజించ
    గట్టి వరము లిచ్చు గజము ఖుండు
    మంచి మనసు తోడ మాలక్ష్మి సేవించ
    పలికి చేసి చూచి కొలిచి యలరు
    --------------------------------------------
    చంద మామ వంటి అందాల భామతో
    చెలిమి చేయ నెంచి బలిమి గాను
    ఎదను కోరు ప్రేమ ముదముగా వివరించి
    పలికి చేసి చూచి కొలిచి యలరు

    రిప్లయితొలగించండి
  16. @రాజేశ్వరి గారూ వావ్
    "మట్టి బొమ్మ జేసి మనసార పూజించ"

    "చంద మామ వంటి అందాల భామతో"

    రిప్లయితొలగించండి
  17. అన్నయ్య గారు శ్రీ పండిత నేమాని వారి సవరణ చాలా బాగుంది. కృతజ్ఞతలు.
    రాజేశ్వరి అక్కయ్య గారి రెండు పూరణలూ అద్భుతంగా ఉన్నాయి. అక్కయ్య గారికి ప్రత్యేక అభినందనలు.

    రిప్లయితొలగించండి
  18. నోచెడి మనసార నోటను పల్కుము
    చింత విడచి పూజ చేయుమెపుడు
    అవ్యయాత్మఁ గనుము దివ్యముగ నటుల
    పలికి చేసి చూచి కొలిచి యలరు.

    రిప్లయితొలగించండి
  19. మిత్రులారా!
    నిన్నటి పూరణలలో మిగిలిన వాటిని పంపిన వారికి కూడా అభినందనలు.
    శ్రీ శ్రీపతి శాస్త్రి గారి కర్మయోగి కడు లెస్సగా నున్నది.
    సోదరి శ్రీమతి రాజేశ్వరి గారి కలంతో 2 ప్రక్కలనుండి వ్రాస్తూ ఉంటారు. భక్తిలో లక్ష్మీ గణపతులను అహ్వానించేరు. అలాగే ప్రేమరసమును గుర్తు చేసేరు. బాగు బాగు. మీ పద్యములో "బలిమి గాను" కి బదులుగా "లలిత గతుల" అంటే బాగుంటుందేమో.
    చంద్రశేఖర్ గారు అవ్యయాత్మను దివ్య దృష్టితో చూడగలిగేరు. ప్రాసయతితో భావము మెరుగుగా కుదిరినది. సెభాస్.

    రిప్లయితొలగించండి
  20. నేమాని పండితార్యా ధన్యవాదాలు.
    మూర్తి మిత్రమా ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  21. గురువర్యులు శ్రీ పండిత నేమానిగారికి ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి