ప్రహేళిక
శస్త్రం నఖలు కర్తవ్యం
ఇతి పిత్రా నియోజితః |
తదేవ శస్త్రం కృతవాన్
పితురాజ్ఞా నలంఘితా ||
భావం -
ఏ శస్త్రాన్ని నిర్మించవద్దని తండ్రి ఆదేశించాడో, ఆ శస్త్రాన్నే కొడుకు నిర్మించి
తండ్రి ఆజ్ఞను జవదాటనివా డైనాడు.
సమన్వితార్థం -
‘న ఖలు’ శబ్దంలోనే ఉంది చమత్కార మంతా. ‘చేయకూడదు’ అనే అర్థంలో ‘న, ఖలు’ అనేవి అవ్యయాలు. గోళ్ళను కత్తిరించు (నఖాన్ లునాతి) అని ‘నఖలు’ శబ్దానికి మరో అర్థం ఉంది.
గోళ్ళను కత్తిరించే (నఖలు) శస్త్రాన్ని నిర్మించమని తండ్రి ఆదేశించగా,

కొడుకు దానినే చేసి తండ్రి ఆజ్ఞను మీరలేదని తాత్పర్యం.
(శ్రీ శ్రీభాష్యం విజయసారథి గారు సేకరించిన ‘ప్రహేళికలు’ గ్రంథం నుండి)
(శ్రీ శ్రీభాష్యం విజయసారథి గారు సేకరించిన ‘ప్రహేళికలు’ గ్రంథం నుండి)
శ్రీ శంకరయ్య గారికి నమస్కారములు.
రిప్లయితొలగించండిశ్లోకము అంతా "నఖలు "పైన ఆధారపడినది
నెయిల్ కట్టర్‌పైన కూడా సంస్కృతంలో ఒక శ్లోకమున్నదన్నమాట!
రిప్లయితొలగించండిసుబ్బారావు గారూ,
రిప్లయితొలగించండిధన్యవాదాలు.
*
కోడీహళ్ళి మురళీ మోహన్ గారూ,
మళ్ళీ ఎన్నాళ్ళకు మీ పేరు నా బ్లాగును పావనం చేసింది! ధన్యవాదాలు.
నిజమే , శ్రీ శ్రీ గారన్నట్టు వ్రాయగల నైపుణ్యం ఉండాలే గానీ " అగ్గి పుల్ల , కుక్కపిల్ల , సబ్బు బిళ్ళ , అన్నీ రసరమ్య మైన పద్యాలు రాయించు కుంటాయి . చాలా బాగుంది తమ్ముడూ ! కొత్త కొత్తవి తెలుపు తున్నందుకు ధన్య వాదములు
రిప్లయితొలగించండి