తప్పు దారుల నడచెడు - తనయులకును తల్లి ప్రేమగ చెప్పును - తపన బడుచు తండ్రి మాత్రము దండించు - దారి మార్చ దండనము కాదు కాదది - పండువయ్యె ! _________________________________
తల్లి తనయుల దిట్టును - తప్పు జేయ తండ్రి తనయుల గొట్టును - దారి మార్చ దేశికుడు తిట్టి గొట్టును - తీరు నేర్ప దండనము కాదు కాదది - పండువయ్యె ! _________________________________
అయ్యా! వసంత కిశోర్ గారూ! మీ ఆరోగ్యము తొందరలో కోలుకోవాలని మా ఆకాంక్ష. మీ పూరణలోని భావము చాల బాగుగ నున్నది. కొన్ని సూచనలు చూడండి: (1) రాజు + కు అనునప్పుడు రాజు + నకు అని వాడవలెను. (2) తనకివ్వ అనుట వాడుక భాష అగును -- తనకీయ అంటే ఇంకా బాగుంటుంది. (3) తలను + ఒగ్గ - యడాగమము రాదు; తలనొగ్గ అగును.
అయ్యా! వసంత కిశోర్ గారూ! మీ పద్యములో ధరణిజాతను ... అనే పాదములో ప్రాస యతిని వేద్దామనుకున్నారు కానీ మీరు ప్రాస నియమము ప్రకారమే ప్రాసయతిని వెయ్యాలి అని గమనించినట్టుల లేదు. అందుచేత ఆ పాదమును ఇలా మారిస్తే బాగుంటుందేమో: "అవని జాతను చూచెను హనుమ యపుడు" స్వస్తి.
వసంత కిశోర్ గారూ, మీ పది పూరణలూ బాగున్నాయి. అభినందనలు. రెండవ పూరణలో ‘తలను + ఒగ్గి’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘తలను దాల్చి’ అందామా? ‘ధర్మరాజుకు తమ్ముడు’ను ‘ధర్మరాజున కనుజుండు’ అందాం. (ఓహ్ ... నేమాని వారి వ్యాఖ్యతో సవరించారు. ఇప్పుడు గమనించాను) మూడవ పూరణలో ‘తిట్టి + కొట్టును’ అన్నప్పుడు సరళాదేశం రాదు. ‘తిట్టి కొట్టును’ అంటేనే సరి. సవరించిన నాల్గవ పూరణలో ‘మారుతి నరయు’ కు మారుగా ‘మారుతి యరయు’ ఉండాలి. ఏడవ పూరణలో ‘లోకి’ అనడం తప్పేమో? ‘లోనికి’ అనాలనుకుంటాను. అలా అంటే గణదోషం. ‘కడుపునందు’ అందామా? తొమ్మిదవ పూరణలో ‘వనజ హితునిని’ ... ఇక్కడ ఒక ‘ని’ ఎక్కువయింది. అక్కడ ‘వనజ మిత్రుని/ బాంధవు’ అంటే సరి! పదవ పూరణలో రేఫసంయుక్తాక్షరానికి ముందున్న అక్షరాన్ని లఘువు చేసారు. పండిత నేమాని వారు సమర్థించినా నా మనస్సులో ఏదో అసంతృప్తి. ఛందశ్శాస్త్ర గ్రంథాలను మరోసారి తిరగేయాలి.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, చక్కని పూరణ. అభినందనలు. * సుబ్బారావు గారూ, మీ రెండు పూరణలు బాగున్నాయి. అభినందనలు. అయితే మొదటి పూరణలో సమస్యను నాల్గవపాదంగా ఉంచితేనే అన్వయం బాగుంటుంది. రెండవ పూరణలో ‘స్కూలులో(న్) + ఒజ్జగాను’ అన్నప్పుడు ‘స్కూలులో నొజ్జగాను’ అవుతుంది. అక్కడ యడాగమం రాకూడదు. ‘సిరి వలదను...’ సమస్యకు మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు. * పండిత నేమాని వారూ, మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు. * గన్నవరపు నరసింహ మూర్తి గారూ, ఈ పూరణలో మీరూ మీ విశ్వరూపాన్ని ప్రదర్శించారు. బాగుంది. మీ రెండవ పూరణ కూడ చక్కగా ఉంది. అభినందనలు. * లక్కాకుల వెంకట రాజారావు గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు. * చంద్రశేఖర్ గారూ, ఒక శబ్దచిత్రాన్ని ఆవిష్కరించారు. బాగుంది మీ పూరణ. అభినందనలు. ఇంతకీ ఆ రమణులు దండకారణ్యంలోని తాపసరమణులేనా? * (సరదాగా...... తుమ్మి "చిరంజీవ!" అనుకున్నట్లు) కంది శంకరయ్య గారూ, బాగుంది మీ పూరణ. అభినందనలు. ఆ ‘దండన’ మీకు మీరు వేసుకున్నదేగా! దానివల్ల కవిమిత్రులకు పండుగే కదా!
మెండుగ సమస్య లిచ్చుచు దండిగ పూరణలఁ గొనుచు దండన మనుచున్ గుండె చెదరనీయకుమా; పండిత నేమాని రక్ష! ‘బ్లాగింపు’ మిఁకన్.
వసంత కిశోర్ గారూ, కూతురి వరుడు అనే అర్థంలో ‘తనయావరుడు’ అవుతుంది. ‘తనయ’ ఆకారాంత స్త్రీలింగ శబ్దం. ‘అంకము జేరి శైలతనయాస్తనదుగ్ధము లాను ..’ అన్నాడు పెద్దన. ‘తనయస్తనం’ అనలేదు. రాముడు ‘జనకతనయా వరుడు’. తనయుడు అకారాంత పుంలింగశబ్దం. అది సమాసపూరవపదమైనపుడు తనయ అవుతుంది. ‘కుంతీతనయ మధ్యముడు’ అంటారు. ‘కుంతీసుతమధ్యముడు’ అనడం మీరు వినే ఉంటారు. ‘వచ్చెం గుంతీసుతమధ్యముండు ...’ భారత ప్రయోగం. నిజానికి సుత అంటే కూతురే కదా. ‘గిరిరాజసుతాతనయా’ అన్నారు. సుతతనయా అనలేదు. ఇక్కడ సమాసపూర్వపదంమైనపుడు కూతురైతే తనయా, సుతా అనీ, కొడుకైతే తనయ, సుత అనీ ఉంటాయి. సరయూసుతుడంటే సరయూనది కొడుకు. సరయు సుతుడంటే సరయువు అనువాని కొడుకు. సందేహం తీరినట్టేనా?
ధన్యవాదాలు, మాస్టారూ. మీ ప్రశ్నతో నా ఆలోచనని పసిగట్టేశారనిపించించింది. పుంసాం మోహన రూపాయ - శ్రీ రాముని అందాన్ని చూసి మురిసిపోని వారెవరుంటారు చెప్పండి! తాపసరమణులే అనుకొందాం
గురువు గారూ ధన్యవాదములు. మీ పూరణ మీ పూరణకు మీ వ్యాఖ్య కూడా చాలా బాగున్నాయి. వసంత కిశోర్ గారితో బాటు నా సందేహము కూడా తీరింది. కిశోర్ జీ ద్వితియా విభక్తి మొదలు సప్తమీ విభక్తి వఱకు విభక్తి ప్రత్యయములకు బదులు నుగామమము వాడుకొన వచ్చును . అది గాక నుగామమ సంధి వలన కూడా నుగామము రావచ్చును. అది గురువు గారు చెప్ప వలసిన పాఠము. మీకు చక్కని కవితా ధార ఉంది. ప్రవహించనీయండి. నుగామ యడాగమాలు సరి చేయడానికి గురువు గారు , అన్నయ్య గారు ఉన్నారు. సత్పురుషులు విద్వాంసుల పరిచయము కూడా పూర్వజన్మ సుకృతమని మిత్రులు చంద్రశేఖరుల వారు చెప్పారు.
అయ్యా! శ్రీ శంకరార్యా! శుభాశీస్సులు. మీరు మన బ్లాగునకే గురువులు. అంతకన్న పెద్ద స్థానము ఇంకేమున్నది. అందరికి మార్గ దర్శకులు. మీలో దోషములు ఉండవు, అక్కడక్కడ టైపు పొరపాటులు దొరలుటేతప్ప. మీ రచనలని గూర్చి ఎవరూ వ్రేలెత్తి చూపలేరు అనే స్థాయిలో ఉంటాయి. ఎట్టి సూచనలకు అవకాశమున్నా నేను శ్రీ శ్యామల రావు గారు వదలుట లేదు కదా.
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండి01)
_________________________________
తప్పు దారుల నడచెడు - తనయులకును
తల్లి ప్రేమగ చెప్పును - తపన బడుచు
తండ్రి మాత్రము దండించు - దారి మార్చ
దండనము కాదు కాదది - పండువయ్యె !
_________________________________
పేడి గాగను శాపంబు క్రీడి కిచ్చె
రిప్లయితొలగించండిస్వర్గ మందున నూర్వశి భాగ్య మదియె
పరగ మేలయ్యె నజ్ఞాత వాసమందు
దండనము కాదు కాదది పండువయ్యె
సూటు బూటులు వేసుకు స్కూలు కేగ
రిప్లయితొలగించండిఅక్షరంబులు నేర్పుచు శిక్ష వేయ
దండనము కాదుకాదది, పండు వయ్యె
అండ దండలు గలిగిన అయ్యవారి
సిరి వలదను వాని కిలను చిక్కులె గాదా ?
రిప్లయితొలగించండి--------
సిరి దా వచ్చిన యప్పుడు
సరగున మోకాలు నొడ్డ సరి కాదయ్యా !
సిరియే మూలము మనిషికి
సిరి వలదను వాని కిలను చిక్కులె గాదా ?
తల్లి కొట్టును దిట్టును తనయు డవని
రిప్లయితొలగించండిదండనము కాదు కాదది ,పండువయ్యె
మంచి మనుగడ దొరికెను మంత్రి వలన
ఊరు నందలి స్కూలులొ యొజ్జ గాను
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
రిప్లయితొలగించండిశాస్త్రీజీ ! మీ దారిలోనే !
02)
_________________________________
ధర్మ రాజుకు తమ్ముడు - ధర్మ చరుడు
తరుణి శాపంబు తనకివ్వ - తలను యొగ్గి
ధరణి నఙ్ఞాత వాసంబు - దాట గలిగె !
దండనము కాదు కాదది - పండువయ్యె !
_________________________________
వానరునకదె శిక్షయౌ వాలమెల్ల
రిప్లయితొలగించండికాల్చుడీ యనగా దశకంధరుండు
హాయిగా లంక గాల్చిన హనుమ కౌర!
దండనము కాదు కాదది పండువయ్యె
సుబ్బారావుగారి బాటలో !
రిప్లయితొలగించండి03)
_________________________________
తల్లి తనయుల దిట్టును - తప్పు జేయ
తండ్రి తనయుల గొట్టును - దారి మార్చ
దేశికుడు తిట్టి గొట్టును - తీరు నేర్ప
దండనము కాదు కాదది - పండువయ్యె !
_________________________________
అయ్యా! వసంత కిశోర్ గారూ! మీ ఆరోగ్యము తొందరలో కోలుకోవాలని మా ఆకాంక్ష. మీ పూరణలోని భావము చాల బాగుగ నున్నది. కొన్ని సూచనలు చూడండి:
రిప్లయితొలగించండి(1) రాజు + కు అనునప్పుడు రాజు + నకు అని వాడవలెను.
(2) తనకివ్వ అనుట వాడుక భాష అగును -- తనకీయ అంటే ఇంకా బాగుంటుంది.
(3) తలను + ఒగ్గ - యడాగమము రాదు; తలనొగ్గ అగును.
నేమానివారికి ధన్యవాదములతో :
రిప్లయితొలగించండి02అ)
_________________________________
ధర్మనందను తమ్ముడు - ధర్మ చరుడు
తరుణి శాపంబు తనకీయ - శిరము నొగ్గి
ధరణి నఙ్ఞాత వాసంబు - దాట గలిగె !
దండనము కాదు కాదది - పండువయ్యె !
_________________________________
నేమానివారి ననుగమిస్తూ :
రిప్లయితొలగించండి04)
_________________________________
ధరణి జాతను కనుగొన్న - మారుతపుడు
తనదు వాలము కాల్పింప - దనుజ ప్రభువు
దగ్ధ మొనరించె లంకను - దయను వీడి
దండనము కాదు కాదది - పండువయ్యె !
_________________________________
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి05)
రిప్లయితొలగించండి_________________________________
శ్యామవర్ణుని నిందింప - సత్య తండ్రి
నింద నీలాపనిందగా - నిర్ణయించి
మణిని , భామల బొందెను - మాధవుండు !
దండనము కాదు కాదది - పండువయ్యె !
_________________________________
నిర్ణయించి = నిరూపించి
అయ్యా! వసంత కిశోర్ గారూ!
రిప్లయితొలగించండిమీ పద్యములో ధరణిజాతను ... అనే పాదములో ప్రాస యతిని వేద్దామనుకున్నారు కానీ మీరు ప్రాస నియమము ప్రకారమే ప్రాసయతిని వెయ్యాలి అని గమనించినట్టుల లేదు. అందుచేత ఆ పాదమును ఇలా మారిస్తే బాగుంటుందేమో:
"అవని జాతను చూచెను హనుమ యపుడు"
స్వస్తి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండినేమానివారికి ధన్యవాదములతో :
రిప్లయితొలగించండి04అ)
_________________________________
ధరణి జాతను కనుగొన్న - సరయు సుతుడు
తనదు వాలము కాల్పింప - దనుజ ప్రభువు
దగ్ధ మొనరించె లంకను - దయను వీడి
దండనము కాదు కాదది - పండువయ్యె !
_________________________________
సరయువు = వాయుదేవుడు
"సరయు సుతుడు " అనకూడని పక్షంలో :
రిప్లయితొలగించండి04ఆ)
_________________________________
ధరణి జాతను మారుతి - నరయు పిదప
తనదు వాలము కాల్పింప - దనుజ ప్రభువు
దగ్ధ మొనరించె లంకను - దయను వీడి
దండనము కాదు కాదది - పండువయ్యె !
_________________________________
06)
రిప్లయితొలగించండి_________________________________
నలుడు దావాగ్ని లో చిక్కి - నలుగు నపుడు
నాగుబామును కాపాడి - యేగు చుండ
ననువు కోల్పోవు టతనికి - ననువు పడెను
దండనము కాదు కాదది - పండువయ్యె !
_________________________________
ననువు = అందము
అనువుపడు = యుక్తమగు
మిత్రుల పూరణలు అలరిస్తున్నాయి.
రిప్లయితొలగించండిమన్ను తింటివ చినతండ్రి మానవేల
కొంటె చేష్టల ననుచును గొట్ట బూని
తల్లి గాంచగ విశ్వముల్ తనయు నోట
దండనము కాదు కాదది పండు వయ్యె
విధి పరీక్షకు నిలబడి విమలు డగుము
రిప్లయితొలగించండిదండనము కాదు కాదది - పండు వయ్యె
డు భవిత ,తొలగు కష్టాలు, శుభము కలుగు
దేవ దేవుండు కరుణించి దిక్కు నిలుచు
మూర్తీజీ ! అద్భుతం !
రిప్లయితొలగించండి07)
_________________________________
కరుణ లేకను శుక్రుని - కడుపు లోకి
కచుని యసురులు చంపించి - కాల్చి పంప
కచుని గాపాడె శుక్రుండు - కనికరించి !
దండనము కాదు కాదది - పండువయ్యె !
_________________________________
పల్లెలో నివాసము వలన ప్రకృతి మధ్య ఉండి తిండి గింజలు పెట్టి ప్రతి దినము రంగు రంగుల పక్షులను చూసి ఆనందిస్తుంటాను .
రిప్లయితొలగించండిమిత్రులు చంద్రశేఖరులు సాక్షి.
పల్లె జనులకు సేయగా వైద్య సేవ
పచ్చదనములఁ బ్ర్రకృతియు ప్రాప్త మయ్యె
పక్షి గణములఁ బ్రోచుట వరము గాదె
దండనము కాదు కాదది పండువయ్యె
కిశోర్ జీ కృతజ్ఞతలు. మీ కవితా వెల్లువ బహు పసందు.
రిప్లయితొలగించండి08)
రిప్లయితొలగించండి_________________________________
కాననములకు రాముని - కైక బంప
క్షాంతి కల్యాణ కారక - కారణుండు !
కరకు రాక్షస మూకల - గావు పెట్టె !
దండనము కాదు కాదది - పండువయ్యె !
_________________________________
గావు పెట్టు = చంపు
మూర్తీజీ ! ధన్యవాదములు !
రిప్లయితొలగించండిఏమిటీ వేళ ? యింత అర్థరాత్రివరకూ పడుకోకుండా ?
09)
రిప్లయితొలగించండి_________________________________
వనజహితునిని పండని - భ్రమసి నపుడు
వజ్ర ఘాతము నందిన - పవన సుతుడు
వరములను బొందె మిక్కిలి - సురల వలన !
దండనము కాదు కాదది - పండువయ్యె !
_________________________________
10)
రిప్లయితొలగించండి_________________________________
సత్య మెన్నడు దప్పని - నిత్య వ్రతుని
సత్య సంధత రూపింప - సత్యవాక్కు
సత్య లోకము జేరెను - సత్యవ్రతుడు !
దండనము కాదు కాదది - పండువయ్యె !
_________________________________
సత్యవాక్కు = ఋషి (విశ్వామిత్రుడు)
దండనము కాదు కాదది పండువయ్యె
రిప్లయితొలగించండిదండకారణ్యవాసులౌ తాపసులకు
చెట్టు పుట్టల కెగిరెడి పిట్టలకును
రామదర్శన లాలస రమణులకును
ఉదయమే లేచి బ్లాగులో నున్న వ్యాఖ్య
రిప్లయితొలగించండిలన్ని పరిశీలనము చేసి యందఱకును
తగు సమాధాన మిచ్చుట తప్పనట్టి
దండనము; కాదు కాదది పండు వయ్యె.
వసంత కిశోర్ గారూ,
రిప్లయితొలగించండిమీ పది పూరణలూ బాగున్నాయి. అభినందనలు.
రెండవ పూరణలో ‘తలను + ఒగ్గి’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘తలను దాల్చి’ అందామా? ‘ధర్మరాజుకు తమ్ముడు’ను ‘ధర్మరాజున కనుజుండు’ అందాం.
(ఓహ్ ... నేమాని వారి వ్యాఖ్యతో సవరించారు. ఇప్పుడు గమనించాను)
మూడవ పూరణలో ‘తిట్టి + కొట్టును’ అన్నప్పుడు సరళాదేశం రాదు. ‘తిట్టి కొట్టును’ అంటేనే సరి.
సవరించిన నాల్గవ పూరణలో ‘మారుతి నరయు’ కు మారుగా ‘మారుతి యరయు’ ఉండాలి.
ఏడవ పూరణలో ‘లోకి’ అనడం తప్పేమో? ‘లోనికి’ అనాలనుకుంటాను. అలా అంటే గణదోషం. ‘కడుపునందు’ అందామా?
తొమ్మిదవ పూరణలో ‘వనజ హితునిని’ ... ఇక్కడ ఒక ‘ని’ ఎక్కువయింది. అక్కడ ‘వనజ మిత్రుని/ బాంధవు’ అంటే సరి!
పదవ పూరణలో రేఫసంయుక్తాక్షరానికి ముందున్న అక్షరాన్ని లఘువు చేసారు. పండిత నేమాని వారు సమర్థించినా నా మనస్సులో ఏదో అసంతృప్తి. ఛందశ్శాస్త్ర గ్రంథాలను మరోసారి తిరగేయాలి.
సరదాగా ఈ బ్లాగుకి
రిప్లయితొలగించండిగురువుగ మన్ననల నందు కొనుచుండిన శం
కర ధీనిధి మీ ఓపిక
కరము ప్రశంసార్హమగుచు క్రాలును జగతిన్
శంకరార్యా ! చక్కని సవరణలకు ధన్యవాదములు !
రిప్లయితొలగించండినేమానివారికి ధన్యవాదములు !
ఇంతకీ పూరణ -04అ)- లో సరయువు = వాయుదేవుడు
ఐన
సరయు సుతుడు = వాయుదేవుని కుమారుడు
తప్పా ? సరియా ? తెలుపగలరు !
పండిత నేమాని వారూ,
రిప్లయితొలగించండిధన్యవాదములు.
*
వసంత కిశోర్ గారూ,
‘సరయు సుతుడు’ సాధువనే నా భావన.
గంగ యంతటి పావని భంగ పడక
రిప్లయితొలగించండిభువికి దిగివచ్చి జగతికి భాగ్య మిచ్చె
లోక రక్షణ చేయుట యోగ్య తనుచు
దండనము కాదు కాదది పండు వయ్యె
యోగ్యత = అర్హత ,.....భంగ పడక = అవమాన పడక
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిచక్కని పూరణ. అభినందనలు.
*
సుబ్బారావు గారూ,
మీ రెండు పూరణలు బాగున్నాయి. అభినందనలు.
అయితే మొదటి పూరణలో సమస్యను నాల్గవపాదంగా ఉంచితేనే అన్వయం బాగుంటుంది.
రెండవ పూరణలో ‘స్కూలులో(న్) + ఒజ్జగాను’ అన్నప్పుడు ‘స్కూలులో నొజ్జగాను’ అవుతుంది. అక్కడ యడాగమం రాకూడదు.
‘సిరి వలదను...’ సమస్యకు మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
*
పండిత నేమాని వారూ,
మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.
*
గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
ఈ పూరణలో మీరూ మీ విశ్వరూపాన్ని ప్రదర్శించారు. బాగుంది.
మీ రెండవ పూరణ కూడ చక్కగా ఉంది. అభినందనలు.
*
లక్కాకుల వెంకట రాజారావు గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
చంద్రశేఖర్ గారూ,
ఒక శబ్దచిత్రాన్ని ఆవిష్కరించారు. బాగుంది మీ పూరణ. అభినందనలు.
ఇంతకీ ఆ రమణులు దండకారణ్యంలోని తాపసరమణులేనా?
*
(సరదాగా...... తుమ్మి "చిరంజీవ!" అనుకున్నట్లు)
కంది శంకరయ్య గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
ఆ ‘దండన’ మీకు మీరు వేసుకున్నదేగా! దానివల్ల కవిమిత్రులకు పండుగే కదా!
మెండుగ సమస్య లిచ్చుచు
దండిగ పూరణలఁ గొనుచు దండన మనుచున్
గుండె చెదరనీయకుమా;
పండిత నేమాని రక్ష! ‘బ్లాగింపు’ మిఁకన్.
రాజేశ్వరి అక్కయ్యా,
రిప్లయితొలగించండిచక్కని పూరణ. బాగుంది. అభినందనలు.
‘యోగ్యత + అనుచు’ అన్నప్పుడు సంధి లేదు. యడాగమం వస్తుంది. దానిని ‘యోగ్యత యని’ అంటే సరి!
శ్రీ శంకరయ్య గారికి నమస్కారములు.
రిప్లయితొలగించండిమీరు సూచించి నట్లు సవరించు కొందును.
కృతజ్ఞతలు .
శంకరార్యా ! మీరు సాధువే యన్ననూ నా సందేహము తీరుట లేదు !
రిప్లయితొలగించండిఏ మూలనో చిన్న సంశయము పొడసూపు చున్నది !
తనయ వరుడు = కూతురి మొగుడు (విభుడు/ప్రియుడు)
సరయు సుతుడు = సరయూ నది పుత్రుడు
అన్న విపరీతార్థాలే నన్ను వేధించు చున్నవి !
దయయుంచి అచ్చోట వ్యాకరణ కార్యం వివరించండి !
యడాగమం గురించి పెద్ద పాఠమే పెట్టారు !
కాని అదేమీ యెవరి బుర్రకూ యెక్కినట్లు లేదు !
నుగాగమం గురించి కూడా ఒక పాఠం పెడితేనే గాని
రెంటికీ తేడా తెలిసేటట్టు లేదు !
మిత్రులందరూ ఎక్కువ సార్లు తప్పు చేసేదిక్కడే !
చేసిన తప్పు మళ్ళీ మళ్ళీ చెయ్యకుండా శిష్యులను
తీర్చి దిద్ద వలసిన పెద్ద బాధ్యత మీదే గదా !
శంకరార్యా ! మిమ్మల్ని మీరే అభినందించుకున్న మీ వ్యాఖ్యలు
రిప్లయితొలగించండిఈ నాటి అద్భుత మనవచ్చు !
అబ్బ ! ఎంత ఆనందం వేసిందో అది చూసి !
వసంత కిశోర్ గారూ,
రిప్లయితొలగించండికూతురి వరుడు అనే అర్థంలో ‘తనయావరుడు’ అవుతుంది. ‘తనయ’ ఆకారాంత స్త్రీలింగ శబ్దం. ‘అంకము జేరి శైలతనయాస్తనదుగ్ధము లాను ..’ అన్నాడు పెద్దన. ‘తనయస్తనం’ అనలేదు. రాముడు ‘జనకతనయా వరుడు’. తనయుడు అకారాంత పుంలింగశబ్దం. అది సమాసపూరవపదమైనపుడు తనయ అవుతుంది. ‘కుంతీతనయ మధ్యముడు’ అంటారు. ‘కుంతీసుతమధ్యముడు’ అనడం మీరు వినే ఉంటారు. ‘వచ్చెం గుంతీసుతమధ్యముండు ...’ భారత ప్రయోగం. నిజానికి సుత అంటే కూతురే కదా. ‘గిరిరాజసుతాతనయా’ అన్నారు. సుతతనయా అనలేదు. ఇక్కడ సమాసపూర్వపదంమైనపుడు కూతురైతే తనయా, సుతా అనీ, కొడుకైతే తనయ, సుత అనీ ఉంటాయి.
సరయూసుతుడంటే సరయూనది కొడుకు. సరయు సుతుడంటే సరయువు అనువాని కొడుకు. సందేహం తీరినట్టేనా?
వసంత కిశోర్ గారూ,
రిప్లయితొలగించండిఏం చేయను? నా పూరణల జోలికి ఎవ్వరూ రావడం లేదు మరి! :-)
శంకరార్యా ! సందేహం తీర్చినందులకు ధన్యవాదములు !
రిప్లయితొలగించండిఇప్పుడు మనసు కొంచెం స్థిమిత పడింది !
శంకరార్యా ! మీ పూరణల మీద వ్యాఖ్యానించే సాహసం
రిప్లయితొలగించండిమీ శిష్యులెవరికీ లేదు !
మీ కోరిక తీరాలంటే
గురువును మించిన శిష్యుల్ని తయారు చెయ్యాలి మీరు !
శంకరు నాభరణమునే
రిప్లయితొలగించండినంకంబుగ బెట్టు కొనిన శంకరు సామీ !
బింకంబౌ మీ రచనకు
వంకల కిల తావు లేదు వందన మయ్యా !
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిధన్యవాదాలు, మాస్టారూ. మీ ప్రశ్నతో నా ఆలోచనని పసిగట్టేశారనిపించించింది. పుంసాం మోహన రూపాయ - శ్రీ రాముని అందాన్ని చూసి మురిసిపోని వారెవరుంటారు చెప్పండి! తాపసరమణులే అనుకొందాం
రిప్లయితొలగించండిగురువు గారూ ధన్యవాదములు. మీ పూరణ మీ పూరణకు మీ వ్యాఖ్య కూడా చాలా బాగున్నాయి. వసంత కిశోర్ గారితో బాటు నా సందేహము కూడా తీరింది.
రిప్లయితొలగించండికిశోర్ జీ ద్వితియా విభక్తి మొదలు సప్తమీ విభక్తి వఱకు విభక్తి ప్రత్యయములకు బదులు నుగామమము వాడుకొన వచ్చును . అది గాక నుగామమ సంధి వలన కూడా నుగామము రావచ్చును. అది గురువు గారు చెప్ప వలసిన పాఠము. మీకు చక్కని కవితా ధార ఉంది. ప్రవహించనీయండి. నుగామ యడాగమాలు సరి చేయడానికి గురువు గారు , అన్నయ్య గారు ఉన్నారు. సత్పురుషులు విద్వాంసుల పరిచయము కూడా పూర్వజన్మ సుకృతమని మిత్రులు చంద్రశేఖరుల వారు చెప్పారు.
అయ్యా! శ్రీ శంకరార్యా!
రిప్లయితొలగించండిశుభాశీస్సులు. మీరు మన బ్లాగునకే గురువులు. అంతకన్న పెద్ద స్థానము ఇంకేమున్నది. అందరికి మార్గ దర్శకులు. మీలో దోషములు ఉండవు, అక్కడక్కడ టైపు పొరపాటులు దొరలుటేతప్ప. మీ రచనలని గూర్చి ఎవరూ వ్రేలెత్తి చూపలేరు అనే స్థాయిలో ఉంటాయి. ఎట్టి సూచనలకు అవకాశమున్నా నేను శ్రీ శ్యామల రావు గారు వదలుట లేదు కదా.
భూషణ దూషణమ్ములకు పొంగక క్రుంగక సుస్థిరాత్మవై
భాషను నమ్మి కొల్చుచును భాసుర వాగ్విభవానురక్తితో
తోషము మీర మేలయిన త్రోవను చూపుచు తోటివారికిన్
భూషణమై కవీంద్రులకు భూతి వెలుంగుము శంకరా సుధీ!
నేను ఎవరినీ పొగడుట లేదు కదా. పొగుడుచుంటే అహం పెరిగి అభ్యాసము తగ్గిపోయే అవకాశము ఉంటుంది అని నా భావము. మనమంతా నిరంతర విద్యార్థులమే కదా! స్వస్తి.
ధన్య వాదములు తమ్ముడూ !
రిప్లయితొలగించండిఈ వ్యాకరణం ప్రతి పద్యానికీ కొత్తే . అసలు నాకు వంట బట్టినట్టు లేదు . ఆ అదృష్టం ఎప్పడికో ? ప్చ్ !
లంక పల్కెను కపితోడ శంక లేదు
రిప్లయితొలగించండిగ్రుద్దు కాదిది పావనీ గొప్ప వరము
బ్రహ్మ చెప్పిన సమయము ప్రాప్తమయ్యె
దండనము కాదు కాదది పండువయ్యె