18, డిసెంబర్ 2011, ఆదివారం

సమస్యాపూరణం - 564 (తేనెబొట్టుతో నంబుధి)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది
      తేనెబొట్టుతో నంబుధి తియ్యనయ్యె.
ఈ సమస్యను సూచించిన కందుల వరప్రసాద్ గారికి ధన్యవాదాలు.

36 కామెంట్‌లు:

 1. అసుర కులమను సాగర మందు జూడ
  పుట్టె బాలుడు ప్రహ్లాదు పుణ్య మధుర
  భావ మందున నాయెగా పావనమ్ము
  తేనెబొట్టుతో నంబుధి తియ్యనయ్యె.

  రిప్లయితొలగించండి
 2. శర్మ గారు, ఏం చెప్పారు! అభినందనలు.చాలా బాగుంది. ఒక్క తేనె బొట్టుతో ఏమవుతుంది అనుకున్నా కానీ ప్రహ్లాదుడు తరతరాలనూ తరింపచేశాడు. నిజమే.

  రిప్లయితొలగించండి
 3. తేట పదముల వెలుగులు తేనె లొలి కె
  తీయ తీయని రాగాలు తీపి చేసె
  తేనె లూరించు నన్నింట తియ్య దనము
  తేనె బొట్టుతో నంబుధి తియ్య నయ్యె .

  రిప్లయితొలగించండి
 4. హరిని ద్వేషించి నిందించు నసుర వంశ
  మందు భక్తితో మనసార హరిని గొలుచు
  బాలకుండు ప్రహ్లాదు డుద్భవ మయె నొక
  తేనె బొట్టుతో నంబుధి తియ్య నయ్యె

  రిప్లయితొలగించండి
 5. శాస్త్రి గారూ , నేనూ మీ ప్రహ్లాద మార్గమునే పట్టాను. మీ పద్యము హృద్యముగా ఉంది.

  రిప్లయితొలగించండి
 6. కంది వంశాబ్ధి జాత శంకరుని గనగ
  తెలుగు పద్యాల పువ్వుల తేనె పట్టు
  పుట్ట తేనియ చిప్పిలి పుడమి జార
  తేనె బొట్టుతో నంబుధి తియ్య నయ్యె

  రిప్లయితొలగించండి
 7. సకల వాఙ్మయమున సదా సారభూత
  మైన దాశివతత్త్వమే దాని వలన
  జ్ఞాన తేజమ్ము వ్యాపించు జగతి నటుల
  తేనె బొట్టుతో నంబుధి తియ్యనయ్యె

  రిప్లయితొలగించండి
 8. దినమునందొక్క పాదము తెలియజేయ ( సమస్యను యీయగా )
  పద్యసంద్రము సృష్ట్యగు హృద్యముగను,
  కంది గురువుల వ్యఖ్యానమందు తేనె
  తేనెబొట్టుతో నంభుధి తియ్యనయ్యె.

  వ్యాఖ్యానము + అందు తేనె ( ఆ పద్యసముద్రములో గురువుగారి వ్యాఖ్యానములు తేనె పలుకులు )

  శంకరాభరణము యింత మధురముగా వుండడానికి కారణము గురువుగారే కదా!!.

  రిప్లయితొలగించండి
 9. కందుల వర ప్రసాదం
  కంది బ్లాగ్ముఖీయం మై
  తేనె
  బొట్టు తో
  నంభుది
  తియ్య నయ్యెన్ !

  రిప్లయితొలగించండి
 10. హనుమచ్ఛాస్త్రి గారు, పొరపాటుగా మిమ్మల్ని శర్మగారని సంబోధించాను. మన్నించాలి.
  మూర్తిగారు, పండితుల వారు, సుబ్బారావుగారు, సంపత్ కుమార్ శాస్త్రి గారు, రాజారావు గారు
  మీ అందరి పూరణలూ శోభాయమానంగా ఉన్నాయి. అభినందనలు.
  జిలేబిగారు, మీ భావాలను మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు.

  లోకమందున దేశములున్నవెన్నొ
  వేదసంస్కృతి గల్గిన పేర్మియున్న
  భారతమనెడి దేశము వలన గాదె_
  తేనె బొట్టుతో నంబుధి తియ్యనయ్యె!

  భారతదేశము వల్లనే ప్రపంచమే పావనమైందని నా భావము.

  రిప్లయితొలగించండి
 11. గాంధి వంశము దుగ్ధంపు కడలి కనగ
  మోహనుడు తీయ తేనియ మోద మాయె
  పాలు తేనెల కలయిక భరత ధాత్రి
  తేనె బొట్టుతో నంబుధి తియ్యనయ్యె!

  రిప్లయితొలగించండి
 12. మిస్సన్న గారు,
  అంబుధి నీటిసముద్రము కదా, పాలకడలి గా మార్చారా?

  రిప్లయితొలగించండి
 13. అయ్యా శ్రీ మిస్సన్న గారూ!

  గాంధీ గారిని తేనెగా చెప్పునప్పుడు, వారి వంశమును ఒక కల్ప వృక్షముగా చెప్పుట బాగుంటుంది కదా. మీ తొలి పాదమును ఈ విధముగా మార్చితే బాగుంటుందేమో చూడండి.

  "గాంధి వంశము పావన కల్పకమ్ము"

  రిప్లయితొలగించండి
 14. జీ యన్ యమ్ గారూ! ధన్యవాదములు. ప్రహ్లాదుని బాట అందరికీ ఆహ్లాద కరమైనదే..
  మందాకిని గారూ ! భారత దేశాన్ని లోకానికి తేనె చుక్కను చేశారు బాగుంది.
  సుబ్బారావు గారూ ! తెల్గు భాషను తేనె బొట్టును చేశారు చక్కగా వున్నది.
  లక్కాకుల వారూ ! కంది వంశాబ్దివారితో మాకందించిన తేనెపట్టు తియ్యగా నున్నది.
  నేమాని వారూ ! శివ తత్వముతో జ్ఞాన తేజమ్ము నింపిన పూరణ బాగా వెలుగొందు చున్నది.
  సంపత్ గారూ ! పద్య సాగరం మధుర వ్యాఖ్యలతో తియ్యనైన విధము మధురముగా నున్నది.
  మిస్సన్న గారూ ! పాలల్లో తేనె కలిపి ఇస్తే ఇంకా చెప్పేదేముంది.ఆహ్..
  మద్యలో 'జిలేబి' ముక్కలు భేషుగ్గా ఉన్నాయి.
  అందరకూ అభినందనలు.

  రిప్లయితొలగించండి
 15. మందాకిని గారూ క్షీరాంబుధి, క్షీరాబ్ధి అంటే పాల కడలి కదా.

  రిప్లయితొలగించండి
 16. నేమాని పండితార్యా మీ సూచన చాలా బాగుంది. కానీ, పాలు తేనె కలపడం ఎలాగా అని చూస్తున్నాను.

  రిప్లయితొలగించండి
 17. వెంకట రాజారావు . లక్కాకులఆదివారం, డిసెంబర్ 18, 2011 6:59:00 PM

  సరదాగా......

  తాడిగడప ,వేమాని ,మందాకినీ స
  మేత రాజేశ్వరీ సోదరీ తదితర -
  చంద్ర శేఖరు ,గోలి,మిస్సన్న ,గన్న
  వరపు ,సంపత్కుమార ,జిగురు ,కిశోరు

  తెలుగు మధుపాలు పద్య పూదేనె బొట్టు
  బొట్టు తెచ్చి కూర్చగ తేనె పట్టు శంక
  రా భరణ మొప్పె - తెలుగు సారస్వతాన
  తేనె బొట్టుతో నంబుధి తియ్య నయ్యె

  రిప్లయితొలగించండి
 18. కామ క్రోధాది రిపులను కలిగి యున్న
  పరమ భీకర సమరపు బైలు భూమి
  మనుజు మదియందు దైవనామమ్మునిడిన_
  తేనె బొట్టుతో నంబుధి తియ్య నయ్యె

  రిప్లయితొలగించండి
 19. ఘన ఋణానుబంధ లవణాకరము నాదు
  జీవనము రామ! నీనామ సేవజేయ
  రామ నామ రసాయన రామకమగు
  తేనెబొట్టుతో నంబుధి తియ్యనయ్యె!
  మనవి: రుచి ప్రధానమైన పూరణ గావున లవణాకరము=సముద్రము~=సంసార సాగరము అను మాట వేయటమైనది.

  రిప్లయితొలగించండి
 20. అల్లరి మూకలను బిలిచి యభినం దింతున్.
  --------------
  పిల్లలు సేయుదు రల్లరి
  అల్లరియే వారి కిష్ట మయ్యా !వినుమీ
  కల్లయు కపటము లెరుగని
  అల్లరి మూకలను బిలిచి యభి నందిం తున్.

  రిప్లయితొలగించండి
 21. ముందుగా నిన్నటి పూరణలను అభినందించిన సోదరులకు ధన్య వాదములు

  రిప్లయితొలగించండి
 22. నింగి తారల సంద్రాన ఖంగు మనుచు
  మెరుపు దాడులు పండిత గురువు లనగ
  వంక లేనట్టి శంకరా భరణ మనెడి
  తేనే బొట్టుతో నంబుధి తియ్య నయ్యె !

  రిప్లయితొలగించండి
 23. అయ్యా మిస్సన్న గారూ!
  ఈ మీ సవరించబడిన పద్యమును చూడండి.

  గాంధి వంశము పావన కల్పతరువు
  మోహనుడు తీయ తీయని తేనె మరియు
  భరత భూమి పయోధియై పరగుచుండ
  తేనెబొట్టుతో నంబుధి తీయనయ్యె

  (పయస్సు : పాలు, నీరు)

  రిప్లయితొలగించండి
 24. అయ్యా! శంకరయ్య గారూ!
  మీ పద్యములో: సృష్టి కర్త కరుణా విశేషమనెడు కి బదులుగా సృష్టికర్తృ కరుణా విశేషమనెడు అనాలేమో. చూడండి.

  రిప్లయితొలగించండి
 25. కందుల వరప్రసాద్ గారూ,
  చక్కని సమస్యను పంపి వైవిధ్యమైన, మనోహరమైన పూరణలు చేయడానికి అవకాశం కల్పించినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు.
  *
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  అసురకులమనే సముద్రంలో ప్రహ్లాదుడనే తేనెబొట్టును వేసారు. చక్కని పూరణ. అభినందనలు.
  ‘పుట్టె బాలుడు ప్రహ్లాదు పుణ్య మధుర | భావ మందున’ అన్నదాన్ని ‘పుట్టె ప్రహ్లాదుఁ డాతని పుణ్యమధుర | భావ మందున’ అంటే ఎలా ఉంటుంది?
  *
  సుబ్బారావు గారూ,
  తేనె వంటి పదాలతో ఆంధ్రభాషాసముద్రం సంగీత సాహిత్యాలనే తియ్యదన్నాన్ని పొందిందంటారు. బాగుంది మీ పూరణ. అభినందనలు.
  *
  గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
  గోలి వారి భావాన్నే తెలిపినా మీ పూరణ పదసౌందర్యంతో, ప్రత్యేక శోభతో అలరారుతున్నది. అభినందనలు.
  *
  లక్కాకుల వెంకట రాజారావు గారూ,
  సంతోషం. ధన్యవాదాలు. నన్ను ‘ఎక్కడికో’ తీసికెళ్ళారు.
  *
  పండిత నేమాని వారూ,
  శివతత్త్వమనే తేనెబొట్టుతో సముద్రమనే జగతిలో జ్ఞానతేజమనే మాధుర్యాన్ని నింపిన మీ పూరణ అత్యుత్తమంగా ఉంది. అభినందనలు.
  *
  సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  కాని నా వ్యాఖ్యానాలుగా ‘బాగుంది, చక్కగా ఉంది, ప్రశస్తంగా ఉంది, ఉత్తమంగా ఉంది ...’ లాంటి పడికట్టు మాటలు చెప్పి ఏమైనా ఛందోవ్యాకరణ దోషాలుంటే సవరణలు సూచిస్తున్నాను. అంతే! నిజానికి సద్వ్యాఖ్యానాల మధుబిందువులను చిలకరించేది పండిత నేమాని వారు, శ్యామల రావు గారు, అప్పుడప్పుడు మిగిలిన కవిమిత్రులు. ఈ ఘనతంతా మీదే!
  మీ పూరణలో ‘పద్యసంద్రము’ దుష్టసమాసం, ‘సృష్ట్యగు’ కుసంధి అవుతున్నాయి. ‘సృష్టి + అగు = సృష్టి యగు’ అవుతుంది. యణాదేశం రాదు. ఆ రెండవ పాదానికి నా సవరణ ... ‘పద్య వార్ధి సృష్టి యగును హృద్యముగను’
  *
  జిలేబి గారూ,
  ధన్యవాదాలు. మీ భావానికి నా పద్యరూపం ....

  కందుల వరప్రసాదమై గను సమస్య
  కంది బ్లాగు ముఖీయమై విందు సేసె
  కవి విరచిత పూరణల్ చవులెసంగ
  తేనెబొట్టుతో నంబుధి తియ్యనయ్యె.
  *
  మందాకిని గారూ,
  ప్రపంచమనే సముద్రానికి జ్ఞానమనే అమృతాన్ని పంచిన భారతదేశ సంస్కృతి గురించిన మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 26. మిస్సన్న గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు. అయితే కొంత సందిగ్ధత. నేమాని వారి సవరణతో ఆ సందిగ్ధత తొలగిపోయింది. అభినందనలు.
  *
  పండిత నేమాని వారూ,
  కవిమిత్రుల పూరణలను విశ్లేషించినందుకు ధన్యవాదాలు.
  *
  లక్కాకుల వెంకట రాజారావు గారూ,
  మీరు ‘సరదాగా’ అని చెప్పిన రెండు పద్యాల పూరణలో కవిమిత్రులను సంబోధించినందుకు ఆనందంగా ఉంది. ధన్యవాదాలు.
  *
  మందాకిని గారూ,
  మీ రెండవ పూరణ కూడా ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
  ‘కామక్రోధాది’ అన్నప్పుడు ‘మ’ గురువై గణదోషం వస్తుంది. అక్కడ ‘కామరోషాది’ అందాం. ‘బైలు’ శబ్దానికి ఆకాశం అనే అర్థం ఉంది. మీరు విశాలమైన అనే అర్థంలో ప్రయోగించి ఉంటారు. అక్కడ ‘బయలు’ అంటే సరి!
  *
  చంద్రశేఖర్ గారూ,
  రామనామంతో సంసారసాగరం మాధుర్యాన్ని పొందుతుందన్న మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
  *
  సుబ్బారావు గారూ,
  ‘అల్లరి మూకల’ మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  రాజేశ్వరి అక్కయ్యా,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  *
  పండిత నేమాని వారూ,
  ధన్యవాదాలు. మీరు చెప్పినదే సరియైనది. సవరిస్తాను.

  రిప్లయితొలగించండి
 27. నా పూరణ ....

  సృష్టికర్తృ సత్కరుణా విశేష మనెడి
  తేనెబొట్టుతో నంబుధి తియ్యనయ్యె;
  తదుపరి యగస్త్యుఁ డను ముని త్రాగి క్రక్క
  వారినిధి రుచి మారి లావణ్య మయ్యె.
  (లావణ్యము = లవణము గలది; ఉప్పన)

  రిప్లయితొలగించండి
 28. గురువుగారికి, పండితుల వారికి నమోవాకములు.
  గురువుగారు, మీ సూచనలకు ధన్యవాదములు.

  రిప్లయితొలగించండి
 29. శంకరార్యా ! చక్కని సవరణ చేశారు. ధన్యవాదములు.
  మీ సూచనతో..

  అసుర కులమను సాగర మందు జూడ
  పుట్టె ప్రహ్లాదు డాతని పుణ్య మధుర
  భావ మందున నాయెగా పావనమ్ము
  తేనెబొట్టుతో నంబుధి తియ్యనయ్యె.

  రిప్లయితొలగించండి
 30. నేమాని పండితార్యా ధన్యవాదములు.
  గురువుగారూ ధన్యవాదములు.

  రిప్లయితొలగించండి
 31. శ్రీగురుభ్యోనమ:

  తిమిరవార్ధిని ఛేదించు దివ్వెవోలె
  సుధను వర్షించు చంద్రుడు మధువు కాగ
  నల్లనైనట్టి జీకటి తెల్లబోయె (తెల్లనాయె)
  తేనెబొట్టుతో నంబుధి తియ్యనయ్యె.

  రిప్లయితొలగించండి
 32. ఆర్యా !

  ఇది నా పూరణ

  భవమహాసాగరమునందు పాపలవణ
  మిళిత జలమున చింతింప మేదినీసు
  తపతి మధురనామమకరందము కలువగ
  తేనెబొట్టుతో నంబుధి తియ్యనయ్యె

  రిప్లయితొలగించండి