5, డిసెంబర్ 2011, సోమవారం

సమస్యాపూరణం - 550 (హనుమంతుని భార్యలు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది
హనుమంతుని భార్య లిద్దఱని చెప్పఁదగున్.

59 కామెంట్‌లు:

  1. విన హనుమ రుద్ర తేజము
    కన మనసాయె పతి కోతి ఘనమగు చేష్టల్
    వినువీధి నుండి జూచిరి
    హనుమంతుని, భార్య లిద్దఱని చెప్పఁదగున్.

    రిప్లయితొలగించండి
  2. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    01)
    _________________________________

    మనసార రాము గొలిచెడి
    "హనుమంతుని భార్య లిద్ద - ఱని చెప్పఁదగున్"
    యన వినుటకు వింతగదా !!!
    అనవరతము బ్రహ్మచర్య - మందుండంగా !
    _________________________________

    రిప్లయితొలగించండి
  3. అనవరత భజన లోలుని
    హనుమంతుని భార్య లిద్దరని చెప్ప దగున్
    ననునది వినుటకు నొప్పదు
    అనవసరము మాటలాడ నార్యులు నికపై .
    ----------
    క్షంతవ్యుడను

    రిప్లయితొలగించండి
  4. అనవరతము వింత సలుప
    జనప్రియముగ పలికితిరి శంకరగురువుల్
    తన శిష్య గణము తానన
    'హనుమంతుని భార్యలిద్దఱని చెప్పఁ దగున్ '

    తానన = తందాన తాన

    రిప్లయితొలగించండి
  5. గనుమా రాముని దూతను
    హనుమంతుని, భార్యలిద్దఱని చెప్పఁ దగున్
    ఘనుడౌ శేషశయనునికి
    కనులకు విందుగ నిలిచిరి గద యీ గుడిలో!

    రిప్లయితొలగించండి
  6. మాన్యులు శంకర గురువులు
    హనుమంతుని భార్యలిద్దరని చెప్పదగున్
    ననునిది పూరణ కిచ్చిరి
    వినసొంపుగ నుండునటుల వివరించండీ.

    రిప్లయితొలగించండి
  7. స్వామియె శరణం
    గురువు గారికి ధన్యవాదములు
    -----------------
    అనవరతము రాముని సే
    వను జేయు ఘనునకు భార్య వరుసలగునులే
    దన బహ్మచర్య, భక్తియు,
    హనుమంతుని భార్యలిద్దఱని చెప్పదగున్|

    రిప్లయితొలగించండి
  8. జనె లంక దాటి సంద్రము
    కనె సీతను గాల్చె పురము కపి యన గనిరా-
    త్రినయనుడు నలువ వేడన్,
    హనుమంతుని, భార్య లిద్దఱని చెప్పఁదగు.

    శివుడు, బ్రహ్మ భార్యలతో కలసి హనుమంతుని చూచేరని నాభావం.

    రిప్లయితొలగించండి
  9. వెంకట రాజారావు . లక్కాకులసోమవారం, డిసెంబర్ 05, 2011 3:12:00 PM

    ఘన కేతన మెత్తె నరుడు
    హనుమంతుని - భార్య లిద్దరని చెప్ప దగున్
    ఫణమున గెల్చిన దొక్కరు
    ఫణి శయనుని చెల్లె లొకరు -పరిణయ మాడెన్

    సుజన-సృజన

    రిప్లయితొలగించండి
  10. అయ్యా! శ్యామల రావు గారు!
    నిన్నటి మీ దశావతార స్తుతి చూచేను. 2, 3 పాదములలో యతి సరిపోవుట లేదు. నా సూచన గమనించండి:
    (2) కొండ వీపున మోయగా కూర్మ మగుచు
    (3) క్షోణి కోరను దాల్చగా క్రోడ మగుచు

    రిప్లయితొలగించండి
  11. అనృతమనుచు వెరవనిచో
    హనుమంతుని భార్యలిద్ద రని చెప్పదగున్
    పొనగూరునంత పాపము
    ఘనుల నటుల నిందజేయు కతమున నయ్యా!

    రిప్లయితొలగించండి
  12. వినినాడ ధాన్యమాలిని
    కిని మరియు సువర్చలకు నొగిన్ బతి చందం
    బున కథలు కలవు కావున
    హనుమంతుని భార్య లిద్దరని చెప్పదగున్

    రిప్లయితొలగించండి
  13. తాడిగడప శ్యామలరావు గారి పూరణ ......

    తన నెడఁబాయని బుద్ధియు
    తన కెడఁబాయంగరాని దగు శ్రీరఘునా
    థునియెడ భక్తియు నిజముగ
    హనుమంతుని భార్య లిద్దఱని చెప్పఁదగున్.

    రిప్లయితొలగించండి
  14. తన నెడబాయని బుధ్ధియు
    తనచిత్తము నేలు రామధరణీపతి సే
    వనకార్యాసక్తియు నివి
    హనుమంతుని భార్య లిద్దరని చెప్పదగున్

    రిప్లయితొలగించండి
  15. నాకొక రెండు సందేహాలు నా మొదటిపూరణలో. రెండవపాదంలో యతి గురించి మరియు భక్తి అనే దానకి భార్యాత్వం ఆపాదించవచ్చునా అనేవి. అందుచేత కొంచెం మార్పుచేసి మరలా ప్రకటించాను. విజ్ఞులు గుణదోషాలు పరిశీలించాలి.

    రిప్లయితొలగించండి
  16. శ్యామల రావు గారూ,
    మీ మొదటిపూరణలో రెండవపాదంలోనిది ‘అఖండయతి’. దీనిని కొందరు లాక్షణికులు అంగీకరించలేదు. దానితో యతి భేదాల సంఖ్య ఎక్కువయింది. ఇది ఈ కాలంలో చాలామంది విరివిగా ఉపయోగిస్తున్నదే. దోషం లేదు.
    భక్తికి భ్యార్యత్వాన్ని ఆపాదించడంలో నాకైతే తప్పనిపించడం లేదు.

    రిప్లయితొలగించండి
  17. హనుమకు నిద్దరు భార్యలు
    వినుటకు చోద్యముగ నుండు వివరింప దగున్ !
    కనుమా ? నిజమా ? హనుమా?
    హనుమంతుని భార్య లిద్దఱని చెప్పఁ దగున్ !

    రిప్లయితొలగించండి
  18. ఘనబాహూరుబలమ్మున
    ననిరిపుచయసంహరణము,ననిలస్నేహం
    బున, సరిపోలును భీముడు
    హనుమంతుని, భార్య లిద్దఱని చెప్పఁ దగున్ !

    రిప్లయితొలగించండి
  19. మనవీధి చివరి మద్దెల
    హనుమంతుని భార్య లిద్దఱని చెప్పఁదగున్
    కనకమ్మ కట్టుకొన్నది
    వనజాక్షివరుస నుడువఁగ వలదది వత్సా!

    రిప్లయితొలగించండి
  20. శ్రీగురుభ్యోనమ:

    ఘనమగు కడలిని దాటగ
    వినయంబుగ బొగడిరంత వీరులు నెవరిన్?
    యినపత్ను లెంద రనినన్
    హనుమంతుని, భార్య లిద్దఱని చెప్పఁ దగున్

    సముద్రమును దాటగల శక్తిమంతుడు హనుమంతుడని వానర వీరులు పొగడినారు.

    సూర్యుడు, చాయా ఉషా సమేతుడు.

    రిప్లయితొలగించండి
  21. మన తెలుగు వారూ, మీరీ పద్యము వ్రాసారని మద్దెల హనుమంత రావు గారితో చెప్ప మంటారా ?
    మీ స్ఫురణతోనే ,

    కన రే హనుమఛ్ఛాస్త్రిని
    వినసొంపుగ కవిత లల్లు విజ్ఞుండతడున్
    ఘన కవిత కాంత దలచగ
    హనుమంతుని భార్య లిద్దఱని చెప్ప దగున్ !

    రిప్లయితొలగించండి
  22. హనుమంతుడు గుణవంతుడు
    హనుమంతుడు బ్రహ్మచారి యని వింటిగదా
    వినలేనీ మాటను నే
    "హనుమంతుని భార్య లిద్దఱని చెప్పఁ దగున్ ! "

    అయ్యా ఇంతకన్న ఏమి స్ఫురించడం లేదు . ఇలా పూరించడం సమంజసమో కాదో మరి.

    రిప్లయితొలగించండి
  23. మనతెలుగు గారు మంచి యుపాయం చెప్పినందులకు ధన్యవాదాలు . నా పేరుతో వ్రాయగలుగుచున్నాను.

    రిప్లయితొలగించండి
  24. నా పూరణ ....

    పెనునిద్ర నుండెనో? క
    ల్లును ద్రాగినవాఁడొ? తెలివి లోపించెనొ? యి
    ట్లనె నొక్కఁడు పదుగుఱు విన
    "హనుమంతుని భార్య లిద్ద ఱని చెప్పఁదగున్"

    రిప్లయితొలగించండి
  25. ఘనముగ నిద్దరు భార్యల
    జనములు విఘ్నేశు నకు ,విశాఖున,కాది
    త్యున కొనరించిరి చిత్రము !
    హనుమంతుని వంతు వచ్చె నాహా !నిజమే!

    రిప్లయితొలగించండి
  26. రాం మోహన శర్మగారూ, సంతోషం మీ పేరు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. మీకు పద్యాలు వ్రాయటం ఇదే మొదలంటే నమ్మ బుద్ధి కావటం లేదు. "హనుమంతుడు గుణవంతుడు..." చక్కగా నడిపించారు. ఇక వెనక్కి తిరిగి చూడకండి.

    రిప్లయితొలగించండి
  27. హనుమంతుడు సూర్యుని కుమార్తెయైన సువర్చలను వివాహం చేసుకొన్నట్లు కొన్ని ప్రస్తావనలున్నాయి. ఈ విషయమై ఒక మంచి బ్లాగు చర్చ (సుదీర్ఘం) "హనుమంతునికి వివాహమైనదా" చూడండి:
    http://wwww.andhrafolks.net/ReadArticle.asp?Type=A&ID=871

    రిప్లయితొలగించండి
  28. డా.మూర్తి మిత్రమా! నారసింహుడు, హనుమంతుడు పంచముఖాంజనేయ స్వామి రూపాలే. మీ ఇద్దరి మధ్యకి నన్ను లాగకండి స్వామీ, అల్పప్రాణిని. ఇద్దరికీ నమస్సులు, చిత్తగించండి:
    వందే వానర నారసింహ ఖగరాట్ క్రోడాశ్వ వక్త్రాన్చితం|
    నానాలంకరణం త్రిపంచనయనం దేదీప్యమానం శివమ్|| (....రుచం అని పాఠాంతరము కలదు)|

    రిప్లయితొలగించండి
  29. రాం మోహన్ శర్మగారి పద్యాల్లో ధార కనిపిస్తోంది. కందం నడక బాగుంది. అభినందనలు. శర్మగారూ, మీకు నచ్చిన విషయంపైన పద్యాలు వ్రాస్తూ ఉండటం అభ్యాసం చేయండి. నిరంతరాభ్యాసంతో పద్యాలు వ్రాయటంలో మంచి వడి వస్తుంది. అలాగే, పద్యాలు వ్రాయాలనుకుంటున్నారు కాబట్టి మొదట తేలిగ్గా ఉండే కొన్ని పద్యకృతులు బాగా పరిశీలనగా పఠించండి. పద్యం నడపటంలో ఒడుపు చక్కగా ఆకళింపు అవుతుంది.

    రిప్లయితొలగించండి
  30. డా. మూర్తి మిత్రమా! మీ పద్యంలో "ఘన కవి(తా) కాంత దలచగ" సరి అని అనుకొంటున్నాను. అయితే హాస్యోక్తి గా, ఏ మార్పూ చేయకుండా కవిత దగ్గర కామా పెట్టి చదువుకొందాం. అప్పుడు, కవిత, కాంత ఇద్దరు అవుతారు. శాస్త్రిగారికి ఇప్పటికే వివాహం అయివుంటే ముగ్గురు, పోయిందేముందీ, ఇంకో వీరతాడు:-) ఏమంటారు?
    కన రే హనుమఛ్ఛాస్త్రిని
    వినసొంపుగ కవిత లల్లు విజ్ఞుండతడున్
    ఘన కవిత, కాంత దలచగ
    హనుమంతుని భార్య లిద్దఱని చెప్ప దగున్ !

    రిప్లయితొలగించండి
  31. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    శివుని భార్య లిద్దరు హనుమంతుని కోతి చేష్టలను చూసారంటారు. బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    వసంత కిశోర్ గారూ,
    చక్కని పూరణ. అభినందనలు.
    ‘తగున్ + అన’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘తగ న్నన’ అనే ప్రయోగా లున్నాయి. సమయానికి సూత్రం గుర్తుకు రావడం లేదు. పరీక్షలున్నాయని మా మేనకోడలు బాలప్రౌఢవ్యాకరణాలను తీసుకువెళ్ళింది. తర్వాత వివరంగా తెలియజేస్తాను.
    పద్యాంతంలో ‘ఉండంగా’ అనకుండా ‘ఉండంగన్’ అనండి.
    *
    సుబ్బారావు గారూ,
    సమంజసమైన పూరణే. క్షమించరాని తప్పేమీ చేయలేదు. ఇదికూడా ఒక పూరణాసంప్రదాయమే. బాగున్నాయి మీ రెండు పూరణలు. అభినందనలు.
    *
    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    అయితే నేను తాన అన్నంతమాత్రాన ఎవ్వరూ తందాన అనడం లేదు లెండి. అప్పుడప్పుడు నాకూ ‘చురకలు’ తప్పడం లేదు :-)
    మీ రెండవ పూరణలో హనుమచ్ఛాస్త్రి గారి్నే లక్ష్యం చేసుకున్నారు. బాగుంది.
    *
    మందాకిని గారూ,
    ప్రశస్తమైన పూరణ మీది. అభినందనలు.
    *
    వరప్రసాద్ గారూ,
    భక్తీ, బ్రహ్మచర్యాలను హనుమంతుని భార్యలను చేసారు. బాగుంది. మంచి పూరణ. అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    పద్యప్రారంభంలోనే పరుషాన్ని సరళం చేసారు. ‘చనె’ అనికదా మొదలు పెట్టవలసింది.
    *
    రాజారావు గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    కాని అర్జునుని భార్య లిద్దరేనా? ఉలూచి, చిత్రాంగదలను మరిచారా?
    *
    పండిత నేమాని వారూ,
    మీ రెండు పూరణలూ వైవిధ్యంగా ఉత్తమంగా ఉన్నాయి. అభినందనలు.
    *
    శ్యామల రావు గారూ,
    మీ పూరణ, దాని ననుసరించిన సవరణ బాగున్నాయి. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    ఇలా అనడం న్యాయమా అని ఏకంగా హనుమంతుణ్ణే అడిగేసారే!
    *
    ఊకదంపుడు గారూ,
    చక్కని పూరణ. అభినందనలు.
    *
    ‘మనతెలుగు’ చంద్రశేఖర్ గారూ,
    మద్దెల హనుమంత రావును గురించిన మీ పూరణ చమత్కారభరితమై అలరించింది. అభినందనలు.
    *
    శ్రీపతి శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘ఎవరిన్ + ఇన ...’ ఇక్కడ యడాగమం రాదు. ‘ఎవరి న్నిన ...’ అనండి. ఎందుకనాలో త్వరలోనే పాఠం పెడతాను.
    *
    రామ మోహన శర్మ గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు. ఇలా పూరించడం కూడా ఒక సంప్రదాయమే. అంతెందుకు? అవధానాలలో క్లిష్టమైన సమస్య నిచ్చిన పృచ్ఛకుని పూరణ సాకుతో ‘బండబూతులు’ తిట్టిన అవధానులూ ఉన్నారు. అయితే అదంతా ఆటలో అరటి పండు. దానివల్ల ఎవరూ కోపం తెచ్చుకోరు. తిట్లు తిన్న పృచ్ఛకుడూ నవ్వుతాడు ....

    రిప్లయితొలగించండి
  32. శంకరయ్యగారూ, క్లిష్టసమస్య మీద అవధాని మండిపడి పృచ్ఛకుని వాయించినా తన పూరణ నెపంతో, ఆ పైన తప్పని సరిగా సరసమైన పూరణ చెప్పితీరాలని నియమం ఉన్నట్లు గుర్తు.

    రిప్లయితొలగించండి
  33. విన సొంపుగ నుండ దగునె ?
    హనుమంతుని భార్య లిద్దఱని చెప్పఁ దగున్ !
    విని నంతనె హనుమంతుడు
    తన తోకను చుట్టి జనుల తరగల ద్రోయున్ !

    రిప్లయితొలగించండి
  34. అయ్యా శంకరయ్య గారూ!
    ఎవరిన్ + ఇన = ఎవరినిన అని సంధి చేస్తే హాయిగా ఉంటుంది. ఎవరిన్నిన అనే ప్రయోగములు ఉంటే ఉండవచ్చుగాక - కాని అవి కొంచెము ఇబ్బందిగానే ఉంటాయి.
    ఆలాగునే తగున్ + అన = తగునన అనడమే సబబు.
    సంస్కృత పదాల తరువాత కొన్ని ప్రయోగములు చూడండి: కస్త్వం + అనె = కస్త్వమ్మనె;
    ప్రీతం + అని = ప్రీతమ్మని
    ఇట్టి ప్రయోగములు మాత్రము చేసుకొన వచ్చును.

    రిప్లయితొలగించండి
  35. పృఛ్ఛకునిపై ఎదురు దాడి:
    సమస్యను ఇచ్చిన పృఛ్ఛకుని పై ఎదురు దాడి చేసినా, సరసమైన రీతిలో పూరణ చేయుట మాత్రము తప్పని సరి. ఎదురుదాడి ఏ మాత్రము సమంజసము కాదు. నోటి దురుసుతనమును ఎవరూ సహించరు.

    రిప్లయితొలగించండి
  36. చంద్ర శేఖర్ గారూ కవిత కాంత పేరు. విరామ చిహ్నాలు పెట్ట వలదని శ్యామలీయము గారు చెప్పారు కదా !

    రిప్లయితొలగించండి
  37. అయ్యా మనతెలుగు గారికి , శంకరయ్య మాస్టారు గారికి , శ్యామలీయం గారికి - అందరికి ధన్యవాదాలు . ఈరోజు ప్రాస విషయం లో నాకు చాలా తేలికైంది . హనుమంతుడు అంటూ ఆయన్నే నమ్ముకున్నాను . 'రెండు పాదాలు ' దాటేశాను . భవదీయుడు .

    రిప్లయితొలగించండి
  38. మాస్టరు గారూ! ధన్యవాదములు.
    మూర్తి గారూ ! 'మన' చంద్ర శేఖర్ గారూ ! ధన్యవాదములు.
    (పద్యములో ఏకవచనం తో సంబోధించాను. క్షమించాలి)
    మళ్ళీ కవిత, లల్లి అని విడదీసి కవితలల్లరుగా !
    చక్కని పూరణ లందించిన కవి మిత్రు లందరకు అభినందనలు.

    కనరే ! మూర్తీ! శేఖర !
    వినసొంపుగ కవిత లల్లి వేయగ మీరే
    ఘన మగు నిందలు న్యాయమ !
    హనుమంతుడు బుద్దిమంతు డని తెలియండీ !

    ( అరె..నా కవిత, కాంత గురించి వీరికెలా తెలిసిందబ్బా ! )

    రిప్లయితొలగించండి
  39. శ్యామల రావు గారూ,
    పండిత నేమాని వారూ,
    అవధానాలలో ఇటువంటి సంప్రదాయం కూడా ఒకటుంది అని చెప్పడమే. ముందే అవధాని పృచ్ఛకుని క్షమించమని వేడుకొని మరీ పూరణ ప్రారంభిస్తాడు. అటువంటిది ఒక అవధానంలో నా చిన్నతనంలో నేను చూసాను. మొదటి రెండు పాదాల్లో దూషణే. మూడవపాదంలో మాత్రమే పూరణ. పూరణ విని సభికులతో పాటు పృచ్ఛకుడూ సరదాగా నవ్వాడు. అయితే ఇది ఎల్లప్పుడూ స్వాగతించదగిందీ, మెచ్చుకొనదగిందీ కాదనుకోండి!

    రిప్లయితొలగించండి
  40. నా చిన్నతనంలో చూసిన అవధానంలో పృచ్ఛకు డిచ్చిన సమస్యా, అవధాని పూరణ గుర్తులేవు కాని ఇలాంటిదే నాకు తెలిసిన ఒక పూరణ. గతంలో మన బ్లాగులోనో, ఇంకెవరి బ్లాగులోనో వ్రాసినట్టు గుర్తు ....
    సమస్య - "గుండ్రాతికి కాళ్ళు వచ్చి గునగున నడిచెన్"
    పూరణ -
    ఉండ్రా ఓరి దురాత్మక!
    యిండ్రా ప్రాసమ్ము కవుల కియ్యఁదగున? కో
    దండ్రాము పదము సోకిన
    గుండ్రాతికి కాళ్లు వచ్చి గునగున నడిచెన్.

    రిప్లయితొలగించండి
  41. గురువుగారూ ఏం చెప్పమంటారండీ. మీరు చెప్పేదాకా ఆ తప్పును గమనించలేకపోయాను. ఒక్కొక్కసారి అంతేనండీ.

    మనతెలుగు వారి పూరణ చాలా బాగుంది.

    రిప్లయితొలగించండి
  42. మిత్రులారా!
    కొన్ని పదములు ఉదా: సభికులు, పూజ్యులు, ధీవరులు అనే వాటికి విపరీతార్థములు ఉంటాయి కాబట్టి ఆ పదములను వాడకుండుట మంచిది. సభ్యులు, పూజనీయులు, ధీమంతులు అని వాడుట శ్రేయస్కరము. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  43. వినుమది యెవ్వరు సెప్పిన
    హనుమంతుని భార్య లిద్దరని చెప్ప దగున్
    నని నంతనె వేగ పడక
    వినయముగా దాని గూర్చి వివరించు జుమీ

    రిప్లయితొలగించండి
  44. హనుమంతుని లీలలనే
    మనవచ్చును చూడుడీ సమస్యకు తగు స్పం
    దన లెన్నిటి చేయించెనొ
    మన మనముల మనుచునుండి మన గురువరుడై

    రిప్లయితొలగించండి
  45. ద్వితీయ ప్రయత్నం

    అనునిత్యమొక సహోద్యోగి
    తననెలవుకుఁబోవువేళ తత్సంధ్యాంతం
    బునఁగావమనుచువేడును
    హనుమంతుని,,భార్యలిద్దఱని చెప్పదగున్!

    రిప్లయితొలగించండి
  46. ఊదంగారూ, మంచి సహోద్యోగినే పట్టారు! ఇంకొంచెం పరిశోధించి ఆనందించండి :-)

    రిప్లయితొలగించండి
  47. అనుదినముసహోద్యోగియె
    తననెలవుకుఁబోవువేళ తత్సంధ్యాంతం
    బునఁగావమనుచువేడును
    హనుమంతుని;భార్యలిద్దఱని చెప్పదగున్!

    చంద్రశేఖర్ గారూ, ధన్యవాదములు, ఇప్పుడు మొదటి పాదం లో గణభంగాన్ని కూడా తొలగించాను.

    రిప్లయితొలగించండి
  48. సవరణ
    --------
    వినుమది యెవ్వరు సెప్పిన
    హనుమంతుని భార్య లిద్దరని చెప్ప దగున్
    విని నంతనె వేగ పడక
    వినయముగా దాని గూర్చి వివరించు సుమీ

    రిప్లయితొలగించండి
  49. మన్నించండి ఇలా అంట్టునందుకు గురువు గారు మీ బ్లాగ్ ని అందులో వ్రాస్తున్నా కామెంట్స్ చూస్తూ ఉంటె నాకు ఒక విషయం అర్ధమవుతంది.. పండితులా చర్చా వేదికలాగా ఉన్నది.. కానీ నాలాంటి(నాకు) వాళ్ళకు ఏమి అర్ధం అవటం లేదు.. గరువులు మీరు పద్యాలతో పాటు బావం కూడా వ్రాయగలరా !

    రిప్లయితొలగించండి
  50. గురువుగారూ,

    ఘనమగు కడలిని దాటగ
    వినయంబుగ బొగడిరంత వీరులు నెవరిన్?
    దినకరుని పత్ను లెందరు
    హనుమంతుని, భార్య లిద్దఱని చెప్పఁ దగున్

    ఇప్పుడు సరిపోతుందనుకుంటాను.

    రిప్లయితొలగించండి
  51. శ్రీ పతి గారూ! హనుమంతుని, భార్య లిద్దఱ వివిడిగా పట్టు కున్నారు బాగుంది.

    రిప్లయితొలగించండి
  52. ఘనముగ రాముని, యనుజుని,
    కనుగొని భుజముల భరించి కాచిన రీతిన్
    వినగనె లక్ష్మణ, రాములు ,
    హనుమంతుని భార్య లిద్దఱని చెప్పఁదగున్

    ....కృత్తివాస రామాయణములో అహిరావణుని వృత్తాంతము...

    ...భరించు వాడు "భర్త"

    రిప్లయితొలగించండి
  53. రణమున దుంపను త్రెంచగ
    కనుగొనగా స్మృతి ఇరాని ఘనుడగు మోడీ...
    అనుమాన మేల? కాంగ్రెసు
    హనుమంతుని భార్య లిద్దఱని చెప్పఁదగున్

    రిప్లయితొలగించండి