28, డిసెంబర్ 2011, బుధవారం

సమస్యాపూరణం - 574 (కవి గౌరవ మెల్ల)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది
కవి గౌరవ మెల్ల కావ్యగానము చెఱచెన్
ఈ సమస్యను పంపిన  
లక్కాకుల వెంకట రాజారావు గారికి
ధన్యవాదాలు.

30 వ్యాఖ్యలు:

  1. చవు లూరగ పాడెను పు
    ష్పవిలాపమ్ముఘంట సాలయె, దానిన్
    భువి నొక్కడు మార్చి పాడ
    కవి గౌరవ మెల్ల కావ్యగానము చెఱచెన్.

    ప్రత్యుత్తరంతొలగించు
  2. కవితా పుష్ప మునకు తీయని గాన సుగంధం తోడైతే "పుష్పవిలాపం" లా విలాసంగా వికసిస్తుంది. లేనప్పుడు వాడిపోతుంది.అని నాభావం.

    ప్రత్యుత్తరంతొలగించు
  3. కవులెల్ల వంద నీ యులు
    కవి గౌరవ మెల్ల నొకడు గానము వలనన్
    నవహే ళ న గావించిన
    కవి గౌరవ మెల్ల కావ్య గానము చెర ఱ చున్ .

    ప్రత్యుత్తరంతొలగించు
  4. అస్ఖలిత బ్రహ్మ చారి కార్గురు పుత్రుల్ .
    ----------

    అస్ఖలిత బ్రహ్మ చారిని
    నస్ఖలిత తొ పుత్రు లార్గు ననుటం దగునే ?
    అస్ఖలితుల కది సాధ్యమ?
    యస్ఖలిత బ్రహ్మ చారి కార్గురు పుత్రుల్ .

    ప్రత్యుత్తరంతొలగించు
  5. వెంకట రాజారావు . లక్కాకులడిసెంబర్ 28, 2011 9:00 AM

    స్తవనీయ మిచటి భారత
    కవి గౌరవ మెల్ల - కావ్యగానము చెరచెన్
    రవి యస్తమయం బెరుగని
    సువిశాల బ్రిటీషు తంత్ర శోభలు సురగన్

    ప్రత్యుత్తరంతొలగించు
  6. అయ్యా! గోలి వారూ!
    మీ పూరణ బాగున్నది కానీ 2, 3 పాదములలో గణములు చూచుకొనవలెను.

    ప్రత్యుత్తరంతొలగించు
  7. నవరాగమ్ము లటంచును
    వివిధములుగ పద్యములను విరుచుచు పాడన్
    శివ! శివ! అనర్థమయ్యెను
    కవి గౌరవమెల్ల కావ్య గానము చెఱచెన్

    ప్రత్యుత్తరంతొలగించు
  8. కవిహృదయ మెఱుఁగ నేరక
    వివిధవిధంబులుగ పాడు వీరుల వలనన్
    కవనంబున రుచి చెడగా
    కవి గౌరవ మెల్ల కావ్యగానము చెఱచెన్

    ప్రత్యుత్తరంతొలగించు
  9. అయ్యా!శ్రీ శ్యామలరావు గారూ!
    మీ పూరణ బాగున్నది కానీ వివిధ విధమ్ములు అనే ప్రయోగమే సాధువు కాదు. వివిధము అంటేనే అనేక విధములు అని అర్థము కదా!.

    ప్రత్యుత్తరంతొలగించు
  10. నేమాని సూచన మేరకు సవరించిన పద్యం:

    కవిహృదయ మెఱుఁగ నేరక
    వివిధప్రకారముల పాడు వీరుల వలనన్
    కవనంబున రుచి చెడగా
    కవి గౌరవ మెల్ల కావ్యగానము చెఱచెన్

    ప్రత్యుత్తరంతొలగించు
  11. అయ్యా సుబ్బారావు గారు!
    దుష్కర ప్రాసతో నున్న మీ పద్యమును చూచేను. అందులో ఏమి రసము ఉన్నది? దుష్కర ప్రాస ఒక అందమా? సరస భావ గర్భితముగా ఉండే పద్యాలే అందరూ హర్షించ తగినవి కదా!

    ప్రత్యుత్తరంతొలగించు
  12. శ్రీ టేకుమళ్ళ వెంకటప్పయ్యా గారి పూరణ (నిన్నటి నిషిద్ధాక్షరిలో) మనకెల్ల అనే సమాసములో "కె" ను ఏమనుకొనవలెను?

    ప్రత్యుత్తరంతొలగించు
  13. భువిలో స్థిరముగ నిల్పెను
    కవిగౌరవ మెల్ల కావ్యగానము; చెఱచెన్
    స్తవనీయ సరస కావ్యో
    ద్భవ మాధురి నెల్ల పక్షపాతి యసూయన్.

    ప్రత్యుత్తరంతొలగించు
  14. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    చక్కని పూరణ. అభినందనలు.
    మీ పద్యంలో రెండవ, మూడవ పాదాలలో గణదోషం. నా సవరణతో మీ పద్యం ....
    చవు లూరగ పాడెను పు
    ష్పవిలాప(మును) ఘంట సాలయె, దానిన్
    భువి నొ(క)డు మార్చి పాడ(గ)
    కవి గౌరవ మెల్ల కావ్యగానము చెఱచెన్.
    *
    సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘అస్ఖలిత బ్రహ్మచారి ...’ పూరణలో రెండవపాదంలో వ్యాకరణ విరుద్ధప్రయోగాలు (తొ, ఆర్గు ననుటం దగునే) ఉన్నాయి. ఆ పాదాన్ని ‘అస్ఖలితన్ పుత్రు లార్గు రనుటయు దగునే’ అంటే సరి!
    *
    లక్కాకుల వెంకట రాజారావు గారూ,
    మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.
    *
    శ్యామల రావు గారూ,
    మీ పూరణ శ్రేష్ఠంగా ఉంది. అభినందనలు.

    ప్రత్యుత్తరంతొలగించు
  15. కవి పండిత సభ యందున
    అవిరళ ముగపాడు చుండ నావేశమునన్ !
    రవిమించు కాంతు లీనెడు
    కవి గౌరవ మెల్ల కావ్య గానము చెఱచెన్ !

    ప్రత్యుత్తరంతొలగించు
  16. శ్రీ నేమాని వారికి నమస్కారములు .
    అస్ఖలిత...... అను సమస్యయే దుష్కర ప్రాసతో ఈయబడినది.
    రెండవ పాదములో "పుత్రు లార్గురనుటం" కు బదులుగా టైపింగులో
    పుత్రులార్గుననుటం అని టైపింగు చేయబడినది.నిజానికి మీ
    అభియోగము నాకు అర్ధము కాలేదు . దయ యుంచి
    కొం చెము వివరం గా తెలియ పర్చ గోర్తాను .తప్పును తెలిసికొని
    సవరిం చు కొం దును .

    ప్రత్యుత్తరంతొలగించు
  17. శ్రీ శంకరయ్య గారికి నమస్కారములు .
    మీరు సూచించిన ప్రకారము రెండవ పాదమును
    సవరింతును.మీ సవరణకు నా కృతజ్ఞతలు.

    ప్రత్యుత్తరంతొలగించు
  18. అయ్యా!శ్రీ సుబ్బారావు గారూ!
    మీరు ఈ బ్లాగులో చేర్చుచున్న సమస్యలు దుష్కరప్రాసలతోనే ఉంటున్నట్లు చూచేను. అటువంటి సమస్యలని ఇచ్చుటలో ఎమి ఆనందము ఉన్నదో నాకు తెలియుట లేదు. పదములకొరకు ఎంతో ఇబ్బంది పడవలసి వస్తుంది - భావము చక్కగీ వివరించుటకు వీలుండదు. భావ గర్భితముగ పూరించుటకు వీలుండే సమస్యలని ఇస్తే మంచి మంచి పూరణలు వస్తాయి - అది అందరకు సుకరముగా ఉంటుంది. అయినా ఎవరి ఆనందము వారిది. మీ అభిరుచి నాకు తెలియదు కదా!. స్వస్తి.

    ప్రత్యుత్తరంతొలగించు
  19. శ్రీ నేమాని వారికి నమస్కారములు .
    మీ అభి ప్రాయము అర్ధ మైనది .అయితే నేను ఈ సమస్యా పూరణ
    కార్య క్రమము లోనికి రాక పూర్వము ఈ యబడిన సమస్యలను
    రోజుకి ఒక్కటి చొప్పున యధా శక్తి పూ రించుచు బ్లాగు లో నికి
    పంపుచు న్నాను. సోదరి తుల్యులు ,రాజే శ్వరి గారి ప్రోత్సాహము వలన
    ఇందులోనికి ప్రవేశిం చాను .అంత క్రితము ఈ సమస్యా పూరణ కార్య క్రమము
    ఉన్నట్లు తెలియదు .మీరు మంచి మనస్సుతో నా దోషములను మన్నించి
    తగు సూచనలు ఇయ్య గోర్తాను .ఈ ద్వా రా నా రచనా శక్తిని ఇతో ధికంగా

    మే లు చేసికొన వీ లగును .ఇలా వ్రాసి నందులకు అన్యధా భావిం చ వలదని
    నా ప్రార్ధన . ఇట్లు ,మీ సోదర తుల్యుడు ,సుబ్బారావు .

    ప్రత్యుత్తరంతొలగించు
  20. శ్రీ సుబ్బా రావు గారికి నమస్సులు. మీ పద్య రచనాసక్తికి అభినందనలు. మీ కృషి సత్ఫలములను ఇచ్చు గాక!. సరళమైన భాషలో మంచి భావముతో, అన్వయ సౌలభ్యముగల పద్యములను రచించుట అలవరచు కొనవలెను. మీరు అధ్యాపక వృత్తిలో రాణించి విశ్రాంతి గైకొనుచున్న పెద్ద వారు. మీ వంటి వారికి నేను ప్రత్యేకముగా ఏమి చెప్పగలను. సమస్యలను నింపుట మంచిదే. కాని దీనివలన రచనా శైలి పెంపొందగలదని నేను చెప్పలేను. పూర్వ కవుల కావ్యములను బాగుగా అధ్యయనము చేస్తూ నిత్యము మననము చేసుకొనుచూ చిన్న చిన్న శీర్షికలతో ఖండికలను వ్రాయుట అలవరచుకొనండి. తప్పక మంచి ఫలితములు ఉండును. మీరు ఈ బ్లాగులోకి చేరుట ఆనందదాయకమే. మీ వంటివారి తోడ్పాటు ఇట్టి బ్లాగులకి ఎంతో ముఖ్యము. స్వస్తి.

    ప్రత్యుత్తరంతొలగించు
  21. లవకుశు లింపుగ పెంచిరి
    కవి గౌరవ మెల్ల;; కావ్యగానము చెఱచెన్
    వివశుని కన్నరి రాముని
    అవనిజ నెడబాసి యంగలార్చెడి యాత్మన్!

    ప్రత్యుత్తరంతొలగించు
  22. శ్రీ నేమాని వారూ ! మాకు ఉదయం ఎనిమిది గంటలకు కరెంటు కోత. త్వరగా పూరించ వలెనను తొందరలో జరిగిన పొరపాటు. తెలియ జేసినందులకు ధన్యవాదములు.
    శంకరార్యా! చక్కని సవరణకు ధన్యవాదములు.

    ప్రత్యుత్తరంతొలగించు
  23. మిత్రులారా! రష్యన్ కోర్టు భగవద్గీతను నిషేధించవలసిన పనిలేదని కేసు కొట్టేసింది. కాబట్టి దానిమీద హర్షాతిరేకంతో ఒక విరుపులేని పద్యపూరణ పాదాన్నిద్దాం, పూరిద్దాం. "సకల సుజనులను గీత చల్లగఁ జూచున్" లేదా "చల్లగ కాపాడు గీత సైబీ రియనా!" లేదా మాస్టారికిష్టమైనది.

    ప్రత్యుత్తరంతొలగించు
  24. నమస్కారములు
    చంద్రా గారూ ! మీ సూచన బాగుంది. నేనిప్ప ట్నుంచె కుస్తీ పడతాను. [ అదే పద్యం కిట్టించ డానికి ]

    ప్రత్యుత్తరంతొలగించు
  25. కవి సమ్మేళనమున నొక
    కవి బృందము చెంత జేరి కాకా యనుచు
    న్నవధానము జేయంగన్
    కవి గౌరవ మెల్ల కావ్యగానము చెఱచెన్


    కవి = నీటి కాకి
    కావ్యము = కవికృతము

    ప్రత్యుత్తరంతొలగించు
  26. నమలగ రాత్రియు ప్రొద్దున
    విమలపు పొవ్వాకు కట్ట వింతగు రీతిన్
    అమరగ గార్దభ కంఠము
    కవి గౌరవ మెల్ల కావ్యగానము చెఱచెన్

    ప్రత్యుత్తరంతొలగించు