27, డిసెంబర్ 2011, మంగళవారం

నిషిద్ధాక్షరి - 2

నిషిద్ధాక్షరి - 2
కవర్గాక్షరాలను (క,ఖ,గ,ఘ,ఙ లను) ఉపయోగించకుండా
కాకి, కోకిల ల సామ్యభేదాలపై
మీకు నచ్చిన ఛందంలో
పద్యం వ్రాయండి.

39 కామెంట్‌లు:

 1. నలుపే రెండును చూడన్
  తలపే వేర్వేరు యరపు దారులు వేరౌ
  తలపున మెత్తురు దీనిని
  తలుపులు వేసేరు చూడ దానిని కాదా?

  రిప్లయితొలగించండి
 2. అండజములు రెండు నరయ నంబుద వర్ణు
  లయ్యు చూపు భేద మఱపు లందు
  పాట యింపు దాని ప్రతిభయె మేలయ్య
  చెవుల రోత బుట్టు రవము వలదు

  రిప్లయితొలగించండి
 3. హనుమఛ్ఛాస్త్రి గారూ మీ పద్యము సవరించాలి,

  కాదంటరా ?

  రిప్లయితొలగించండి
 4. నలుపు నలుపేర రెండిట
  పిలుపులు వేరౌ యరచిన పెను వయసవ్వన్
  వలపులు పుట్టించును యది
  తలచిన దీనిని చిరచిర తప్పదు చంద్రా!

  రిప్లయితొలగించండి
 5. దత్త పది ,అతి -గతి -చితి -పతి.
  ---------
  అతియు గతియు లేని పతినిని సేవింప
  లాభ ముండు నొక్కొ లబ్ధి బొంద ?
  భారతంబు నందు భగవంతు డొ దవెను
  చితులు కాల కుండ చేయుడ య్య !

  రిప్లయితొలగించండి
 6. రెండును జూడను నలుపులు
  రెండును మఱి బల్బు వంటి యండము బెట్టున్
  రెండింటి యరుపు భిన్నము
  రెండింటను మిన్న తలిరు దిం డి యె నెన్నన్ .

  రిప్లయితొలగించండి
 7. అయ్యా! శ్రీ గోలి వారూ!
  క వర్గము వద్దంటూనే చివరలో కాదా అన్నారేంటి?

  రిప్లయితొలగించండి
 8. అయ్యా! ఛంద్రqసేఖర్ గరూ!
  వలపులు పుట్టించును యది అన్నారు కదా - "య" ఎట్లా వచ్చింది?

  రిప్లయితొలగించండి
 9. అయ్యా సుబ్బారావు గారూ!
  కందపద్యములో యతిని ప్రాస యతిగా వేయకూడదు. మామూలు యతులు వేసి మళ్ళీ మీ పద్యమును సవరించండి.

  రిప్లయితొలగించండి
 10. తమ్ముడు చి.డా.నరసింహమూర్తి కలానికి కూడా మంచి పదును వచ్చింది. ఈ మధ్య మంచి ధారతో మెరిసిపోతోంది. అభినందనలు.
  శ్రీ చంద్రశేఖరులు కూడా మంచి వెన్నెల కురిపిస్తున్నారు - కవితల్లో. సెహ్బాస్.

  రిప్లయితొలగించండి
 11. అన్నయ్య గారికి నమస్సులు. మీరు క నిషిధ్ధాక్షరితో ' కంద ' పై చెప్పిన పద్యము యిక్కడ దయ చేసి ప్రచురించరూ ?

  రిప్లయితొలగించండి
 12. కాకి : కోకిల!

  రెండును హరివర్ణములే
  రెండును ద్విజములె భలే స్వరములలో
  నుండును సుధయును, వ్యథయును
  రెండును రచయితల మిత్రులే జనమాన్యా!

  కందకూరపై కంద పద్యము - క నిషేధము:

  తొలి హల్లు ననుస్వారము
  వలపల ద యు జేర్చినంత వచ్చిన దుంపన్
  పులుసావలతో వండిన
  బలె బలె రుచులలరు తినగ పప్పు పిదపగా

  రిప్లయితొలగించండి
 13. శ్రీనేమాని మహాశయా! ధన్యవాదాలు. మొదట "వలపులు పుట్టించునది" వ్రాశాను. కానీ కోకిల-కాకి అను వాటికి "అది-ఇది" అనే సామ్యం కోసం "వలపులు పుట్టించును యది" అనటమే సరి అనిపించింది. తప్పయితే సూచన చేయ ప్రార్థన.

  రిప్లయితొలగించండి
 14. అయ్యా చంద్రశేఖర్ గారూ!

  మీ పద్యానికి మా సవరణను చూడండి:

  నలుపు నలుపేర రెండిట
  పిలుపులు వేరౌ నరచిన వీనుల విందై
  వలపులు రేపునదొండును
  దలచిన చిరచిర మరొండు తప్పదు చంద్రా!

  రిప్లయితొలగించండి
 15. డా. మూర్తి మిత్రులను ఎఱ్ఱనామాత్యులు ఆవహించారు. వారి ప్రభ వీరి మీద పడింది. ఏం చెప్పమంటారు!

  రిప్లయితొలగించండి
 16. వెంకట రాజారావు . లక్కాకులమంగళవారం, డిసెంబర్ 27, 2011 11:00:00 AM

  వేయేల మేని చాయల
  వాయసము వసంతసేన వర్ణ సమంబుల్
  పాయని భేదము లరుపులు
  వాయసముల సాటి బుధులు వాదము లందున్

  రిప్లయితొలగించండి
 17. నీలవర్ణ మొండు నెనరైన సామ్యమ్ము
  రుతము నరసినన్ విరుద్ధ ముండు
  తలిరుదిండి పాట తన్మయత్వము నిడు
  బలిభుజరవ మిష్టపడఁ డెవండు.

  రిప్లయితొలగించండి
 18. శంకరయ్యగారూ, బలిభుజరవ మన్నమాట కొంచెం అనుమానాస్పదంగానే ఉందండీ.బలిభుక్కు అంటే సరే కాకి. బలిభుజము అనవచ్చా అని ప్రశ్న. అయితే గియితే బలిభుక్కు కాస్తా బలిభోజి అవుతుందేమో. నాకు సరిగా తెలుసుననుకోను.

  రిప్లయితొలగించండి
 19. శ్యామల రావు గారూ,
  కాకికి బలిభుక్కు, బలిభుజము రెండూ పర్యాయపదాలే. సూర్యరాయాంధ్ర నిఘంటువులో అచ్చుతప్పు వల్ల బలిభక్కు, బలిభజము అని ఇచ్చారు. మీ సందేహం చూసి ఆన్ లైన్ Sanksri - English Dictionary పరిశీలించాను. ‘బలిభుజ్’ శబ్దానికి crow అనే అర్థాన్ని ఇచ్చారు.

  రిప్లయితొలగించండి
 20. శంకరయ్యగారికి ధన్యవాదాలు.
  ఆన్ లైన్ Sanksri - English Dictionary చిరునామా ఇస్తారా?
  నాకు కూడా కొంచెం ఉపయోగంగా ఉంటుందనుకుంటున్నాను.

  రిప్లయితొలగించండి
 21. కారము లేనట్టి కూర కాంతుడు మెచ్చెన్ .
  -----------------------

  కారము వేసియు ,వేయక
  కూరలు రెండింటి జేసి కోమలి వెట్టన్
  కూరలను దినిన వెంటనె
  కారము లేనట్టి కూర కాంతుడు మెచ్చెన్ .

  రిప్లయితొలగించండి
 22. నలుపులు రెండును జూడను
  నలుపైనను రెండు జూడ నరులుల నేస్తం
  అలుపులు నొందని యఱుపుల
  తలపులలో జేర్చ దగును దప్పక రెంటిన్ .

  రిప్లయితొలగించండి
 23. శ్యామల రావు గారూ,
  గూగుల్ లో ‘Online Sanskrit - English Dictionary' అని వెదకితే సరి! కావలసినన్ని ఉన్నాయి. మీరు అడిగారు కనుక ఒకటి రెండు ...
  1) spokensanskrit.de

  2) dsal.uchicago.edu/dictionaries/apte/

  రిప్లయితొలగించండి
 24. కవిమిత్రులకు వందనాలు.
  ఈనాటి నిషిద్ధాక్షరికి స్పందన ఎలా ఉంటుందో అని ఉదయం కొద్దిగా సందేహించాను. కాని ఇందరు ఇన్నిరకాలుగా సఫలప్రయత్నం చేసి నాకు ఎనలేని సంతోషాన్ని కలిగించారు. దీనిని ‘నా’ బ్లాగుగా కాక ‘మన బ్లాగు’గా తీర్చిదిద్దుతున్నారు. మహదానందంగా ఉంది. మరోసారి అందరికీ ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 25. అయ్యా శ్రీ సుబ్బారావు గారూ!
  మీ పద్యము 4వ లైనులో క దొరలినది చూడండి.

  రిప్లయితొలగించండి
 26. చుట్టము లొచ్చెద రోయని

  పెట్టుము దదియన్న మనుచు పెరడున నిలుచున్ !

  అట్టే నలుపై యుండిన

  ఒట్టే నీ పాట విననిచొ నొప్పే యెడదన్ !

  రిప్లయితొలగించండి
 27. శ్రీ నేమాని వారికి నమస్కారములు
  ---
  తప్పదు అని టైపు చేయబోయి తప్పక అన్నాను.
  తప్పును సూచించి నందులకు కృతజ్ఞుడను .

  రిప్లయితొలగించండి
 28. మావి చివురుమేతరి దోచు మసిని వోలె,
  వాయసము సమవర్ణిని, వాసి యెచట?
  సురభి తొడరిన యంతనె సులభ రీతి
  అంతరమ్మును సులువున నరయవచ్చు.

  రిప్లయితొలగించండి
 29. మన తెలుగు - చంద్రశేఖర్మంగళవారం, డిసెంబర్ 27, 2011 10:15:00 PM

  శ్రీ నేమాని మహాశయా! చక్కటి మెరుగులుదిద్దినందులకు ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 30. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  పద్యం చివర ‘కారా’ అన్నారు. అక్కడ ‘నిజమే’ అందామా?
  *
  గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
  మీ పద్యం ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
  *
  చంద్రశేఖర్ గారూ,
  వయసుడిగిన వారిలో వలపులు పుట్టించే మీ పద్యం అందంగా ఉంది. అభినందనలు.
  ‘వలపులు పుట్టుంచును యది’ ని ‘వలపులు పుట్టించునుగా’ అందాం.
  *
  సుబ్బారావు గారూ,
  మీ దత్తపది బాగుంది. అభినందనలు.
  రెండు నిషిద్ధక్షర పద్యాలు బాగున్నాయి.
  అయితే మొదటి పద్యం చివరి పాదంలో యతి తప్పింది. నేమాని వారు చెప్పినట్లు మీరక్కడ ప్రాసయతి వేసారు. కందంలో ప్రాసయతి నియమం లేదుకదా!
  రెండవ పద్యంలో ‘నరలుల నేస్తం’ అన్నారు. అక్కడ ‘నరులకు నేస్తం/ బలుపుల నొందని ...’ అంటే సరి! చివరి పాదంలో ‘క, గ’లు ఉన్నాయి. అవి నిషిద్ధాలు కదా!
  మీ ‘కారము లేనట్టి కూర ...’ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.
  *
  పండిత నేమాని వారూ,
  మీ పద్యం తలమానికంగా ఉంది. కవర్ణనిషేధంతో కందపై మీ పద్యం ఔత్సాహిక కవులకు మార్గదర్శకం. ధన్యవాదాలు.
  చంద్రశేఖర్ గారి పద్యానికి మీ సవరణ చాలా బాగుంది.
  *
  లక్కాకుల వెంకట రాజారావు గారూ,
  చక్కని పద్యం చెప్పారు. అభినందనలు.
  *
  రాజేశ్వరి అక్కయ్యా,
  చుట్టాల రాకను తెలియజేసే కాకి గురించి చక్కని పద్యం చెప్పారు. మా కెవరికీ తట్టని ఆలోచన. అందరూ పాపం ... కాకిని నిందించివాళ్ళే. మీరు తప్ప! ఎంతైనా అనుభవసారం! అభినందనలు.
  ‘చుట్టము లొచ్చెదరో’ను ‘చుట్టములు వత్తురో యని’ అందాం. ‘వచ్చు’ను ‘ఒచ్చు’ అని ప్రయోగించరాదు. ‘దది యన్నము’ ..? అది పెరుగన్నమా? అయితే ‘పెట్టుము పెరుగన్న మనుచు/ పెట్టుము దధ్యన్న మనుచు’ అంటే బాగుంటంది.
  *
  రవి గారూ,
  సుందరమైన పద్యం చెప్పారు. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 31. గన్నవరపు వారూ ! నేమాని వారూ ! ధన్యవాదములు. నా పొరబాటును కాదంటానా? 'నిజమే'నంటాను'. ధన్యవాదములు.
  శంకరార్యా! ధన్యవాదములు. 'నిజమే' మనసున అనుకుని కార్యాలయమునకు వెళ్ళే తొందరలో పొరపాటు జరిగింది.మీ సవరణ కూడా 'నిజమే' ఐనది. ధన్యవాదములు.

  రిప్లయితొలగించండి
 32. శ్రీ శంకరయ్యగారికి నమస్కారములు.
  -----
  మీరు చెప్పినట్లు సరి చేయుదును.మీ సూచనలకు,శ్రీ నేమాని వారి సూచనలకు
  కృతజ్ఞుడను.

  రిప్లయితొలగించండి
 33. సవరణ తో...

  నలుపే రెండును చూడన్
  తలపే వేర్వేరు యరపు దారులు వేరౌ
  తలపున మెత్తురు దీనిని
  తలుపులు మూసేరు చూడ దానిని నిజమే ?

  రిప్లయితొలగించండి
 34. మన తెలుగు - చంద్రశేఖర్మంగళవారం, డిసెంబర్ 27, 2011 11:40:00 PM

  మాస్టారూ, నా పద్యంలోని అంతరంగిక భావాన్ని సరిగ్గా కనిపెట్టారు. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 35. గురువు గారూ మీ పద్యము అద్భుతముగా ఉంది. రవి గారి పద్యము చాలా బాగుంది. సురభి కి వసంత మనే అర్ధము ఉందని తెలిసింది.

  రిప్లయితొలగించండి
 36. చిన్న పునరుక్తి దోషం సరిదిద్దాను.

  మావిచివురుమేతరి తోచు మసిని వోలె,
  వాయసము సమవర్ణిని, వాసి యెచట?
  సురభి తొడరిన యంతనె సులభ రీతి
  అంతరమ్మును విశదము నరయవచ్చు.

  రిప్లయితొలగించండి
 37. రెండు జీవుల బేధము మెండు యంద్రు!
  అశుభ వేళల మనకెల్ల అతిధి యగును!
  పాట వీనుల విందుగ పాడు జూడ!
  సర్వ జీవుల సృష్టిది శంకరయ్య!

  రిప్లయితొలగించండి
 38. మీ పేరులో "క" ఉంది గమనించ లేదు క్షమించండి.

  రెండు జీవుల బేధము మెండు యంద్రు!
  అశుభ వేళల మనకెల్ల అతిధి యగును.
  పాట వీనుల విందుగ పాడు జూడ!
  సర్వ జీవుల సృష్టిది సారి జూడ!

  రిప్లయితొలగించండి