నేమాని వారి సూచనకు ధన్యవాదాలు. రెండవ పాదములో యతి సరిజేసినాను. వేరు వేరైన పేర్లతో పిలచినంత ఒక్క తత్వంబు వేరుగా కుండు నట్లు దేవు నెవ్వార లేరీతి దెలియ నైన ఒక్కఁడే కాక వేఱొకం డుండునొక్కొ?
మిస్సన్న గారూ, మా నాలుగు పూరణలూ బాగున్నాయి. అభినందనలు. ముఖ్యంగా రెండవపూరణ నాకు బాగా నచ్చింది. ఇక మూడువపూరణ ‘పడతికి పతి యొక్కడే కాక ...’ నేను పూరించాలనుకున్న భావం. ఇప్పుడు మరో ఆలోచన చేయాలి! నాల్గవ పూరణ బాగుంది. కాని అది కవివాక్యమా? సుధేష్ణ మాటా? లేక కీచకుని వాక్యమా? * ‘మనతెలుగు’ చంద్రశేఖర్ గారూ, పరమాత్మకు అకార విశేషణాలతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు. * రాజారావు గారూ, అద్భుతమైన పూరణ. ‘కృష్ణ’ శబ్దవాచ్యులు మరొక్కరు కారు నలుగురన్న మీ పూరణకు నమోవాకాలు. * గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, ఒకరిని అనుకరించినా మీవలె కవిత్వం చెప్పువారు ‘మరొక్కరు’ లేరు. చక్కని పూరణ. అభినందనలు. * శ్రీపతి శాస్త్రి గారూ, మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు. ‘సృష్టిస్థితి’ అన్నప్పుడు ‘ష్టి’ గురువై గణదోషం. సవరించే ప్రయత్నం చేయండి. * చింతా రామకృష్ణారావు గారూ, ఉత్తమంగా ఉంది మీ పూరణ. అభినందనలు. * శ్యామల రావు గారూ, ‘ఏకం సత్’ అన్న విషయాన్ని చక్కగా పూరణలో ప్రస్తావించారు. గొప్ప పూరణ. అభినందనలు. నేమాని వారి సూచన ననుసరించి సవరించారు కదా. బాగుంది. సంతోషం. * పండిత నేమాని వారూ, అద్భుతమైన పూరణ మీది. అభినందనలు. * గన్నవరపు నరసింహ మూర్తి గారూ, చక్కని ఇతివృత్తంతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు. ‘పురుషులందున సింహుడు’ ను ‘పురుషసింహుడు సద్గుణపూర్ణు డితడు’ అంటే ఎలా ఉంటుందంటారు? * జిగురు సత్యనారాయణ గారూ, ప్రశస్తమైన పూరణ. అభినందనలు.
తమ్ముడు చి.నరసింహమూర్తి వ్రాసిన పద్యము చాల బాగున్నది. అభినందనలు. దానికే మరికొన్ని వన్నెలు చిన్నెలు నేను ఇలా చేర్చేను. పురుషసింహ వరేణ్యుండు పూర్ణుడితడు నిగమవేద్యుండు సర్వత్ర నియతి యితడు అగ్రపూజార్హుడైన మహాత్ముడితడు ఒక్కడే గాక వేరొకం డుండు నొక్కొ
అగ్ని కన్నుల దాల్చిన హరుని గనియు, గరళమును గళమందున కలుగు వాని గనియు, విల్లును బట్టిన కర్మ యోగి ఒక్కఁడే కాక వేఱొకం డుండునొక్కొ?
విహిత కార్యము చేయవలె కానీ, ఫలితమును దలచి పొంగనూ, క్రుంగనూ కూడదన్న ఆర్యోక్తి ని చక్కగా పాటించిన మన్మథుడు, తెలిసీ శివునిపై బాణ ప్రయోగం చేశాడు. లోకకళ్యాణం కొరకే కదా! కాబట్టి కర్మయోగి అని మన్మథుని అనవచ్చని భావిస్తున్నాను. సరి అవునా కాదా చెప్పగలరు.
మాస్టారూ, సందేహం "...ఇతడు+ఒక్కడే గాక = ఇతడొక్కడే గాక" సంధి ఆదేశం అవుతుంది గదా! కొందరు "ఇతడునొక్కడేగాక" అనినుగాగమంతో , మరి కొందరు "....ఇతడు---ఒక్కడే గాక" అని విడివిడిగా సంధి చేయకుండా పూరించారు. వీటిలోని తేడాలేమిటి?
మందాకిని గారూ మీ రెండు పద్యాలూ బాగున్నాయి. మీ సందేహమేమో గానీ నాకు తెలిసినది చెపుతున్నాను. కల్యాణం అనే పదం సరియైనదని విజ్ఞులు అంటూ ఉంటారు. (కళ్యాణం కాదు అని.)
మిస్సన్న గారు, ధన్యవాదాలండి. చిన్నప్పట్నించీ ఉన్న అలవాటులో అలా వ్రాశాను, కల్యాణం అనేదే సరియైనది.నిజమే. కర్మయోగి అనే పదం మన్మథుని విషయంలో ప్రయోగించాను. ఆ విషయంలో కొంచెం సందేహమండి. కర్మయోగి కి పూర్తి నిర్వచనం చెప్పేంత పరిపక్వత లేదు కాబట్టి సందేహమండి. ధన్యవాదాలండి.
తెలుగు సంస్కృతభాషల అక్షరమాలలో కొన్ని తేడాలున్నాయి. తెలుగులో మహా ప్రాణాలు (ఖ,ఘ,ఛ మొదలైన వత్తు అక్షరాలు) లేవు. వత్తు అక్షరాలున్న మాటలు సంస్కృతపదాలు లేదా తత్సమాలు. అలాగే 'ళ','ఱ' అనే అక్షరాలు సంస్కృతంలో లేవు. తెలుగువాళ్ళం 'కళ' అనే మాటను సంస్కృతంలో 'కల' అనే వ్రాస్తారు. అయితే తెలుగులో 'కల', 'కళ' అని రెండు మాటలూ, వాటికి వేర్వేరు అర్ధాలూ ఉన్నాయి. అందుచేత తెలుగులో 'కళ్యాణం' అని కూడా వాడవచ్చునని నా అభిప్రాయం. పొరబాటైతే విజ్ఞులు మన్నించవలసినది. 'కళ్యాణం' అని బ్రౌణ్యం, 'కల్యాణం' అని శబ్దరత్నాకరం. శంకరనారాయణ నిఘంటువు రెండు మాటలూ ఇచ్చింది. అన్నట్లు నా దగ్గర ముద్రిత నిఘంటుప్రతులు లేవు - వెబ్ లో చూసాను. ఈ విషయంలో అభ్యంతరం ఉంటే మన్నించాలి.
చంద్రశేఖరుగారూ. ఈనాడు, 'ఒక్కడు' పదంమీద నాకు కనిపించిన ప్రయోగాలు: రాజారావుగారి 'యనగ నొక్కడే ', చింతా రామ కృష్ణా రావుగారి 'చూచిన నొక్కడైన', మిస్సన్నగారి 'నింగినొక్కడౌ' మరియు నేమానివారి 'అనగ నొక్కడే' అనేవి. మీరు చెప్పినట్లు "ఇతడు+ఒక్కడే = ఇతడొక్కడే " అవుతుంది. కాని నేటి పై ప్రయోగాలలో నుగాగమం సరిగానే ఉందికద. అనగన్, చూచినన్, నింగిన్ అనే మాటలపైకద సంధి జరిగినది. ఇక్కడ నా కేమీ దోషం కనిపించలేదు. ఒకవేళ నేను పొరబడితే తెలియచేయ వలసినది. కొందరు సంధి చేయకుండా పూరించారన్నారు. నరసింహమూర్తిగారి పద్యానికి నేమానివారి సవరణలో 'ఇతడు ఒక్కడే' అని విసంధిగా ఉంది. అయితే పదాలు రెండూ వేర్వేరు పాదాలకు చెందాయి. 'ఇతడు' అనేది మూడవపాదం చివరా, నాలుగవ పాదం మొదటిలో 'ఒక్కడే' అనే పదం ఉన్నది. కాబట్టి వారు సంధి చేయలేదేమో. ఒకవేళ సవరణ ఆవశ్యకం అనుకుంటే 'ఈత డొక్కడే' అని పరిష్కరించవచ్చు కాని ప్రస్తుత పాఠంకూడా యేదైనా విశేషకారణం వలన సాధువే కావచ్చును. ఇంతకంటే యీ విషయంలో అభిప్రాయం చెప్పటానికి అపండితుడనైన నాకు సాహసం లేదు.
నా పద్యమునకు గురువు గారి సవరణ, అన్నయ్య గారి వన్నె చిన్నెలు, ఆ పద్య స్ఫూర్తితో మిస్సన్న గారు వ్రాసిన పద్యము అద్భుతంగా నున్నాయి. రాం మోహన శర్మ గారూ, మీ మొదటి పద్యమునకు అభినందనలు. మీకు చక్కని కవితా స్రవంతి భగవ దనుగ్రహము వలన సమకూడ గలదు.
రాం మోహన్ శర్మ గారూ, మీ పద్యం బ్రహ్మాండంగా ఉంది. ఇది మీ మొదటిపద్యం అంటే నమ్మటం కష్టం! అభినందనలు. శ్రీవిశ్వనాథగారు ఒకసారి, 'నేను వ్రాసి ప్రకటించిన పద్యములొక ఇరవదివేలుండవచ్చును. వ్రాసి చించివేసినవి యేబదివేలుండవచ్చును' అన్నారు. అభ్యాసం వలన కవికి మంచి ధారాశుధ్ధి అలవడుతుంది. మీ పద్యంలో ఇప్పడే మంచి ధార కనిపిస్తోంది. మీరు తప్పక తరచుగా పద్యాలు రచిస్తూ ఉండండి.
శంకరార్యా ! ధన్యవాదములు. మిస్సన్న గారూ ! ఈ రోజు ఎక్కువ పద్యములు వ్రాసిన "ఒకేఒక్కడు" అయ్యారు. కిశోర్జీ శెలవు పెట్టారనుకుంటాను. రామ్మోహన్ శర్మ గారూ ! స్వాగతం. మీ చేరిక సంతోషముగా నున్నది.
మందాకినిగారూ, మన్మథుని కర్మయోగి అనటం మరీ అనుచితం యేమీ కాదని నా అభిప్రాయం. సాక్షాత్తు పరమశివునిపైన పూలబాణాలు వేయటానికి ఆయన చాలా సంకోచించాడు. కాని దేవకార్యం. దేవరాజు ఆనతిని త్రోసివేయలేక బెదురుతూనే శివునిపైకి సాహసించి వెళ్ళాడు. ఆయన చేసింది కేవలం కర్తవ్యనిర్వహణమాత్రమే! ఫలితం తనకు పరమప్రమాదకరం కావచ్చునని తెలిసినా తనపని తాను చేసాడు. ఆయనకు పరమేశ్వరునిపై అగౌరవం యేమీ లేదు.
మందాకిని గారూ శ్యామలీయం గారి వివరణ చూచారు కదా. ఇవాళ ఒక క్రొత్త విషయం తెలుసుకొన్నాను. ఇక మీరు మన్మథుడిని కర్మయోగి అనడంలో అనౌచిత్యం ఏమీ కనుపించడం లేదు. అతనికి తెలుసు తాను నశించగలనని. లోకోపకారం కోసం అతనాపని చేశాడు. శ్యామలీయం గారూ మీ సమగ్ర వివరణకు ధన్యవాదాలు. రామ మోహన్ శర్మ గారూ శీఘ్ర సంపూర్ణ కవన విద్యా ప్రాప్తిరస్తు. హనుమచ్చాస్త్రి గారూ అవును కదూ! ఒకే ఒక్కణ్ణి.
కవిమిత్రు లందరికీ శతసహస్ర వందనాలు. అందరూ పరస్పరం గుణదోష విచారణ చేస్తూ, చర్చలో పాల్గొంటూ నాకు శ్రమను తగ్గిస్తున్నారు. "తాంబూలా లిచ్చేశాను. తన్నుకు చావండి" అని అగ్నిహోత్రావధానులు చెప్పినట్టు "సమస్య ఇచ్చాను. ఇక పూరణలు పంపండి, చర్చించుకోండి" అన్నట్టు ఉంది నా పరిస్థితి. అందరి భాగస్వామ్యం నాకు మహదానందాన్ని కలిగిస్తున్నది. ఈ ఉత్సాహాన్ని, స్ఫూర్తిని కొనసాగించవలసిందిగా మనవి. అయితే చర్చలు హుందాగా, సంస్కారవంతంగా ఉండి, వ్యక్తులను కించపరచే విధంగా ఉండకుండా జాగ్రత్త పడండి. అందరికీ ధన్యవాదాలు. తెలుగుపద్యం వర్ధిల్లాలి!
అయ్యలారా ! ఇదేమీ నేను ఒకేసారి వ్రాసిన పద్యము కాదు ...పొద్దున 8 కి సమస్యాపూరణం చూసినప్పటినుండి , యతి ప్రాస గణాలతో కుస్తీ పడుతూ సాయంత్రం 5 కి పూర్తి చేసినాను . ప్రోత్సహించిన అందరికీ ధన్యవాదాలు .
మిస్సన్న గారూ, మా మాటను మన్నించినందుకు సంతోషం. ధన్యవాదాలు. * పండిత నేమాని వారూ, గన్నవరపు వారి పద్యానికి మీ పూరణ వన్నెతెచ్చింది. ‘సభలోన నియతి’కి సవరణ సూచించాలని ఎంతో ఆలోచించాను. కాని తోచలేదు. మీ సవరణ మార్గదర్శకం. ధన్యవాదాలు. * మందాకిని గారూ, నిన్నటి సమస్యకు నేటి మీ పూరణ బాగుంది. అభినందనలు. మన్మథుని కర్మయోగిగా దర్శించిన మీ ‘క్రొత్తచూపు’కు ప్రశంసలు! ‘అగ్ని కన్నుల’ను ‘అగ్గికన్నుల దాల్చిన’ అనో లేదా ‘అగ్నినేత్రముల్ దాల్చిన’ అందాం. ఇప్పటికే వైరిసమాసాల గురించి చర్చ, అపార్థాలు చోటుచేసుకున్నాయి!
ఇప్పుడే తెలిసిన విషాదవార్త ... నా అభిమాన నటుడు ‘దేవానంద్’ పరలోకగతు డయ్యాడు. ఆ ‘నిత్యయౌవన’ నటుని మృతికి నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను. భగవంతుడు ఆయన ఆత్మకు శాంతిని చేకూర్చుగాక!
శ్యామలీయంగారూ, మీ విశ్లేషణకు ప్రతిస్పందనకు ధన్యవాదాలు. "ఇతడు+ఒక్కడే" కానీ సందర్భాలలో నుగాగమ ప్రయోగంలో దోషం వుందని నేను అనలేదు అనుకోవటంలేదు. అలాగే పై పాదాలలో గుణ విశేషణాలను జత చేస్తూ అతడును + "ఇతడును+ఒక్కడే..." అన్నచోట కూడా నుగాగం రావటం సహజమే. నా సందేహం మీరు గమనించారు. నేమాని వారు సందిచేయకపోవటం వెనకాల ఏదైనా సూత్రం వుందా?
చంద్రశేఖర్: రామమోహన శర్మగారూ, మీరు పోస్టింగు వేసేటప్పుడు "name/URL" సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు మీకు మీ పేరు వేయటానికి చోటు కనిపిస్తుంది. అప్పుడు"రామమోహన శర్మ" అని టైపు చేయండి. ఆ రకంగా మీరు పోస్టింగు వేసినప్పుడు "రామమోహన శర్మ చెప్పారు" అని కనిపిస్తుంది. ఆ రకంగా "అజ్ఞాత చెప్పారు" అనే గొడవ వుండదు. చాలా తేలిక, ప్రయత్నించి చూడండి. సందేహం వుంటే చెప్పండి.
మిస్సన్న గారూ, స్ఫూర్తి మూర్తి గారిదైనా పూరణలో మీ ప్రత్యేకత కనిపిస్తూనే ఉంది. మంచి పూరణ. అభినందనలు. * శ్రీపతి శాస్త్రి గారూ, నా సూచన మన్నించి సవరించినందుకు సంతోషం. ఏదైనా సవరణ సూచించాలని అలోచించిన నాకు ‘పోషణ’ శబ్దం అసలే స్పురించలేదు. భళి ... భళి! వివేకానందునిపై మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు. * ‘తెలుగు పాటలు’ గారూ, స్వాగతం! ఈ బ్లాగులో వస్తున్న పూరణపద్యాలు చాలా వరకు ద్రాక్షాపాకాలే. సాధారణ పదాలతో, సుబోధకమైన పద్యాలే వ్రాస్తున్నారు. అప్పటికీ కొందరు మిత్రులు తమ పూరణల సారాంశాన్ని కాని, నేపథ్యాన్ని కాని, అవసరమైన వివరణను కాని ఇస్తున్నారు కదా! * రాజేశ్వరి అక్కయ్యా, సూర్యపరంగా మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు. ‘సకలప్రాణుల’ అన్నప్పుడు సంయుక్తాక్షర యోగం చేత ‘ల’ గురువై గణదోషం సంభవిస్తుంది. ‘సకలజీవుల’ అంటే సరి! చంద్రుని పరంగా మీ రెండవపూరణ చాలా బాగుంది. అభినందనలు. * ‘మనతెలుగు’ చంద్రశేఖర్ గారూ, అక్కడ నుగాగమం వస్తే ‘ఇతడుకూడ’ అనే విశే్షార్థం వస్తుంది. ‘నేను వచ్చితిని- నేనును వచ్చితిని’ ... తేడా గమనించండి. ఇక విసంధిగా వ్రాయడం ... పూర్వపాదాంతంలో వ్యాక్యం పూర్తి అయి తరువాతి పాదంలో క్రొత్తవాక్యం ప్రారంభించినపుడు అచ్చును ప్రయోగించండంలో తప్పు లేదు. * రామమోహన్ శర్మ గారూ, మీకు సంతోషంతో స్వాగతం పలుకుతున్నాను. మీ మొదటి పద్యమే సలక్షణంగా ఉండి అలరిస్తున్నది. ‘సవదరించు’ శబ్దప్రయోగమే మీ నైపుణ్యాన్ని ప్రకటిస్తున్నది. మీ పూరణలో శబ్దప్రయోగం, ధార ఎవరో ఔత్సాహికులు వ్రాసిన పద్యంలా లేదు. అభినందనలు, ధన్యవాదాలు. * మిస్సన్న గారూ, నిజమే! సూర్యరాయాంధ్ర నిఘంటువు ‘కల్యాణ’ శబ్దాన్నే పేర్కొంది. ‘కళ్యాణం’ లేదు.
ఊకదంపుడు గారూ, ఆంధ్రత్వం మూర్తీభవించిన మనోహరమైన పూరణ చెప్పారు. అభినందనలు. ‘పంచెకట్టు + అన్న’ అన్నప్పుడు యడాగమం రాదు. అక్కడ సంధి నిత్యం. దానిని ‘పంచెకట్టు లన్న’ అందాం. పద్యం మధ్య అచ్చులు రాకుండా చూడండి. * వసంత కిశోర్ గారూ, మీ దశావతార పూరణలు అద్భుతంగా ఉన్నాయి. అభినందనలు. నాల్గవపూరణలో ‘నారసింహుని రూపమ్ము - నవతరించి’ అన్నదాన్ని ‘నారసింహరూపమ్మున నవతరించి’ అంటే బాగుంటుందేమో? అలాగే ‘నిర్దయగను ఒక్కడే’ అనేకంటే ‘నిర్దయుడయి యొక్కడే’ అందాం. పదవపూరణలో ‘కల్కియైన’ కంటే ‘కల్కియగుచు’ అంటే బాగుంటుందని నా సూచన. కొసమెరుపు ..... ధర్మరక్షణ కొఱకయి ధరణిపైన దాల్చెఁ గరుణాత్ముఁడు దశావతారములను కోటి నామాల రూపాల మేటి యాతఁ డొక్కఁడే కాక వేఱొక్కఁ డుండు నొక్కొ? * గన్నవరపు నరసింహ మూర్తి గారూ, మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు. మీరూ నాలాగే ఆలోచించినందుకు సంతోషం!
శంకరార్యా ! చక్కని సవరణలకు ధన్యవాదములు ! గాంధీగారి మీది మీ పూరణ చాలా బావుంది !
మూర్తీజీ ! ధన్యవాదములు ! గాంధీగారిమీది మీ పూరణ కూడా చాలా బావుంది ! గురువుగారితో సమమయ్యారు ! అభినందనలు ! త్వరలోనే గురువును మించిన శిష్యుడు కాబోతారన్నమాట !
రాజేశ్వరిగారూ "వెన్నె లందు" అన్న ప్రయోగంలో చిక్కు ఉంది. వెన్నెల, అందు అనే రెండూ తెలుగు పదాలు కాబట్టి వీటి మధ్య సంధి లేదు కాబట్టి యడాగమం తప్పనిసరి. అందుచేత "వెన్నెల యందు" అన్న స్వరూపం యేర్పడుతుందని, అందుచేత అందమైన యీ పాదాన్ని సవరించవలసి వస్తుందని నా అభిప్రాయం.
అయ్యా! శ్యామల రావు గారు! నిన్నటి మీ దశావతార స్తుతి చూచేను. 2, 3 పాదములలో యతి సరిపోవుట లేదు. నా సూచన గమనించండి: (2) కొండ వీపున మోయగా కూర్మ మగుచు (3) క్షోణి కోరను దాల్చగా క్రోడ మగుచు
thanks for your time, I like your website, 2012 nba all star jerseys subject matter is amazingly remarkable. Will be able to learn about plenty belonging to the within just, bikini swimsuit and see many want to see, thank you very much to share .Louis Vuitton Replica .best wish for you !
నాతిఁ జంపెను కోపియై కోతిఁ జంపె
రిప్లయితొలగించండిచెట్టు కొట్టెను మున్నీటఁ గట్టుఁ గట్టె
నాలి నగ్గిలో నుంచినా డడవిఁ దించె
నొక్కఁడే కాక వేఱొకం డుండునొక్కొ?
నాతిఁ జంపెను వేరొక నాతిఁ బ్రోచె
రిప్లయితొలగించండిమరొక నాతిని దొంగిలె మరియు నొకతిఁ
జేసె సుందరి నేమందు చిలిపి వాని
నొక్కఁడే కాక వేఱొకం డుండునొక్కొ?
మిస్సన్నగారు ! రామ - కృష్ణుల పై ' నొక్కుడు' బాగుందండీ!
రిప్లయితొలగించండిఆది పురుషుండ నంతుడ నాది మధ్య
రిప్లయితొలగించండిలయుఁడఖిలలోక లీలావిలాస పురుష
తముఁడసదృశ మోక్షప్రదాత పరమాత్ము
డొక్కఁడే కాక వేఱొకం డుండునొక్కొ?
ఒక్కడే కాక వేఱొకం డుండు నొక్కొ ?
రిప్లయితొలగించండికాదు నల్వురు - వ్యాసుండు ,ఘనుడు వాసు
దేవు ,డర్జున, ద్రౌపదుల్ దెలియ 'గృష్ణు '
లైరి నల్వురు భారతం బందు గనుడు
సుజన-సృజన
మిస్సన్న గారు నాతిని పట్టుకుంటే నేను కోతిని పట్టుకున్నాను.
రిప్లయితొలగించండికోతి నొక్కటి చాటుగా కూల్చి వేసె
రాజు జేసెను నొక కోతి రక్ష వేడ
నొక్క కోతిని మదిలోన నుంచె జూడ
నొక్కఁడే కాక వేఱొకం డుండునొక్కొ?
శ్రీగురుభ్యోనమ:
రిప్లయితొలగించండిలోకములనెల్ల గావగ లోన నిలిపె
ప్రళయ మన్నది లేనట్టి ప్రణవ మూర్తి
సృష్టి స్థిత్యంతముల జేయు శివుడు తాను
ఒక్కఁడే కాక వేఱొకం డుండునొక్కొ?
'మన ' చంద్ర శేఖర్ గారు ' ఒక ' విధం గా చూస్తే...
రిప్లయితొలగించండిరాజారావు గారు 'నాలుగు ' విధాలుగా చూశారు...
రెండు విధముల పూరణలు ముచ్చట గొలుపుచున్నవి.
' ఒకే ఒక్కడు ' ఉమాపతి గురించి శ్రీపతి గారు చక్కగా చెప్పారు.
రిప్లయితొలగించండిఉన్న దున్నట్టు బొగడ మిస్సన్న యనగ
రిప్లయితొలగించండినొక్కడే కాక వేఱొకం డుండు నొక్కొ ?
సాగి పరమాత్ము బొగడగా చంద్ర శేఖ
రొక్కడే కాక వేఱొకం డుండు నొక్కొ?
శ్రీ గోలి వారికి ధన్య వాదములు
గోలివారికి, రాజారవుగారికీ ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిఎక్కడెక్కడచూచిన నొక్కడైన
రిప్లయితొలగించండిదేవుడుండును కాపాడ దీన జనుల.
ఏల పరదైవముండునంచిట్లు పలుక?
ఒక్కఁడే కాక వేఱొకం డుండునొక్కొ?
వేరు వేరైన పేర్లతో పిలచినంత
రిప్లయితొలగించండిఒక్క తత్వంబు వేర్పడి పోని యట్లు
దేవు నెవ్వార లేరీతి దెలియ నైన
ఒక్కఁడే కాక వేఱొకం డుండునొక్కొ?
అయా! శ్రీ శ్యామల రావు గారు:
రిప్లయితొలగించండిమీ పద్యమును చూచేను. భావము చాలా బాగుంది. 2వ పాదములో యతి సరిపోవుట లేదు. కాస్త సరి చేయండి.
కృష్ణు నొక్కని నల్వురు కృష్ణు లనుచు
రిప్లయితొలగించండినెంచి చూపించి పిమ్మట నెవరి గనిన
కృష్ణుడే తోచు నామంపు రీతి తెలిపె
ఘనుడు మిత్రుడు రాజరా వనఘు డగుచు.
గోలి వారూ రాజారావు గారూ ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిహనుమచ్చాస్త్రి గారూ మీ కోతి నొక్కుడు కేం తక్కువ?
నిండు పున్నమి చంద్రుడు నీలి నింగి
రిప్లయితొలగించండినొక్కడౌ రీతి గుణముల చక్కనైన
పరమ సాధ్వీ లలామయౌ పడతికి పతి
యొక్కఁడే కాక వేఱొకం డుండునొక్కొ?
భర్త లేవురు గల పతివ్రతవె నీవు
రిప్లయితొలగించండిసింహ బలునొల్ల సైరంధ్రి చింత యగునె
పరమ సాధ్వివి నీవైన భర్త నీకు
నొక్కఁడే కాక వేఱొకం డుండునొక్కొ?
ఆదియు ననాది జగముల కాదిగురువు
రిప్లయితొలగించండిఘోర కాకోల విషమును గొంతునందు
దాల్చి నట్టి జగత్త్రయ త్రాత యనగ
నొక్కడే కాక వేరొక్కడుండు నొక్కొ?
మిత్రుల పూరణలు అలరారు చున్నవి.
రిప్లయితొలగించండిభీష్ముఁడు ధర్మరాజుతో ;
పురుషు లందున సింహుఁడు పూర్ణుఁ డితఁడు
నిగమ వేద్యుఁడు సభ లోన నియతి యితఁడు
అగ్ర పూజకు గోవిందుఁ డర్హు డితఁడు
నొక్కఁడే గాక వేఱొకం డుండు నొక్కొ !
ఉత్తర గోగ్రహణ సమయమున ద్రోణుని పలుకులు:-
రిప్లయితొలగించండిఅదియె దేవదత్తపు మ్రోత, అదియె వినుము
క్రీడి గాండీవ శబ్దము, కేళియె యగు
వానికి సమరంబన,వచ్చు వాడు విజయు
డొక్కఁడే కాక వేఱొకం డుండునొక్కొ!!
నేమాని వారి సూచనకు ధన్యవాదాలు. రెండవ పాదములో యతి సరిజేసినాను.
రిప్లయితొలగించండివేరు వేరైన పేర్లతో పిలచినంత
ఒక్క తత్వంబు వేరుగా కుండు నట్లు
దేవు నెవ్వార లేరీతి దెలియ నైన
ఒక్కఁడే కాక వేఱొకం డుండునొక్కొ?
మిస్సన్న గారూ,
రిప్లయితొలగించండిమా నాలుగు పూరణలూ బాగున్నాయి. అభినందనలు.
ముఖ్యంగా రెండవపూరణ నాకు బాగా నచ్చింది.
ఇక మూడువపూరణ ‘పడతికి పతి యొక్కడే కాక ...’ నేను పూరించాలనుకున్న భావం. ఇప్పుడు మరో ఆలోచన చేయాలి!
నాల్గవ పూరణ బాగుంది. కాని అది కవివాక్యమా? సుధేష్ణ మాటా? లేక కీచకుని వాక్యమా?
*
‘మనతెలుగు’ చంద్రశేఖర్ గారూ,
పరమాత్మకు అకార విశేషణాలతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
*
రాజారావు గారూ,
అద్భుతమైన పూరణ. ‘కృష్ణ’ శబ్దవాచ్యులు మరొక్కరు కారు నలుగురన్న మీ పూరణకు నమోవాకాలు.
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
ఒకరిని అనుకరించినా మీవలె కవిత్వం చెప్పువారు ‘మరొక్కరు’ లేరు. చక్కని పూరణ. అభినందనలు.
*
శ్రీపతి శాస్త్రి గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
‘సృష్టిస్థితి’ అన్నప్పుడు ‘ష్టి’ గురువై గణదోషం. సవరించే ప్రయత్నం చేయండి.
*
చింతా రామకృష్ణారావు గారూ,
ఉత్తమంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
*
శ్యామల రావు గారూ,
‘ఏకం సత్’ అన్న విషయాన్ని చక్కగా పూరణలో ప్రస్తావించారు. గొప్ప పూరణ. అభినందనలు.
నేమాని వారి సూచన ననుసరించి సవరించారు కదా. బాగుంది. సంతోషం.
*
పండిత నేమాని వారూ,
అద్భుతమైన పూరణ మీది. అభినందనలు.
*
గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
చక్కని ఇతివృత్తంతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
‘పురుషులందున సింహుడు’ ను ‘పురుషసింహుడు సద్గుణపూర్ణు డితడు’ అంటే ఎలా ఉంటుందంటారు?
*
జిగురు సత్యనారాయణ గారూ,
ప్రశస్తమైన పూరణ. అభినందనలు.
గురువుగారూ ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిమీ సందేహ నివృత్తి కోసం మూడవ పూరణను సవరించాను.
భర్త లేవురు గల పతివ్రత నటంచు
సింహ బలునన్ను సైరంధ్రి ఛీ యనెదవు
పరమ సాధ్వివి నీవైన భర్త నీకు
నొక్కఁడే కాక వేఱొకం డుండునొక్కొ?
తమ్ముడు చి.నరసింహమూర్తి వ్రాసిన పద్యము చాల బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిదానికే మరికొన్ని వన్నెలు చిన్నెలు నేను ఇలా చేర్చేను.
పురుషసింహ వరేణ్యుండు పూర్ణుడితడు
నిగమవేద్యుండు సర్వత్ర నియతి యితడు
అగ్రపూజార్హుడైన మహాత్ముడితడు
ఒక్కడే గాక వేరొకం డుండు నొక్కొ
సూర్యదేవుని మందిర శోభ గనుడు
రిప్లయితొలగించండిగర్భ గృహమున నిప్పుడు కనుడు_ రవికి
తోడగుచు దీపములు వెల్గె తోరణముగ;
భానుకాంతితో తారలు ప్రభలఁ జెలఁగె.
నిన్నటి సమస్యకూడా ఈ రోజే పూరణ చేశాను.
అగ్ని కన్నుల దాల్చిన హరుని గనియు,
గరళమును గళమందున కలుగు వాని
గనియు, విల్లును బట్టిన కర్మ యోగి
ఒక్కఁడే కాక వేఱొకం డుండునొక్కొ?
విహిత కార్యము చేయవలె కానీ, ఫలితమును దలచి పొంగనూ, క్రుంగనూ కూడదన్న ఆర్యోక్తి ని చక్కగా పాటించిన మన్మథుడు, తెలిసీ శివునిపై బాణ ప్రయోగం చేశాడు. లోకకళ్యాణం కొరకే కదా!
కాబట్టి కర్మయోగి అని మన్మథుని అనవచ్చని భావిస్తున్నాను. సరి అవునా కాదా చెప్పగలరు.
మూర్తి మిత్రమా అభినందనలు.
రిప్లయితొలగించండిమీ స్ఫూర్తితో ......
ఆదిజుండగు బ్రహ్మకు నయ్య యితడు
వేద వాజ్ఞ్మయ మందున వేద్యు డితడు
ముజ్జ గమ్ముల కెల్లను పూజ్యుడితడు
నొక్కఁడే కాక వేఱొకం డుండునొక్కొ?
గురువుగారూ ధన్యవాదములు. సవరించిన పూరణను పరిశీలింప ప్రార్థన.
రిప్లయితొలగించండిసృష్టి పోషణ లయములు జేయువాడు
లోకములనెల్ల గావగ లోన నిలిపె
ప్రళయ మన్నది లేనట్టి ప్రణవ మూర్తి
ఒక్కఁడే కాక వేఱొకం డుండునొక్కొ?
మహానుబావులు ఎంతో మంది ఎన్నో పద్యాలు వ్రాశారు,పద్యం తో బావం కూడా వ్రాయగలరా
రిప్లయితొలగించండిహనుమచ్చాస్త్రిగారూ ధన్యవాదములు. అందరిపూరణలు వైవిద్యభరితమైన భావములతో ఒకే పరమాత్మను శ్లాఘిస్తూ సంతోషము కలిగించుచున్నవి.
రిప్లయితొలగించండిసకల ప్రాణుల బ్రతికించు సవితు డొకడె
రిప్లయితొలగించండివెలుగు విరజిమ్మి చీకటి గెలుచు కొనెడి
నమ్మి కొలిచిన దైవమ్ము వమ్ము కాదు
ఒక్కఁ డే కాక వేఱొకం డుండు నొక్కొ !
మాస్టారూ,
రిప్లయితొలగించండిసందేహం "...ఇతడు+ఒక్కడే గాక = ఇతడొక్కడే గాక" సంధి ఆదేశం అవుతుంది గదా! కొందరు "ఇతడునొక్కడేగాక" అనినుగాగమంతో , మరి కొందరు "....ఇతడు---ఒక్కడే గాక" అని విడివిడిగా సంధి చేయకుండా పూరించారు. వీటిలోని తేడాలేమిటి?
అందరు కవుల పూరణా లనుదినమ్ము
రిప్లయితొలగించండిశ్రద్ధతో జూచి ప్రేమగా సవదరించు
గురువు జూడగా నేడు శంకరుడె గాదె
ఒక్కఁ డే కాక వేఱొకం డుండు నొక్కొ !
ఇది నా మొదటి పద్యం . తప్పులుంటే సవరించ ప్రార్థన .
- రాం మోహన్ శర్మ .
మందాకిని గారూ మీ రెండు పద్యాలూ బాగున్నాయి. మీ సందేహమేమో గానీ నాకు తెలిసినది చెపుతున్నాను. కల్యాణం అనే పదం సరియైనదని విజ్ఞులు
రిప్లయితొలగించండిఅంటూ ఉంటారు. (కళ్యాణం కాదు అని.)
మిస్సన్న గారు,
రిప్లయితొలగించండిధన్యవాదాలండి. చిన్నప్పట్నించీ ఉన్న అలవాటులో అలా వ్రాశాను, కల్యాణం అనేదే సరియైనది.నిజమే.
కర్మయోగి అనే పదం మన్మథుని విషయంలో ప్రయోగించాను. ఆ విషయంలో కొంచెం సందేహమండి. కర్మయోగి కి పూర్తి నిర్వచనం చెప్పేంత పరిపక్వత లేదు కాబట్టి సందేహమండి.
ధన్యవాదాలండి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండితెలుగు సంస్కృతభాషల అక్షరమాలలో కొన్ని తేడాలున్నాయి. తెలుగులో మహా ప్రాణాలు (ఖ,ఘ,ఛ మొదలైన వత్తు అక్షరాలు) లేవు. వత్తు అక్షరాలున్న మాటలు సంస్కృతపదాలు లేదా తత్సమాలు. అలాగే 'ళ','ఱ' అనే అక్షరాలు సంస్కృతంలో లేవు. తెలుగువాళ్ళం 'కళ' అనే మాటను సంస్కృతంలో 'కల' అనే వ్రాస్తారు. అయితే తెలుగులో 'కల', 'కళ' అని రెండు మాటలూ, వాటికి వేర్వేరు అర్ధాలూ ఉన్నాయి. అందుచేత తెలుగులో 'కళ్యాణం' అని కూడా వాడవచ్చునని నా అభిప్రాయం. పొరబాటైతే విజ్ఞులు మన్నించవలసినది. 'కళ్యాణం' అని బ్రౌణ్యం, 'కల్యాణం' అని శబ్దరత్నాకరం. శంకరనారాయణ నిఘంటువు రెండు మాటలూ ఇచ్చింది. అన్నట్లు నా దగ్గర ముద్రిత నిఘంటుప్రతులు లేవు - వెబ్ లో చూసాను. ఈ విషయంలో అభ్యంతరం ఉంటే మన్నించాలి.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిచంద్రశేఖరుగారూ. ఈనాడు, 'ఒక్కడు' పదంమీద నాకు కనిపించిన ప్రయోగాలు: రాజారావుగారి 'యనగ నొక్కడే ', చింతా రామ కృష్ణా రావుగారి 'చూచిన నొక్కడైన', మిస్సన్నగారి 'నింగినొక్కడౌ' మరియు నేమానివారి 'అనగ నొక్కడే' అనేవి. మీరు చెప్పినట్లు "ఇతడు+ఒక్కడే = ఇతడొక్కడే " అవుతుంది. కాని నేటి పై ప్రయోగాలలో నుగాగమం సరిగానే ఉందికద. అనగన్, చూచినన్, నింగిన్ అనే మాటలపైకద సంధి జరిగినది. ఇక్కడ నా కేమీ దోషం కనిపించలేదు. ఒకవేళ నేను పొరబడితే తెలియచేయ వలసినది. కొందరు సంధి చేయకుండా పూరించారన్నారు. నరసింహమూర్తిగారి పద్యానికి నేమానివారి సవరణలో 'ఇతడు ఒక్కడే' అని విసంధిగా ఉంది. అయితే పదాలు రెండూ వేర్వేరు పాదాలకు చెందాయి. 'ఇతడు' అనేది మూడవపాదం చివరా, నాలుగవ పాదం మొదటిలో 'ఒక్కడే' అనే పదం ఉన్నది. కాబట్టి వారు సంధి చేయలేదేమో. ఒకవేళ సవరణ ఆవశ్యకం అనుకుంటే 'ఈత డొక్కడే' అని పరిష్కరించవచ్చు కాని ప్రస్తుత పాఠంకూడా యేదైనా విశేషకారణం వలన సాధువే కావచ్చును. ఇంతకంటే యీ విషయంలో అభిప్రాయం చెప్పటానికి అపండితుడనైన నాకు సాహసం లేదు.
రిప్లయితొలగించండినా పద్యమునకు గురువు గారి సవరణ, అన్నయ్య గారి వన్నె చిన్నెలు, ఆ పద్య స్ఫూర్తితో మిస్సన్న గారు వ్రాసిన పద్యము అద్భుతంగా నున్నాయి.
రిప్లయితొలగించండిరాం మోహన శర్మ గారూ, మీ మొదటి పద్యమునకు అభినందనలు. మీకు చక్కని కవితా స్రవంతి భగవ దనుగ్రహము వలన సమకూడ గలదు.
రాం మోహన్ శర్మ గారూ, మీ పద్యం బ్రహ్మాండంగా ఉంది. ఇది మీ మొదటిపద్యం అంటే నమ్మటం కష్టం! అభినందనలు. శ్రీవిశ్వనాథగారు ఒకసారి, 'నేను వ్రాసి ప్రకటించిన పద్యములొక ఇరవదివేలుండవచ్చును. వ్రాసి చించివేసినవి యేబదివేలుండవచ్చును' అన్నారు. అభ్యాసం వలన కవికి మంచి ధారాశుధ్ధి అలవడుతుంది. మీ పద్యంలో ఇప్పడే మంచి ధార కనిపిస్తోంది. మీరు తప్పక తరచుగా పద్యాలు రచిస్తూ ఉండండి.
రిప్లయితొలగించండిశంకరార్యా ! ధన్యవాదములు.
రిప్లయితొలగించండిమిస్సన్న గారూ ! ఈ రోజు ఎక్కువ పద్యములు వ్రాసిన "ఒకేఒక్కడు" అయ్యారు. కిశోర్జీ శెలవు పెట్టారనుకుంటాను.
రామ్మోహన్ శర్మ గారూ ! స్వాగతం. మీ చేరిక సంతోషముగా నున్నది.
శ్రీగురుభ్యొనమ:
రిప్లయితొలగించండివేద ధర్మము వివరించె విశ్వమందు
భరత ఖండపు కీర్తిని వ్యాప్తి జేసె
ఘనుడు మన వివేకానందు డనగ జాతి
కొక్కఁడే కాక వేఱొకం డుండునొక్కొ?
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమందాకినిగారూ, మన్మథుని కర్మయోగి అనటం మరీ అనుచితం యేమీ కాదని నా అభిప్రాయం. సాక్షాత్తు పరమశివునిపైన పూలబాణాలు వేయటానికి ఆయన చాలా సంకోచించాడు. కాని దేవకార్యం. దేవరాజు ఆనతిని త్రోసివేయలేక బెదురుతూనే శివునిపైకి సాహసించి వెళ్ళాడు. ఆయన చేసింది కేవలం కర్తవ్యనిర్వహణమాత్రమే! ఫలితం తనకు పరమప్రమాదకరం కావచ్చునని తెలిసినా తనపని తాను చేసాడు. ఆయనకు పరమేశ్వరునిపై అగౌరవం యేమీ లేదు.
రిప్లయితొలగించండిమందాకిని గారూ శ్యామలీయం గారి వివరణ చూచారు కదా. ఇవాళ ఒక క్రొత్త విషయం తెలుసుకొన్నాను.
రిప్లయితొలగించండిఇక మీరు మన్మథుడిని కర్మయోగి అనడంలో అనౌచిత్యం ఏమీ కనుపించడం లేదు. అతనికి తెలుసు తాను నశించగలనని. లోకోపకారం కోసం అతనాపని చేశాడు.
శ్యామలీయం గారూ మీ సమగ్ర వివరణకు ధన్యవాదాలు.
రామ మోహన్ శర్మ గారూ శీఘ్ర సంపూర్ణ కవన విద్యా ప్రాప్తిరస్తు.
హనుమచ్చాస్త్రి గారూ అవును కదూ! ఒకే ఒక్కణ్ణి.
కన్నె సరసన కూర్చుని వెన్నె లందు
రిప్లయితొలగించండిగాలి పెదవుల బాసలు కవిత లల్ల
జగతి మరపింప జేసెడి చంద్రు డతడు
ఒక్కఁ డే కాక వేఱొకం డుండు నొక్కొ ?
కవిమిత్రు లందరికీ శతసహస్ర వందనాలు.
రిప్లయితొలగించండిఅందరూ పరస్పరం గుణదోష విచారణ చేస్తూ, చర్చలో పాల్గొంటూ నాకు శ్రమను తగ్గిస్తున్నారు. "తాంబూలా లిచ్చేశాను. తన్నుకు చావండి" అని అగ్నిహోత్రావధానులు చెప్పినట్టు "సమస్య ఇచ్చాను. ఇక పూరణలు పంపండి, చర్చించుకోండి" అన్నట్టు ఉంది నా పరిస్థితి. అందరి భాగస్వామ్యం నాకు మహదానందాన్ని కలిగిస్తున్నది. ఈ ఉత్సాహాన్ని, స్ఫూర్తిని కొనసాగించవలసిందిగా మనవి. అయితే చర్చలు హుందాగా, సంస్కారవంతంగా ఉండి, వ్యక్తులను కించపరచే విధంగా ఉండకుండా జాగ్రత్త పడండి. అందరికీ ధన్యవాదాలు.
తెలుగుపద్యం వర్ధిల్లాలి!
అయ్యలారా ! ఇదేమీ నేను ఒకేసారి వ్రాసిన పద్యము కాదు ...పొద్దున 8 కి సమస్యాపూరణం చూసినప్పటినుండి , యతి ప్రాస గణాలతో కుస్తీ పడుతూ సాయంత్రం 5 కి పూర్తి చేసినాను . ప్రోత్సహించిన అందరికీ ధన్యవాదాలు .
రిప్లయితొలగించండిభవదీయుడు
- రాం మోహన్ శర్మ .
మిస్సన్న గారూ,
రిప్లయితొలగించండిమా మాటను మన్నించినందుకు సంతోషం. ధన్యవాదాలు.
*
పండిత నేమాని వారూ,
గన్నవరపు వారి పద్యానికి మీ పూరణ వన్నెతెచ్చింది. ‘సభలోన నియతి’కి సవరణ సూచించాలని ఎంతో ఆలోచించాను. కాని తోచలేదు. మీ సవరణ మార్గదర్శకం. ధన్యవాదాలు.
*
మందాకిని గారూ,
నిన్నటి సమస్యకు నేటి మీ పూరణ బాగుంది. అభినందనలు.
మన్మథుని కర్మయోగిగా దర్శించిన మీ ‘క్రొత్తచూపు’కు ప్రశంసలు! ‘అగ్ని కన్నుల’ను ‘అగ్గికన్నుల దాల్చిన’ అనో లేదా ‘అగ్నినేత్రముల్ దాల్చిన’ అందాం. ఇప్పటికే వైరిసమాసాల గురించి చర్చ, అపార్థాలు చోటుచేసుకున్నాయి!
ఇప్పుడే తెలిసిన విషాదవార్త ... నా అభిమాన నటుడు ‘దేవానంద్’ పరలోకగతు డయ్యాడు. ఆ ‘నిత్యయౌవన’ నటుని మృతికి నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను. భగవంతుడు ఆయన ఆత్మకు శాంతిని చేకూర్చుగాక!
రిప్లయితొలగించండి@రాజేశ్వరి నేదునూరి గారూ
రిప్లయితొలగించండిమీ పూరణ "కన్నె సరసన కూర్చుని వెన్నె లందు" బాగుంది.
శ్యామలీయంగారూ, మీ విశ్లేషణకు ప్రతిస్పందనకు ధన్యవాదాలు. "ఇతడు+ఒక్కడే" కానీ సందర్భాలలో నుగాగమ ప్రయోగంలో దోషం వుందని నేను అనలేదు అనుకోవటంలేదు. అలాగే పై పాదాలలో గుణ విశేషణాలను జత చేస్తూ అతడును + "ఇతడును+ఒక్కడే..." అన్నచోట కూడా నుగాగం రావటం సహజమే. నా సందేహం మీరు గమనించారు. నేమాని వారు సందిచేయకపోవటం వెనకాల ఏదైనా సూత్రం వుందా?
రిప్లయితొలగించండిమిస్సన్న గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ "నిండు పున్నమి చంద్రుడు నీలి నింగి" బాగుంది.
భార్య తరఫున వచ్చెను బంధు విపుడు
రిప్లయితొలగించండిఒక్క డనుకొని దెచ్చితి నొక్క ఫలము
నొక్కడే కాక వేరొకం డుండు నొక్కొ?
యూహ జేసితి నట్టులే నుండె నొకడు
చంద్రశేఖర్:
రిప్లయితొలగించండిరామమోహన శర్మగారూ, మీరు పోస్టింగు వేసేటప్పుడు "name/URL" సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు మీకు మీ పేరు వేయటానికి చోటు కనిపిస్తుంది. అప్పుడు"రామమోహన శర్మ" అని టైపు చేయండి. ఆ రకంగా మీరు పోస్టింగు వేసినప్పుడు "రామమోహన శర్మ చెప్పారు" అని కనిపిస్తుంది. ఆ రకంగా "అజ్ఞాత చెప్పారు" అనే గొడవ వుండదు. చాలా తేలిక, ప్రయత్నించి చూడండి. సందేహం వుంటే చెప్పండి.
మిస్సన్న గారూ,
రిప్లయితొలగించండిస్ఫూర్తి మూర్తి గారిదైనా పూరణలో మీ ప్రత్యేకత కనిపిస్తూనే ఉంది. మంచి పూరణ. అభినందనలు.
*
శ్రీపతి శాస్త్రి గారూ,
నా సూచన మన్నించి సవరించినందుకు సంతోషం. ఏదైనా సవరణ సూచించాలని అలోచించిన నాకు ‘పోషణ’ శబ్దం అసలే స్పురించలేదు. భళి ... భళి!
వివేకానందునిపై మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
*
‘తెలుగు పాటలు’ గారూ,
స్వాగతం! ఈ బ్లాగులో వస్తున్న పూరణపద్యాలు చాలా వరకు ద్రాక్షాపాకాలే. సాధారణ పదాలతో, సుబోధకమైన పద్యాలే వ్రాస్తున్నారు. అప్పటికీ కొందరు మిత్రులు తమ పూరణల సారాంశాన్ని కాని, నేపథ్యాన్ని కాని, అవసరమైన వివరణను కాని ఇస్తున్నారు కదా!
*
రాజేశ్వరి అక్కయ్యా,
సూర్యపరంగా మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
‘సకలప్రాణుల’ అన్నప్పుడు సంయుక్తాక్షర యోగం చేత ‘ల’ గురువై గణదోషం సంభవిస్తుంది. ‘సకలజీవుల’ అంటే సరి!
చంద్రుని పరంగా మీ రెండవపూరణ చాలా బాగుంది. అభినందనలు.
*
‘మనతెలుగు’ చంద్రశేఖర్ గారూ,
అక్కడ నుగాగమం వస్తే ‘ఇతడుకూడ’ అనే విశే్షార్థం వస్తుంది. ‘నేను వచ్చితిని- నేనును వచ్చితిని’ ... తేడా గమనించండి. ఇక విసంధిగా వ్రాయడం ... పూర్వపాదాంతంలో వ్యాక్యం పూర్తి అయి తరువాతి పాదంలో క్రొత్తవాక్యం ప్రారంభించినపుడు అచ్చును ప్రయోగించండంలో తప్పు లేదు.
*
రామమోహన్ శర్మ గారూ,
మీకు సంతోషంతో స్వాగతం పలుకుతున్నాను.
మీ మొదటి పద్యమే సలక్షణంగా ఉండి అలరిస్తున్నది. ‘సవదరించు’ శబ్దప్రయోగమే మీ నైపుణ్యాన్ని ప్రకటిస్తున్నది. మీ పూరణలో శబ్దప్రయోగం, ధార ఎవరో ఔత్సాహికులు వ్రాసిన పద్యంలా లేదు. అభినందనలు, ధన్యవాదాలు.
*
మిస్సన్న గారూ,
నిజమే! సూర్యరాయాంధ్ర నిఘంటువు ‘కల్యాణ’ శబ్దాన్నే పేర్కొంది. ‘కళ్యాణం’ లేదు.
సుబ్బారావు గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ పూర్తిగా వైవిధ్యంగా, చమత్కారభరితంగా ఉంది. అభినందనలు.
‘అట్టులే + ఉండే’ అన్నప్పుడు యడాగమం వస్తుంది. ‘అట్టులే యుండె’ అంటే సరి!
శంకరయ్య గారు ! కృ తజ్ఞతలు .సవరింతును
రిప్లయితొలగించండినా పూరణ ....
రిప్లయితొలగించండిభారతావని దాస్యమ్ము పాఱఁద్రోల
శాంత్యహింస లాయుధములై సమర మాంగ్ల
పాలకులతోడఁ జేసినవాఁడు గాంధి
యొక్కఁడే కాక వేఱొకం డుండునొక్కొ!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపద్యమన్న,ఠీవినొసగు పంచెకట్టు
రిప్లయితొలగించండియన్న, ఆవకాయయును, అష్టావధాన
మన్న సంప్రీతిఁజూపువాడరయ నాంధ్రు
డొక్కఁ డే కాక వేఱొకం డుండు నొక్కొ ?
నమస్కారములు
రిప్లయితొలగించండిసోదరులకు నచ్చి నందుకు ధన్య వాదములు.
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
మత్స్యావతారము :
01)
_________________________________
మగత నిద్దుర బోవగా - మర్కుడపుడు
మూడు వేదంబులను వేగ - మ్రుచ్చిలించి
మందిరము దాగు ముష్కరు - మత్తు నణచి
మహితమౌ వేదముల దెచ్చి - మర్కుకిడగ
మత్స్యరూపమ్ము దాల్చిన - మహితుడతడు !
ఒక్కఁడే కాక వేఱొకం - డుండు నొక్కొ?
_________________________________
మర్కుడు = బ్రహ్మ
మందిరము = సముద్రము
కూర్మావతారము :
రిప్లయితొలగించండి02)
_________________________________
కూడి దేవత లసురులు - కూర్మిమీర
గిలకరించుచు నుండిన - గిరియె మునుగ
గోపుడై కాచె గిరినంత - కూర్మ రూపు
డొక్కఁడే కాక వేఱొకం - డుండు నొక్కొ?
_________________________________
గోపుడు = రక్షకుడు
వరాహావతారము :
రిప్లయితొలగించండి03)
_________________________________
వసుధ యంతయు మునుగంగ - వార్థి యందు
బ్రహ్మ నాసిక బుట్టిన - వామనుండు
పర్వతమ్మంత పెరిగెను - పంది రూపు
విశ్వ గాపాడి దేల్చగా - విషధి పైకి !
ఒక్కఁడే కాక వేఱొకం - డుండు నొక్కొ?
_________________________________
వార్థి = విషధి = సముద్రము
వసుధ = విశ్వ = భూమి
నరసింహావతారము :
రిప్లయితొలగించండి04)
_________________________________
నారదుని యాశ్రమంబున - నాడు బుట్టి
నమ్మి కొలిచిన బాలుని - నయము బ్రోవ
నారసింహుని రూపమ్ము - నవతరించి
నిధన మొనరించె రాక్షసు - నిర్దయగను !
ఒక్కఁడే కాక వేఱొకం - డుండు నొక్కొ?
_________________________________
వామనావతారము :
రిప్లయితొలగించండి05)
_________________________________
బలము ,స్వర్గమ్ము గొనినట్టి - బలిని వేడి
వజ్రి రాజ్యమ్ము రక్షించె - వామనుండు
విమల తేజంబు గలిగిన - విక్రముండు !
ఒక్కఁడే కాక వేఱొకం - డుండు నొక్కొ?
_________________________________
పరశురామావతారము :
రిప్లయితొలగించండి06)
_________________________________
పరశువును బొందె , ప్రార్థించి - పరమ శివుని !
కార్త వీర్యుని కడదేర్చె - కర్కశముగ !
తండ్రి యాఙ్ఞను ఖండించె - తల్లి తలను !
పరమ కాఠిన్య హృదయుడై - పగయె రగుల
రాజు లెల్లర దండించె - రక్త మెగయ !
క్షాంతి నంతను తానిచ్చె - కశ్యపునకు !
పరశు రాముని తులతూగు - పురుషుడెవడు ?
ఒక్కఁడే కాక వేఱొకం - డుండు నొక్కొ?
_________________________________
రామావతారము :
రిప్లయితొలగించండి07)
_________________________________
రావణాదుల వధియించి - రమణి బ్రోచి
రామ రాజ్యము స్థాపించి - భామ తోడ
రాజ్యమన్నను రాముని - రాజ్యమనగ
రాజ్యపాలన గావించె - రమ్య మలర
రాక్షసాంతక కోదండ - రాముడవని !
ఒక్కఁడే కాక వేఱొకం - డుండు నొక్కొ?
_________________________________
బలరామావతారము :
రిప్లయితొలగించండి08)
_________________________________
నదుల గతులను మార్చెను - నవ్యరీతి
హలము చేబూని వ్యవసాయ - మలర జేసె
రమ్య గుణశీలుడౌ బల - రాముసాటి !
ఒక్కఁడే కాక వేఱొకం - డుండు నొక్కొ?
_________________________________
గురువుగారూ ధన్యవాదాలు.
రిప్లయితొలగించండివసంత మహోదయా దుమ్ము దులిపేశారు. అభినందనలు.
గురువుగారూ జాతిపితను దర్శిమ్పజేసిన మీ పూరణ చాలా బాగుంది.
రిప్లయితొలగించండికృష్ణావతారము :
రిప్లయితొలగించండి09)
_________________________________
క్రూర రాక్షసులందరి - గూల్చి వైచె !
కూర్మి జూపెను భక్తులు - కోరి కొలువ !
క్రుచ్చె గీతను నరునకు - మెచ్చి తాను !
కృష్ణ మానమ్ము గాపాడె - కృష్ణు ,డధిపు
డొక్కఁడే కాక వేఱొకం - డుండు నొక్కొ?
_________________________________
మిస్సన్న మహాశయా ! ధన్యవాదములు !
రిప్లయితొలగించండికల్క్యవతారము :
రిప్లయితొలగించండి10)
_________________________________
కాని పనులను జేసెడి - కాలమైన
కలి యుగాంతములో విష్ణు - కల్కి యైన
కత్తి చేబట్టి శిక్షించు - కాపురుషుల
కలిని నిగ్రహ పరచెడు - కల్కి యౌర !
ఒక్కఁడే కాక వేఱొకం - డుండు నొక్కొ?
_________________________________
శాంతికాము డహింసయు సత్య మలరఁ
రిప్లయితొలగించండిదెల్ల దొరలతో పోరాడి దీప్తి నొందె
గెలిచె స్వరాజ్యమును గాంధి యలఘు డాత
డొక్కడే గాక వేఱొకం డుండు నొక్కొ
గురువు గారూ మీ పూరణ చూడ లేదు. మీ పూరణ చాలా బాగుంది.
రిప్లయితొలగించండికిశోర్ జీ మీ పూరణలన్నీ బ్రహ్మాండము. అన్నిటిలో నరసింహావతార పూరణ మరీ బాగుంది.
రిప్లయితొలగించండిగురువు గారు, మిస్సన్నగారు, శ్యామలీయం గారు
రిప్లయితొలగించండిధన్యవాదాలు.
ఊక దంపుడు గారు,
భలే చెప్పారండీ!!!!
ఊకదంపుడు గారూ,
రిప్లయితొలగించండిఆంధ్రత్వం మూర్తీభవించిన మనోహరమైన పూరణ చెప్పారు. అభినందనలు.
‘పంచెకట్టు + అన్న’ అన్నప్పుడు యడాగమం రాదు. అక్కడ సంధి నిత్యం. దానిని ‘పంచెకట్టు లన్న’ అందాం. పద్యం మధ్య అచ్చులు రాకుండా చూడండి.
*
వసంత కిశోర్ గారూ,
మీ దశావతార పూరణలు అద్భుతంగా ఉన్నాయి. అభినందనలు.
నాల్గవపూరణలో ‘నారసింహుని రూపమ్ము - నవతరించి’ అన్నదాన్ని ‘నారసింహరూపమ్మున నవతరించి’ అంటే బాగుంటుందేమో? అలాగే ‘నిర్దయగను ఒక్కడే’ అనేకంటే ‘నిర్దయుడయి యొక్కడే’ అందాం.
పదవపూరణలో ‘కల్కియైన’ కంటే ‘కల్కియగుచు’ అంటే బాగుంటుందని నా సూచన.
కొసమెరుపు .....
ధర్మరక్షణ కొఱకయి ధరణిపైన
దాల్చెఁ గరుణాత్ముఁడు దశావతారములను
కోటి నామాల రూపాల మేటి యాతఁ
డొక్కఁడే కాక వేఱొక్కఁ డుండు నొక్కొ?
*
గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
మీరూ నాలాగే ఆలోచించినందుకు సంతోషం!
శంకరార్యా ! చక్కని సవరణలకు ధన్యవాదములు !
రిప్లయితొలగించండిగాంధీగారి మీది మీ పూరణ చాలా బావుంది !
మూర్తీజీ ! ధన్యవాదములు !
గాంధీగారిమీది మీ పూరణ కూడా చాలా బావుంది !
గురువుగారితో సమమయ్యారు ! అభినందనలు !
త్వరలోనే గురువును మించిన శిష్యుడు కాబోతారన్నమాట !
రాజేశ్వరిగారూ "వెన్నె లందు" అన్న ప్రయోగంలో చిక్కు ఉంది. వెన్నెల, అందు అనే రెండూ తెలుగు పదాలు కాబట్టి వీటి మధ్య సంధి లేదు కాబట్టి యడాగమం తప్పనిసరి. అందుచేత "వెన్నెల యందు" అన్న స్వరూపం యేర్పడుతుందని, అందుచేత అందమైన యీ పాదాన్ని సవరించవలసి వస్తుందని నా అభిప్రాయం.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఆర్యులారా, దశావతారస్తుతిపూర్వకంగా పూరణ ప్రశస్తంగా ఉంది. నాకు కూడా యీ విధంగా చేయటం అభిమతం.
రిప్లయితొలగించండిచదువులకు రక్ష గూర్చెడు సదయు డగుచు | ఒక్కఁడే కాక వేఱొకం డుండునొక్కొ?
గిరిని వీపున మోయగా కూర్మ మగుచు | ఒక్కఁడే కాక వేఱొకం డుండునొక్కొ?
క్షోణి కోరను దాల్చగా కిటి గ నగుచు ఒక్కఁడే కాక వేఱొకం డుండునొక్కొ?
నరమృగాకృతి సురవైరి నణచ తోచు | ఒక్కఁడే కాక వేఱొకం డుండునొక్కొ?
బలిని వెడలించి యిద్రుని నిలుప గలుగు | ఒక్కఁడే కాక వేఱొకం డుండునొక్కొ?
దుష్టరాజన్యశ్రేణిని దునుము వాడు | ఒక్కఁడే కాక వేఱొకం డుండునొక్కొ?
జగములకు రావణభయంబు సమయ జేయు | ఒక్కఁడే కాక వేఱొకం డుండునొక్కొ?
భూమి భారంబు తగ్గింప పొడము వాడు | ఒక్కఁడే కాక వేఱొకం డుండునొక్కొ?
తుళువలనుబుధ్ధివాదాన దునుమువాడు | ఒక్కఁడే కాక వేఱొకం డుండునొక్కొ?
కలిని వెడలించి సత్యయుగంబు దెచ్చు | ఒక్కఁడే కాక వేఱొకం డుండునొక్కొ?
నారాయణార్పణమస్తు. స్వస్తి.
అయ్యా! శ్యామల రావు గారు!
రిప్లయితొలగించండినిన్నటి మీ దశావతార స్తుతి చూచేను. 2, 3 పాదములలో యతి సరిపోవుట లేదు. నా సూచన గమనించండి:
(2) కొండ వీపున మోయగా కూర్మ మగుచు
(3) క్షోణి కోరను దాల్చగా క్రోడ మగుచు
నేమాని వారి సవరణలతో పునఃప్రకటనము:
రిప్లయితొలగించండిచదువులకు రక్ష గూర్చెడు సదయు డగుచు | ఒక్కఁడే కాక వేఱొకం డుండునొక్కొ?
కొండ వీపున మోయగా కూర్మ మగుచు | ఒక్కఁడే కాక వేఱొకం డుండునొక్కొ?
క్షోణి కోరను దాల్చగా క్రోడ మగుచు ఒక్కఁడే కాక వేఱొకం డుండునొక్కొ?
నరమృగాకృతి సురవైరి నణచ తోచు | ఒక్కఁడే కాక వేఱొకం డుండునొక్కొ?
బలిని వెడలించి యిద్రుని నిలుప గలుగు | ఒక్కఁడే కాక వేఱొకం డుండునొక్కొ?
దుష్టరాజన్యశ్రేణిని దునుము వాడు | ఒక్కఁడే కాక వేఱొకం డుండునొక్కొ?
జగములకు రావణభయంబు సమయ జేయు | ఒక్కఁడే కాక వేఱొకం డుండునొక్కొ?
భూమి భారంబు తగ్గింప పొడము వాడు | ఒక్కఁడే కాక వేఱొకం డుండునొక్కొ?
తుళువలనుబుధ్ధివాదాన దునుమువాడు | ఒక్కఁడే కాక వేఱొకం డుండునొక్కొ?
కలిని వెడలించి సత్యయుగంబు దెచ్చు | ఒక్కఁడే కాక వేఱొకం డుండునొక్కొ?
గురువు గారూ, ధన్యవాదములు. మీసూచన గుర్తుపెట్టుకుంటాను.
రిప్లయితొలగించండిమందాకిని గారూ, ధన్యవాదములు.
నమస్కారములు.
రిప్లయితొలగించండిశ్యామలీయం గారూ ! మీ సూచన తప్పక పాటిస్తాను. ధన్య వాదములు
thanks for your time, I like your website, 2012 nba all star jerseys
రిప్లయితొలగించండిsubject matter is amazingly remarkable. Will be able to learn about plenty belonging to the within just, bikini swimsuit and see many want to see, thank you very much to share .Louis Vuitton Replica .best wish for you !