ప్రహేళిక
దేవరాజో మయా దృష్టః
వారివారణమస్తకే |
భక్షయి త్వార్కపర్ణాని
విషం పీత్వా క్షయం గతః ||
వాచ్యార్థం -
నీటియేనుగు తలపైన (వారివారణ మస్తకే). నాకు కనిపించిన (మయాదృష్టః), ఇంద్రుడు (దేవరాజః) జిల్లేడు ఆకులను (అర్కపర్ణాని), తిని (భక్షయిత్వా), విషం త్రాగి (విషం పీత్వా), నాశన మయ్యాడు (క్షయం గతః).
నీటియేనుగు తలపైన (వారివారణ మస్తకే). నాకు కనిపించిన (మయాదృష్టః), ఇంద్రుడు (దేవరాజః) జిల్లేడు ఆకులను (అర్కపర్ణాని), తిని (భక్షయిత్వా), విషం త్రాగి (విషం పీత్వా), నాశన మయ్యాడు (క్షయం గతః).
వ్యంగ్యార్థం -
దేవర = ఓ మరదీ!
వారి వారణ మస్తకే = నీటిని అడ్డగించే కట్టమీద
మయా దృష్టః = నాచేత చూడబడిన (నేను చూచిన)
అజః = మేక
అర్కపర్ణాని = జిల్లేడు ఆకులను
భక్షయిత్వా = తిని
విషం = నీటిని
పీత్వా = త్రాగి
క్షయం = ఇంటికి
గతః = వెళ్ళిపోయింది.
(శ్రీ శ్రీభాష్యం విజయసారథి గారు సేకరించిన ‘ప్రహేళికలు’ గ్రంథం నుండి)
శ్రీ శంకరయ్య గారికి నమస్కారములు.
రిప్లయితొలగించండిఒక అర్ధము మేక ,ఇంకొక అర్ధము దేవేంద్రుడు గురించి బాగుంది.
సుబ్బారావు గారూ,
రిప్లయితొలగించండినచ్చి, సంతోషించినందుకు ధన్యవాదాలు.
చమత్కార పద్యములు ఎంతో బాగుంటున్నాయి. మనతెలుగు ఎంత మహోన్నత మైనదో ఇలా చదువు తుంటే , నిజంగా ఆశ్చర్య ము , ఆనందము కలుగు తున్నాయి. ధన్య వాదములు తమ్ముడూ !
రిప్లయితొలగించండిరాజేశ్వరిగారు, ఇదంతా సంస్కృత వ్యవహారం కాదుటండీ!
రిప్లయితొలగించండి