8, డిసెంబర్ 2011, గురువారం

సమస్యాపూరణం - 553 (ఆపదలను దొలచు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది
ఆపదలను దొలచు పాపచయము
ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

37 కామెంట్‌లు:

 1. శ్రీగురుభ్యోనమ:

  నీపదాంఘ్రియుగము నిత్యము సేవింప
  ఆపదలను దొలచు, పాపచయము
  తొలగు,ప్రజ్ఞ గలుగు,పులకరించు తనువు
  దేవ దేవ మీకు సేవ జేయ

  రిప్లయితొలగించండి
 2. పాప భీతి లేక పరమేశు పై భక్తి
  చింత నింత లేక సిగ్గు లేక
  పాప ములను జేయు భడవ పున్యంబుల
  నాప దలను దొలచు పాపచయము.

  రిప్లయితొలగించండి
 3. ఆపదలను దొలచు బాప చయము బాపు
  భ్రమల నెల్ల జీల్చు శ్రమను దీర్చు
  గూర్చు యోగములను జేర్చు నీ పద సీమ
  పార్వతీశ! నీదు పాద సేవ

  రిప్లయితొలగించండి
 4. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !

  01)
  _____________________________________

  అసుర సంధ్య వేళ - నాలోచనను మున్‌గి
  యాదమరచ, బండి - నాప గలుగు
  ఆగకుండ వచ్చు - నా కారు గమనించి !
  ఆపదలను దొలచు - పాప చయము !
  _____________________________________
  పాప = కంటిపాప

  రిప్లయితొలగించండి
 5. చిన్న టైపాటు సవరణ తో...

  పాప భీతి లేక పరమేశు పై భక్తి
  చింత నింత లేక సిగ్గు లేక
  పాప ములను జేయు భడవ పుణ్యంబుల
  నాప, దలను దొలచు పాపచయము.

  (ఆప + తలను )

  రిప్లయితొలగించండి
 6. స్వామియె శరణం
  గురువు గారికి ధన్యవాదములు
  నేటి రాజకీయముతో, భారతదేశమందున పాపుల వల్లకాని పని లేదు
  -------------
  పచ్చ నోట్లు పంచ బలుమార్గములుజూపు,
  జగతియందులేని జాలవిద్య
  నేర్చినట్టి వారు, నీతిని జంపియే
  ఆపదలను దొలచు పాప చయము
  (జాలవిద్య = గారడి విద్య)

  రిప్లయితొలగించండి
 7. వెంకట రాజారావు . లక్కాకులగురువారం, డిసెంబర్ 08, 2011 11:32:00 AM

  వచనీయ మైన మాటకు
  శుచియగు చేతలను జేర్చి సుజనుం డొన గూ
  ర్చు చెయిదము లాపదలను దొ
  లచు , పాప చయమును ద్రోచి లయ మొనరించున్

  రిప్లయితొలగించండి
 8. అందరికీ నమస్కారం !
  ఆర్యులారా ,
  నా ప్రయత్నమిది ..

  ప్రాణహానియున్న పలుకవచ్చును తప్పు
  మనువు నిలుప, మాట మార్చ దగును
  అఘములైన గూడ నట్టిస్థితులజూడ
  నాపదలను దొలచు పాపచయము

  రిప్లయితొలగించండి
 9. స్వామియె శరణం
  గురువు గారికి ధన్యవాదములు
  -----------
  ఆపదలను దొలచు పాపచయము, నేడు
  రాజకీయమందు రాక్షస గణ
  మెల్ల జేరి కోట్లు మ్రింగి, కావలియున్న
  వారి గష్టములకు వార్థిగట్టి

  రిప్లయితొలగించండి
 10. 1
  ఆపదలను దొలచు పాపచయము నగ్ని
  గడ్డివాము నట్లు గాదహించు
  సకలశుభము లిచ్చు సర్వేశ్వరుని పాద
  పద్మములను గొల్చువాని భక్తి

  2
  భక్తి యిట్టి దనుచు వచియింప శక్యమే
  అదియె గడచు నెల్ల ఆపదలను
  దొలచు పాపచయము తులలేని భక్తియే
  భక్తి వలన మోక్ష పదము గలుగు

  రిప్లయితొలగించండి
 11. శ్రీపతిని వహించు శ్రీనాగ దేవరా!
  కాపు నీవ మాకు. కరుణ చూపి
  కావుమయ్య మమ్ము. కారుణ్య రూప! మా
  యాపదలను దొలచు పాఁప చయము.

  రిప్లయితొలగించండి
 12. 1.శంకరాభరణం;సమస్య 553

  సత్ప్రవర్తనమ్ము,సాధు సాంగత్యమ్ము
  నాపదలను దొలచు,;పాపచయము ,
  పరిహరించు ,పుణ్య ఫలముల నిచ్చును
  పంకజాక్షు సేవ పావనమ్ము
  ------------
  2.సమస్య-20-10-2010
  ఏ ధర్మమ్ముల నెరుగక
  మేధో ప్రజ్ఞా వికాస మేలేకుండన్
  గాధల గొన్నిటి నేరిచి
  బోధించుటె రాని గురువె పూజ్యుండయ్యెన్.

  రిప్లయితొలగించండి
 13. పూల దండల నిను బూజించు మనుజుని
  ఆపదలను దొలచు పాప చయము
  తొలగ జేయ నిపుడ తోయజ నయనాల
  రమ్ము వేగ మిటకు రామ పత్ని!

  రిప్లయితొలగించండి
 14. పర హిత మొనరించు వాడె పాపాత్ము డగున్
  -------------------
  పర హితము జేయ గోరుచు
  పరువంబును వీడ నాడి పదుగురి కోసం
  చెరసాల కేగె గోపయ
  పర హిత మొనరించు వాడె పాపాత్ము డగున్ ?

  రిప్లయితొలగించండి
 15. అమ్మా నేదునూరి రాజేశ్వరి సోదరీమణీ!
  జన్మ దిన శుభాకాంక్షలు. ఈరోజే మా అబ్బాయి నంద కిశోర్ కుమార్తె చి.సౌ.ఉమ జన్మ దినము కూడా. (న్యూ జెర్సీ)

  ఆనందమును గూర్చు పర్వమిది అమ్మా! పుణ్య రాజేశ్వరీ!
  జ్ఞానానందనిధీ! కవిత్వమయి! నీ జన్మంబు ధన్యంబునై
  నానా భక్తి విశేషమార్గ నిరతిన్ భాసిల్లు నిత్యంబు నీ
  శానుండిచ్చుత నీకు శాంతి సుఖ భాస్వద్దివ్య యోగమ్ములన్

  రిప్లయితొలగించండి
 16. చిన్న సవరణ:
  మా పద్యములో మొదటి పదము: ఆనందమ్మును అని చదువుకోవాలి.

  రిప్లయితొలగించండి
 17. రామ నామమందా ‘ర’ కార మగిని బీజ
  మదియె బాధలన్ వేదన లాపదలను
  దొలచు పాప చయము బాపు, మలగునా ‘మ’
  కార మడ్డుకట్టగనిల్చి కాపనోపు (కాపుజేయు)
  రామ! రామ! రామ! యనరె రమణులార!

  రిప్లయితొలగించండి
 18. మ:ల:స. రాజేశ్వరి గారికి "పుట్టిన రోజు శుభాకాంక్షలు"

  రిప్లయితొలగించండి
 19. నమస్కారములు
  సుబ్బారావు గారికీ , అవధాన సరస్వతులు శ్రీ పండిత నేమాని వారికీ ధన్య వాదములు

  రిప్లయితొలగించండి
 20. అయ్యా! చంద్రశేఖర్ గారూ!
  మీ రామభక్తి అనన్య సామాన్యమని మీ పద్యము చెప్పుచున్నది.
  భావము బాగున్నది. మొదటి పాదములో అగిని బీజ అన్నారు. కొంచెము మార్చి అనల బీజ అంటే హాయిగా నుంటుంది.

  రిప్లయితొలగించండి
 21. మిత్రులారా! ఈనాటి పూరణలలో ఎక్కువగా దైవ భక్తి వైభవమును వర్ణించేరు. అందరి పూరణలు బాగుగ నున్నవి. శ్రీపతి శాస్త్రి గారు - భక్తిభావముతో మీ పూరణ బాగున్నది.
  శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారు - పుణ్యంబుల నాప - దలను దొలచు పాప చయము అనే పూరణ బాగు బాగు.
  శ్రీ వసంత కిశోర్ గారు: మీ కంటి పాప ప్రయోగము బాగున్నది.
  శ్రీ వరప్రసాద్ గారు: నీతిని జంపే గారడీలు బాగుగ చెప్పేరు.
  శ్రీ వెంకట రాజారావు గారు : మనో వాక్ కాయ కర్మల శుద్ధి బాగుగా వర్ణించేరు.
  శ్రీ కల్యాణ్ గారు : శుక్ర నీతి హాయిగా చెప్పేరు - ప్రాణ మాన విత్త భంగమందు బొంక వచ్చు నఘము వొందడు
  శ్రీ వరప్రసాద్ గారు: కోట్లతో రాజాకీయాలు - బాగు బాగు.
  శ్రీ శ్యామల రావు గారు : 2 పద్యములలో సర్వేశ్వరుని యందు భక్తి యొక్క ప్రయోజనములను వర్ణించేరు - బాగున్నది.
  శ్రీ చింతా రామకృష్ణా రావు గారూ: పాప చయము - నాగదేవతగా వర్ణన బాగున్నది.
  శ్రీ కమనీయము గారు: సాధు జన లక్షణములను బాగుగా చెప్పేరు.
  శ్రీ సుబ్బారావు గారు - సీతాదేవికి మీ వేడుకోలు బాగున్నది.
  శ్రీ చంద్రశేఖర్ గారు: ర & మ బీజాక్షరముల వైభవాన్ని బాగుగా చెప్పేరు.
  అందరికీ అభినందనలు.

  మిత్రులారా! ఈనాటి పూరణలలో ఎక్కువగా దైవ భక్తి వైభవమును వర్ణించేరు. అందరి పూరణలు బాగుగ నున్నవి. శ్రీపతి శాస్త్రి గారు - భక్తిభావముతో మీ పూరణ బాగున్నది.
  శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారు - పుణ్యంబుల నాప - దలను దొలచు పాప చయము అనే పూరణ బాగు బాగు.
  శ్రీ వసంత కిశోర్ గారు: మీ కంటి పాప ప్రయోగము బాగున్నది.
  శ్రీ వరప్రసాద్ గారు: నీతిని జంపే గారడీలు బాగుగ చెప్పేరు.
  శ్రీ వెంకట రాజారావు గారు : మనో వాక్ కాయ కర్మల శుద్ధి బాగుగా వర్ణించేరు.
  శ్రీ కల్యాణ్ గారు : శుక్ర నీతి హాయిగా చెప్పేరు - ప్రాణ మాన విత్త భంగమందు బొంక వచ్చు నఘము వొందడు
  శ్రీ వరప్రసాద్ గారు: కోట్లతో రాజాకీయాలు - బాగు బాగు.
  శ్రీ శ్యామల రావు గారు : 2 పద్యములలో సర్వేశ్వరుని యందు భక్తి యొక్క ప్రయోజనములను వర్ణించేరు - బాగున్నది.
  శ్రీ చింతా రామకృష్ణా రావు గారూ: పాప చయము - నాగదేవతగా వర్ణన బాగున్నది.
  శ్రీ కమనీయము గారు: సాధు జన లక్షణములను బాగుగా చెప్పేరు.
  శ్రీ సుబ్బారావు గారు - సీతాదేవికి మీ వేడుకోలు బాగున్నది.
  శ్రీ చంద్రశేఖర్ గారు: ర & మ బీజాక్షరముల వైభవాన్ని బాగుగా చెప్పేరు.
  అందరికీ అభినందనలు.

  రిప్లయితొలగించండి
 22. శ్రీపతి శాస్త్రి గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  హనుమచ్ఛాస్త్రి గారూ,
  ‘ఆపదలను’ చక్కగా విరిచి చమత్కారాన్ని సాధించారు. బాగుంది. అభినందనలు.
  ‘చింతన + ఇంత’ అన్నప్పుడు సంధి జరుగక యడాగమం వస్తుందనుకుంటున్నాను.
  ‘భడవ’ శబ్దానికి ఏ అర్థమూ లేదు. శ్రీహరి నిఘంటువు మాత్రం ‘ఒక తిట్టు’ అంది.
  *
  పండిత నేమాని వారూ,
  పరమేశ్వరుని పాదసేవ వలన కలిగే ప్రయోజనాలను వివరించిన మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.
  *
  వసంత కిశోర్ గారూ,
  కంటిపాప అర్థంలో మీ పూరణ బాగుంది. అభినందనలు.
  చయమంటే సమూహం కదా! మరి ‘ఇద్దరుంటే గుంపు కా’ దన్న ఆంగ్లసామెత ఏదో విన్నట్టు గుర్తు :-)
  *
  వరప్రసాద్ గారూ,
  ధనబలంతో పాపపు పనులతో ఆపదలను తొలగించుకొనే వారి గురించిన మీ పూరణ బాగుంది.
  మీ రెండవ పూరణ కూడా దాదాపు అదే భావాన్ని వ్యక్తం చేస్తున్నది. చక్కని పూరణ. అభినందనలు.
  *
  రాజారావు గారూ,
  సమస్య పాదాన్ని కందంలో ఇమిడ్చిన మీ నైపుణ్యం ప్రశంసనీయం. చక్కని పూరణ. అభినందనలు.
  *
  కళ్యాణ్ గారూ,
  పాపం చేయతగ్గ సందర్భాలను వివరిస్తూ చక్కని పూరణ చెప్పారు. బాగుంది. అభినందనలు.
  *
  శ్యామల రావు గారూ,
  మీ రెండు పూరణలూ అద్భుతంగా ఉన్నాయి. అభినందనలు.
  *
  చింతా రామకృష్ణారావు గారూ,
  పాపను పామును చేసారు. బాగుంది. పూరణలో చమత్కారం ఉంది. అభినందనలు.
  అయితే ‘పాఁపచయము’ సమాసమే చింత్యం!
  *
  ‘కమనీయం’ గారూ,
  మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
  ఇక మీ ‘బోధించుట రాని గురువు’ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
  *
  సుబ్బారావు గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  ‘పరహిత మొనరించు’ పూరణ సమర్థనీయం కాదనుకుంటా. అలాగే ‘కోసం’ అనే వ్యావహారిక పద ప్రయోగం. అక్కడ ‘కొఱకై’ అంటే సరి.
  *
  పండిత నేమాని వారూ,
  మీ మనుమరాలు ‘ఉమ’కు జన్మదిన శుభాకాంక్షలు!
  మనము మురియ జన్మదిన శుభాకాంక్షలు
  తెల్పుచుంటిని ‘ఉమ’! ధీవిశాలు
  రామజోగి మనుమరాలవు; నందకి
  శోరు ముద్దు సుతవు; శుభము నీకు!
  *
  చంద్రశేఖర్ గారూ,
  ప్రశస్తమైన పూరణ. అభినందనలు.
  నేమాని వారి సవరణను గమనించారు కదా!
  *
  నేమాని వారూ
  అందరి పూరణలను పరామర్శించినందుకు నా తరఫున, అందరి తరఫున ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 23. ఐక మత్య మెపుడు నద్భుత శక్తియౌ
  నొంటి వాని శక్తి యోటి కుండ
  కలిమి బలిమి జనుల కలయికలో నుండు
  నాపదలను దొలచు పాప! చయము.

  రిప్లయితొలగించండి
 24. సోదరి రాజేశ్వరి కివె
  సాదరముగ జన్మ దినపు సత్కామన లీ
  మేదిని శత వర్షమ్ములు
  మోదముతో నుండగలరు మురహరి కృపన్.

  రిప్లయితొలగించండి
 25. శ్రీ నేమాని వారికి ధన్యవాదములు.
  శంకరార్యా ! ధన్యవాదములు....భడవ పదము తిట్టుగానే వాడాను.

  రిప్లయితొలగించండి
 26. వేంకటరమణుని సకల సంకటహర
  ణుని కలియుగ వైకుంఠవాసుని శుభకర
  జయకర ఘన పావన నామ జపము పాపు
  నాపదలను, దొలచు పాప చయము.

  రిప్లయితొలగించండి
 27. శంకరార్యా ! ధన్యవాదములు ! దీనిని తిలకించుడు !
  +++++++++++++++++++++++++++++++++++++
  చయము : బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు
  chayamu
  [Skt.] n.
  1. An assemblage, a multitude, a heap or collection, సమూహము;
  2. a mound of earth, a pile. కోట కొరడు.
  3. This word is even used for a small number
  నేత్రచయము the three eyes of Siva are called his set of eyes.
  +++++++++++++++++++++++++++++++++++++

  రిప్లయితొలగించండి
 28. మన తెలుగు - చంద్రశేఖర్శుక్రవారం, డిసెంబర్ 09, 2011 1:45:00 AM

  శ్రీ నేమాని మహాశయా! చక్కటి సవరణకు ధన్యవాదాలు. అగ్ని శబ్దం రావాలని "అగిని" వాడాను.

  రిప్లయితొలగించండి
 29. నమస్కారములు .
  సోదరులు మిస్సన్న గారికి ధన్య వాదములు. ఇంత మంచి సరస్వతీ పుత్రులకు , పండితులకు , నేను సోదరిని కావడం నా పూర్వ జన్మ సుకృతం. అదృష్ట వంతు రాలిని. అందరికీ ధన్య వాదములు.

  రిప్లయితొలగించండి
 30. మిస్సన్న గారూ,
  పాపను సంబోధిస్తూ ఐకమత్యం ప్రాధాన్యతను వివరించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  ఊకదంపుడు గారూ,
  పూరణ బాగుంది. కానీ సమస్య పాదం ఆటివెలది అయితే పై మూడు పాదాలూ తేటగీతి వ్రాసారు.
  *
  వసంత కిశోర్ గారూ,
  కాని అక్కడ ‘the three eyes of Shiva' అన్నారు కదా. నేను చెప్పింది రెండింటి గురించి.

  రిప్లయితొలగించండి
 31. అమ్మా రాజేశ్వరి గారూ నా పద్యంలో చివరి పాదాన్ని
  ఇలా చదువుకోండి.
  మోదముతో నుండగలరు మురహరి కరుణన్ .

  రిప్లయితొలగించండి
 32. అపదలను పుణ్యాలకు కలిపి శాస్త్రిగారు చక్కగా చెప్పారు

  రిప్లయితొలగించండి
 33. శంకరార్యా ! ధన్యవాదములు !
  నేను " నేత్రచయము " తరువాత యేముందో చూడలేదు !
  దాన్ని నేత్రద్వయానికి అన్వయించుకొని నా పూరణ కానిచ్చేశాను !
  మీరు చెప్పిన తరువాతనే వివరంగా చదివి
  తప్పు తెలుసుకొని నాలిక్కరచు కున్నాను !

  రిప్లయితొలగించండి
 34. ఈ తప్పు ఇప్పటికి చాలా సార్లే చేసాను. మన్నించండి.ముందు ముందు జాగ్రత్త వహిస్తాను,

  ఇందిరామనోహరునేడుకొండలవాని
  వేయి పేరులుగలవేంకటపతి
  నామజపము కలిని నరులకెల్లను పాపు
  నాపదలను, దొలచు పాప చయము.

  రిప్లయితొలగించండి