8, డిసెంబర్ 2011, గురువారం

నా పాటలు - (సాయి పాట)

                       దేవుడు - గురువు - రాజు


ఎక్కడైనా గాని ఎప్పుడైనా గాని
అక్కరకు వస్తాడు మన సాయి
వేయి నామాల రూపాల మనసాయి
నామరూపాల కందని మన సాయి              || ఎక్కడైనా ||


ఏ దేవు డీజగములకు సృష్టికర్త
ఏ దేవు డీజగము లెల్ల కాపాడు
ఏ దేవు డత్యంత మహిమాన్వితుండు
ఆ సాయి దేవుడే శరణమ్ము మనకు         
|| ఎక్కడైనా ||

ఏ గురువు అజ్ఞాన తిమిరిసంహారి
ఏ గురువు జ్ఞానప్రకాశ భాస్కరుడు
ఏ గురువు సర్వజన సన్మార్గదర్శి
ఆ సాయి సద్గురువె శరణమ్ము మనకు    
|| ఎక్కడైనా ||

ఏ రాజు మన హృదయసామ్రాజ్య నేత
ఏ రాజు దుష్టగుణ శాత్రవ విజేత
ఏ రాజు సుఖశాంతి సంపదల దాత
ఆ సాయి మహరాజె శరణమ్ము మనము 
|| ఎక్కడైనా ||

1 కామెంట్‌:

  1. శంకరార్యా ! చక్కగా నున్నది !
    రామదాసు సినిమాలో "ఏ మూర్తి"
    అన్న పాటకు ధీటుగా నున్నది !

    రిప్లయితొలగించండి