పాదానులోమ ప్రతిలోమ శ్లోకం
కాళీనానననాళీకా
రాధితాహిహితాధిరా |
మాయాసామమసాయామా
కాపిదీప్రప్రదీపికా ||
(ఈ శ్లోకంలో ఏపాదానికి ఆ పాదం ఎటునుండి చదివినా ఒక్కటే!)
పదవిభాగం -
కాళీ, ఈన, ఆనన, నాళీక, ఆరాధితా, హి, హిత, అధి, రా, మా, యా, సా, మమ, సా, ఆయామా, కాపి, దీప్రప్రదీపికా.
అన్వయం -
కాళీ, ఇన, ఆనన, నాళీక, ఆరాధితా హి, హిత, అధి, రా, యా మా, సా, ఆయామా, సా, మమ, కాపి, దీప్రప్రదీపికా.
ప్రతిపదార్థాలు -
కాళీ = పార్వతి యొక్క
ఇన = భర్త అయిన శంకరుని
ఆనన = వదన మనే
నాళీక = పద్మం చేత
ఆరాధితా హి = స్తుతింపబడేడీ,
హిత = భక్తుల యొక్క
అధి = మనోవ్యధను
రా = తొలగించేదీ (అయిన)
యా మా = ఏ లక్ష్మీదేవి
సా = (భక్తులపట్ల) దయ యొక్క
ఆయామా = దీర్ఘత కలిగినదై ఒప్పుతున్నదో
సా = అటువంటి లక్ష్మీదేవి
మమ = నాకు
కాపి = అనిర్వచనీయమైన
దీప్రప్రదీపికా = ఎల్లప్పుడు ప్రకాశించే దీపిక అగును గాక!
భాష్యం విజయసారథి గారు సేకరించిన ‘ప్రహేళికలు’ గ్రంథంనుండి)
కాళీనానననాళీకా
రాధితాహిహితాధిరా |
మాయాసామమసాయామా
కాపిదీప్రప్రదీపికా ||
(ఈ శ్లోకంలో ఏపాదానికి ఆ పాదం ఎటునుండి చదివినా ఒక్కటే!)
పదవిభాగం -
కాళీ, ఈన, ఆనన, నాళీక, ఆరాధితా, హి, హిత, అధి, రా, మా, యా, సా, మమ, సా, ఆయామా, కాపి, దీప్రప్రదీపికా.
అన్వయం -
కాళీ, ఇన, ఆనన, నాళీక, ఆరాధితా హి, హిత, అధి, రా, యా మా, సా, ఆయామా, సా, మమ, కాపి, దీప్రప్రదీపికా.
ప్రతిపదార్థాలు -
కాళీ = పార్వతి యొక్క
ఇన = భర్త అయిన శంకరుని
ఆనన = వదన మనే
నాళీక = పద్మం చేత
ఆరాధితా హి = స్తుతింపబడేడీ,
హిత = భక్తుల యొక్క
అధి = మనోవ్యధను
రా = తొలగించేదీ (అయిన)
యా మా = ఏ లక్ష్మీదేవి
సా = (భక్తులపట్ల) దయ యొక్క
ఆయామా = దీర్ఘత కలిగినదై ఒప్పుతున్నదో
సా = అటువంటి లక్ష్మీదేవి
మమ = నాకు
కాపి = అనిర్వచనీయమైన
దీప్రప్రదీపికా = ఎల్లప్పుడు ప్రకాశించే దీపిక అగును గాక!
భాష్యం విజయసారథి గారు సేకరించిన ‘ప్రహేళికలు’ గ్రంథంనుండి)
మాస్టరు గారూ ! "కుడి ఎడమైనా పొరపాటు లేని" శ్లోకం ...చాలా బాగుంది.
రిప్లయితొలగించండి" పారిజాతాప హరణంలో " ఇలాంటి పద్యాలు చదివాను తమ్ముడు ! నాకు చాలా ఇష్టం. మళ్ళీ ఇన్నాళ్ళకి .
రిప్లయితొలగించండిఅయ్యా! ఇటువంటి మరొక పద్యమును చూడండి. రచయిత వివరములు నాకు గుర్తు లేవు.
రిప్లయితొలగించండిధీరహిమ భామ హిరధీ
తారరవా మదహరాహ దమవారరతా
మారవర వీరవరమా
సారసదా యజ దరాద జయదా సరసా
శంకరయ్య గారికి నమస్కారములు .మీ చమత్కార పద్యాలు ముదా వహములు .ఆ
రిప్లయితొలగించండిలక్ష్మీ దేవి మీకు దీప్ర ప్రదీపికా!
అనులోమ విలోమము [ అర్ధ భ్రమక కందము. ] [
రిప్లయితొలగించండినాయ శరగ సార విరయ
తాయనజయ సారసుభగ ధరదీ నియమా !
మాయని ధీరధగ భసుర
సాయజనయ తాయరవి రసాగర శయనా !
[ మొదటి రెండు పాదములు వెనుక నుండి చదివిన ౩,౪, పాదములు వచ్చును. మళ్ళీ ౩,౪, పాదములు వెనుక నుండి చదివిన మొదటి రెండు పాదములు వచ్చును. ]
--------------------------------------------------
పాద భ్రమకము [ ప్రతి పాదమును వెనుక నుండి చదివిన అదే పదము వచ్చును
ధీర శయ నీయ శరదీ
మార విభానుమత మమత మనుభా విరమా !
సారస వననవ సరసా
దారద సమతార హార తామస దరదా !
[ ఇవి నంది తిమ్మనగారి పారిజాతాప హరణంలొ నారదుడు కృష్ణుని చలోక్తులతో స్తుతించిన విధము. ] క్షమించాలి. ఇష్టంతో వ్రాయాలని వ్రాసానంతే . నాకేమి తెలిసి కాదు.
శ్రీ నేమాని వారూ ! రాజేశ్వరి గారూ ! చక్కటి కందములను పరిచయం చేశారు ధన్యవాదములు..
రిప్లయితొలగించండిఆర్యా ! పై వ్యాఖ్య లలో శ్రీ నేమానివారు, రాజేశ్వరి గారు పరిచయం చేసిన చమత్కార పద్యములను కూడా ప్రతిపదార్థములతో విడివిడిగా ఒక రోజు ప్రచురిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఈ వ్యాఖ్య లలో ఉంటే ఎక్కువ మంది చూసే అవకాశం ఉండదు.
రిప్లయితొలగించండి