4, డిసెంబర్ 2011, ఆదివారం

సమస్యా పూరణం - 548 (గుణవంతున్ దెగనాడి)

వారాంతపు సమస్యాపూరణం
కవిమిత్రులారా,
ఈ వారాంతానికి పూరించవలసిన సమస్య ఇది
గుణవంతున్ దెగనాడి నాతి వలచెన్
గోవర్ధనోద్ధారకున్.

14 కామెంట్‌లు:

  1. ఘన సత్వున్ శిశుపాలు నీకు పతిగా కల్యాణమున్ జేతుమో
    గుణ సంవర్ధిని! రుక్మిణీ! యనగనే కోపించి దుష్టాత్ము, స
    ద్గుణహీనున్, శిశుపాల దుర్మతి ఖలున్, దుష్టున్, మహా నీచ దుర్
    గుణవంతున్ దెగనాడి నాతి వలచెన్గోవర్ధనోద్ధారకున్

    రిప్లయితొలగించండి
  2. మణిమాణిక్యవిభూషణంబుల గుణంబై వెల్గు మాలక్ష్మి రు
    క్మిణి, నిన్నున్ శిశుపాలుకిత్తుమనురుక్మిన్ జూచి వారించి, ధూ
    షణచిత్తుండవినీతిమంతుండునవిశ్వాసుండు, హీనుండు దు
    ర్గుణవంతున్ దెగనాడి నాతి వలచెన్ గోవర్ధనోద్ధారకున్.

    రిప్లయితొలగించండి
  3. శ్రీగురుభ్యోనమ:

    గుణవంతుండగు గృష్ణునిన్ మదిని జేకొన్నట్టి యా రుక్మిణీ
    ప్రణయంబున్ మది లోన మెచ్చి వలచెన్ ప్రాణేశుడై కృష్ణుడే
    రణరంగంబున సైనికావళుల వీరావేశమున్ ద్రుంచ, దు
    ర్గుణవంతున్ దెగనాడి, నాతి వలచెన్ గోవర్ధనోద్ధారకున్

    దుర్గుణవంతున్ = శిశుపాలుని (అని అన్వయించుకొనవలెను)
    ఈ పదమును పద్యంలో యిమద్చలేక పోయితిని.కవి పండితులు మన్నించప్రార్థన.

    రిప్లయితొలగించండి
  4. గుణ హీనుండ ఘుడున్ విమూఢుడు మహాక్రూరాత్ముడౌ నా సుయో
    ధన మిత్రుండగు చైద్యు డెట్లగును వైదర్భీ కరంబందుటల్
    గుణ శోభాయుతుడున్ పరాత్పరుడు గోగోపీ విభుండుండ దు-
    ర్గుణవంతున్ దెగనాడి నాతి వలచెన్ గోవర్ధనోద్ధారకున్.

    రిప్లయితొలగించండి
  5. క్షణమే నాకు మహాయుగంబుగను నాకన్పించె, నన్నేలరా !
    ఫణిరాజాసన గావరా !గతివి నాపాలిందయాళుండవై
    రణరంగంబున గెల్చి,నన్ కరుణతో రక్షింపు రమ్మంచు, దు
    ర్గుణవంతున్ దెగనాడి నాతి వలచెన్ గోవర్ధనోద్ధారకున్.

    రిప్లయితొలగించండి
  6. పొరబాటుగా క్షణమే నాకు అని రాశాను. క్షణమే యైన అని భావన.

    రిప్లయితొలగించండి
  7. విని తా గృష్ణుని రూప శౌర్య గుణ దోర్వీర్యంబులన్ ,రుక్మిణీ
    వనితా రత్నము ప్రేమలో పడి, హరిన్ వాంఛించి ,యా రుక్మి దు
    ర్గుణ వంతున్ దెగ నాడి ,నాతి వలచెన్ - గోవర్ధ నోధ్ధార కుం
    డును విచ్చోసి ,వివాహ మాడెను ఘనుండు గ్రాహవ క్రీడియై

    సుజన-సృజన

    రిప్లయితొలగించండి
  8. 4 - వ పాదం లో ' విచ్చోసి ' టైపాటు . 'విచ్చేసి ' గా చదువ గలరు

    రిప్లయితొలగించండి
  9. రణరంగమ్మున సత్యభామఁ గని విభ్రాంతుండు భూభర్త త
    న్మనమందున్ గొనె రాగభావ పులకమ్మౌ లిప్స; క్రొమ్మున్ గ్రహిం
    చెను హాసమ్మున, సమ్మతించి విభుసత్ స్పృహ్యమ్ము, వేగంబుఁ దు
    ర్గుణవంతున్ దెగనాడి, నాతి వలచెన్ గోవర్ధనోద్ధారకున్.

    ("రుక్మిణి" పూరణకన్నా విభిన్నంగా ప్రయత్నించాలని చేసిన కిట్టుబాటు. దోషాలను మన్నించాలి.)

    రిప్లయితొలగించండి
  10. మీరా బాయి పరంగా ...

    ఘనుడా ద్రౌపది మాన రక్ష కుడినే గానంబుతో మీర 'నా
    తనువే కృష్ణుని కంకితం' బని భువిన్ తా మానసంబందునన్
    మనువాడంగను మానవాధములనే మన్నించకే యిట్టి దు
    ర్గుణవంతున్ దెగనాడి నాతి వలచెన్ గోవర్ధనోద్ధారకున్.

    రిప్లయితొలగించండి
  11. కృష్ణ ప్రియ (ISKCON):

    సణుగుల్ జేయుచు రోజురోజు రసమున్ సాంబారులన్ దెప్పుచున్
    పుణుకుల్ తోడుత మిర్చిబజ్జిలను తా పూజించి భక్షించుచున్
    గొణుగుల్ మీరగ నత్తమామలను భల్ కొండాడకే పారు దు
    ర్గుణవంతున్ దెగనాడి నాతి వలచెన్ గోవర్ధనోద్ధారకున్ :)

    రిప్లయితొలగించండి