6, డిసెంబర్ 2011, మంగళవారం

చమత్కార పద్యాలు - 139

                ఏకాక్షర (ఏకవ్యంజన) శ్లోకం - 2

మామామ మా మమేమామా
మామూమామేమమేమమే
|
మామామేమిమిమేమామ
మమోమామామమామమీ
||


పదవిభాగం -
మామ్, ఆమ, మా, మమ, ఇమాం, ఆమామూమ, అమేం, అమ, ఈం, అమే, అమామ్, అమః, మేమి (మా + ఏమి), మిమే, మామం (మా + అమం), అమః, మామామ (మా + అమామ), మామ్, అమీ.


అన్వయం -
మమ, మా, ఇమాం, మామ్, ఆమ, అమేం (అమా + ఈం), ఈం, అమ్, ఆమామూమ, అమే, మే, అమ, అమామ్, మేమి (మా + ఏమి), అమః, మామం (మా + అమం), మిమే, అమీ, మామ్, మామామ (మా + అమామ).


ప్రతిపదార్థాలు -
మమ = నా యొక్క
మా = బుద్ధి
ఇమాం మామ్ = ఈ లక్ష్మిని
ఆమ = పొందెను.
అమేం -
అమా = సహితురాలైన
ఈం = లక్ష్మి గల
అమ్ = నీ పాదాన్ని
ఆమామూము = ఆశ్రయించాము.
అమే = ఓ దుర్బుద్ధీ (జ్యేష్ఠాదేవీ)!
మే = నాకు
అమ = దూరంగా వెళ్ళు.
అమామ్ = లక్ష్మికంటె వేరైన దేవతను
మా + ఏమి = పొందను.
అమః = బంధరహితుడనై
మా = లక్ష్మి యొక్క
అమమ్ = ప్రాపును
మిమే = అపేక్షిస్తాను.
అమీ = ఈ మేము
మామ్ = ప్రమాణమైన శాస్త్రాన్ని
మా + అమామ = అతిక్రమింపము. 


(శ్రీ శ్రీభాష్యం విజయసారథి గారి ‘ప్రహేళికలు’ సంకలనం నుండి)

5 కామెంట్‌లు:

 1. మాస్టర్ జీ ! 'మా' పద్యం 'మమ్మీ'లాగున మహా గొప్పగా ఆనంద పరచింది.

  రిప్లయితొలగించండి
 2. మామా శ్లోకము ,అర్ధము వ్రాసిన మీ "మా" కు నా జోహార్లు .

  రిప్లయితొలగించండి
 3. హనుమచ్ఛాస్త్రి గారూ,
  సుబ్బారావు గారూ,
  ................. ధన్యవాదాలు!

  రిప్లయితొలగించండి
 4. వసంత కిశోర్ గారూ,
  ధన్యవాదాలు.
  అవి చాటువులు. కవి ఎవరో, ఏకాలానిదో తెలియదు.

  రిప్లయితొలగించండి