నమస్కారం ! మద్యం చాల తక్కువ మంది తమంత తాముగా అలవాటు చేసుకుంటారు , మిగతా వారికంతా ఎవరో స్నేహితులు చెప్పిన చెడుమాటల వల్ల అలవాటు అవుతుంది , అలాంటి ఒక చెడు ప్రబోధమే నా పద్యాలకి వస్తువు ...
మిత్రులారా! ఇప్పటి వరకు వచ్చిన పూరణలను చూచేను. అందరికీ అభినందనలు. విద్యా .... భాగవత .... భారత .... పద్య .. మొదలయిన ఉత్కృష్ట పదములతో ఒక నీచమయిన మాటను ఉపయోగించుట శ్రేయస్కరము కాదు. మన సంస్కృతి యొక్క పవిత్రతను మన నిలబెట్టుకొందాము.
2. ఇచ్చిన సమస్యను మార్చ కూడదు. మద్యమును మధ్యమును అని మార్చేరు శ్రీ రాజారావు గారు.
3. వరప్రసాదు గారి పూరణలో 3వ పాదములో 1 లఘువు ఎక్కువైనది. 4.కళ్యాణ్ గారి సీసము తరువాతి తేటగీతిలో జగతిన్ తరువాత యడాగమము చేసేరు. అలా యడాగమము రాదు. స్వస్తి.
శ్రీపతిశాస్త్రి గారు 'వైద్యుడు సూచన జేయగ మద్యము సేవించువాఁడు మాన్యుఁడు ' అన్నారు బాగుంది. కాని విచారించవలసిన విషయం యేమిటంటే పద్యంలో మొదటిరెండు పాదాలు కేవలం దండగ. అవిలేకపోయినా నష్టంలేదు పద్యభావానికి. అందుచేత ఇంకా ఘట్టిగా రావాలని నా ఉద్దేశం.
వసంత కిశోరులవారూ! 'విద్యామద్యము' అన్నారు. అయ్యయ్యో అనుకున్నాను. మరొక షాక్. ఈ సారి సంపత్కుమారులు 'పద్యామద్యము'. పోనీలెండి - ఇది కొంతలో కొంత నయం. షాక్ మీద షాక్ ' వసంత కిశోరుల వారి భారతమద్యము '. అప్పుడే యేమయింది! పాపం పోతనగారు! ఆయన గుక్కతిప్పుకోకుండా అంబుజోదరదివ్యపాదారవిందచింతనామృతపానవిశేషమత్తచిత్తము అని పేద్ద సమాసంవేసి అమృతపానం అంటే, అయ్యా వసంత కిశోరులవారూ మీరేమిటండీ అన్యాయంగా 'భాగవతం బను మద్యము' అనేశారు. అయితే, యీ స్పెషల్ బ్రాండ్ మద్యాన్ని సేవించే వాడు 'మాన్యుఁడు జగతిన్' అన్నారు - నిజంగా రక్షించేసారు. నేనేదో శ్రీమద్భాగవత మాహాత్మ్యం కావ్యం (http://syamalatadigadapa.blogspot.com/) వ్రాసుకుంటూ ఉన్నవాణ్ణి కాస్తా యీ సమస్యని చూసి అయోమయంలో పడిపోయాను. మీ పూరణ బాగుంది కేవలం పూరణ పరంగా. కాని ఆమధ్య నేమాని వారు సెలవిచ్చినట్లు నవ్వులకునైన భాగవతాన్ని మద్యంతో ఉపమించటమో ఉత్ప్రేక్షించటమో ప్రస్తుతం నేనున్న మూడ్ లో వ్యక్తిగతంగా హర్షించే స్థితిలో లేను. అందుకు క్షమించాలి. చివరాఖరికి 'అధ్యయనామృతమద్యం' అన్నారు. మీషాపులో చాలా వెరైటీ మద్యాలున్నాయే. బాబోయ్.
అన్నట్లు 'పద్యామద్యము' మంచి సరుకు కాదు. అసాధుసమాసం. సాధువే ననుకోవాలంటే పద్యాఽమద్యము (పద్య + అమద్యము) అవుతుంది - భలే అదే బాగుంది లేకపోతే పద్యాన్ని మద్యం అందామనుకున్నారా? చూసారా పద్యశారద యెలా పలికించిందో మీనోట!
నా పూరణలో వైవిధ్యం ఏమీ లేదు. ఏదో పూరణ చెప్పాలి కదా! .... సద్యోయశహీనుం డగు మద్యము సేవించువాఁడు; మాన్యుఁడు జగతిన్ విద్యావినయ సమేతుం డుద్యోగాంచితుఁడు దురిత మొల్లనివాఁడున్.
శ్యామలీయంగారూ నమస్సులు. వైద్యుని సలహా మేరకు మద్యము త్రాగేవారందరూ మహనీయులైపోరు. అట్లైన అవకాశవాదులందరూ నెపము వైద్యుని మీదకు నెట్టి ఇంకా ఎక్కువ త్రాగుతారు. కానీ ప్రజలకొరకు పాటుపడుచూ అనారోగ్యపరిస్థితులలో తప్పని సరియై వైద్యుని సలహా మేరకు (వ్యాధి నయమగు వరకు మాత్రమే) మద్యము పుచ్చుకొన్న వాడు మాన్యుడే కదా అని నా అభిప్రాయము.
వసంత కిశోర్ గారూ, మీ ఆరు పూరణలు బాగున్నాయి. అభినందనలు. కొన్ని పూరణలలో ప్రాసనియమాన్ని ఉల్లంఘించినట్లున్నారు. అయితే అవి అంతగా పట్టించుకోవలసినవి కావు. ద, ధ, థ ప్రాసను కొందరు లాక్షణిలులు అంగీకరించారు. * సంపత్ కుమార్ శాస్త్రి గారూ, బాగుంది మీ పూరణ. అభినందనలు. అది ‘పద్య + అమద్య’మా ? * సుబ్బరావు గారూ, చక్కని పూరణ. అభినందనలు. నాకు తెలిసిన ప్రముఖ ‘అనుభూతివాద’ వచన కవి ఉన్నాడు. ఆయన ‘మద్యం’ సేవిస్తేనే కవిత్వం వ్రాస్తాడట! ‘కాలు నమ్మి ...’ సమస్యకు మీ పూరణ బాగుంది. అభినందనలు. అయితే మృకండుమునిని ‘మృకముని’ అనవచ్చా అని సందేహం. * శ్రీపతి శాస్త్రి గారూ, సిరప్, టానిక్కులలో ఆల్కహాల్ శాతం ఇంత అని ఉంటుంది కదా. అది విషయంగా మీ పూరణ బాగుంది . అభినందనలు. ‘చేయువాడు + ఓషధి’ అన్నప్పుడు సంధి జరిగి యడాగమం రాదు. ‘చేయునాత డోషధివోలెన్’ అందాం. * గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, చక్కని పూరణ. అభినందనలు. * లక్కాకుల వెంకట రాజారావు గారూ, ఒత్తి పలుకుతున్నానని ముందే చెప్పి చేసిన మీ మూడు పూరణలూ బాగున్నాయి. అభినందనలు. చివరగా వ్రాసిన నాల్గవ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు. * చంద్రశేఖర్ గారూ, ఉద్యోగం, సంపాదన లేదు కదా! లోకల్ లిక్కర్ చంద్రభాసురమే దిక్కా? ప్రశస్తంగా ఉంది మీ పూరణ. అభినందనలు. మొదటి పాదంలో గణదోషం. ‘ఉద్యోగ మూడి మతిచెడి’ అంటే సరి! అన్నట్టు ఈమధ్య మిత్రులు ‘గన్నవరపు’ వారు బ్లాగుపైన ‘శీతకన్ను’ వేసినట్టున్నారు. * పండిత నేమాని వారూ, ఆదాయాన్నిచ్చేవాడు కనుక ప్రభుత్వం దృష్టిలో మద్యం సేవించేవాడు మాన్యుడే. ఉత్తమమైన పూరణ చెప్పారు. అభినందనలు. మీ రెండవ పూరణకూడా ప్రశస్తంగా ఉంది. అభినందనలు. * వరప్రసాద్ గారూ, బాగుంది మీ పూరణ. అభినందనలు. మూడవ పాదంలో గణదోషం. ‘సద్యోగము చెడి/విడి తిరుగుచు’ అంటే? * కళ్యాణ్ గారూ, చక్కని పూరణ. అభినందనలు. ‘జనులచె’ .. ‘చే’ను హ్రస్వం చేయరాదు. ‘బుధుల్ ... మాన్పించె’ అన్వయం కుదరడం లేదు. ‘బుధుల్/ మద్యము మన రాష్ట్రమందు మాన్పించిరిగా’ అందామా? తరువాత చెప్పిన మీ రెండు పూరణలూ (అందులో ఒకటి సీసం) చాలా బాగున్నాయి. అభినందనలు. ఎత్తుగీతి మూడవ పాదంలో గణదోషం. ‘ము నితరులకై’ అన్నదాన్ని ‘మును నితరులకై’ అంటే సరి! * మంద పీతాంబర్ గారూ, పరభాషా‘వ్యసనాన్ని’ చక్కగా ప్రస్తావించిన మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు. * మిస్సన్న గారూ, హృద్యమైన పూరణ చెప్పారు. అభినందనలు. మీ రెండవ పద్యం మనోహరంగా ఉంది. ధన్యవాదాలు. * శ్యామల రావు గారూ, సహృదయంతో సద్విమర్శతో అందరి పూరణలను పరామర్శించారు. ధన్యవాదాలు. మీ సూచనలు మా కందరికీ అనుసరణీయం. ధన్యవాదాలు. * రాజేశ్వరి అక్కయ్యా, మీ మొదటి పూరణ అన్నివిధాలా బాగుంది. అభినందనలు. రెండవపూరణలో ప్రాసదోషం, ‘అతడు + ఉల్లము’ అన్నచోట యడాగమం, ‘భార్యతొ’ తోను తొ చేయడం వంటివి ఉన్నాయి. * ఊకదంపుడు గారూ, మీ రెండు పూరణలూ ఉత్తమంగా ఉన్నాయి. అభినందనలు.
అయ్యా ! నేమాని వారూ ,శ్యామలీయంగారూ మీ మీ విమర్శలకు ధన్యవాదములు ! ఇక్కడ కించిత్ అబిప్రాయ భేదం కలుగుతోంది ! ఈ రోజు నా పూరణలను అందరూ మెచ్చుకొనే రీతిగా వ్రాసాననుకున్నాను !
కాని ఇలా అక్షింతల మీద అక్షింతలు పడతాయనుకోలేదు !
నేను మీతో ఏకీభవించలేకున్నాను ! ఎందుకంటే మద్యము అనే పదం ఎంతో నీచమైనది గానూ ఆ నీచ వస్తువుతో మంచి మంచివాటిని పోల్చి అవమానించినట్టు గానూ ఉంది మీ విమర్శ! మద్యమంటే ఒక నీచ వస్తువు మీ దృష్టిలో !
కాని నా దృష్టిలో మత్తు కలిగించే దేదైనా మద్యమే ! ఆ దృష్టితోనే నేను పూరించడం జరిగింది !
అసలు మద్యం ఎలా తయారు చేస్తారు ? అమ్మోనియం నైట్రేట్ కలిపి తయారు చేసిన చీప్ లిక్కరొకటేనా ???
మద్యమంటే పక్వాని కొచ్చిన ద్రాక్షపళ్ళ రసంతో తయారు చేస్తారు ! ఇంకా అనేక విధాలు కనిపెట్టబడి ఉండవచ్చు ఈ రోజుల్లో ! అసలు మద్యానికున్న పర్యాయ పదాలనొకసారి గమనించండి !
అఘ్రేయము,ఆసవము,కాదంబరము, కాదంబరి,కాలిక , గంధవతి ,గంధమాదని,గంధోత్తమ,దేవ సృష్ట,పక్వరసము, ప్రియము,మధువు,మాధవి, మాధురి,వరుణాత్మజ,సీత , సురభి! ఇవి కొన్ని మాత్రమే ! ఒక నీచమైన వస్తువుకు ఇన్ని మంచి పేర్లెలా ఉంటాయి !
పోనీ కాసేపు నీచమే అనుకుందాం ! అది నేను కల్పించినది కాదు ! సమస్య లోనే ఇవ్వబడింది ! దానికొక కావ్య గౌరవం కల్పించాననుకున్నాను మంచివాటితో పోల్చి! అదేగా సమస్యా పూరణమంటే ! ఈ పని ఏ వర్ణన లో నైనా చేస్తే అధిక్షేపించినా, ఆక్షేపించినా బావుంటుంది!
కాని సమస్యలో యివ్వబడిన ఒక నీచ వస్తువుకు సమస్యా పూరణతో గౌరవం కల్పించాను ! సమస్యలో పదాల్ని మార్చ కూడదు గదా ! ద కి వత్తు పెడితే కూడా ఆక్షేపణే గదా !
ఇంతకీ నే చెప్పొచ్చే దేమంటే "మత్తు కలిగించేది మద్యము " అన్న భావనతో నా పూరణలు చేశాను !
పదవ తరగతి చదివేటప్పుడు అన్నీ తెలుకున్నా మనిపిస్తుంది ! కాని పైపైకి చదివే కొద్దీ మనకు తెలిసింది అణుమాత్రమే నన్న సంగతి అవగతమవుతుంది ! అంటే మత్తులో (వ్యామోహం) కూరుకు పోతాము ! ఇంకా ఇంకా తెలుసుకోవాలనే జిఙ్ఞాస పెరుగుతుంది !
నా దృష్టిలో చదువొక వ్యసనం ! మద్యం తాగే వాడు ఇంకా ఇంకా తాగాలను కుంటాడు ! భారత ,భాగవతాలు చదవడం ఒక మత్తు ! పద్య రచన ఒక పిపాస !
మద్యానికి దాన్ని తాగేవాడెలా బానిసౌతాడో ఇవి చదవడం మొదలుపెట్టి వ్యామోహం పెంచుకున్న వాడు కూడా అలాగే బానిసగా మారతాడన్నదే నా దృష్టి కోణం ! చదువుకు బానిసైనవాడు మాన్యుడు గాక మరేమవుతాడు !
ఇందులో భారత భాగవతాల్ని నేనేమీ అవమానించలేదని మనవి !
శిర:కంపో విభాజ్యత్ర, చైవం చర్విత చర్వణం, పద్యం మాద్యంకరం దివ్యం, వర్ధతాం అభివర్ధతాం
అని చెప్పారు. పద్యము కూడా మత్తును కలిగించేదే అనీ, తల వూచటము, పునరుక్తి దోషము లేకుండటము, మత్తును కలిగించిటము అనేవి పద్యసేవనము లోనూ, మద్యసేవనము లోనూ వుంటాయని పూరించారు.
పద్యము వ్రాయవలెనన్న ఉత్సాహము, ఉత్సుకతతో కొన్ని సమాసాలను తప్పుగా ప్రయోగించి వుంటే క్షమించగలరు.
శ్రీ వసంత్ కిశోర్ గారు చెప్పినట్లు, మద్యము అనే పదానికి ఒక భావసారూప్యమైన, ఉన్నతభావాన్ని ప్రదర్శించే విధంగా పూరణ చేద్దామనే ఆలోచనే తప్పితే మరొకటి లేదని సవినయంగా మనవిచేస్తున్నాను. కానీ పెద్దలు చెప్పినట్లు, ఇటువంటివి తప్పు సమాసాలను ( తప్పు అర్థము వచ్చేవి )రాకుండా జాగ్రత్త వహిస్తాను.
వసంత కిశోర్ గారూ, మీ సమాధానం వివరంగా, విశ్లేషణాత్మకంగా ఉంది. ధన్యవాదాలు. ప్రాసవిషయంలో దానిని కొందరు లాక్షణికులు ‘అంగీకరించారు’ అనే కదా నేనన్నది. వ్యతిరేకించారని అనలేదు కదా! అయితే సాధ్యమైనంత వరకు అటువంటి వివాదాస్పదమైన ప్రాసల జోలికి పోకుండా ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. వాస్తవానికి ఇన్ని ప్రాసభేదాలు తరువాతి కాలంలో పుట్టినవే. మహాకవులు తమ రచనల్లో ప్రమాదవశాత్తు ప్రయోగించినవి చూచి లాక్షణికులు ‘ఆర్యవ్యవహారంబులు దుష్టంబులు గ్రాహ్యంబులు’ అన్నట్టుగా వాటికి లక్షణాలను సిద్ధం చేసారు. అంతే కాని ముందే లక్షణం ఉండి దాని ననుసరించి నన్నయాది కవులు ప్రయోగించా రనుకొనడం తప్పు. అయితే నా వ్యాఖ్యలోని ‘నియమోల్లంఘన’ శబ్దాన్ని వెనక్కి తీసుకుంటున్నాను. మీకు కష్టం కలిగించి ఉంటే మన్నించండి. * సంపత్ కుమార్ శాస్త్రి గారూ, చక్కని శ్లోకాన్ని పరిచయం చేసారు. ధన్యవాదాలు.
వసంతకిశోరులవారు మన్నించాలి. మీ పూరణలు నచ్చబట్టే ప్రత్యేకంగా ప్రస్తావించటం జరిగింది. ఒకటిరెండు సందర్భాలలో హర్షించేందుకు నా మనఃస్థతి నిరాకరించిందన్నానే కాని మీ పూరణలో దేంట్లోను సారస్యలోపం చెప్పలేదే.
శ్యామలీయంగారూ ! ధన్యవాదములు ! ఇందులో మన్నించవలసింది యేముంది ! మీరు షాక్ మీద షాక్ అంటే --- భారత భాగవతాల్ని నేనేమీ అవమానించలేదని చెప్పడానికి నా దృష్టి కోణం గమనిస్తారని విషయాన్ని కొంచెం వివరంగా విపులంగా చెప్పవలసి వచ్చింది !
మీ విమర్శలూ సలహాలూ చర్చలూ మాకందరికీ యెప్పుడూ మార్గదర్శకాలే !
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండి01)
______________________________
గద్యమును గారవించుచు
పద్యముపై ప్రేమతోడ - పదుగురి లోనన్
పద్యము రచించి ,విద్యా
మద్యము సేవించువాఁడు - మాన్యుఁడు జగతిన్ !
______________________________
ఆద్యంతంబులనెఱుగక,
రిప్లయితొలగించండిహృద్యమమై పరగు సుకవి కృతిరచనాసం
విద్యారాజము, పద్యా
మద్యము, సేవించువాడు మాన్యుడు జగతిన్.
పద్యముల నల్ల నేరడు
రిప్లయితొలగించండిమద్యము సేవించు వాడు ,మాన్యుడు జగతిన్
హృద్యముగ బాడు మనుజుడు
ఆద్యంతము ముదము జేయు నార్యా రాధ్యా !
కాలు నమ్మి కొలిచి కాలు గెలిచె
రిప్లయితొలగించండి------------
భక్త గణము లందు మృకముని సూనుండ
యధికు డనుట జెల్లు నరయ , నతడు
నాత్మ దృప్తి నెఱసి నమరుండు గా నెంచి
కాలు నమ్మి కొలిచి కాలు గెలిచె
శ్రీగురుభ్యోనమ:
రిప్లయితొలగించండివిద్యావంతుడు, ప్రజకై
ఉద్యమములు జేయువాడు యోషధి వోలెన్
వైద్యుడు సూచన జేయగ
మద్యము సేవించువాఁడు మాన్యుఁడు జగతిన్
సంపత్జీ ! బావుందిమీ పద్యా మద్యం !
రిప్లయితొలగించండిఅవధానులకు అభివందనములతో :
02)
______________________________
సద్యోః గర్భము రీతిని
విద్యావేత్తల నెదుటను - విడుపే లేకన్
పద్యముల నాశుధారను
మద్యము సేవించువాఁడు - మాన్యుఁడు జగతిన్ !
______________________________
హృద్యంబగు రస కవితా
రిప్లయితొలగించండిసేద్యంబున పద్య ఫలపు చెరకు రసంబున్
గద్యము జంబీర మదియె
మద్యము, సేవించువాఁడు మాన్యుఁడు జగతిన్
03)
రిప్లయితొలగించండి______________________________
ఆద్యుడు నన్నయ, వెంటను
మధ్యముడై తిక్కనార్యు - మధుర మధురమౌ
హృద్యం బెర్రన, భారత
మద్యము సేవించువాఁడు - మాన్యుఁడు జగతిన్ !
______________________________
చిన్న సవరణతో..
రిప్లయితొలగించండిహృద్యంబగు రస కవితా
సేద్యంబున పద్యచయము చెరకు రసంబే
గద్యము జంబీర మదియె
మద్యము, సేవించువాఁడు మాన్యుఁడు జగతిన్
04)
రిప్లయితొలగించండి______________________________
మిథ్యా జగమును దాటగ
నుద్యుక్తు లయిన జనులకు - నెమ్మది గలుగున్
తథ్యము ! భాగవతం బను
మద్యము సేవించువాఁడు - మాన్యుఁడు జగతిన్ !
______________________________
నెమ్మది = స్వాస్థ్యము
మద్యము - ను కాస్త గట్టిగా ఒత్తి ...
రిప్లయితొలగించండివేద్యులు నర నారాయణు
లాద్యులుగా యోగ విద్య కా గురు శిష్యుల్
తథ్యము హరి ,గుంతీ సుత
మధ్యము సేవించు వాడు మాన్యుడు జగతిన్
05)
రిప్లయితొలగించండి______________________________
విద్యల నేర్వగ గోరెడు
విద్యార్థులు వెంట వెంట - వివరము లెరుగన్
అధ్యయ నామృత మనియెడు
మద్యము సేవించువాఁడు - మాన్యుఁడు జగతిన్ !
______________________________
అమెరికా కష్టాలు, "ఆ వెధవకంటే ఈ వెధవ నయం" అనుకోమన్న సామెతగా:
రిప్లయితొలగించండిఉద్యోగములూడి మతిచెడి
సద్యోగము లేక సొక్కి చచ్చుట కన్నన్
ఆద్యంతము మౌనమ్ముగ
మద్యము సేవించువాఁడు మాన్యుఁడు జగతిన్!
మద్యమె పెద్దల విందగు
రిప్లయితొలగించండిమద్యమె యాదాయమిచ్చు మన ప్రభుతకు నై
వేద్యం బధికారులకును
మద్యము సేవించువాడె మాన్యుడు జగతిన్
06)
రిప్లయితొలగించండి______________________________
చోద్యంబుగ మారు నయయొ
మద్యము సేవించువాఁడు ! - మాన్యుఁడు జగతిన్
విద్యల గలుగు వివేకము
నాద్యంతము నాచరించు - నరుడే ధరణిన్ !
______________________________
ఓం స్వామియే శరణమయ్యప్ప
రిప్లయితొలగించండిసవరణలకు గురువు గారికి ధన్యవాదములు.
---------
గద్యము వ్రాసిన పూజ్యులు
పద్యము వ్రాయు పురుషుండు పాపాత్ముడులే,
సద్యోగము లేక దిరుగుచు
మద్యము సేవించు వాడు మాన్యుడు జగతిన్|
నమస్కారం !
రిప్లయితొలగించండిఆర్యా ! ఇది నా పూరణ
ఉద్యమముల్ సేసి జనుల్
మద్యము పూర్వము నెల్లెడ మాన్పించెమహిన్
చోద్యము నేడు కలి పెరిగి
మద్యము సేవించువాడె మాన్యుడు జగతిన్
నా పూరణ లో 2 వ పాదంలో దోషం , సవరించిన పద్యమిది
రిప్లయితొలగించండిఉద్యమముల్ సేసి బుధుల్
మద్యము, పూర్వము, జనులచె మాన్పించెమహిన్
చోద్యము నేడు కలి పెరిగి
మద్యము సేవించువాడె మాన్యుడు జగతిన్
గద్యములకు గేయములకు
రిప్లయితొలగించండిపద్యములకు పాటలకును ప్రాణము తెలుగే ,
చోద్యముమరి పరభాషా
మద్యము సేవించు వాడు మాన్యుడు జగతిన్ !!!
కిశోర్జీ నమస్కారం! మీ ఆరోగ్యం త్వరగా మెరుగుపడి మీరు మీ పూరణల పరంపరలను నిరాటంకంగా కొనసాగించాలని మనసారా కోరుకొంటున్నాను
రిప్లయితొలగించండితధ్యము రోగస్థు డగును
రిప్లయితొలగించండిమద్యము సేవించు వాడు - మాన్యుడు జగతిన్
మద్యమునకు దూరముగా
హృద్యముగా బ్రతుకు , ధన్యు డేయుగ మందున్
విద్యాది మహోన్న తములు
మద్యముతో బోల్చ దగవు - మరి యేనాడున్
మద్యము నీచమె , యగునే
మద్యము సేవించు వాడు మాన్యుడు ? జగతిన్
సద్యశము పొందు నేమో
రిప్లయితొలగించండిమద్యము సేవించు వాడు మాన్యుడు జగతిన్
హృద్యము సమస్య కానీ
మద్యము ద్రావింప లేను మాన్యుల చేతన్.
హృద్యము రాజా పూరణ
రిప్లయితొలగించండిపద్య కవిత్వాదు లెపుడు వాణీ రూపౌ
విద్యలు తగదన వానిని
మద్యము సేవించు వాడు మాన్యుడు జగతిన్
నమస్కారం !
రిప్లయితొలగించండిమద్యం చాల తక్కువ మంది తమంత తాముగా అలవాటు చేసుకుంటారు , మిగతా వారికంతా ఎవరో స్నేహితులు చెప్పిన చెడుమాటల వల్ల అలవాటు అవుతుంది , అలాంటి ఒక చెడు ప్రబోధమే నా పద్యాలకి వస్తువు ...
మద్యము కుడుచుట విద్యయె
విద్యలు మరి యనుభవైకవేద్యమవ దగున్
ఉద్యుక్తుడవగుమో యిల
మద్యము సేవించువాడె మాన్యుడు జగతిన్
విడువుము భయమును విడువుము బుధ్ధిని
విడువుము తెలివిని విడుము సిగ్గు
వీడును దుఃఖము వీడును క్లేశము
వేయేల మద్యము పెద్ద వరము
అని పలుకుఖలుల నాదరించగబోకు
వారి మాటలబడి పాపి గాకు
పలుకు తీపిగ నుంచి పరులచెరచనెంచు
కుటిల బుద్ధులకిల కొదవు లేదు
వగచు మద్యము సేవించు వాడె, మాన్యు
డు జగతిన్ యెంచ నిక నెవ్వడు? తన శీల
ము నితరులకై మార్చక ,మోహమువిడి
స్థిరముగ, తన బుద్ధి నదుపు సేయు వాడె
విద్యాది మహోన్నతముల
రిప్లయితొలగించండిమద్యముతో బోల్చదగదు , మరి యేనాడున్
మద్యము నీచమె , యగునే
మద్యము సేవించు వాడు మాన్యుడు ? జగతిన్
మద్యము వద్దుర పాడగు
రిప్లయితొలగించండిమద్యము సేవించువాడు, మాన్యుడు జగతిన్
సద్యోగ పథము నూనుచు
విద్యాధికుడయి చెలగు వివేకి సుధీంద్రా!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమిత్రులారా!
రిప్లయితొలగించండిఇప్పటి వరకు వచ్చిన పూరణలను చూచేను. అందరికీ అభినందనలు.
విద్యా .... భాగవత .... భారత .... పద్య .. మొదలయిన ఉత్కృష్ట పదములతో ఒక నీచమయిన మాటను ఉపయోగించుట శ్రేయస్కరము కాదు. మన సంస్కృతి యొక్క పవిత్రతను మన నిలబెట్టుకొందాము.
2. ఇచ్చిన సమస్యను మార్చ కూడదు. మద్యమును మధ్యమును అని మార్చేరు శ్రీ రాజారావు గారు.
3. వరప్రసాదు గారి పూరణలో 3వ పాదములో 1 లఘువు ఎక్కువైనది.
4.కళ్యాణ్ గారి సీసము తరువాతి తేటగీతిలో జగతిన్ తరువాత యడాగమము చేసేరు. అలా యడాగమము రాదు.
స్వస్తి.
ధన్యవాదాలు గురువుగారు , ఆ యడాగమం తప్పుని సరిజేసుకుంటాను ..
రిప్లయితొలగించండి' గాంచ ' అని మారిస్తే సరిపోతుందనుకుంటాను
శ్రీపతిశాస్త్రి గారు 'వైద్యుడు సూచన జేయగ మద్యము సేవించువాఁడు మాన్యుఁడు ' అన్నారు బాగుంది. కాని విచారించవలసిన విషయం యేమిటంటే పద్యంలో మొదటిరెండు పాదాలు కేవలం దండగ. అవిలేకపోయినా నష్టంలేదు పద్యభావానికి. అందుచేత ఇంకా ఘట్టిగా రావాలని నా ఉద్దేశం.
రిప్లయితొలగించండివసంత కిశోరులవారూ! 'విద్యామద్యము' అన్నారు. అయ్యయ్యో అనుకున్నాను. మరొక షాక్. ఈ సారి సంపత్కుమారులు 'పద్యామద్యము'. పోనీలెండి - ఇది కొంతలో కొంత నయం. షాక్ మీద షాక్ ' వసంత కిశోరుల వారి భారతమద్యము '. అప్పుడే యేమయింది! పాపం పోతనగారు! ఆయన గుక్కతిప్పుకోకుండా అంబుజోదరదివ్యపాదారవిందచింతనామృతపానవిశేషమత్తచిత్తము అని పేద్ద సమాసంవేసి అమృతపానం అంటే, అయ్యా వసంత కిశోరులవారూ మీరేమిటండీ అన్యాయంగా 'భాగవతం బను మద్యము' అనేశారు. అయితే, యీ స్పెషల్ బ్రాండ్ మద్యాన్ని సేవించే వాడు 'మాన్యుఁడు జగతిన్' అన్నారు - నిజంగా రక్షించేసారు. నేనేదో శ్రీమద్భాగవత మాహాత్మ్యం కావ్యం (http://syamalatadigadapa.blogspot.com/) వ్రాసుకుంటూ ఉన్నవాణ్ణి కాస్తా యీ సమస్యని చూసి అయోమయంలో పడిపోయాను. మీ పూరణ బాగుంది కేవలం పూరణ పరంగా. కాని ఆమధ్య నేమాని వారు సెలవిచ్చినట్లు నవ్వులకునైన భాగవతాన్ని మద్యంతో ఉపమించటమో ఉత్ప్రేక్షించటమో ప్రస్తుతం నేనున్న మూడ్ లో వ్యక్తిగతంగా హర్షించే స్థితిలో లేను. అందుకు క్షమించాలి. చివరాఖరికి 'అధ్యయనామృతమద్యం' అన్నారు. మీషాపులో చాలా వెరైటీ మద్యాలున్నాయే. బాబోయ్.
అన్నట్లు 'పద్యామద్యము' మంచి సరుకు కాదు. అసాధుసమాసం. సాధువే ననుకోవాలంటే పద్యాఽమద్యము (పద్య + అమద్యము) అవుతుంది - భలే అదే బాగుంది లేకపోతే పద్యాన్ని మద్యం అందామనుకున్నారా? చూసారా పద్యశారద యెలా పలికించిందో మీనోట!
నా పూరణలో వైవిధ్యం ఏమీ లేదు. ఏదో పూరణ చెప్పాలి కదా! ....
రిప్లయితొలగించండిసద్యోయశహీనుం డగు
మద్యము సేవించువాఁడు; మాన్యుఁడు జగతిన్
విద్యావినయ సమేతుం
డుద్యోగాంచితుఁడు దురిత మొల్లనివాఁడున్.
శ్యామలీయంగారూ నమస్సులు. వైద్యుని సలహా మేరకు మద్యము త్రాగేవారందరూ మహనీయులైపోరు. అట్లైన అవకాశవాదులందరూ నెపము వైద్యుని మీదకు నెట్టి ఇంకా ఎక్కువ త్రాగుతారు. కానీ ప్రజలకొరకు పాటుపడుచూ అనారోగ్యపరిస్థితులలో తప్పని సరియై వైద్యుని సలహా మేరకు (వ్యాధి నయమగు వరకు మాత్రమే) మద్యము పుచ్చుకొన్న వాడు మాన్యుడే కదా అని నా అభిప్రాయము.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅద్యక్ష పదవి కొఱకని
రిప్లయితొలగించండిఉద్యమము సలిపి యలసి యోగ్యుడ ననుచున్ !
హృద్యముగ పొంగి పొరలుచు
మద్యము సేవించు వాఁడు మాన్యుఁడు జగతిన్ !
--------------------------------
సంధ్యా సమయము నుండియు
ఉద్యోగము విడచి యతడు యుల్లము పొంగన్ !
ఉద్యమము నెఱపి భార్యతొ
మద్యము సేవించు వాఁడు మాన్యుఁడు జగతిన్ !
క్షమించాలి ఇక్కడ భార్యతో మద్యం సేవించడం అని కాదు. భార్యతొ పోట్లాడి ఐనా అని "
1)
రిప్లయితొలగించండిమద్యమునుగాచు వారికి
మద్యముతోనోట్లుగెల్చు మాయావులకున్
మద్యమునమ్మెడి వారికి
మద్యము సేవించు వాఁడు మాన్యుఁడు జగతిన్ !
2)
ఛేద్యంబీదుర్వ్యసనమ
వద్యంబంచునెరిగి,తగువైద్యము గొనుటన్
మద్యద్వేషిగ మారిన
మద్యము సేవించు వాఁడు మాన్యుఁడు జగతిన్ !
వసంత కిశోర్ గారూ,
రిప్లయితొలగించండిమీ ఆరు పూరణలు బాగున్నాయి. అభినందనలు.
కొన్ని పూరణలలో ప్రాసనియమాన్ని ఉల్లంఘించినట్లున్నారు. అయితే అవి అంతగా పట్టించుకోవలసినవి కావు. ద, ధ, థ ప్రాసను కొందరు లాక్షణిలులు అంగీకరించారు.
*
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
అది ‘పద్య + అమద్య’మా ?
*
సుబ్బరావు గారూ,
చక్కని పూరణ. అభినందనలు.
నాకు తెలిసిన ప్రముఖ ‘అనుభూతివాద’ వచన కవి ఉన్నాడు. ఆయన ‘మద్యం’ సేవిస్తేనే కవిత్వం వ్రాస్తాడట!
‘కాలు నమ్మి ...’ సమస్యకు మీ పూరణ బాగుంది. అభినందనలు.
అయితే మృకండుమునిని ‘మృకముని’ అనవచ్చా అని సందేహం.
*
శ్రీపతి శాస్త్రి గారూ,
సిరప్, టానిక్కులలో ఆల్కహాల్ శాతం ఇంత అని ఉంటుంది కదా. అది విషయంగా మీ పూరణ బాగుంది . అభినందనలు.
‘చేయువాడు + ఓషధి’ అన్నప్పుడు సంధి జరిగి యడాగమం రాదు. ‘చేయునాత డోషధివోలెన్’ అందాం.
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
చక్కని పూరణ. అభినందనలు.
*
లక్కాకుల వెంకట రాజారావు గారూ,
ఒత్తి పలుకుతున్నానని ముందే చెప్పి చేసిన మీ మూడు పూరణలూ బాగున్నాయి. అభినందనలు.
చివరగా వ్రాసిన నాల్గవ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
*
చంద్రశేఖర్ గారూ,
ఉద్యోగం, సంపాదన లేదు కదా! లోకల్ లిక్కర్ చంద్రభాసురమే దిక్కా?
ప్రశస్తంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
మొదటి పాదంలో గణదోషం. ‘ఉద్యోగ మూడి మతిచెడి’ అంటే సరి!
అన్నట్టు ఈమధ్య మిత్రులు ‘గన్నవరపు’ వారు బ్లాగుపైన ‘శీతకన్ను’ వేసినట్టున్నారు.
*
పండిత నేమాని వారూ,
ఆదాయాన్నిచ్చేవాడు కనుక ప్రభుత్వం దృష్టిలో మద్యం సేవించేవాడు మాన్యుడే. ఉత్తమమైన పూరణ చెప్పారు. అభినందనలు.
మీ రెండవ పూరణకూడా ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
*
వరప్రసాద్ గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
మూడవ పాదంలో గణదోషం. ‘సద్యోగము చెడి/విడి తిరుగుచు’ అంటే?
*
కళ్యాణ్ గారూ,
చక్కని పూరణ. అభినందనలు.
‘జనులచె’ .. ‘చే’ను హ్రస్వం చేయరాదు. ‘బుధుల్ ... మాన్పించె’ అన్వయం కుదరడం లేదు.
‘బుధుల్/ మద్యము మన రాష్ట్రమందు మాన్పించిరిగా’ అందామా?
తరువాత చెప్పిన మీ రెండు పూరణలూ (అందులో ఒకటి సీసం) చాలా బాగున్నాయి. అభినందనలు.
ఎత్తుగీతి మూడవ పాదంలో గణదోషం. ‘ము నితరులకై’ అన్నదాన్ని ‘మును నితరులకై’ అంటే సరి!
*
మంద పీతాంబర్ గారూ,
పరభాషా‘వ్యసనాన్ని’ చక్కగా ప్రస్తావించిన మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
*
మిస్సన్న గారూ,
హృద్యమైన పూరణ చెప్పారు. అభినందనలు.
మీ రెండవ పద్యం మనోహరంగా ఉంది. ధన్యవాదాలు.
*
శ్యామల రావు గారూ,
సహృదయంతో సద్విమర్శతో అందరి పూరణలను పరామర్శించారు. ధన్యవాదాలు. మీ సూచనలు మా కందరికీ అనుసరణీయం. ధన్యవాదాలు.
*
రాజేశ్వరి అక్కయ్యా,
మీ మొదటి పూరణ అన్నివిధాలా బాగుంది. అభినందనలు.
రెండవపూరణలో ప్రాసదోషం, ‘అతడు + ఉల్లము’ అన్నచోట యడాగమం, ‘భార్యతొ’ తోను తొ చేయడం వంటివి ఉన్నాయి.
*
ఊకదంపుడు గారూ,
మీ రెండు పూరణలూ ఉత్తమంగా ఉన్నాయి. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపీతాంబరధరా ! మీ పరామర్శకు ధన్యవాదములు !
రిప్లయితొలగించండిశంకరార్యా ! ధన్యవాదములు !
అయ్యా ! నేమాని వారూ ,శ్యామలీయంగారూ
రిప్లయితొలగించండిమీ మీ విమర్శలకు ధన్యవాదములు !
ఇక్కడ కించిత్ అబిప్రాయ భేదం కలుగుతోంది !
ఈ రోజు నా పూరణలను అందరూ మెచ్చుకొనే రీతిగా
వ్రాసాననుకున్నాను !
కాని ఇలా అక్షింతల మీద అక్షింతలు పడతాయనుకోలేదు !
నేను మీతో ఏకీభవించలేకున్నాను !
ఎందుకంటే మద్యము అనే పదం ఎంతో
నీచమైనది గానూ ఆ నీచ వస్తువుతో
మంచి మంచివాటిని పోల్చి
అవమానించినట్టు గానూ ఉంది మీ విమర్శ!
మద్యమంటే ఒక నీచ వస్తువు మీ దృష్టిలో !
కాని నా దృష్టిలో మత్తు కలిగించే దేదైనా మద్యమే !
ఆ దృష్టితోనే నేను పూరించడం జరిగింది !
అసలు మద్యం ఎలా తయారు చేస్తారు ?
అమ్మోనియం నైట్రేట్ కలిపి తయారు చేసిన చీప్ లిక్కరొకటేనా ???
మద్యమంటే పక్వాని కొచ్చిన ద్రాక్షపళ్ళ రసంతో తయారు చేస్తారు !
ఇంకా అనేక విధాలు కనిపెట్టబడి ఉండవచ్చు ఈ రోజుల్లో !
అసలు మద్యానికున్న పర్యాయ పదాలనొకసారి గమనించండి !
అఘ్రేయము,ఆసవము,కాదంబరము, కాదంబరి,కాలిక ,
గంధవతి ,గంధమాదని,గంధోత్తమ,దేవ సృష్ట,పక్వరసము,
ప్రియము,మధువు,మాధవి, మాధురి,వరుణాత్మజ,సీత , సురభి!
ఇవి కొన్ని మాత్రమే !
ఒక నీచమైన వస్తువుకు ఇన్ని మంచి పేర్లెలా ఉంటాయి !
పోనీ కాసేపు నీచమే అనుకుందాం !
అది నేను కల్పించినది కాదు !
సమస్య లోనే ఇవ్వబడింది !
దానికొక కావ్య గౌరవం కల్పించాననుకున్నాను మంచివాటితో పోల్చి!
అదేగా సమస్యా పూరణమంటే !
ఈ పని ఏ వర్ణన లో నైనా చేస్తే అధిక్షేపించినా, ఆక్షేపించినా బావుంటుంది!
కాని సమస్యలో యివ్వబడిన ఒక నీచ వస్తువుకు సమస్యా పూరణతో
గౌరవం కల్పించాను !
సమస్యలో పదాల్ని మార్చ కూడదు గదా !
ద కి వత్తు పెడితే కూడా ఆక్షేపణే గదా !
ఇంతకీ నే చెప్పొచ్చే దేమంటే
"మత్తు కలిగించేది మద్యము "
అన్న భావనతో నా పూరణలు చేశాను !
పదవ తరగతి చదివేటప్పుడు అన్నీ తెలుకున్నా మనిపిస్తుంది !
కాని పైపైకి చదివే కొద్దీ మనకు తెలిసింది
అణుమాత్రమే నన్న సంగతి అవగతమవుతుంది !
అంటే మత్తులో (వ్యామోహం) కూరుకు పోతాము !
ఇంకా ఇంకా తెలుసుకోవాలనే జిఙ్ఞాస పెరుగుతుంది !
నా దృష్టిలో
చదువొక వ్యసనం !
మద్యం తాగే వాడు ఇంకా ఇంకా తాగాలను కుంటాడు !
భారత ,భాగవతాలు చదవడం ఒక మత్తు !
పద్య రచన ఒక పిపాస !
మద్యానికి దాన్ని తాగేవాడెలా బానిసౌతాడో
ఇవి చదవడం మొదలుపెట్టి వ్యామోహం పెంచుకున్న వాడు కూడా
అలాగే బానిసగా మారతాడన్నదే నా దృష్టి కోణం !
చదువుకు బానిసైనవాడు మాన్యుడు గాక మరేమవుతాడు !
ఇందులో భారత భాగవతాల్ని నేనేమీ అవమానించలేదని మనవి !
చిత్తగించ గలరు !
ఒకానొక అవధానములో పద్యసేవనమును మద్యసేవనముతో పోల్చమని అడుగగా అవధాని గారు,
రిప్లయితొలగించండిశిర:కంపో విభాజ్యత్ర, చైవం చర్విత చర్వణం,
పద్యం మాద్యంకరం దివ్యం, వర్ధతాం అభివర్ధతాం
అని చెప్పారు. పద్యము కూడా మత్తును కలిగించేదే అనీ, తల వూచటము, పునరుక్తి దోషము లేకుండటము, మత్తును కలిగించిటము అనేవి పద్యసేవనము లోనూ, మద్యసేవనము లోనూ వుంటాయని పూరించారు.
పద్యము వ్రాయవలెనన్న ఉత్సాహము, ఉత్సుకతతో కొన్ని సమాసాలను తప్పుగా ప్రయోగించి వుంటే క్షమించగలరు.
శ్రీ వసంత్ కిశోర్ గారు చెప్పినట్లు, మద్యము అనే పదానికి ఒక భావసారూప్యమైన, ఉన్నతభావాన్ని ప్రదర్శించే విధంగా పూరణ చేద్దామనే ఆలోచనే తప్పితే మరొకటి లేదని సవినయంగా మనవిచేస్తున్నాను. కానీ పెద్దలు చెప్పినట్లు, ఇటువంటివి తప్పు సమాసాలను ( తప్పు అర్థము వచ్చేవి )రాకుండా జాగ్రత్త వహిస్తాను.
శ్రీ శ్యామలీయం గారికి, గురువు గారికి ధన్యవాదములు.
_____________________________________________
రిప్లయితొలగించండిప్రాసమైత్రి - 4
13) స్వవర్గజ ప్రాస -
ఏకవర్గానికి చెందడం వల్ల, బాహ్యప్రయత్నంలో మహాప్రాణాలుగా ఉండడం చేత థ, ధలు, ఘోషాలు అవడం వల్ల ద,ధలు ప్రాసమైత్రికి చెల్లుతాయి.
ఉదా.
(అ).
సింధురము మహోద్రేక మ
దాంధంబై వచ్చులీల నాచార్యునిపై
గంధవహసుతుఁడు గవియ న
మంథరగతి నెవ్వఁ డాఁగు మనయోధులలోన్. (భార. ద్రోణ. 1-88)
(ఆ).
కా దన కిట్టిపాటి యపకారముఁ దక్షకుఁ డేకవిప్రసం
బోధనఁ జేసి చేసె నృపపుంగవ .... (భార. ఆది. 1-124)
(ఇ).
బాంధవసౌహృదప్రణయ భక్తివిశేషము లొప్ప నీమనో
గ్రంథి యడంగఁ జేయ నెసకంబునఁ బూనినవారు ... (భార. ఆర. 4-160)
14) ఋప్రాస -................................
_____________________________________________
శంకరార్యా ! మీరు చెప్పిన పాఠమిది !
భారతంలోనుండి ఉదాహరణలు కూడా యిచ్చారు !
ఒక్క లాక్షణికుడైనా వ్యతిరేకించిన దాఖలా లేదు !
మరి యెవరు వ్యతిరేకించినట్టు ?
వసంత కిశోర్ గారూ,
రిప్లయితొలగించండిమీ సమాధానం వివరంగా, విశ్లేషణాత్మకంగా ఉంది. ధన్యవాదాలు.
ప్రాసవిషయంలో దానిని కొందరు లాక్షణికులు ‘అంగీకరించారు’ అనే కదా నేనన్నది. వ్యతిరేకించారని అనలేదు కదా! అయితే సాధ్యమైనంత వరకు అటువంటి వివాదాస్పదమైన ప్రాసల జోలికి పోకుండా ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం.
వాస్తవానికి ఇన్ని ప్రాసభేదాలు తరువాతి కాలంలో పుట్టినవే. మహాకవులు తమ రచనల్లో ప్రమాదవశాత్తు ప్రయోగించినవి చూచి లాక్షణికులు ‘ఆర్యవ్యవహారంబులు దుష్టంబులు గ్రాహ్యంబులు’ అన్నట్టుగా వాటికి లక్షణాలను సిద్ధం చేసారు. అంతే కాని ముందే లక్షణం ఉండి దాని ననుసరించి నన్నయాది కవులు ప్రయోగించా రనుకొనడం తప్పు.
అయితే నా వ్యాఖ్యలోని ‘నియమోల్లంఘన’ శబ్దాన్ని వెనక్కి తీసుకుంటున్నాను. మీకు కష్టం కలిగించి ఉంటే మన్నించండి.
*
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
చక్కని శ్లోకాన్ని పరిచయం చేసారు. ధన్యవాదాలు.
వసంతకిశోరులవారు మన్నించాలి. మీ పూరణలు నచ్చబట్టే ప్రత్యేకంగా ప్రస్తావించటం జరిగింది. ఒకటిరెండు సందర్భాలలో హర్షించేందుకు నా మనఃస్థతి నిరాకరించిందన్నానే కాని మీ పూరణలో దేంట్లోను సారస్యలోపం చెప్పలేదే.
రిప్లయితొలగించండిశంకరార్యా ! ధన్యవాదములు !
రిప్లయితొలగించండిఇందులో కష్టం కలిగించేదీ మన్నించవలసిందీ యేముంది !
విషయ కౌతుకం ! అంతే !
అంతకు మించి యేమీ లేదు !
శ్యామలీయంగారూ ! ధన్యవాదములు !
రిప్లయితొలగించండిఇందులో మన్నించవలసింది యేముంది !
మీరు షాక్ మీద షాక్ అంటే ---
భారత భాగవతాల్ని నేనేమీ అవమానించలేదని చెప్పడానికి
నా దృష్టి కోణం గమనిస్తారని
విషయాన్ని కొంచెం వివరంగా విపులంగా
చెప్పవలసి వచ్చింది !
మీ విమర్శలూ సలహాలూ చర్చలూ
మాకందరికీ యెప్పుడూ మార్గదర్శకాలే !
పద్యములబ్బవు పాటలు
రిప్లయితొలగించండిమద్యము సేవించకున్న మహలింగముదౌ
చోద్యపు పిల్లన గ్రోవికి;
మద్యము సేవించువాఁడు మాన్యుఁడు జగతిన్
మహలింగము = T. R. Mahalingam
గద్యము వ్రాయుట నేర్వక
రిప్లయితొలగించండిసద్యశమందగను కోరి చంపుచు ప్రజలన్
పద్యములల్లుచు కవితా
మద్యము సేవించువాఁడు మాన్యుఁడు జగతిన్ :)