5, డిసెంబర్ 2011, సోమవారం

చమత్కార పద్యాలు - 138

ఢాలబంధం

                                                   (చిత్రంపైన క్లిక్ చేయండి. పెద్దగా కనిపిస్తుంది)
ఆ.వె.
రమ్యసుగుణధామ! రావణసంహార!
రఘుకులాబ్ధిచంద్ర! యఘవిదార!
రక్తితోడ నిన్ను ప్రార్థింతు మనసార
రమ్ము నన్ను బ్రోవ రామ! ధీర!

6 కామెంట్‌లు:

 1. మాస్టరు గారూ ! రామయ్య మీద వెయ్యి "డాల " రుల "విలువైన" పద్యం చెప్పారండీ.

  రిప్లయితొలగించండి
 2. శంకరార్యా ! చక్కగా నున్నది !
  దీన్ని బంధ కవిత్వ మంటారా ? చిత్ర కవిత్వ మంటారా ?
  రెండూ ఒకటేనా ?

  రిప్లయితొలగించండి
 3. చింతా రామకృష్ణారావు గారి వ్యాఖ్య ......
  మాన్యులు శంకరయ్యగారు చేసిన ఢాల బంధ రచన చూచుట వలన కలిగిన ప్రేరణతో నేను వ్రాసిన ఢాల బంధము గమనింప మనవి.
  గీ:-
  రమ్య గుణ ధాము శ్రీరఘు రాము గనర!
  రక్ష గొలిపెడు నామము రామ వినర!
  రశ్మినొడఁ గూర్చు నక్షర రామ యనర!
  రత్న కాంతులు వెదజల్లు రాము గొనర.

  రిప్లయితొలగించండి
 4. హనుమచ్ఛాస్త్రి గారూ,
  ధన్యవాదాలు.
  *
  వసంత కిశోర్ గారూ,
  ధన్యవాదాలు. చిత్రకవిత్వంలోని వివిధప్రక్రియలలో బంధకవిత్వం ఒకటి. దీనిని గురించి వీలైతే ఒకపాఠం పెడతాను.
  *
  చింతా రామకృష్ణారావు గారూ,
  ధన్యవాదాలు. మీ ఢాలబంధం బాగుంది.

  రిప్లయితొలగించండి
 5. నమస్కారములు.
  చాలా బాగుంది తమ్ముడు ! చింతా వారి " ఆంద్రామృతంలో " కుడా బంధ కవిత్వాలు చాలా ఉన్నాయి . ఎంతో ఆనందంగా ఉంది. మీరు పాఠాలు పెడితే , కొంతైనా నేర్చు కొ గలనేమో అన్న ఆశ . ధన్య వాదములు

  రిప్లయితొలగించండి