ఏకాక్షర శ్లోకం
యాయాయాయాయాయాయాయా
యాయాయాయాయాయాయాయా |
యాయాయాయాయాయాయాయా
యాయాయాయాయాయాయాయా ||
పదవిభాగం
యాయాయా, ఆయ, ఆయాయ, అయాయ, అయాయ, అయాయ, అయాయ, అయాయ, ఆయాయాయ, ఆయాయాయ, ఆయాయా, యా, యా, యా, యా, యా, యా, యా, యా.
తాత్పర్యం
భగవంతునికి అలంకారమైన ఈ పాదుకలు మనకు అన్ని శుభాలను కలిగిస్తాయి. సర్వరోగాలను హరిస్తాయి. నిరంతరం అతని సన్నిధిలో ఉండాలనే మన కోరికను సఫలం చేసే జ్ఞానాన్ని చేకూర్చుతాయి. ఈ పాదుకల వలన మనం ప్రపంచంలోని అన్ని ప్రదేశాలకూ చేరుకోవచ్చు. అటువంటి మహిమాన్వితమైన ప్రభుపాదుకలకు వందనం.
(శ్రీ వేదాంత దేశికుల ‘పాదుకాసహస్రం’ నుండి)
pitsuburgu
రిప్లయితొలగించండి---------
చూసితి పేలసు గోల్డును
చూసితి ప్రభు పాద గురుని చూసితి కృష్ణున్
చూసితి భక్తుల నృత్యము
చూసితి మఱి రాజ హంస చూడ్కులు ,నడకల్
ప్రభు పాదుకలకు నమస్కారము.
రిప్లయితొలగించండిచూసితి ప్రభు పాద గురుని చూసితి కృష్ణున్
రిప్లయితొలగించండి_________________________________
Thats Wheeling WV :)
శ్రీరాముని ప్రతినిధిగా
రిప్లయితొలగించండిధారుణి పాలనమొనర్చి ధర్మనిరతితో
పేరొందిన పాదుకలకు
సారమతిన్ ప్రణతులిడుచు సలిపెద భజనల్
ఓ పాదుకలారా మీ యదృష్టము నేమని వర్ణించ వచ్చును
రిప్లయితొలగించండికం. నిరతము నా కమలాసతి
కరకమలము లొత్తు పాద కమలంబుల శ్రీ
కరముల కరమనురక్తిని
భరియింతురు ప్రేమ మీరు పాదుకలారా
కం. లోకంబులు మూడింటిని
తాకుచు నిలచినవి యైన పాదంబు లహో
మీకే దక్కెను దాల్చగ
మీ కబ్బిన భాగ్యమునకు మేరయు గలదే
ఇంతటి సేవ జేయు నదృష్టము పొందిన భాగ్యశాలి యా శేషుడే నేమో కదా!
కం. గడసరి యగు నా శేషుడు
విడువడుగా సామి నొక్క విఘడియయును నా
తడు హరి కన్నియు తానగు
పడకయగున్ దోమతెరయు పాదుకలునగున్
రండు. అందరును హరి పాదుకలను తనివితీర దర్శించి మనసా స్పృశించి తరించుడు.
కం. పాదుకలా అవి జీవుల
వేదన లడగించు దొడ్డ వేదికలా నిం
పాదిగ తాకుడయా సం
పాదించుడయా విశేష ఫలమున్ ముక్తిన్
శ్రీ శ్యామలరావు గారి పాదుకాస్తవము బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిసుబ్బారావు గారు, నేమానివారు, శ్యామలరావు గారు పాదుకలపై చెప్పిన పద్య పాదములు భక్తిని పాదు గొలుపు చున్నవి.
రిప్లయితొలగించండిసుబ్బారావు గారూ,
రిప్లయితొలగించండిచక్కని పద్యం చెప్పారు. ధన్యవాదాలు.
*
వెలమకంటి భరద్వాజ్ గారూ,
ధన్యవాదాలు.
*
పండిత నేమాని గారూ,
ధన్యవాదములు. మంచి పద్యం చెప్పారు.
*
శ్యామల రావు గారూ,
మీ చేత ‘పాదుకలు’ శీర్షికతో ఒక ఖండకావ్య రూపకల్పన జరిగింది. ధన్యోస్మి!
ముఖ్యంగా చివరి పద్యం ఉత్తమంగా ఉంది. ధన్యవాదాలు.
భరతుడు శిరమున దాలిచి
రిప్లయితొలగించండిపరమ పవిత్ర మైన పాదుక లనుచున్ !
కరములు జోడించి యతడు
ధరణిని పాలించ దొడగె ధార్మిక నిరతిన్ !
తప్పులుంటే సోదరులు క్షమించాలి . [ పరమ పవిత్ర మైన శ్రీ రామ పాదములకు ప్రణామములు ]
రాజేశ్వరి అక్కయ్యా,
రిప్లయితొలగించండిరామపాదుకల మీద చక్కని పద్యం చెప్పారు. ధన్యవాదాలు.
తప్పులుండాలి కదా నేను సవరించడానికి ... :-)
రెండవ పాదంలో ‘పవిత్రమైన’ అన్నచోట గణదోషం. ‘పవిత్రమ్ములైన’ అంటే సరి!
శ్యామలీయం గారూ అనిర్వచనీయం.
రిప్లయితొలగించండిఒక్క పాదము సద్గతి నుంచు నరుని
ఒక్క పాదుక దాటించు నుర్వి భవము
ఒక్క హరి యేలు నెల్లరి యుల్లములను
ఒక్క యక్షర ప్రణవమే ఓం శుభమ్ము.
మిస్సన్న గారూ,
రిప్లయితొలగించండిమంచి పద్యం చెప్పారు. ధన్యవాదాలు.
క్రొత్త సంవత్సరంలో మనకన్నీ శుభాలే కలుగాలని ఆశిద్దాం.