ఆదిత్య స్తోత్రము
సీ.
సూర్యనారాయణా! శుద్ధ తేజోనిధీ!
వందనమ్మో సదానందమూర్తి!
సకల లోకములలో చైతన్య తేజంబు
ప్రసరింపజేయు దివ్య స్వరూప!
ఆదిదేవా! జగదాధార! భాస్కరా!
ఆదిత్య! ధ్యానింతు నాత్మరూప!
సృష్టికర్తవు దేవ! శ్రితజనపాలకా!
వేదమూర్తివి రవీ! విమలతేజ!
భువనపాలకుడవు పుష్కరబాంధవా!
వాసుదేవ! దినేశ! పద్మినీశ!
ప్రళయకారకుడవు, ప్రణవవాచ్యుడవీవు
అష్టమూర్తివి పూష! ఆదితేయ!
త్రిజగదాప్తుండవు దివ్యగాత్రుండవు
విశ్వసాక్షివి మిత్ర! విబుధవంద్య!
గ్రహనాయకుడవు త్రికాల నియంతవు
కాంతిమంతుడవు ప్రజ్ఞానరాశి
చైతన్య కారక!జ్ఞానతేజోనిధి!
అజ్ఞాన తిమిరాపహారి! ద్యుమణి!
ఆరోగ్యదాత వాశ్రిత కల్ప భూజంబు
దృష్టిప్రదాతవు దేవ దేవ!
సింహరాశ్యధిపతి! సైంహికేయారాతి
ఆకాశగమనుడ వరుణ వర్ణ!
ధర్మ సంరక్షక! దానవ నాశక!
తత్త్వవేత్తవు శ్రితత్రాత వర్క!
ఆ.వె.
నీ స్తవమునొనర్చి నీదు సేవలు చేసి
నిన్ను నాశ్రయించు నిర్మలులకు
శాంతి సౌఖ్యములను సద్గతులనొసంగు
భద్రరూప! నీకు వందనములు
రచన - శ్రీ పండిత నేమాని రామజోగి సన్యాసి రావు గారు
సీ.
సూర్యనారాయణా! శుద్ధ తేజోనిధీ!
వందనమ్మో సదానందమూర్తి!
సకల లోకములలో చైతన్య తేజంబు
ప్రసరింపజేయు దివ్య స్వరూప!
ఆదిదేవా! జగదాధార! భాస్కరా!
ఆదిత్య! ధ్యానింతు నాత్మరూప!
సృష్టికర్తవు దేవ! శ్రితజనపాలకా!
వేదమూర్తివి రవీ! విమలతేజ!
భువనపాలకుడవు పుష్కరబాంధవా!
వాసుదేవ! దినేశ! పద్మినీశ!
ప్రళయకారకుడవు, ప్రణవవాచ్యుడవీవు
అష్టమూర్తివి పూష! ఆదితేయ!
త్రిజగదాప్తుండవు దివ్యగాత్రుండవు
విశ్వసాక్షివి మిత్ర! విబుధవంద్య!
గ్రహనాయకుడవు త్రికాల నియంతవు
కాంతిమంతుడవు ప్రజ్ఞానరాశి
చైతన్య కారక!జ్ఞానతేజోనిధి!
అజ్ఞాన తిమిరాపహారి! ద్యుమణి!
ఆరోగ్యదాత వాశ్రిత కల్ప భూజంబు
దృష్టిప్రదాతవు దేవ దేవ!
సింహరాశ్యధిపతి! సైంహికేయారాతి
ఆకాశగమనుడ వరుణ వర్ణ!
ధర్మ సంరక్షక! దానవ నాశక!
తత్త్వవేత్తవు శ్రితత్రాత వర్క!
ఆ.వె.
నీ స్తవమునొనర్చి నీదు సేవలు చేసి
నిన్ను నాశ్రయించు నిర్మలులకు
శాంతి సౌఖ్యములను సద్గతులనొసంగు
భద్రరూప! నీకు వందనములు
రచన - శ్రీ పండిత నేమాని రామజోగి సన్యాసి రావు గారు
స్వామియె శరణం
రిప్లయితొలగించండిశ్రీ పండిత నేమాని గురువు గారికి ధన్యవాదములు
మీ ఆదిత్య స్తోత్రము చాలా బాగున్నది. ఈస్తోత్రము పఠియింప తప్పక ఆ తేజోనిధీ సద్గతులనొసంగును
శంకరార్యా ! చక్కని పద్యం ! ధన్యవాదములు !
రిప్లయితొలగించండిపండిత నేమాని వారూ,
రిప్లయితొలగించండిబ్లాగు మిత్రులకు ‘ఆదిత్యస్తోత్రము’ నందించిన మీకు నమస్కృతులు, ధన్యవాదాలు.
*
వరప్రసాద్ గారూ, వసంత కిశోర్ గారూ,
ధన్యవాదాలు.