2, డిసెంబర్ 2011, శుక్రవారం

సమస్యా పూరణం - 546 (అన్నభార్య వదిన)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది
అన్నభార్య వదిన యగుట కల్ల!

55 కామెంట్‌లు:

  1. వదిన యన్నయన్న భార్యయై యుండును
    భార్య యనిన వామ భాగ మగును
    కాదనన్నలేదు లేదన్న నే విన
    నన్న, భార్య వదిన యగుట కల్ల!

    రిప్లయితొలగించండి
  2. అందరికీ వందనములు !

    01)
    _____________________________________

    అన్న భార్య వదిన - యగుటన్న నిజమది
    అమ్మ కేమొ కోడ - లగును గనిన !
    అక్క మగడు బావ - ఐనచో, మరి బావ
    యన్న భార్య వదిన - యగుట కల్ల!
    _____________________________________

    రిప్లయితొలగించండి
  3. తనదు చెల్లి యెడల తగురీతి ప్రేమను
    జూపు చున్న వేళ; చూరగొనియె
    నాదరమ్ము , నిక్కమమ్మయె మఱిదికి
    యన్న భార్య వదిన యగుట కల్ల.

    తన చెల్లిని ప్రేమగా చూచుకొంటున్న వదిన , మఱిది మనసులో అమ్మగా ఆదరము పొందుతుంది కానీ వట్టి వదినగా మాత్రమే కాదనుట.

    రిప్లయితొలగించండి
  4. తండ్రి భార్య తల్లి, తమ్ముని బార్యయె
    మరదలగును, అత్త మామ భార్య
    అన్నభార్య వదిన యగుట కల్లయె కాదు
    తెలియ వరుస లన్ని తేట పడును.

    రిప్లయితొలగించండి
  5. ధార వాహికందు తాననెనొక్కడు
    ప్రేమ నాదు 'లవరు' ప్రేమ నాదు
    'పవరు' నాకె యగును భార్యగ యేనాడు
    'అన్నభార్య' 'వదిన' యగుట కల్ల

    రిప్లయితొలగించండి
  6. వెంకట రాజారావు . లక్కాకులశుక్రవారం, డిసెంబర్ 02, 2011 9:18:00 AM

    అన్న భార్య వదిన యగుట - కల్లదిగొ శ్రీ
    రామ చరిత సాక్ష్య మై మెలంగు
    వదిన తల్లి యగును వనిత సీతమ్మయు
    లక్ష్మణుండు సాక్షి లక్షణముగ

    సుజన-సృజన

    రిప్లయితొలగించండి
  7. -----------------------------------------
    అన్న భార్య వదిన యగుట కల్ల
    యనెడి వారిని చూడ లేదయ్య! నెచట
    చూచు చుంటిని నిప్పుడె చోద్య మలర
    వినుత గుణ శీల ! మాటలు వేయు నేల?

    రిప్లయితొలగించండి
  8. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ మొదటి రెండు చాలా బాగున్నాయి. అభినందనలు.
    మూడవపూరణలో భావం కొంత గందరగోళంగా ఉంది. మళ్ళీ మళ్ళీ చదివినా అవగాహనకు రావడం లేదు. కొద్దిపాటి వివరణ ఇస్తే బాగుంటుందేమో!
    మొదటి పూరణలో ‘వదిన యన్నన్ + అన్న- వదిన యన్న నన్న...’ అవుతుంది. యడాగమం రాదు. అలాగే ‘కాదని + అన్న’ అన్నప్పుడు యడాగమం వచ్చి ‘కాదని యన్న’ అవుతుంది. అక్కడ ‘కాదనంగ లేదు’ అంటే సరి!
    వరుసబెట్టి వరుసలు తెల్పిన మీ రెండవ పూరన ఉత్తమంగా ఉంది.
    *
    వసంత కిశోర్ గారూ,
    మీ ‘మొదటి’ (01) పూరణ బాగుంది. బావ భార్య ఐనా, బావ అన్న భార్య ఐనా వదిన కాదు. నిజమే. చక్కని పూరణ. అభినందనలు.
    *
    మందాకిని గారూ,
    తల్లి వంటి వదిన గురించిన మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    ‘రాముని బుద్ధిమంతనం’ అనే శరత్ బాబు నవల ‘మా వదిన’ పేరుతో సినిమాగా వచ్చింది. అందులో వదిన నటించిన కృష్ణకుమారి మరిదిని కొడుకుగానే చూస్తుంది. ఎప్పుడో చిన్నప్పుడు చూసిన సినిమా. నాకూ అలాంటి వదిన రావాలని కోరుకొనేవాణ్ణి. ఆ చిత్రంలో ‘కలలు గనే వేళ యిదే కన్నయ్యా, కలతమాని తీపి నిదుర పోవయ్యా’ అనే పాట నాకెంతో ఇష్టం. దానికోసం ఎంత ప్రయత్నించినా దొరకలేదు.
    *
    లక్కాకుల వెంకట రాజారావు గారూ,
    సీతమ్మ ప్రస్తావనతో అద్భుతమైన పూరణ నిచ్చారు. అభినందనలు.
    ‘కల్లదిగొ’ అన్వయం కుదురుతున్నట్లు లేదు. ‘కల్లదిగొ శ్రీ’ అన్నచోట ‘కల్లయె గాదు’ అంటే ఎలా ఉంటుందంటారు?
    *
    సుబ్బారావు గారూ,
    మంచి ఊహతో పూరణ చేసారు. బాగుంది. అయితే సమస్య పాదం ఆటవెలదిలో ఉంటే మీరు మిగతా పాదాలు తేటగీతిలో వ్రాసారు. మీ పద్యాన్ని ఆటవెలదికి మార్చే నా ప్రయత్నం ....

    అన్న భార్య వదిన యగుట కల్ల యనుచు
    ననెడి వారిఁ జూడ నైతి నెచట
    చూచు చుంటి నిపుడె చోద్య మలరుచుండ
    వినుత గుణ! నుడులు వేయు నేల?
    *
    ‘మనతెలుగు’ చంద్రశేఖర్ గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    మొదటి పాదంలో గణదోషం. సవరించండి.

    రిప్లయితొలగించండి
  9. శ్యామలరావు గారూ,
    మీ రెండు పూరణలూ బాగున్నాయి కదా! ఎందుకు తొలగించారు?

    రిప్లయితొలగించండి
  10. అన్నగారిభార్య యగునేని వదినెయౌ
    వావివరుస లున్న వదినయగును
    ముక్కు మొగ మెఱుగని పొరుగింటి పుల్లయ్య
    అన్నభార్య వదిన యగుట కల్ల!

    రిప్లయితొలగించండి
  11. 2.
    ఏమి మీ సమస్య యెందుకు సందియం
    బెన్న డేని యెచట నేని గాని
    తాళిక ట్టి నట్టి యాలికి స్వయముగా
    అన్నభార్య వదిన యగుట కల్ల!

    రిప్లయితొలగించండి
  12. శంకరయ్యగారు, ఇవి పంపుతుండగా, ఆఫీసు అర్జెన్సీ. యతులను సరిజూసుకొనలేదు హడావుడిలో. అందుకే తొలగించి పరిశీలించాను. మళ్ళీ ప్రకటించాను.

    రిప్లయితొలగించండి
  13. ఛలోక్తి గా:
    కనబడక వినబడక కలియ బడకనె
    ముప్పుదెచ్చువార్త మోసుకొచ్చి
    పుట్టి ముంచునట్టి జెట్టి యాకాశ రా
    మన్నభార్య వదిన యగుట కల్ల!

    రిప్లయితొలగించండి
  14. వరము పొందినవిధి పంచభర్తృకలైరి
    పంచపాండవులు ద్రుపదతనయకు
    దైవలీలజూడనీవిధిగానుండు
    నన్న భార్యవదిన యగుట కల్ల.

    రిప్లయితొలగించండి
  15. మందాకిని గారు తాత్పర్యం రాసి అర్ధమైనట్లు చెప్పారు ...మా వంటివారికి తాత్పర్యం చెప్పక పోతే చాలా పద్యాలు అర్ధం కావు ,మా పై దయ ఉంచి రెండు ముక్కలు తాత్పర్యం చెప్ప ప్రార్ధన .

    రిప్లయితొలగించండి
  16. కవి యొక కృతి జేసెడు నెడ
    కవినే దండాన్వయములు ఘటియించుచు త
    త్కవితార్ధములు విశేషము
    లవి యెల్లం దెలుప గోరు టన్యాయమగున్

    రిప్లయితొలగించండి
  17. వెంకట రాజారావు . లక్కాకులశుక్రవారం, డిసెంబర్ 02, 2011 1:33:00 PM

    శంకరయ్య గారూ !పద్యం అర్ధం కాలేదా
    'అర్ధం కాక పోతే రాసిన వాడిదే లోపం '
    పద్యం రాసి వివరణ ఇచ్చు కోవడం ' బొమ్మ గీచి బొమ్మ పేరు రాయడ '
    మౌతుందేమోమరి ! అయనా తప్పడం లేదు

    ' అన్న భార్య వదిన యగుటకు +అల్లదిగొ శ్రీ
    రామ చరిత సాక్ష్య.....'

    రిప్లయితొలగించండి
  18. బ్లాగు మిత్రులకు సూచన. ఒకసారి http://kandishankaraiah.blogspot.com/2011/11/542.html (దోషకాల మొసంగు సంతోషగరిమ) తిలకించవలసినది. అజ్ఞాతగారు నన్ను మహాపాపిని చేసిన ముచ్చట చూడవచ్చు. అజ్ఞాతలకు జవాబివ్వ నవుసరం లేదు. కాని విషయం కాస్త మనకి పనికి వచ్చేది కావటం వలననూ, వినదగు నెవ్వరు చెప్పని అని నమ్మిక వలననూ తగిలిన పాపపంకిలం గురించి కొంచెం శోధించటం జరిగింది.

    రిప్లయితొలగించండి
  19. రాజారావు గారూ,
    మిమ్మల్ని నొప్పించి ఉంటే మన్నించాలి. నిజంగానే అక్కడ నా అవగాహనాలోపమే. అన్యధా భావించవద్దని మనవి.

    రిప్లయితొలగించండి
  20. శ్యామల రావు గారూ,
    మీ రెండు పూరణలూ ప్రశస్తంగా ఉన్నాయి. అభినందనలు.
    *
    చంద్రశేఖర్ గారూ,
    మీరు మొదట పంపిన పూరణ సరిగానే ఉందా? నేను పొరబడ్డానా?
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    నేనూహించిన భారతార్థ పూరణ మీనుండి వచ్చింది. సంతోషం. చక్కని పూరణ. అభినందనలు.
    *
    శ్యామల రావు గారూ,
    మీరు పద్యంలో చెప్పినట్లు నిజంగా అన్యాయమే. అలాంటి అన్యాయం ఈరోజు నేనూ చేసాను.

    రిప్లయితొలగించండి
  21. శంకరయ్యగారూ, మేమింకా ప్రాధమికదశ లోని ఔత్సాహికకవులమే కాబట్టి అపుడపుడు మీరు మాపద్యాల తాత్పర్యాన్ని ప్రశ్నించవలసిరావటం సహజమే.

    రిప్లయితొలగించండి
  22. సంపత్కుమారులవారి 'పంచభర్తృకలైరి పంచపాండవులు' అన్నప్రయోగం సరైనది కాదనుకుంటాను. ఉభయసమాసాలమధ్య లింగవైరుధ్యం ఉంది.

    రిప్లయితొలగించండి
  23. మణివత్భ్రాజత్ కవితతి
    ఘృణిమంత కవిత్వ రమ్య కేళిన్ రసపూ
    రణములతో కూర్చిరి భూ
    షణముల వాగ్దేవికయ్య శంకర జేజే

    రిప్లయితొలగించండి
  24. గురువు గారు, ధన్యవాదాలు.
    మీరు చెప్పిన సినిమా / పాట నేనెప్పుడూ వినలేదు. నేను ఇప్పుడే వెదికితే ఈ లింక్ దొరికింది. ఈ సైట్ లో పాటలు సమస్య లేకుండా ప్లే అవుతాయని చెప్పగలను కానీ, ఇప్పుడు ఈ పాట చెక్ చేసే అవకాశం లేదు నాకు.
    మీరు ఈ క్రింది లింక్ లో ప్రయత్నించి చూడండి. అడ్రస్ బార్ లో ఈ లింక్ ని కాపీ పేస్ట్ చేసి ఎంటర్ చేయండి. మా వదిన అనే సినిమా పాటలన్నీ ఉన్నట్టున్నాయి. చూడండి.

    http://www.sakhiyaa.com/maa-vadina-1967-%E0%B0%AE%E0%B0%BE-%E0%B0%B5%E0%B0%A6%E0%B0%BF%E0%B0%A8/

    రిప్లయితొలగించండి
  25. మీరు తప్పకుండ అడగవచ్చు. చెప్పటం నా బాధ్యత. అప్పుడప్పుడు ఇలాంటి మొట్టికాయలు పడుతుంటే అన్వయం మీద మరింత శ్రద్ధ పెంచుకునే అవకాశం నాకు కలుగుతుంది.
    ఇక మీద మరింత తేలికగా అన్వయం ఉండేలా పద్యాలు జాగ్రత్త గా వ్రాస్తాను.

    తాత్పర్యం:
    ఒక అన్న, ఒక చెల్లి ఉన్న ఒక వ్యక్తి గురించి వ్రాశాను.
    ఆ వ్యక్తి తన చెల్లిని తన వదిన తగువిధంగా ప్రేమగా చూసుకోవటం గమనించాడు. ఆ వదిన మీద గౌరవం పెరిగింది. నిక్కము అనగా నిజము, నిజముగా ఆ వ్యక్తికి అప్పటినుంచీ వదినను వదినగా కన్నా తల్లిగా భావించటం మొదలుపెట్టాడు.
    మీకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  26. అజ్ఞాత గారు, ఇప్పుడే చూశాను మీ వ్యాఖ్య. మన్నించండి.

    ( నా వ్యాఖ్యలో ఈ భాగం కట్ అయింది. అజ్ఞాత గారు, గమనించగలరు.)

    రిప్లయితొలగించండి
  27. చిన్ననాటినుండి చెలిమితో నుంటిమి
    చేసికొంటిమి కద బాసలెన్నొ
    నిన్నుదప్ప కోర నెవ్వారి నైనను
    అన్నభార్య ; వదినె యగుట కల్ల.
    ----------

    రిప్లయితొలగించండి
  28. నేమాని వారు సత్యం సెలవిచ్చారు.

    రసరమ్యవిమలపూరణ
    కుసుమావళిపరిమళంబు కొసరుచు కడు సొం
    పెసగం తెలుగు సరస్వతి
    కిసలయపదసీమచెలగు కీర్తిశుభములన్

    రిప్లయితొలగించండి
  29. గురు తుల్యులు శ్రీ శంకరయ్య గారికి నమస్కారములు .సమస్యను బిందువు గానే ఉంచి పూరణ తేటగీతి లో వ్రాసాను .

    క్షంతవ్యుడను .మీ పూరణ చాల బాగున్నది. కృతజ్ఞతలు

    రిప్లయితొలగించండి
  30. శంకరార్యా ! య డాగ మములు సందేహిస్తూనే వేశాను. సవరణలకు ధన్యవాదములు. ఇక మూడవ పద్యంలోనేటి టీవి సీరియల్స్ లో వచ్చే చిత్ర విచిత్ర మలుపులు తిరిగే సంఘట నలలో ఒక భాగంగా...ప్రేమ అనే భామను ఒకడు ప్రేమిస్తుంటే ఆమెను వాడి అన్నయ్యకు ఇచ్చి వివాహం చేసే పరిస్థితిలో వాడు అన్న మాటలు.ఆమె య్ప్పటికీ అన్న భార్య - వదిన కాదు.. నాకే సొంతం అనే సందర్భం. ఇక సీరియల్ సంభాషణలలో సగమే తెలుగు ఉంటుంది. అందుకే సహజత్వం కోసం ఇంగ్లీషు పదాలు.

    ధార వాహికందు తాననెనొక్కడు
    ప్రేమ నాదు 'లవరు' ప్రేమ నాదు
    'పవరు' నాకె యగును భార్యగ యేనాడు
    'అన్నభార్య' 'వదిన' యగుట కల్ల

    రిప్లయితొలగించండి
  31. గోలి వారు మన్నించాలి. 'వాహికందు' అన్నది సాదువు కాదు 'వాహిక యందు' అన్నది సాధుస్వరూపం. ఇక్కడ యడాగమం జరగడానికి కారణం 'వాహిక' అనే సంస్కృతపదానికీ 'అందు' అనే తెలుగు పదానికీ మధ్య సంధి లేకపోవటమే. అంతేకాక, 'భార్యగ యేనాడు'లో పొరపాటు ఉంది . ఇక్కడ యడాగమం సరికాదు. నుగాగమం చేసి భార్యగన్ + ఏనాడు --> 'భార్యగ నేనాడు' అనవలసి యుంటుంది. ఒకవేళ నాదే పొరపాటైతే క్షంతవ్యుడిని, నా అభిప్రాయం చెప్పాను.

    రిప్లయితొలగించండి
  32. Disclaimer: ఇది నాకథ కాదు, కవి సమయం అంతే. హాయిగా నవ్వుకోండి :-)
    బ్రహ్మచారి బాట బట్టి కాశికిపోవు
    నన్నుబ్రతిమిలాడి వెన్నుచఱచి
    పిలిచి పిల్ల నిచ్చి ‘నలచు’నా మామసూ
    రన్నభార్య వదిన యగుట కల్ల!

    రిప్లయితొలగించండి
  33. శ్యామలీయం గారూ,

    పంచభర్తృకలైరి పంచపాండవులు అనే ప్రయోగం సరియైనది కాదని చెప్పారు. ఉభయసమాసాల మధ్య లింగవైరుధ్యం అని అన్నారు. దయచేసి కొంచం వివరిస్తే నేర్చుకోవాలని వుంధి. శ్రమపెడుతున్నందులకు మన్నించవలసినదిగా ప్రార్థన.

    రిప్లయితొలగించండి
  34. శ్యామల రావు గారూ ! ధన్యవాదములు.
    ఆర్యా ! రామ్ మోహన్ శర్మ గారి తో జరిగిన 'వాడి' 'వేడి' చర్చ చూశాను.
    ఇక్కడ పద్యములు వ్రాసే వారిలో చాలామంది ఔత్సాహికులే గాని పెద్ద పండితులము గాము.విజ్ఞులు తప్పులను తెలిపి సవరణలు చూపి తప్పులు పునరావృతం కాకుండా చూడాలనే మా ఆకాంక్ష.మనసున అన్యధా భావించక మీ విశ్లేషణలు కొనసాగించ వలసినదిగా కోరుచున్నాను.
    శర్మ గారూ! నమస్కారములు. మీకు తెలిసిన విషయములు మాకు తెలిపి మార్గ దర్శనలో సహకరించ వలసినదిగా కోరు చున్నాము. మీ చర్చ వలన కొన్ని విషయములు తెలుసుకొన గలిగినాము.కాని చర్చ 'వాడి' 'వేడి' గా కాకుండా మెత్తగా చల్లగా సాగితే బాగుండేది. అన్యదా భావించ వలదు. మీ నుండి చక్కని విశ్లేషణలను అభిలషిస్తూ....

    రిప్లయితొలగించండి
  35. ఆర్యుల సూచనల మేరకు నా పూరణలు సవరణలతో...


    వదిన యన్ననన్న భార్యయై యుండును
    భార్య యనిన వామ భాగ మగును
    కాదననిన లేదు లేదన్న నే విన
    నన్న, భార్య వదిన యగుట కల్ల!


    తండ్రి భార్య తల్లి, తమ్ముని బార్యయె
    మరదలగును, అత్త మామ భార్య
    అన్నభార్య వదిన యగుట కల్లయె కాదు
    తెలియ వరుస లన్ని తేట పడును.


    ' 'సీరియలును' గంటి చెప్పెనందొక్కడు
    ప్రేమ నాదు 'లవరు' ప్రేమ నాదు
    'పవరు' నాకె యగును భార్యగ నేనాడు
    'అన్నభార్య' 'వదిన' యగుట కల్ల

    రిప్లయితొలగించండి
  36. శ్యామల రావు గారూ,
    తెలుగు భాషా సాహిత్యాలు ప్రత్యేక విషయంగా చదివి డిగ్రీలు పొంది, తెలుగు అధ్యాపకులుగా ఎంతోకాలం బాషాబోధన చేసిన వాళ్లకంటే సాంకేతిక విద్యలు చదివి, సాహిత్యంతో ఏమాత్రం సంబంధం లేని వృత్తుల్లో ఉన్నవాళ్ళు కొందరు ఛందోవ్యాకరణాలపై సాధికారంగా, శాస్త్రీయంగా వ్యాఖ్యానించడం అబ్బురాన్నీ, సంతోషాన్నీ కలిగిస్తున్నది.
    సర్వేభ్యో మహాజనేభ్యో నమః!

    రిప్లయితొలగించండి
  37. సురసరిత్ప్రవాహశోభాతిశయధార
    లలితపదవిలాసలాస్యకవిత
    వెలువరించునట్టి విజ్ఞుండు నేమాని
    సత్కవికి స్తుతు లనె శంకరయ్య!

    రిప్లయితొలగించండి
  38. సుబ్బారావు గారూ,
    సమస్యపాదం ఒక ఛందస్సులో ఉంటే పాదభగం చేయకుండా వేరే ఛందస్సులో పూరించే సంప్రదాయం ఉంది. ఇది ప్రశంసనీయమైన ప్రయత్నం. అందరూ హర్షిస్తారు.
    మీ పద్యంలో మొదటిపాదంలో తేటగీతి లక్షణాలు లేవు. గణదోషం. ఆ సమస్యను తేటగీతిలో ఇముడ్చవచ్చు. అదీ కచ్చితంగా రెండుపాదాలలో. సమస్యతో మొదలుపెట్టి తేటగీతి వ్రాయలేము. మీ మొదటి పాదాన్ని తేటగీతి చేయాలంటే ‘అన్న భార్య (తన/తాను)వదిన యగుట కల్ల’ అనవలసి ఉంటుంది. కాని సమస్య పాదాన్ని ఇలా మార్చడం దోషం.
    ఒకసారి నా పూరణ చూడండి ...

    రిప్లయితొలగించండి
  39. నా పూరణ ....

    తల్లి యన్న గేహిని పినతల్లి కాదు,
    తండ్రి చెల్లెలి సుతయు సోదరియు గాదు,
    చెన్ను మీఱఁగ నిల్లాలి ‘యన్న భార్య
    వదిన యగుట కల్ల’యె గదా వరుసలు గన.

    రిప్లయితొలగించండి
  40. గురు తుల్యులు శ్రీ శంకరయ్య గారికి నమస్కారములు .మీ అమూల్య మైన సూచనలకు ధన్య వాదములు .

    ఇటువంటి దోషములు పునరా వృతము కాకుండా జాగ్రత్త పడుదును

    రిప్లయితొలగించండి
  41. మనసు పడితి నంచు మనువాడ ననుగోరి
    మాట మార్చి ఇపుడు దాట జూడ
    వేయి జెప్ప నేల ? వీడను నీచేయి నీ
    అన్న భార్య వొదిన యగుట కల్ల

    రిప్లయితొలగించండి
  42. సంపత్కుమారులవారూ, 'పంచభర్తృకలైరి పంచపాండవులు' అన్నప్రయోగం లో లింగవైరుధ్యం గురించి వివరణ అడిగారు. సంతోషం. నేనెరిగనట్లు మనవి చేస్తాను. మనకు పాండవులు పురుషులన్నది స్పష్టంగా తెలుసును. ఒకవేళ యెవరికైనా తెలియకపోయినా, పద్యంలో 'ద్రుపదతనయకు' అనటం వలన స్పష్టం అవుతున్నది కదా. యెందుకంటే 'తనయ' అంటే కుమార్తె కాబట్టి. అలాగే, 'భర్తృక' అంటే 'భర్త గలది' అనే అర్ధం కాబట్టి యీ పదం స్త్రీపట్ల మాత్రం అన్వయిస్తుంది. యేదో సినిమాలో 'పాంచాలీ పంచభర్తృకా!' అన్న సంబోధన కూడా ఉన్నది. బహుశః మీరు దీన్ని విని తత్ప్రభావంతో యీ పదం వాడారేమో తెలియదు. పాంచాలి కారణాంతరం వలన పంచభర్తృక అయినది. పంచభర్తృకలు అంటే అయిదుగురు భర్తలు గల స్త్రీలు అని అర్ధం. ఇప్పుడు పరిశీలించండి, 'పంచభర్తృకలైరి పంచపాండవులు' అన్న జంట సమాసాల్లో మెదటిది స్త్రీలను తెలుపుతుండగా రెండవది పురుషులను తెలుపుతున్నది యని బోధపడుతున్నది. ఇదీ నేను ప్రస్తావించిన లింగవైరుధ్యం. యధాతధంగా అన్వయిస్తే 'పంచభర్తృకలైరి పంచపాండవులు' అన్న దానికి పంచపాండవులనేవాళ్ళు ఒక్కొక్కళ్ళూ అయిదుగురు భర్తలుగల స్త్రీలయ్యారని వస్తుంది.

    రిప్లయితొలగించండి
  43. రసరమ్యవిమలపూరణ
    లసదృశ గుణదోష గణన మత్యంతముదం
    బెసగ నిరంతర మిదియే
    వ్యసనమ్మై కీర్తిఁ గనుము శ్యామల రావూ!

    రిప్లయితొలగించండి
  44. మందాకిని గారూ,
    మేకెలా ధన్యవాదాలు తెలుపుకోవాలో తెలియడం లేదు. మీరిచ్చిన లింక్ ద్వారా నా కిష్టమైన పాటను విన్నాను. ఆ పాటను వింటూ నా బాల్యాన్ని గుర్తుకు తెచ్చుకున్నాను. దానిని డౌన్ లోడ్ చేసుకొంటే బాగుండేది. ఎలాగో నాకు తెలియదు.

    రిప్లయితొలగించండి
  45. ‘కమనీయం’ గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    *
    ‘మనతెలుగు’ చంద్రశేఖర్ గారూ,
    చక్కని పూరణ. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    సవరించిన మీ పూరణలు సర్వశ్రేష్ఠంగా ఉన్నాయి. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మంచి భావంతో పూరణ చేసారు. అభినందనలు.
    అయితే చివర అన్వయం కొద్దిగా ఇబ్బంది పెడుతున్నది. ‘వీడను నిన్నటం/ చన్న భార్య ...’ అంటే బాగుంటుందేమో?
    *
    శ్యామల రావు గారూ,
    సంపత్ కుమార్ శాస్త్రి గారి ‘పంచభర్తృకలైరి ...’ విషయంలో నేను మీతో సంపూర్ణంగా ఏకీభవిస్తున్నాను. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  46. రాక్షసాళి మాయ రంగైన యా లేడి
    హాని కలుగ దచట నన్న కెపుడు
    ఆర్తనాద మద్ది యామాయయే, నిజ-
    మన్నభార్య! వదిన! యగుట కల్ల.

    రిప్లయితొలగించండి