31, డిసెంబర్ 2011, శనివారం

సమస్యాపూరణం - 577 (గతకాలము మేలు)

కవిమిత్రులారా,
             2011 సంవత్సరానికి వీడ్కోలు!
          ఈ సంవత్సరమంతా పూరణార్థం రోజుకొక సమస్య నిస్తూ వస్తున్న నాకు బ్రతుకే సమస్య అయింది. మనశ్శాంతిని దూరం చేసిన ఉద్రిక్త పరిస్థితులను ఎన్నో ఎదుర్కొన్నాను. కోడలుతో సమస్య, ఊళ్ళు, ఇళ్ళు  మారడం, శారీరక. మానసిక, ఆర్థిక ఇబ్బందులు నన్ను బాధ పెట్టాయి. బ్లాగు నిర్వహణ ఒక్కటే నాకు సాంత్వన నిచ్చింది. బ్లాగు మిత్రులు ఎప్పటికప్పుడు నాకు  ధైర్యాన్ని ఇచ్చారు. ఆర్థికంగానూ ఆదుకున్నారు.
          మిత్రులు కేవలం సమస్యలను పూరించడమే కాక మిగిలినవారి పూరణల గుణదోష విచారణ చేస్తూ నాకు శ్రమ తగ్గించారు. ఛందోవ్యాకరణాల గురించి సంస్కారపూరిత చర్చలు చే్సారు. బ్లాగు మిత్రుల మధ్య అన్యోన్యత పెరిగింది. వారి స్నేహానికి బ్లాగు ఒక మాధ్యమం అయింది.
          ఒకటి రెండు అజ్ఞాత వ్యాఖ్యల వల్ల మనస్సు కొంత చివుక్కు మన్నా ‘స్థితప్రజ్ఞత’ను అలవరుచుకొనే ప్రయత్నం చేసాను.
          ఈ సంవత్సరానికి వీడ్కోలు పలికే ఈ తరుణంలో నాకు అన్ని విధాల సహకరిస్తున్న బ్లాగుమిత్రు లందరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది
      గతకాలము మేలు వచ్చు కాలముకంటెన్.
                                

31 కామెంట్‌లు:

 1. సోదర సోదరీమణులకు నూతన ఆంగ్ల సంవత్సర (2012)
  శుభాకాంక్షలు .
  ----
  గైకొనుడు శుభాకాంక్షలు
  గైకొనుమా యాంగ్ల వత్సరాభ్యుదయమునున్
  గైకొని యాశిసు లీయుడు
  గైకొందును దప్ప కిపుడు గై దం డల తోన్ .

  30 December 2011 3:03

  రిప్లయితొలగించండి
 2. కుటుంబ,ఆర్ధిక,మానసిక,ఆరోగ్య సమస్యలు ఎన్ని ఉన్ననూ "శంకరాభరణము" నందు సమస్యల నిచ్చుటను సమస్యగా దలుపక బాధ్యతగా తలచి నిర్విఘ్నము గా నిర్వహించుచున్న శంకరార్యులకు నూతన వత్సరమున సమస్యలన్నీ తొలగి "సమస్యలనిచ్చు సమస్య (?)" ఒక్కటే మిగలాలని కోరుకుంటూ....

  వెతలను దలపకు మిట్టుల
  'గతకాలము మేలు వచ్చు కాలముకంటెన్'
  ‘స్థితప్రజ్ఞత’ తో నిలబడు
  గతకాలము కంటె వచ్చు కాలము మేలౌ.

  రిప్లయితొలగించండి
 3. మన బ్రతుకుల కంటె మన పిల్లల జీవితాలు ఆనంద మయముగా ఉండాలని కోరుతూ ;

  చతురతయు త్రగ్గు వృధ్ధుల
  గతకాలము మేలు వచ్చు కాలముఁ గంటెన్
  సుత జనుల వృధ్ధిఁ గోరిన
  గతకాలముఁ గంటె వచ్చు కాలము హితమౌ !

  రిప్లయితొలగించండి
 4. గతమును దలపకు మయ్యా !
  వెత లన్నిటి మాయ జే సి వేం కట ప్ర భు డున్
  గతమే మేలని పిం చును
  గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్ .

  రిప్లయితొలగించండి
 5. గతమెంతొ ఘనమ యందురు
  గతమునె మన పూర్వ కవులు ఘనముగ పలికెన్
  గతమే సువర్ణ యుగమౌ
  గతకాలము మేలు వచ్చు కాలము కంటెన్.

  రిప్లయితొలగించండి
 6. గురువు గారికి మిత్రులందఱికీ వారి వారి కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యములు సకల శుభములు సర్వదా సమకూడాలని మరోసారి భగవంతునుకు నా ప్రార్ధనలు. సర్వే జనాః సుఖినో భవంతు.

  రిప్లయితొలగించండి
 7. భామకు చీరేల నయ్య ! పదుగురు చూడన్ .
  -------------
  ఏమిది! సుందర విగ్రహ
  మామని నే బోలి యుండి యాకర్షితయై
  యామెతొ సరి బోల గలుగు
  భామకు చీరేల నయ్య ! పదుగురు చూ డన్ .

  రిప్లయితొలగించండి
 8. అయ్యా సుబ్బారావుగారూ! మీ పూరణలను ఆయా టపాలలోనే వ్యాఖ్యానరూపంలో పెడితేనే బాగుంటుందని నా సూచన.

  రిప్లయితొలగించండి
 9. మానవుడు ఆశావాది. భవిష్యత్తు ఎప్పటికప్పుడు బాగానే వుంటుందని నమ్ముతూ:
  గతమది తెఱచిన పొత్తము
  ప్రతిపుట తెలియును తెలియని భావి డగరగా
  దతియోచన లనవలదుర
  గతకాలము మేలు వచ్చు కాలముకంటెన్.

  రిప్లయితొలగించండి
 10. వెంకట రాజారావు . లక్కాకులశనివారం, డిసెంబర్ 31, 2011 10:03:00 AM

  మతి దొలగంపుము, గతమే
  గతకాలము ,మేలు వచ్చు కాలము ,కంటే(కంటెన్)!
  మతిమంతుడు భువి నాశా
  రతుడె, భవిష్యత్తు కోరి ప్రగతిని నడచున్

  క్రీశా యిరవై పండ్రెం
  డాశా వహమై చరించ నాహ్వా నింతున్
  ధీ శాలురు కవిమిత్రుల
  కీశానుడు సకల సిరు లభీష్టము లిచ్చున్

  చంద్రశేఖరు, గోలి, మిస్సన్న,గన్న
  వరపు,సంపత్కుమార,జిగురు,కిశోరు,
  తాడిగడప,నేమాని,మందాకినులకు,
  శ్రీపతికి,సుబ్బరావు,రాజేశ్వరులకు,

  మందకును,కందివారికి మనసు నిండ
  ఇష్ట కామ్యార్థ సిధ్ధి సిధ్ధింప గోరి
  ప్రియము గూర్చరాజారావు బిలుచు చుండె
  స్వాగతము రమ్మ! క్రొత్త సంవత్సరమ్మ!

  రిప్లయితొలగించండి
 11. శ్రీగురుభ్యోనమ:

  ఒక వయోవృద్ధుని మనోభావము

  గతమున గడచిన ఘటనలు
  హితమును కలిగించి సన్నిహితులను గూర్చెన్
  మితమగు జీవన పథమున
  గతకాలము మేలు వచ్చు కాలముకంటెన్

  రిప్లయితొలగించండి
 12. వెంకట రాజారావు . లక్కాకులశనివారం, డిసెంబర్ 31, 2011 12:30:00 PM

  టైపాటును సవరించగా ' మతి దొలగింపుము 'అని జదువగలరు

  రిప్లయితొలగించండి
 13. లక్కాకుల వారు,

  మతి దొలగింపుము అని చదివి హడలి పోయాను, నాదేమో అని !

  చీర్స్
  జిలేబి.

  రిప్లయితొలగించండి
 14. సతిపతుల ప్రీతి మృగ్యమె,
  మతిమాలిన వాదనలతొ మాయలు జరుగున్,
  గతి దప్పును ధర్మములున్,
  గతకాలము మేలు వచ్చు కాలము కంటెన్.

  రిప్లయితొలగించండి
 15. వెంకట రాజారావు . లక్కాకులశనివారం, డిసెంబర్ 31, 2011 2:50:00 PM

  చిన్ని పదబంధములు కూర్చి చీర్సు చేర్చి
  తెలుగు మాటకు చవులూరు తీపి పేర్చి
  కవితలకు గోము లద్దెడి చవి జిలేబి !
  నవ వసంత శుభాకాంక్ష లివిగొ !మీకు

  రిప్లయితొలగించండి
 16. శంకరార్యులకు, పండితాదులందరికీ

  నూతన సంవత్సర శుభాకాంక్షలు.

  శంకరార్యా,

  గత సంవత్సరమ్ము ఏల , వచ్చు కాలమును కంటెన్,
  గత సంవత్సరము ఏల, 'మరువం' గ వచ్చు వచ్చు కాలము కంటెన్,
  గత 'సమ' వత్స సమస్య తీరి మీ వచ్చు కాలము శౌభాగ్యమ్ముల నివ్వ వలె మీకు ఆ పదేవత దయవలన్

  జిలేబి.

  రిప్లయితొలగించండి
 17. స్తుతమైన జనన రాశికి
  గతి తప్పక సౌరి వచ్చె కాలము తిరగన్
  బ్రతుకెటులుండగ బోవునొ!
  గతకాలము మేలు వచ్చు కాలముకంటెన్!!

  సౌరి = శని

  రిప్లయితొలగించండి
 18. శ్రీపతిశాస్త్రిశనివారం, డిసెంబర్ 31, 2011 7:33:00 PM

  గురువర్యులు శ్రీ కంది శంకరయ్యగారికి, శ్రీ పండిత నేమానిగారికి, శ్రీ చింతా రామకృష్ణారావు గారికి, కవులు,పండితులు, బ్లాగు వీక్షకులు అయిన మిత్రులు అందరకు 2012 నూతన సంవత్సరం శుభాకాంక్షలు.

  రిప్లయితొలగించండి
 19. ప్రపంచవ్యాప్తంగా వున్న కవి మిత్రులకు, స్నేహితులకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు! ౨౦౧౨ వ సంవత్సరము మీకు మరిన్ని శుభములు చేకూర్చు గాక!

  రిప్లయితొలగించండి
 20. అతలా కుతలము సంద్రము,
  వెత లెన్నియొ గలుగు నట్లు వేత్తలు సెప్పన్
  గతముతొ బోలిక జూడగ
  గతకాలము మేలు వచ్చు కాలము కంటెన్ .

  రిప్లయితొలగించండి
 21. శ్రీపతిశాస్త్రిశనివారం, డిసెంబర్ 31, 2011 7:46:00 PM

  రాజారావుగారూ మీ పద్యము

  "క్రీశా యిరవై పండ్రెం" చాలా బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 22. శ్రీ అజ్ఞాత గారికి నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్ష లతో
  వ్రాయునది .మీ సూచన కు ధన్య వాదములు.అయితే
  ఈ లేటెస్టు టపాలలో నా పాత పూరణలను పంపితే
  గురువులు శ్రీ శంకరయ్య గారు చూసి సవరణలు
  చేయు చున్నారు .పాత టపాల లో, సవరణలకు
  వీలుం డదని నా అభి ప్రాయము .మన్నిం చ గలరు

  రిప్లయితొలగించండి
 23. అతులిత స్మృతులౌ మిగులగ
  గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్ !
  వెతలను దూరము చేయగ
  సతతము దైవమును కొలువ చింతలు బాపున్ !

  రిప్లయితొలగించండి
 24. సుబ్బారావుగారూ, మీరు పంపిన పాతటపాల పూరణలు ఈమెయిలు ద్వారా శంకరయ్యగారికి చేరతాయి. వారికి మీరు పోస్టు చేసినట్లు తెలుస్తుంది కావున వారు సవరణ చేయగలరు. ఒక రకంగా చెప్పాలంటే మీరు అక్కడ పోస్టు చేయటమే సమంజసము. ఎవరైనా పూరణల సంకలనం చేస్తే మీ పూరణ సరైన చోట కనబడుతుంది. ఆపై మీ ఇష్టం, శంకరయ్య గారి యిష్టం.

  రిప్లయితొలగించండి
 25. వెతలును సుఖములు చూడగ
  బ్రతుకున నతి సహజ మండ్రు పలువురు పెద్దల్
  సతమును తగదిది పలుకగ
  గతకాలము మేలు వచ్చు కాలము కంటెన్ .

  రిప్లయితొలగించండి
 26. గురువులకు, పండితులకు, పెద్దలకు, కవి మిత్రులందరికీ నూతన ఆంగ్ల వత్సరాది శుభాకాంక్షలు.

  రిప్లయితొలగించండి
 27. అతివలు మగనికి హితముగ
  మితిమీరిన ప్రేమ తోడ మేలౌ శుభముల్ !
  మతిచెడి వెతలతొ నేడిటు
  గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్ !

  రిప్లయితొలగించండి
 28. శ్రీపతిశాస్త్రిఆదివారం, జనవరి 01, 2012 8:17:00 AM

  శ్రీగురుభ్యోనమ:
  నూతన సంవత్సర శుభాకాంక్షలు

  బ్లాగు నిర్వహించు బడిపంతులయ్యకు
  స్పందనలను దెలుపు పండితులకు
  పూరణములు జేయు బుధవర్గములకును
  స్వస్తి గూర్చు నూత్నవత్సరమ్ము

  రిప్లయితొలగించండి
 29. దీదీ ఉవాచ:

  అతిగా మోడియు నమితుడు
  బ్రతుకిక హీనముగ జేయ బంగాలందున్
  చతికిల పడగా నేనిట
  గతకాలము మేలు వచ్చు కాలముకంటెన్

  రిప్లయితొలగించండి