20, డిసెంబర్ 2011, మంగళవారం

సమస్యాపూరణం - 566 (సంపన్నుల దైవ మగును)


 కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది
సంపన్నుల దైవ మగును శంకరుఁ డెన్నన్
ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

31 కామెంట్‌లు:

  1. నింపాదిగ శివ పూజను
    ఇంపార నమక చమక సహితముగ భక్తిన్
    సంపన్నము జేయు సుగుణ
    సంపన్నుల దైవ మగును శంకరుఁ డెన్నన్

    రిప్లయితొలగించండి
  2. శ్రీగురుభ్యోనమ:

    కంపనమొందని భక్తి
    న్నింపుగ నీశ్వరుని గొలచు నెవ్వరికైనన్
    సంపద చేకూరు, సుగుణ
    సంపన్నుల దైవ మగును శంకరుఁ డెన్నన్

    రిప్లయితొలగించండి
  3. పంపా యను నది యొడ్డున
    సంపద గల దైవ మయ్యె శంకరు ,సుతులున్
    పంపా నగరపు శివ ,భక్త
    సంపన్నుల దైవ మగును శంకరు డె న్నన్ .

    రిప్లయితొలగించండి
  4. ఇంపుగ మఱి శివ పూజను
    సొంపారగ జేసిరేని సూనృత భక్తిన్
    సంపదలే నిచ్చు సుగుణ
    సంపన్నుల దైవ మగును శంకరు డె న్నన్ .

    రిప్లయితొలగించండి
  5. పాలే సజ్జనుల నెల్ల పతితుల జేయున్ .
    ---------------

    పాలే యభి షేకించిన
    పాలే నైవేద్య మిచ్చి పాలే ద్రాగన్
    బాలా రిష్టపు పలు పా
    పాలే సజ్జను ల నెల్ల పతితుల జేయున్ .

    రిప్లయితొలగించండి
  6. పెంపొందిన సాంసారిక
    తంపరలన్ ద్రుంచి నిత్యధార్మిక వృత్తిన్
    లంపటములకోర్చు తపో
    సంపన్నుల దైవమగును శంకరుడెన్నన్.

    రిప్లయితొలగించండి
  7. మాం పాహి శంకరా! యను
    కంపామయ! యనుచు వేడగా రక్షించున్
    సంపూర్ణ భక్తియోగసు
    సంపన్నుల దైవమగును శంకరుడెన్నన్

    రిప్లయితొలగించండి
  8. సంపత్కుమారులవారూ, 'తపో సంపన్నులు' అన్న ప్రయోగం సరిగాదండీ.
    'తపస్సంపన్నులు' అనవలసి ఉంది. అలా గంటే పద్యంలో గణాలుకుదరవు కాబట్టి కొంచెం సవరించుకోవలసి ఉంటుంది.

    రిప్లయితొలగించండి
  9. అయ్యా శ్రీ సంపత్ కుమార్ గారూ & శ్రీ శ్యామల రావు గారూ!

    తపస్సంపన్నులు అనినా గణాలు సరిపోతున్నాయండి. అలాగే మార్చితే చాలును - ఇంకేమీ అక్కరలేదు.

    రిప్లయితొలగించండి
  10. శ్రీ శ్యామలరావు గారూ!
    మిటారి : అల్లసాని పెద్దన గారు కూడా తమ ఉత్పలమాలిక (పూత మెరుంగులున్ ) పద్యములో మిన్నల మిటారపు ముద్దుల గుమ్మ అని వాడేరు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  11. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    ‘సుగుణసంపన్నుల’తో బాగుంది మీ పూరణ. అభినందనలు.
    ‘పూజను + ఇంపార = పూజ నింపార’ అవుతుంది. అలా అంటే గణదోషం వస్తుంది. ‘పూజల నింపార’ అందాం.
    *
    శ్రీపతి శాస్త్రి గారూ,
    అచంచలభక్తిని ‘కంపన మెరుగని భక్తి’ అన్నారు. బాగుంది. మంచి పూరణ. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    మీ మొదటి పూరణ సందిగ్ధంగా ఉంది. మూడవ పాదంలో గణదోషం ఉంది.
    రెండవ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    ‘పాలే సజ్జనుల నెల్ల ...’ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
    శ్యామలీయం, నేమాని గారల వ్యాఖ్యలు గమనించారు గదా! ‘తపస్సంపన్నుల’ అనండి.
    *
    పండిత నేమాని వారూ,
    భక్తి యోగ సంపన్నతతో మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  12. నమస్కారములు
    " మిటారి , కపట ప్రేమల " ను గురించి మంచి వివరణ ఇచ్చినందుకు ,శ్రీ పండిత నేమాని వారికి ,శ్రీ శ్యామలీయం గారికి కృతజ్ఞతలు .

    రిప్లయితొలగించండి
  13. ఇంపుగ వేడిన నిడుముల
    ముంపును తప్పించువాడు ముక్తేశ్వరు డే
    సంపద గోరును? సద్గుణ
    సంపన్నుల దైవమగును శంకరు డెన్నన్!!!

    వంపులు దిరిగిన జడసుడి
    గంపన గంగనునిలిపిన గంగాధరుడే
    సంపదయౌ భువికి గుణసు
    సంపన్నుల దైవమగును శంకరు డెన్నన్!!!

    రిప్లయితొలగించండి
  14. చెంపను కెంపులు విరియగ
    సొంపగు చండికను గొలువ శంకరు పత్నిన్ !
    పెంపెనఁగు ముదము తోడను
    సంపన్నుల దైవ మగును శంకరు డెన్నన్ !

    శివ .....శివా .... = పార్వతీ + శివుడు = ఇద్దరు ఒకటేకదా ? .ముందు దేవిని స్తుతి చేస్తె ,దైవం ప్రసన్నుడౌ తాడు. అని నా అభి ప్రాయము

    రిప్లయితొలగించండి
  15. మిత్రులారా!
    సోదరి రాజేశ్వరి గారు ఒక మంచి విషయమును గుర్తు చేసేరు. మరి కొంచెము నేను వివరిస్తాను. శివ అంటే శివుడు, శివా అంటే పార్వతీ దేవి. ఇద్దరిలో ఏ మాత్రము తేడా లేదు. ఒకరు జ్ఞానము ఇంకొకరు శక్తి. ప్రకృతి, పురుషుడు. ఇద్దరూ కలిసి ఉంటేనే విశ్వము సృష్టి, పాలన మరియు లయములు ఉంటాయి.
    ఏ దేవతా మూర్తిని సంబోధించేటప్పుడయిన వారి వాల్లభ్యమును కూడ చెప్పితే ఫలితము బాగుంటుంది. శంకరా అని సంబోధింఛేటప్పుడు పార్వతీనాథా అనుట మంచిది, అలాగే హరీ అనే కంటే లక్ష్మీకాంతా అనుట మంచిది అంటారు.
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  16. వెంకట రాజారావు . లక్కాకులమంగళవారం, డిసెంబర్ 20, 2011 9:10:00 PM

    సంపద ధనమా ? చదువా ?
    సంపద యధికారమ ? మద జాడ్యములే యీ
    సంపదలు - ప్రపత్తి మన
    స్సంపన్నుల దైవమగును శంకరుడెన్నన్

    రిప్లయితొలగించండి
  17. @రాజేశ్వరి నేదునూరి కవయిత్రి గారూ పూరణలు మీ చేతి నుండి ప్రాణం తో వస్తున్నాయి. నేమాని గారె చెబుతున్నారు.
    "చెంపను కెంపులు విరియగ
    సొంపగు చండికను గొలువ శంకరు పత్నిన్ ! "

    రిప్లయితొలగించండి
  18. @మంద పీతాంబర్ గారూ పూరణ బ్రహ్మాండం. సున్నితంగా సెలయేరులా సాగిపోయింది.

    వంపులు దిరిగిన జడసుడి
    గంపన గంగనునిలిపిన గంగాధరుడే

    రిప్లయితొలగించండి
  19. వెంకట రాజారావు . లక్కాకులమంగళవారం, డిసెంబర్ 20, 2011 10:38:00 PM

    మంద వారి తెలుగు మధురాతి మధురమ్ము
    తియ్య తియ్య నైన తెలుగు రుచుల
    నిండు తెలుగు దనపు నేతితో యరిసెలు
    పండుగ లకు ముందె వండి నాడు

    రిప్లయితొలగించండి
  20. ఇంపార పూజ చేసిన
    పెంపగు సంతసము తోడ పెరుగుచు శివుడున్
    సంపదల నీయ గోర,సు
    సంపన్నుల దైవ మగును శంకరు డెన్నన్.
    --------
    పెరుగుచు అనగా ఉబ్బుచు అని నా భావము.
    శంకరుడు ఉబ్బు లింగడు కదా !

    రిప్లయితొలగించండి
  21. మంద పీతాఒబర్ గారూ మీ రెండు పద్యాలు బాగున్నాయి. రెండవ పద్యం హృద్యముగా ఉన్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  22. ఆరోగ్యం దోబూచు లాడుతూ మిత్ర దర్శనాన్ని దూరం చేస్తోంది !

    అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    అయ్యా ! కైలాస శంకరులు గాదు !
    నే జెప్పునది కంది శంకరుల గురించి !

    01)
    _____________________________________

    ఇంపుగ సమస్య నిచ్చుచు
    పెంపొందగ తెనుగు పద్య - విభవమ్మెంతో;
    సొంపుగ గూర్చెడి కవితా
    సంపన్నుల దైవ మగును - శంకరుఁ డెన్నన్ !
    _____________________________________

    రిప్లయితొలగించండి
  23. నమస్కారములు .
    సోదరులు శ్రీ పండిత నేమానివారికీ , శ్రీ లక్క రాజు గారికి , ధన్య వాదములు

    రిప్లయితొలగించండి
  24. అభినందించిన శ్రీ శివరామకృష్ణ గారికి ,శ్రీ శ్రీ పతి శాస్త్రి గారికి మరియు మనోహరమైన పద్యంచెప్పి సంతోషాన్నికలుగ జేసిన శ్రీ రాజారావు గారికి ధన్యవాదములు .

    రిప్లయితొలగించండి
  25. ఇంపుగ గుడి నిర్మించితి
    సొంపుగ శివునందు నిల్పి చూపితి ప్రజకున్
    కంపించు నాదు పాపము
    సంపన్నుల దైవ మగును - శంకరుఁ డెన్నన్ !

    రిప్లయితొలగించండి
  26. ఒక అవినీతి పరుడైన నాయకుని స్వగతంగా నా పై పూరణ భావించమని మనవి.

    రిప్లయితొలగించండి
  27. @మిస్సన్న గారూ మీ పూరణ చాలా బాగుంది. అందరూ ఒకరి తరువాత ఒకరు హిట్స్ వేస్తున్నారు.

    ఇంపుగ గుడి నిర్మించితి
    సొంపుగ శివునందు నిల్పి చూపితి ప్రజకున్

    రిప్లయితొలగించండి
  28. గంపలతో ధనధాన్యము
    సంపదలు సుఖముల నింపి సారా ముదముల్
    సొంపుగ నిచ్చు తెలంగణ
    సంపన్నుల దైవ మగును శంకరుఁ డెన్నన్

    రిప్లయితొలగించండి
  29. బంపరు ధనముల నిడుచున్
    సొంపగు తెలగాణలోన శూరుల వోలెన్
    జంపింగులు జేయదలచు
    సంపన్నుల దైవ మగును శంకరుఁ డెన్నన్

    రిప్లయితొలగించండి