30, డిసెంబర్ 2011, శుక్రవారం

నా పాటలు - (సాయి పాట)

                           ఓంసాయి శ్రీసాయి

ఓంసాయి శ్రీసాయి జయసాయి అనండి
ఓంకారరూపుడైన సాయి మహిమ కనండి              
|| ఓంసాయి ||

ప్రేమతోడ సాయినాథు పేరు తలచినంతనే
పెన్నిధియై కొర్కెలు నెరవేర్చు మాట నిజమండి
సాయిబాబ లీలలను సన్నుతించు వారలు
సర్వబంధనాలు తొలగి ముక్తి గనుట నిజమండి     
|| ఓంసాయి ||

విశ్వాసంతోడ సాయి నాశ్రయించువారికి
శాశ్వతసుఖశాంతు లిచ్చు సదయుడనీ నమ్మండి
షిరిడీపతి చరణకమల శరణాగతులైన వారి
మరణభయం పోగొట్టే మాన్యుడనీ నమ్మండి           || ఓంసాయి ||

మహిమాన్వితుడైన సాయి మహిత కథాశ్రవణమే
మానరాని రోగాలను మాన్పుననుట నిజమండి
సమత మమత బోధించిన సాయిగురుని సూక్తులే
భ్రమలను తొలగించునట్టి బాటలనీ నమ్మండి             || ఓంసాయి ||

5 కామెంట్‌లు:

  1. !
    శ్రీ సాయీ! యో సాయీ !
    నీ సాయము గోరు చుంటి నిలకడ కొఱకై
    ఈ సారికి దయ జూడుము
    ఏ సాయము కోర నిన్ను నికపై సాయీ!

    రిప్లయితొలగించండి
  2. సారమ్మే యీవట యోం
    కారమ్మే నీవు సకల గ్రహగతులకు నా
    ధారమ్మే నీవు నమ
    స్కారశతము నీకొనర్తు సద్గురు సయీ!

    రిప్లయితొలగించండి
  3. అలవాటులో పొరపాటు - టైపు పొరపాటు క్రిందటి పద్యములో చివరి సంబోధన "సాయీ" అని దిద్దుకోవలెను.

    రిప్లయితొలగించండి
  4. సుబ్బారావు గారూ,
    మీ సాయి స్తుతి బాగుంది. ధన్యవాదాలు.
    *
    పండిత నేమాని వారూ,
    సాయి తత్త్వాన్ని ఆవిష్కరించిన మీ పద్యం ప్రశస్తంగా ఉంది. ధన్యవాదాలు.
    *
    ‘అక్షరమోహనం’ గారూ,
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి