14, డిసెంబర్ 2011, బుధవారం

చమత్కార పద్యాలు - 146 (ప్రహేళిక సమాధానం)

ప్రహేళిక సమాధానం

అనేకసుశిరం వాద్యం
కాంతం చ ఋషిసంజ్ఞితమ్
|
చక్రిణా చ సదారాధ్యం
యది జానాసి తద్వద
||

 సమాధానం

అనేక సుశిరం = పలురంధ్రాలు కలది, 
వాద్యం (వ + ఆద్యం) = ‘వ’ అనే అక్షరం మొదట ఉండేది, 
కాంతం (క + అంతం) = ‘క’ అనే అక్షరం చివర ఉండేది, 
ఋషి సంజ్ఞితం = ఋషి (వాల్మీకి) పేరు కలది, 
చక్రిణా = పాములచేత, సదా + ఆరాధ్యం = ఎప్పుడు సేవింపబడేది

అది వల్మీకం (పుట్ట).

సమాధానం కోసం ప్రయత్నించిన మందాకిని, రాజేశ్వరి అక్కయ్య, అజ్ఞాత గారలకు ధన్యవాదాలు.

3 కామెంట్‌లు:

  1. గురువు గారు,బాగుంది. పుట్ట అనుకున్నాను. కానీ వాద్యం, కాంతం కు ఈ అర్థాలు తీసుకోవాలని తెలియలేదు. ఖచ్చితంగా సంగీత సాధనమేనేమో అనుకున్నాను.

    రిప్లయితొలగించండి
  2. ఆర్యా! నేను కూడా వేణువు అనే అనుకున్నాను. వల్మీకమునకు కాంత, వాద్యమనే అర్థ ము వ ఆద్యం, క అంతం తో చమత్కారంగా ఉంది. ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి