29, డిసెంబర్ 2011, గురువారం

సమస్యా పూరణం - 575 (భగవద్గీత)

 కవిమిత్రులారా,
          భగవద్గీతను నిషేధించాలని వేసిన పిటీషన్ ను రష్యా కోర్టు కొట్టివేసింది. గతంలో ఈ అంశాన్ని ఆధారంగా చేసికొని సమస్య ఇస్తే అందరూ ఉత్సాహంగా గీతాప్రాశస్త్యాన్ని వివరిస్తూ సరసమైన, ప్రబోధాత్మకమైన పూరణలు పంపారు. అందరికీ ధన్యవాదాలు.

          నిన్నటి వార్త చూసి కవిమిత్రులు స్పందించి పూరణార్థం కొన్ని సమస్యలను పంపారు. ఈరోజు అందరి సమస్యలను ఇస్తున్నాను.  అయితే వాటిలో సమస్య ఉండదు. వ్యతిరేకార్థం, అసంబద్ధత, అసత్యం వంటివి లేవు. అన్నీ సూటిగా ఉన్నాయి. మిత్రులు వాటిలో నచ్చిన పాదాన్ని ఎన్నుకొని పద్యరచన చేయడమే. 

ఆ సమస్యలు(?) ఇవి
శ్రీ పండిత నేమాని వారు
విజయశ్రీకలితగీత! వేవేల నుతుల్ 

శ్రీ పోచిరాజు సుబ్బారావు గారు
గీత మార్చును మనుజుల గీత నెపుడు 

‘మనతెలుగు’ శ్రీ చంద్రశేఖర్ గారు
చల్లగఁ గాపాడు గీత సకల సుజనులన్
చల్లగఁ గాపాడు గీత సైబిరియనులన్

పై కవిమిత్రులకు ధన్యవాదాలు.

49 కామెంట్‌లు:

  1. ముందుగా రెండులక్షల పైగా అతిథులకు సాహిత్య రుచులు చూపించిన మా
    శంకరాభరణము నకు, అఖండముగా నిర్వహించుచున్న శంకరార్యులకు అభినందన మందార సుమమాలలు.

    రిప్లయితొలగించండి
  2. ప్రజలా పెడదారిఁ బడిన
    యజముల వలె నినువలదని నారట, వారల్
    రుజపీడితులువిడువుమా
    విజయశ్రీకలితగీత! వేవేల నుతుల్

    రిప్లయితొలగించండి
  3. శ్రీ శాస్త్రి గారూ ఏదో రకంగా ఎప్పుడూ ముందే, ఈరోజు వ్యాఖ్యతో :-) "...పురశ్చహనుమాన్..." నమోనమ:

    రిప్లయితొలగించండి
  4. చెల్లని వారిని విషమును
    చల్లిన వారిని గీతా చార్యుల పైనన్
    ఒల్లక తొడలను గిల్లెను
    చల్లగఁ గాపాడు గీత సైబిరియనులన్.

    రిప్లయితొలగించండి
  5. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీరు చెప్పేదాక నేను గమనించనే లేదు. నిజమే! బ్లాగు హిట్ కౌంటర్ రెండు లక్షలు దాటింది. బ్లాగుకు సగటున రోజుకు ఆరువందల వీక్షకులు ఉంటున్నారు. దీనివల్ల బ్లాగుకు ఎంతటి ఆదరణ ఉందో తెలుస్తున్నది. ఇందుకు మీ అందరి సహకారమే కారణం.
    కేవల వీక్షకులకు, పూరణలు పంపే కవిమిత్రులకు, ఛందోవ్యాకరణాది చర్చలకు తెరదీసి విలువైన జ్ఞానాన్ని పంచుతున్న పెద్దలకు, పండితులకు, హితులకు అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.
    ఎవరన్నారు తెలుగు పద్యం చచ్చిపోయిందని?
    తెలుగు పద్యానికి జై! తెలుగు పద్యం జిందాబాద్!

    రిప్లయితొలగించండి
  6. చంద్ర శేఖర్ గారూ!
    "ముందుగ వచ్చితేను, మరి ముందుగ పూరణ మీరు వ్రాయగా"
    మీకు అభినందనలు.

    రిప్లయితొలగించండి
  7. శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారూ!
    మీ పూరణ బాగున్నది. కానీ 2వ పాదములో లక్షణ భంగము కనిపించుచున్నది. కాస్త ఓపిక పడండి. మీరు తొందరలో గమనించుటలేదు.

    రిప్లయితొలగించండి
  8. త్రిజగద్విజేతవీవే
    సుజనశ్రీచందనా! యశోధనా! యోగ
    వ్రజదాయి! జ్ఞానరూపిణి!
    విజయశ్రీకలిత గీత! వేవేల నతుల్

    రిప్లయితొలగించండి
  9. మా పూరణ 2వ పాదములో టైపు పొరపాటు --
    యశోధనా కి బదులు యశోధన అని చదువుకోవలెను.

    రిప్లయితొలగించండి
  10. గీత యనునది యె భగ వద్గీత సుమ్ము
    గీత బోధించు శాసించు నూత నిచ్చు
    మాన వత్వంబు నేర్పుచు మనిషి జేయు
    గీత మార్చును మనుజుల గీత నెపుడు

    రిప్లయితొలగించండి
  11. అల్లరి మూకలను బిలిచి యభినం దింతున్.
    ---------

    పిల్లలు సేయుదు రల్లరి
    అల్లరియే వారి కిష్ట మయ్యా !వినుమీ
    కల్లయు కపటము లెరుగని
    అల్లరి మూకలను బిలిచి యభి నందిం తున్.

    రిప్లయితొలగించండి
  12. అల్లదె గీతా సారము
    మెల్లగ నోరార జుర్ర మేదిని యందున్
    నుల్లము రంజిల జేయుచు
    చల్లగ గాపాడు గీత సకల సుజనులన్ .

    రిప్లయితొలగించండి
  13. లక్షల సంఖ్యలలో ప్రియ
    వీక్షకులకు నేస్తమైన విజ్ఞాన నిధీ
    అక్షయ శుభకామనలివె
    అక్షర లలితాంగి శంకరాభరణ! బళా!

    రిప్లయితొలగించండి
  14. ఎల్ల వేళల నుపదేశ మిచ్చు తల్లి
    ఎల్ల దేశంబులం కీర్తి నిచ్చు తల్లి
    ఎల్ల వారికి చల్లని తల్లి గనుక
    గీత మార్చును మనుజుల గీత నెపుడు

    రిప్లయితొలగించండి
  15. వెంకట రాజారావు . లక్కాకులగురువారం, డిసెంబర్ 29, 2011 10:12:00 AM

    విజయోస్తు !భరత జననీ !
    విజయ రహస్య యుత యోగ ! విజయోస్తు సదా !
    విజయోపదేశ బహువిధ
    విజయశ్రీ కలిత గీత ! వేవేల నుతుల్

    విధి లిఖిత మై ,యతీతమై కదలు నుదుటి
    రాత మార్చంగ నెవ్వరి చేత గాదు
    ఐన,తెలిసి యందలి యోగ మాచ రించ
    గీత మార్చును మనుజుల గీత నెపుడు

    తల్లియు దండ్రియు వలె , దగ
    నుల్లము రంజిల్ల బల్కు నొజ్జయు బలె , శ్రీ
    యల్లా మాలిక్ వలె గడు
    చల్లగ గాపాడు గీత సకల సుజనులన్

    రిప్లయితొలగించండి
  16. అల్లదె సైబీ రియనులు
    కొల్లలు గా గీత గూర్చి కోర్టుకు నేగన్
    చెల్లదని కోర్టు చెప్పగ
    చల్ల గ గాపాడు గీత సైబిరి యనులన్ .

    రిప్లయితొలగించండి
  17. అజరామర బోధనముల
    విజయుడు సాధించె నపుడు విజయము పేర్మిన్
    ఋజుపథము పుణ్య విభవము
    విజయశ్రీకలిత గీత! వేవేల నుతుల్

    రిప్లయితొలగించండి
  18. శ్యామలీయం గారూ మన్నించండి

    ఎల్ల దేశంబులం గీర్తి నిచ్చు తల్లి

    అని సవరించాలనుకొంటాను.

    రిప్లయితొలగించండి
  19. శ్రీనరసింహ మూర్తిగారు సరిగ్గా చెప్పారు కీర్తి కాస్తా గీర్తి అవటమే సలక్షణం! శుభం.

    రిప్లయితొలగించండి
  20. రాజేశ్వరిగారూ, మీ పద్యం కోసం యెదురు చూస్తున్నాం. మీరేమో నేనిప్ప ట్నుంచె కుస్తీ పడతాను. [ అదే పద్యం కిట్టించ డానికి ] అన్నారు. ఏం చెబుతారో మరి.

    ఒక దెబ్బ కూడి పడితే
    ఒకటో రకమైన పద్య మౌతుందండీ
    ఒకపట్టాన కుదరదో
    ఒక దణ్ణం పెట్టి మరల మొదటికి రండీ

    రిప్లయితొలగించండి
  21. విజయసఖావిష్కృతశుభ
    విజయా ప్రజ్ఞావివేకవిజ్ఞానముఖీ
    విజయానందామృతధుని
    విజయశ్రీకలితగీత! వేవేల నుతుల్

    రిప్లయితొలగించండి
  22. కొల్లలు హితములు పలుకుచు
    మెల్లగ మనసులను దోచి మేలొనరించున్
    కల్ల నిజంబుల దెలుపుచు
    చల్లగఁ గాపాడు గీత సకల సుజనులన్

    రిప్లయితొలగించండి
  23. చల్లని తీర్పు వినంబడె
    నెల్లరి హృదయముల శాంతి వెల్లివిరియగన్
    మెల్లగ వారును జదువగ
    చల్లగఁ గాపాడు గీత సైబిరియనులన్

    రిప్లయితొలగించండి
  24. గణ దోషమును తెలిపిన నేమానివారికి ధన్యవాదములు. సవరణ తో...

    చెల్లని వారిని విషమును
    చల్లిన వారలను గీత సత్కృతి పైనన్
    ఒల్లక తొడలను గిల్లెను
    చల్లగఁ గాపాడు గీత సైబిరియనులన్.

    రిప్లయితొలగించండి
  25. శ్రీ శ్యామలరావు గారు శ్రీమతి రాజేశ్వరిగారికి వ్రాసిన కందములో యతి మైత్రి పాటించడము విస్మరించారు.

    రిప్లయితొలగించండి
  26. విజయుని గీతిక! బుధులకు
    ఋజు మార్గము నరయ మంచి రీతి! ధరిత్రి-
    న్నజరామరమై వెలిగెడు
    విజయశ్రీకలితగీత! వేవేల నుతుల్.

    రిప్లయితొలగించండి
  27. శంకరాభరణ కర్తకు శుభాకాంక్షలు.

    గురువులు జాలము నందున
    పరువులు మన తెన్గు పద్య ప్రాభవ మునకున్
    బరువులు భాషారులకున్
    చెరువులు సౌజన్యమునకు శ్రీ శంకరులౌ.

    రిప్లయితొలగించండి
  28. ఉల్లమున నెంచు వారిని
    యొల్లక కువిమర్శ జేయు నూసర వెలులన్
    మెల్లగ దారికి తెచ్చును
    చల్లగఁ గాపాడు గీత సకల సుజనులన్

    రిప్లయితొలగించండి
  29. గీత జెప్పెను వెన్నుడు గెలుపు గోరి
    గీత బోధను తలిసెట్టి గీచి చూపె
    నజ్క గీతలు నరులకు నవ్య మెపుడు
    గీత మార్చును మనుజుల గీత నెపుడు

    1) కృష్ణ భగవానుడు గీతా బోధ అర్జునునకు గెలుపును గోరి చెప్పెను.
    2) తలిసెట్టి రమారావు గీతా బోధ (కొడుకు తాటి చెట్టు ఎక్కి కల్లు గీత గీస్తుంటే, కింద తండ్రి ఎలా గీయాలో బోధించడం) అన్న కార్టూను తెలుగులొ మొదటి కార్టూన్ గా
    భావించబడుతోంది.
    3)నజ్కా గీతలు (సదరన్ పెరూ లో) ఇప్పటికీ మానవాళికి అద్భుతం గా తోస్తున్నాయి.

    రిప్లయితొలగించండి
  30. నేమాని వారూ, నేను శ్రీమతి రాజేశ్వరిగారికి వ్రాసిన కందములో యతి మైత్రి పట్టించుకోలేదు - కావాలనే. వ్యావహారిక పద్యాల్లో అంతగా అవసరం లేదని నా అభిప్రాయం.

    రిప్లయితొలగించండి
  31. నమస్కారములు శ్యామలీయం గారూ ! ధన్య వాదములు.
    మీరన్నట్టు " ఒక దెబ్బ కూడి పడితే " ఆ పద్యం చక్కగా వచ్చేస్తుంది. లేదా ఇక కుస్తీ తప్పదు. అవునూ ! కాకి పద్యం తర్వాత నా పద్యం ఎవరు సరి జేసి నట్టు లేదు. అంత ఘోరం గా ఉందా ?
    మీ అందరికి సవరణ జేయగల ఓర్పు ఉండాలే గానీ నాలుగు పూరణలు వ్రాయాలను కున్నాను . అందుకే ఇప్పుడు .

    రిప్లయితొలగించండి
  32. జల్లను గీతా సారము
    ఉల్లము రంజిల్లు నటుల నుతియిం పంగన్ !
    ఒల్లము నీపాద యుగళి
    చల్లగ గాపాడు గీత సకల సుజనులన్ !
    --------------------------------------------------
    కల్లా కపటము తోడను
    నల్లని కన్నయ్య ఘనతను నుడువని వారై !
    చిల్లర చేష్టలు చేసిరి
    చల్లగ గా పాడు గీత సైబిరియనులన్ !

    సశేషం . [ ఇనిస్టాల్ మెంటులో ]

    రిప్లయితొలగించండి
  33. భజనలు చేయగ కృష్ణుని
    విజయములను పొందు రనుచు విభవము తోడన్ !
    గజమునకు మోక్ష మిచ్చిన
    విజయశ్రీ కలిత గీత ! వేవేల నుతుల్ !
    -------------------------------------------
    రాత మారదు చేసిన పాత ములకు
    ఆర్తితో పిలువ నరుదెంచు నాప్తు డనుచు
    కోత యిచ్చును కొలిచిన కొంత వరకు
    గీత మార్చును మనుజుల గీత నెపుడు !

    రిప్లయితొలగించండి
  34. శ్రీగురుభ్యోనమ:

    నిజము గ్రహించితి కృష్ణా
    విజయము లెల్లపుడు కలుగు విన నీపలుకుల్
    సుజనుల పాలిట సొమ్మౌ
    విజయశ్రీకలితగీత! వేవేల నుతుల్

    రిప్లయితొలగించండి
  35. ఉల్లికి మల్లెకు భేదము
    తెల్లముగ తెలియుట కష్టతే కొందరకున్
    తల్లడిలి చల్లబడిరిగ
    చల్లగఁ గాపాడు గీత! సైబిరియనులన్.

    రిప్లయితొలగించండి
  36. రాత అనే వాడుక మాటను ఉపయోగించుట సమంజసమా? వ్రాత అనరాదా? మిత్రులు తగు జాగ్రత్తతో భాష యొక్క పటుత్వమును సడలనీయక ఉంచగలరని నా నమ్మకము.

    రిప్లయితొలగించండి
  37. అయ్యా శ్రీ చంద్రశేఖర్ గారూ!
    మీ ఉల్లి పద్యములో 2వ పాదము బాగులేదు. తెల్లమగుట కష్టమగుగదే కొందరకున్ -- అనండి.

    రిప్లయితొలగించండి
  38. శ్రీ నేమాని మహాశయుల సూచనలు శిరసావహిస్తూ:
    బ్రహ్మవ్రాతల మార్చెడి వజ్ర పదము
    ఆటుపోటులడ్డుకొనెడి ఆత్మబంధు
    వా పరమపావన భగవద్వచనమౌ సు
    గీత మార్చును మనుజుల గీత నెపుడు
    మనవి: పదము=కిరణము అనే అర్థంలో;
    ----
    ఉల్లికి మల్లెకు భేదము
    తెల్లమగుట కష్టమగుగదే కొందరకున్
    తల్లడిలి చల్లబడిరిగ
    చల్లగఁ గాపాడు గీత! సైబిరియనులన్.

    రిప్లయితొలగించండి
  39. విజయము నెప్పుడు నీదే

    విజయాలకు దల్లివీవ ! విజయుని మాతా !

    అజరా మరముగ వెలిగెడి

    విజయ శ్రీ కలిత గీత !వేవేల నుతుల్ .

    రిప్లయితొలగించండి
  40. కవిమిత్రులారా,
    సంతోషం. నేనూహించినట్లే చక్కని స్పందన వచ్చింది. అందరికీ ధన్యవాదాలు.
    *
    చంద్రశేఖర్ గారూ,
    మీ పూరణలు (నేమాని వారి సూచనతో సవరించిన పూరణతో) చాలా బాగున్నాయి. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    నేమాని వారి సూచనతో సవరించిన మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    సుజనస్తుత పాండిత్య
    స్రజధారీ! రామజోగి! సత్కవివర్యా!
    భజియించెద నిన్ను కవన
    విజయాంచిత కీర్తి! నీకు వేవేల నుతుల్.
    *
    సుబ్బారావు గారూ,
    మీ నాలుగు పూరణలూ బాగున్నాయి. అభినందనలు.
    గీతను ‘విజయుని మాతా’ అన్నారు. ‘విజయ విధాతా’ అంటే ఇంకా బాగుంటుందేమో?
    మీ ‘అల్లరిమూకలను ...’ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    *
    శ్యామల రావు గారూ,
    మీ నాలుగు పూరణలూ ఉత్తమంగా ఉన్నాయి. అభినందనలు.
    సరదాగా వ్యావహారికంలో మీ పద్యప్రయోగం చమత్కార జనకంగా ఉంది. నేమాని వారన్నట్టు యతిమైత్రి పాటించి ఉంటే ఇంకా బాగుండేది. ‘ఒకటో రకమైన పద్య మొక్కరి దైతే ...’ అంటే ఎలా ఉంటుంది?
    ఏమీ మీ కవితా ఝరి!
    సామాన్యము గాదు, నిజము, శ్యామల రావూ!
    శ్రీమద్భగవద్గీతా
    ప్రామాణికతను నుడివితె పద్యము లందున్.
    *
    లక్కాకుల వెంకట రాజారావు గారూ,
    మీ మూడు పూరణలూ చక్కగా ఉన్నాయి. అభినందనలు.
    *
    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    ప్రశస్తంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,
    ధన్యవాదాలు.
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    *
    టేకుమళ్ళ వెంకటప్పయ్య గారూ,
    బహుకాల దర్శనం. సంతోషం!
    వివిధగీతాప్రాధాన్యతలను వివరిస్తున్న మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    చివరాఖరుకు కిట్టించి మాట నెగ్గించుకున్నారు. సంతోషం. అభినందనలు.
    మొదటి పూరణలో ‘ఒల్లము నీపాద యుగళి’ అంటూనే కాపాడమంటారు. అక్కడ ‘ఒల్లము నీ పదములు విడ’ అంటే బాగుంటుందేమో?
    రెండవపూరణ రెండవపాదంలో గణ యతి దోషాలు. ‘నల్లని కన్నయ్య ఘనత నచ్చని వారై’ అంటే సరి!
    మూడవ పూరణలో ‘పొందు రనుచు’ను ‘పొందవచ్చు’ అందాం.
    నాల్గవ పూరణలో మొదటి పాదంలో ‘పాతములకు’ అన్నచోట ‘పాపములకు’ అనీ, రెండవ పాదంలో ‘పిలువ’ అంటే గణదోషం కనుక ‘పిల్వ’ అనీ నా సవరణ.
    *
    శ్రీపతి శాస్త్రి గారూ,
    చక్కని పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  41. శ్రీ శంకరయ్య గారికి నమస్కారములు.
    మీ సవరణ బాగుంది. కృతజ్ఞతలు .

    రిప్లయితొలగించండి
  42. మొత్తానికి కిట్టిం చానె గానీ మెప్పించ లేక పోయాను. అన్నీ శ్రమతో సవరణ చేసి నందుకు తమ్మునికి ధన్య వాదములు. ప్చ్ ! శ్యామలీయం గారూ ! లాభం లేదు. నేనింకా ఒక మెట్టు కుడా ఎక్కలేదు.

    రిప్లయితొలగించండి
  43. సోదరి రాజేశ్వరి గారికి నమస్కారములు.
    "మెట్టు మెట్టుకు గండము చుట్టు కొనును."
    ఆ గండములను దాటి ఒక్కొక్క మెట్టే
    ధైర్యం గా ఎక్కుతూ ముందుకు సాగాలి .

    రిప్లయితొలగించండి
  44. ఇల్లను చీకటి నూతిన,
    కల్లగు సంసార మందు గడుపుట కంటెన్!
    గొల్లఁడు బోధలు చదివిన
    చల్లగ గాపాడు గీత సకల సుజనులన్ !

    కల్ల = అసత్యము, నిజము కానిది అనే అర్ధంతో

    రిప్లయితొలగించండి
  45. ఉల్లములలరగజేయును
    తల్లిగహితమునువచించు ,ధర్మపుగనియై
    అల్లదె కృష్ణముఖోద్గత
    చల్లగ గాపాడు గీత సకల సుజనులన్ !

    రిప్లయితొలగించండి