కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది
సమరమునే కోరినాఁడు శాంతిని పొందన్.
ఈ సమస్యను పంపిన
గోలి హనుమచ్ఛాస్త్రి గారికి
ధన్యవాదాలు.
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది
సమరమునే కోరినాఁడు శాంతిని పొందన్.
ఈ సమస్యను పంపిన
గోలి హనుమచ్ఛాస్త్రి గారికి
ధన్యవాదాలు.
రమణులతో చెడ దిరుగగ
రిప్లయితొలగించండిగమనించెను రోగములను కామేశ్వర్రావ్
శ్రమయనక వెడలి 'డాక్టరు
సమరమునే' కోరినాఁడు శాంతిని పొందన్.
గోలి వారూ శభాష్
రిప్లయితొలగించండిమిస్సన్న గారూ ! ధన్యవాదములు.
రిప్లయితొలగించండిశ్రీగురుభ్యోనమ:
రిప్లయితొలగించండిఅమలిన హితమును గోరిన
గమనింపక కౌరవుండు గర్వముతోడన్
మమతలు జావగ మదిలో
సమరమునే కోరినాఁడు శాంతిని పొందన్
కౌరవుండు = దుర్యోధనుడు
సమరంబు సేయ నొల్లని
రిప్లయితొలగించండియమ ధర్మజ సుతుడు పంపె యదుకుల ప్రభునిన్
సమతత్వము లేనందున
సమరమునే కోరినాడు శాంతిని పొందన్.
సమరమె శాంతికి భూమిక
రిప్లయితొలగించండిసమరమ్మే దుర్మతులను సమయింపగ శ్రీ
రమణుండు కురుక్షేత్రపు
సమరమునే కోరినాడు శాంతిని బొందన్
శమదమములనెడి గుణములఁ
రిప్లయితొలగించండిదిమిరము వలె కమ్మినట్టిఁ దెలియమిఁ దనమున్,
భ్రమలను ద్రెంచుచు, లొంగక
సమరమునే కోరినాఁడు శాంతిని పొందన్.
ఇంద్రియములకు లొంగక వాటితో సమరము చేసి జయించి శాంతిని పొందుట.
పూరణ లన్ని సమవృద్దిగ వున్నవి.
రిప్లయితొలగించండిశాంతికి, సమరమును జత చేసిన
శాస్త్రిగారికి మా అభినందనలు.
అయ్యా శాస్త్రిగారూ, డాక్టరు సమరం ఇంకా సర్వీసులో వున్నాడా:-)?
రిప్లయితొలగించండిఏడనుండి,ఏడకొచ్చి
రిప్లయితొలగించండిసమస్యను చతురతతో
మంచిగా పూరించి
మామనసు దోచినాడు శాస్త్రిగారు.
వెంకటెశ్వరరావు.
స్వామియె శరణం
రిప్లయితొలగించండిగురువు గారికి ధన్యవాదములు
అన్నాహజారే పోతాటమునకు బాసటగా నిల్చిన వారికొఱకు
-------------
శ్రమయనక మన హజారే
సమరమునే కోరినాడు, శాంతిని పొందన్
తమ దుర్గతి దొలగు సమా
గమమును జూడ జనులెల్ల గర్జించిరిలే|
( సమాగమమును = మంచి రోజు)
మందాకినిగారు శమదమములనెడి గుణములు అన్నారు. కాని శమదమములు గుణములు కావు. సాధనసంపత్తిలో అంగాలు. స్థూలంగా శమము అంటే అంతరింద్రియ నిగ్రహం, దమము అంటే బహిరింద్రియ నిగ్రహం.
రిప్లయితొలగించండిశమము, దమము అనేవాటిని గుణములు అనవచ్చనే అనుకుంటున్నాను.
రిప్లయితొలగించండిఅలా కాదు అంటే ఈ క్రింది విధముగా మొదటిపాదమును మార్చితే సరిపోతుంది.
శమదమములచే మనమునుఁ
సమయించగ రిపుషట్కము
రిప్లయితొలగించండివిమలాత్ముడు విమలయోగవిద్యారతుడై
శమదమసాధనయుతుడై
సమరమునే కోరినాఁడు శాంతిని పొందన్.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమందాకినిగారూ, శ్రీమద్భగవద్గీత యందలి మోక్షసన్యాస యోగములోని 42 వ శ్లోకమును గమనించండి:
రిప్లయితొలగించండిశమౌ దమః తప శ్శౌచం క్షాంతి రార్జవ మేవ చ
జ్ఞానం విజ్ఞాన మాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజమ్
దీని భావమేమిటంటే, శమము, దమము, తపస్సు, శౌచము, ఓర్మి, ఋజుత్వము, జ్ఞాన విజ్ఞానాలు, ఆస్థిక భావము అనునవి బ్రాహ్మణులకు స్వభావ సిద్ధమైన కర్మలు.
కాబట్టి శమదమాలు కర్మవిభాగములలోనికి వస్తాయి కాని గుణములు కావని నా అభిప్రాయం. గుణములనేవి సత్వరజ స్తమములనే గుణత్రయములు లేదా వాటి యొక్క మేళనవికారములు. యేవిధముగా మూలవర్ణత్రయమైన ఎరువు, నీలం, ఆకుపచ్చల వివిధమైన నిష్పత్తులతో అనంతమైన వర్ణములు యేర్పుడుతున్నవో అదే విధముగా సత్వరజ స్తమముల వివిధనిష్పత్తులతో అనంతమైన వాస్తవిక గుణసముదాయ మేర్పడుతున్నది. గీత యందు గుణత్రయవిభాగయోగము అనే అధ్యాయము కూడ గలదు.
సమరమునొల్లని పార్థుడు
రిప్లయితొలగించండికమలాక్షుని బోధలువిని క్షత్రియునకు ధ
ర్మముగా గ్రహించి తదుపరి
సమరమునే కోరినాడు శాంతిన్ పొందన్
నేమానివారి సూచన మేరకు, ఒక చిన్న సవరణ. శమదమ బదులుగా శమముఖ అని మార్చిన అనంతరం, పునఃప్రకటనము:
రిప్లయితొలగించండిసమయించగ రిపుషట్కము
విమలాత్ముడు విమలయోగవిద్యారతుడై
శమముఖసాధనయుతుడై
సమరమునే కోరినాఁడు శాంతిని పొందన్.
ఆలాగే విమల శబ్దం పునరుక్తికావటం పరిహరించాలనుకుంటే, ప్రకటయోగవిద్యారతుడై అన్నా బాగుంటుందని నా అభిప్రాయం.
శ్యామలీయం గారు,
రిప్లయితొలగించండిఎంతో చక్కగా వివరించారు. ధన్యవాదాలండి.
అందుకే పెద్దలు వ్రాయటానికి ముందు ఎక్కువ చదివి తెలుసుకోవాలని అంటారు.
నేమాని వారి పద్యం
రిప్లయితొలగించండిసమరమునొల్లని పార్థుడు | కమలాక్షుని బోధలువిని క్షత్రియునకు ధ
ర్మముగా గ్రహించి తదుపరి | సమరమునే కోరినాడు శాంతిన్ పొందన్
చాలా హృద్యంగా ఉంది. సరదాగా, నా ధోరణిలో దీనినే మరి కొంచెం ప్రౌఢంగా వ్రాస్తే యీ క్రింది విధంగా తయారవుతుందేమో.
సమరం బొల్లని పార్థుడు | కమలాక్షుని బోధవడసి క్షత్రియ ధర్మా
భిముఖండై స్థిరమతియై | సమరమునే కోరినాడు శాంతిన్ పొందన్
ఈ సాహసాన్ని నేమానివారు మన్నిస్తారని ఆశిస్తున్నాను.
మందాకినిగారూ, మీరన్నది నిజమే.
రిప్లయితొలగించండిప్రసిధ్ధ నవలాకారిణి Jane Austen ఒకచోట అంటుంది. 30వ పడిలో పడేదాకా వ్రాయవద్దని . ఎందుకంటే లోకానుభవమూ, పఠనార్జిత జ్ఞానమూ సరిపోవని. చాలా కాలం క్రిందట, ఒక స్నేహితురాలు నాతో, శ్యామలరావూ నువ్వూ వ్రాయవచ్చుకదా అంటే, ఇంకా కొన్నాళ్ళాగాలీ అని యీ మాటలే ఆమెకు చెప్పాను.
ఇపుడు నాకు 60 నడుస్తున్నది. కాని ఇన్నేళ్ళలో నా అజ్ఞానం పెరిగినట్లుందే తప్ప జ్ఞానం కాదు.
2)
రిప్లయితొలగించండిసమరంబున నక్సలుసులు
యమపురికిన్నేగిరపుడ యడవుల లోనే
అమరుల నాయకు డంతట
సమరమునే కోరినాడు శాంతిని పొందన్.
అయ్యా! శ్యామలరావు గారూ!
రిప్లయితొలగించండిమీ షష్టి పూర్తి పండుగ ఎప్పుడు? జరుపుకొనే అవకాశములుంటే మాకు తెలియ జెయ్యండి. పద్య ఆశీస్సులైనా పంపగలము.
అయ్యా శ్యామల రావు గారూ!
రిప్లయితొలగించండినేను కొవ్వూరులో ఉన్నప్పుడు (1982 - 94)మిత్రుల సూచన మేరకు పద్యములను సమాసభూయిష్ఠముగా రచించేవాడిని. తరువాత తణుకులో నున్నప్పుడు (1995-98) పెద్దల సలహాపై తేలికైన భాషను వాడుట అలవరచుకొన్నాను. ఇప్పుడు నా భాష ఇంకా పలుచ బడుతుందేమో అనిపించుచున్నది.
ఏనాటి అగ్రహారమొ
మానాటికి కండ్రికాయె మా పని దీరన్
మీ నాడు మాన్య మయ్యెను
నానాటికి తీసికట్లు నాగంభట్లూ!
నేమాని వారూ, మీ పద్యానికి నా అనుసరణ వ్రాసింది, నాకు మీలా సులభబాషలో వ్రాయటం ఇంకా అభ్యాసం కాలేదని చెప్పుకోవటానికే. ఒకప్పుడు నా ఇంగ్లీషుకూడా ఇంచుమించు Miltonian శైలిలో ఉండేది. అదిచూసి మా నాన్నగారు తేలిక భాషలో వ్రాయలేవా అని మందలించారు. ఇప్పటికీ అప్పుడపుడు చేంతాడంత వాక్యాలు వ్రాస్తుంటాను ఆంగ్లంలో. చివరికి ఒక ఇంగ్లీషువాడికే, నేను భారతీయుణ్ణి మహాప్రభో, యింగ్లీష్ వాడిని కానని చెప్పుకోవలసి వచ్చిందంటే నమ్మండి.
రిప్లయితొలగించండిమా మావయ్యగారు శ్రీ పాండురంగ విఠల్ ప్రసాద్ గారు కొంత జటిలమైన భాష వాడతారు. 'ఒరేయ్. అలా రాయటం నీవల్ల కాదు. నీది చాలా తేలిక శైలి' అన్నారాయన. మీరు మరింత తేలికశైలిలో వ్రాస్తే ఆశ్చర్యం వేసింది. నేనైతే ఇది యెలా వ్రాసి ఉండే వాడనా అని ప్రయోగం చేసి చూసానంతే.
అదలా ఉంచి మీరు ఉటంకించి పద్యం ఏనాటి అగ్రహారమొ.. బాగుంది. విన్నదే. యెవరి పద్యమో గుర్తుకు రావటంలేదు. నానాటికి తీసికట్లు నాగంభట్లు అన్న సామెతకు ఇదే మూలమనుకుంటాను.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
నేమాని వారి స్ఫూర్తితో :
01)
_____________________________________
కమలాక్షుని బోధనతో
సమయించగ నఙ్ఞతయును - శౌర్యము తోడై
సమరాంగణమున నరుడే
సమరమునే కోరినాడు - శాంతిని పొందన్ !
_____________________________________
కుట్టనిచో తేలు కాదు కుమ్మరి పురుగే
రిప్లయితొలగించండి-------------------
కుట్టని తేలుల నెరుగము
కుట్టును నవి దారి పొడుగు గ్రుచ్చుచు పో తూ
కుట్టుట వాటికి సహజము
కుట్టనిచో తేలు కాదు కుమ్మరి పురుగే
సుబ్బారావుగారూ, భట్టుమూర్తిని రంగంలోకి దింపారే!
రిప్లయితొలగించండిలొట్ట యిదేటి మాట పెను లోభులతో మొగమోట మేల తా
గుట్టక యున్నవృశ్చికము కుమ్మర పుర్వని యందురే కదా?
పట్టపు రాజు పట్టి సరిపల్లె సరాసరి యీయకున్న నే
దిట్టక మాన.......
హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండివారెవ్వా! ఎంత చమత్కారంగా చెప్పారు! చక్కని పూరణ. అభినందనలు.
*
శ్రీపతి శాస్త్రి గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
సుబ్బారావు గారూ,
మంచి విషయంతో పూరణ చెప్పారు. అభినందనలు.
‘యమధర్మజు’డంటేనే ధర్మరాజు కదా! యమధర్మజ సుతుడు? అలాగే ‘యదుకులప్రభునిన్’ అన్నప్పుడు ‘ల’గురువై గణదోషం ఏర్పడుతున్నది. ఆ పాదాన్ని ‘యమధర్మజు డంపినాడు యదుకులనాథున్’ అంటే సరి!
మీ రెండవ పూరణకూడా బాగుంది. అభినందనలు. ‘నక్సలుసులు’ శబ్దం కొంచెం ఇబ్బందికరంగా ఉంది. ఆ పాదాన్ని ‘సమరమున తీవ్రవాదులు’ అందామా?
*
రాజారావు గారూ,
శ్రేష్ఠమైన పూరణ. అభినందనలు.
*
మందాకిని గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
*
కూచిమంచి నాగేంద్ర గారూ,
స్వాగతం. ధన్యవాదాలు.
*
వెంకటేశ్వర్ గారూ,
ధన్యవాదాలు.
*
వరప్రసాద్ గారూ,
చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
*
శ్యామల రావు గారూ,
మందాకిని గారి పూరణను సవరిస్తూ, చెప్పిన విషయాలు ఎంతో ఉపయుక్తంగా ఉన్నాయి. ధన్యవాదాలు.
*
పండిత నేమాని వారూ,
ప్రశస్తమైన పూరణ. అభినందనలు.
*
వసంత కిశోర్ గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
మిత్రులారా!
రిప్లయితొలగించండిఈనాడు పూరణలు సంఖ్యా బలము లేకున్నా రసపుష్టితో అలరుచున్నవి.
శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారు వైద్యులు సమరం గారిని పరిచయము చేసేరు.శ్రీ శ్రీపతి శాస్త్రి గారు, శ్రీ సుబ్బా రావు గారు, శ్రీ రాజా రావు గారు, శ్రీ వసంత కిశోర్ గారు కురుక్షేత్ర సంగ్రామ సంబందిత విషయాలనే ఎత్తుకొన్నారు.శ్రీమతి మందాకిని గారు, శ్రీ శ్యామలరావు గారు వేదాంత విద్యను ప్రదర్శింప జేసేరు. శ్రీ వర ప్రసాద్ గారు అన్నా హజారే గారిని స్తుతించేరు. శ్రీ సుబ్బా రావు గారు తమ రెండవ పూరణలో నక్సల్ నాయకులను గూర్చి చెప్పేరు. మొత్తము మీద అన్ని పూరణలు బాగుగనే ఉన్నాయి. అందరికి అభినందనలు.
చక్కని పూరణలు చేసిన కవిమిత్రు లందరకు అభినందనలు.
రిప్లయితొలగించండిశంకరార్యులకు, శ్రీ నేమాని వారికీ ధన్యవాదములు.
'మన' చంద్ర శేఖర్ గారికి, కూచి'మంచి' వారికి, వెంకటేశ్వర రావు గారికి ధన్యవాదములు,.
శంకరయ్య గారికి నమస్కారములు. ధర్మ రాజు అర్ధము లో ఆ భావన నాకు
రిప్లయితొలగించండిస్ఫురించనె లేదు.మీ సవరణ చాల బాగుంది.కృ త జ్ఞుడను .సవరించు
కొందును.అలాగే యదు కుల నాధున్, తీ వ్ర వాదులు కూడ బాగుంది.
శంకరార్యా !ధన్యవాదములు !
రిప్లయితొలగించండిసుమతులు భరతాంబ సుతులు
రిప్లయితొలగించండికుమతుల చెఱనుండి ముక్తి గొని రహియింపన్
అమరుడు గాంధి యహింసా-
సమరమునే కోరినాఁడు శాంతిని పొందన్
కుముదము చేకొని యాతడు
రిప్లయితొలగించండిరమణీమణి చెంత జేరి రాగము తోడన్ !
బ్రమియింప దలచి భార్యను
సమరమునే కోరి నాడు శాంతిని పొందన్ !
రాగము = అనురాగము .
పండిత నేమాని వారూ,
రిప్లయితొలగించండిధన్యవాదాలు.
*
మిస్సన్న గారూ,
మీ ‘అహింసా సమరము’ చాలా బాగుంది. అభినందనలు.
నిజానికి నేను ‘సత్యాగ్రహ సమరము’ విషయంగా పూరణ చేయాలనుకున్నాను. నిన్న మా అమ్మాయిని, మనుమడిని తీసుకురావడానికి వెళ్ళడంతో సమయం చిక్కలేదు. అప్పటికీ రాత్రి అనుకున్నా ‘గాంధీగారి సమరం’గురించి ఎవరూ ప్రస్తావించలేదని! మీ పూరణతో నాకోరిక తీరింది. ధన్యవాదాలు.
*
రాజేశ్వరి అక్కయ్యా,
మీ ‘ప్రణయకలహం’ పూరణ బాగుంది. అభినందనలు.
గురువుగారూ ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిభ్రమలన్ని తొలగి పోవగ
రిప్లయితొలగించండిఅమల మనస్కత మురారి నర్చించుటకై
కుమతుల దుశ్చింతలపై
సమరమునే కోరినాడు ,శాంతిని పొందన్
-----------------
‘కమనీయం’ గారూ,
రిప్లయితొలగించండిబాగుంది మీ పూరణ. అభినందనలు.
కాని ‘కర్త’ ఎవరో చెప్పడం మరిచారు. ‘కోరినవాడు’ ఎవరు?
తొలగ నాతడు /లేక, తొలగ భక్తుడు అంటే సరిపోతుంది.
రిప్లయితొలగించండిశ్రమ లేకనె హిట్లరపుడు
రిప్లయితొలగించండితమ పొరుగుల నాక్రమించి దండించంగన్
శమదమము వీడి చర్చిలు
సమరమునే కోరినాఁడు శాంతిని పొందన్
కుములుచు నేడ్చెడి మమతన్
రిప్లయితొలగించండిచిమచిమ లాడించి నవ్వి చీరుచు జుత్తున్
కమలపు చిహ్నము తోడుత
సమరమునే కోరినాఁడు శాంతిని పొందన్