ఇకార, అకార విశిష్ట శ్లోకం
క్రింది శ్లోకం పూర్వార్ధం ఇకార విశిష్టమై, ఉత్తరార్ధం అకార విశిష్టమై ఉన్నది.
క్షితిస్థితిమితిక్షిప్తి
విధివిన్నిధి సిద్ధిలిట్ |
మమ త్ర్యక్ష నమద్దక్ష
హర స్మరహర స్మర ||
తాత్పర్యం
ఓ ముక్కంటీ! సర్వజ్ఞా! లయకరా! అష్టవిధశక్తి శాలీ! భూతిదాతా! దక్ష మన్మథ సంహారా! నన్ను కాపాడు.
కాపాడు మయ్య !మమ్ముల
రిప్లయితొలగించండినేపాపము సేసి యెఱుగ మేవేళల లోన్
మీ పాద సేవ చేతుము
మా పాలిట దైవ మీవె మంజుల నాధా !
సుబ్బారావు గారూ,
రిప్లయితొలగించండిమంజునాథ ప్రార్థనగా మీ పద్యం చాలా బాగుంది. ధన్యవాదాలు.