28, డిసెంబర్ 2011, బుధవారం

చమత్కార పద్యాలు - 160

ఉకార విశిష్ట శ్లోకం

క్రింది శ్లోకంలోని అక్షరాలన్నీ కేవలం ఉత్వంతోనే ఉన్నాయి.

ఉరుగుం ద్యుగురుం యుత్సు
చుక్రుశుస్తుష్టువుః పురు
|
లులుభుః పుపుషుర్ముత్సు
ముముహుర్ను ముహుర్ముహుః
||

తాత్పర్యం
దేవతలందరూ యుద్ధానికి వెళ్తూ దేవగురువైన బృహస్పతిని సంతోషంగా, స్థిరంగా ఉండమని, మాటిమాటికి నిద్రావశుడు కావద్దని ప్రార్థించారు.

1 కామెంట్‌:

  1. శ్రీ శంకరయ్య గారికి నమస్కారములు.
    కుంభ కర్ణుని వలె బృహస్పతి కూ డ నిద్రా వశు డా ?

    రిప్లయితొలగించండి