20, డిసెంబర్ 2011, మంగళవారం

చమత్కార పద్యాలు - 151

చాటు శ్లోకం


అపూర్వోऽయం మయా దృష్టః
కాంతం కమలలోచనే
|
శోంతరం యో జానాతి
 స విద్వాన్ నాత్ర సంశయః
||

వాచ్యార్థం -
ఓ కమలాక్షీ! అపూర్వం (మును పెన్నడు లేనిది), కాంతం (సుందరం) ఐనది నాచేత చూడబడినది. ఎవడైతే శోంతరం తెలుసుకుంటాడో అతడే పండితుడు. అందులో అనుమానం లేదు.


వ్యంగ్యార్థం -
అపూర్వం (మొదట ‘అ’కారం ఉన్నదీ), కాంతం (క + అంతం = చివర ‘క’కారం ఉన్నదీ), శోంతరం (శో + అంతరం = నడుమ ‘శో’ ఉన్నదీ) అయిన ‘అశోక’ వృక్షాన్ని చూచాను. 


               (శ్రీ శ్రీభాష్యం విజయసారథి గారు సేకరించిన ‘ప్రహేళికలు’ గ్రంథం నుండి)

2 కామెంట్‌లు:

  1. అశోక వృక్ష దర్శనం . చాలా బాగుంది తమ్ముడూ ! హేట్సాఫ్

    రిప్లయితొలగించండి
  2. ఆది ని "అ"కారము
    మద్యన "ఓత్వ సహిత శకారము"
    అంత్యమున "పూర్ణ బిందు సహిత క కారము"=
    అశోకం.
    నేను పండితుడను అవునో కానో తెలుపగలరు.
    క్షం తవ్యుడను.

    రిప్లయితొలగించండి