1, మే 2012, మంగళవారం

పద్య రచన - 13


కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యా(లను)న్ని వ్రాయండి.

13 కామెంట్‌లు:

  1. భామా మేనక వెడలుము
    లేమా నే జారి పోతి లేకను తెలివిన్
    ఈమె శకుంతలగా యగు
    లే మా దేశమున పేరు లెస్సగ పొందున్.

    రిప్లయితొలగించండి
  2. తనయను గాంచుమో యనఘ! తాపససత్తమ! నాకమేగెదన్
    మనమలరంగ బెంచుమిక మత్తనుజాతను గాధినందనా!
    యని వచియించు మేనకకు నా మునివర్యు డికేమి పల్కకే
    తనగతి నేగినాడు భవితవ్యము దేవుని కప్పగించుచున్.

    రిప్లయితొలగించండి
  3. మేనక ! యేగుమునిక నీ
    కూ నయు నీ తోడు గాగ , గోరిక తీ రెన్
    రానిక నీ దరి కెపుడును
    జానెడు గా నున్న పిల్ల శాకుంతల యౌన్ .

    రిప్లయితొలగించండి
  4. ఇంద్రుని పంపున నాముని
    చంద్రుని వశపరచు కొనగ చయ్యన సడలె-
    న్నింద్రియ నిగ్రహము వలపు
    సంద్రమునన్ ముంచె మేన్క సంయమి లొంగెన్.

    చెట్టాపట్టాల్ కట్టిరి
    చెట్టుల పుట్టలను వాంఛ చెలియలి కట్టన్
    బిట్టుగ దాటగ పుట్టెను
    పట్టియ మేనకకు మునికి భంగ తపంబై.

    పట్టిని గొనుమిక నేని-
    ప్పట్టున బోవలెను సురుల పట్టనమునకు-
    న్నిట్టుల చెప్పగ మేనక
    పుట్టియ మునిగిన దటంచు మునికిక తోచెన్.

    తపము భంగ పరచి తన దారి తానయి
    పోవ జూచు పూవు బోడి గాంచి
    గాధి రాజ సుతుడు గ్రహియించి ముప్పును
    వలదు బిడ్డ టంచు పలికె నపుడు.

    మేనక యా పసి బిడ్డను
    తానుగ పొదలందు విడచి తరలెను దివికిన్
    మానుగ శకుంత పక్షులు
    దానిని సాకంగ కణ్వ తపసి గ్రహించెన్.

    రిప్లయితొలగించండి
  5. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    పద్యం బాగుంది. అభినందనలు.
    కాని ‘శకుంతల’ నామకరణం చేసింది కణ్వమాహర్షి కదా!
    *
    సత్యనారాయణ మూర్తి గారూ,
    చక్కని పద్యం వ్రాసారు. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    మంచి పద్యం వ్రాసారు. అభినందనలు.
    ‘ఏగుము + ఇక’ ... ద్రుతమెక్కడిది? ‘ఏగుము నీవీ / కూనయు...’ అందామా?
    మీరూ విశ్వామిత్రుడే ఆ కూనకు శకుంతల పేరు పెట్టినట్లు వ్రాసారు.
    *
    మిస్సన్న గారూ,
    మంచి ఖండిక వ్రాసారు. అభినందనలు.
    మేనకను మేన్క అన్నారు?

    రిప్లయితొలగించండి
  6. గురువుగారూ ధన్యవాదాలు.
    మొదటి పద్యాన్నిలా సవరిస్తున్నాను.

    ఇంద్రుని పంపున నాముని
    చంద్రుని వశపరచు కొనగ చయ్యన సడలె-
    న్నింద్రియ నిగ్రహము వలపు
    సంద్రమునన్ ముంచె జాణ సంయమి లొంగెన్.

    రిప్లయితొలగించండి
  7. విపినము నందు బ్రహ్మమును వేడి తపంబును సల్పుచున్న నా
    తపమిదె భంగమయ్యెనిట, తప్పుయెఱింగియు చేయుచుంటినే!
    చపలత, సుంత మోహమిది చప్పున లొంగుటదెంతచిత్రమో!
    యిపుడిక బాల తోడ, చనుమెక్కడికైనను నీవు మేనకా!

    రిప్లయితొలగించండి
  8. భామా వీడుము నన్నిక
    నీ మోహము నందు మునిగి నీమము లేకన్ !
    కామగతి తిరిగి యుంటిని
    భూమిక చాలించి మరలి పొమ్మిక దివికిన్ !

    రిప్లయితొలగించండి
  9. లక్ష్మీదేవి గారూ,
    మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    కందం అందంగా ఉంది. అభినందనలు.
    ‘భూమిక చాలించి...’?

    రిప్లయితొలగించండి
  10. గురువు లకు ధన్య వాదములు
    భూమిక = పాత్ర , వేషము [ నిఘంటువులో ఉంది ]

    రిప్లయితొలగించండి
  11. శ్రీపతిశాస్త్రిబుధవారం, మే 02, 2012 10:06:00 PM

    శ్రీగురుభ్యోనమ:

    దృష్టిమరల్చుచున్నిటుల తేజము తగ్గగ జేయుచుంటివే
    భ్రష్టుడనైతి మోహమను పాశమునందున నేను జిక్కితిన్
    కష్టములిట్లు కల్గినవి కన్నకుమార్తెను వీడుచుంటి నే
    శిష్టుడనయ్యెదన్ ఘన వశిష్టుడు మెచ్చగ బ్రహ్మవేత్తనై

    రిప్లయితొలగించండి
  12. శ్రీపతి శాస్త్రి గారూ,
    దుష్కరప్రాసతో చక్కని పద్యం వ్రాసారు. బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  13. శంకరార్యా ! ధన్యవాదములు.ఋషి త్రికాలఙ్ఞుడని అలా వ్రాశాను. సవరణ చేయుచున్నాను.

    భామా మేనక వెడలుము
    లేమా నే జారి పోతి లేకను తెలివిన్
    ఈమన పుత్రిక పొందును
    లే మా దేశమున పేరు లెస్సగ భావిన్.

    రిప్లయితొలగించండి