క్రూరుడు దుస్ససేను డతి ఘోరముగా ద్రుపదాత్మజన్ సభా ద్వారము నుండి యీడ్చుకొని వచ్చి, మహాత్ముల మధ్య నిల్పియున్, చీరను లాగు వేళ - తన చెంగును గట్టిగ బట్టి యొల్లదే జార! గుణంబు గల్గు సతి సాధ్వి యటంచు నుతించి రెల్లరున్!
సత్యనారాయణ మూర్తి గారూ, సీతామాతపై పుష్పాలను, శకుంతల దురవస్థకు కన్నీటిని జారవిడిచిన మీ రెండు పూరణలు ఉదాత్తంగా ఉన్నాయి. అభినందనలు. * లక్ష్మీదేవి గారూ, భర్తకు అన్నివిధాలా అనుకూలురాలైన సతిని గూర్చిన మీ పూరణ బాగుంది. అభినందనలు. * గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, సీత కోసం అశ్రువులు జార్చిన మీ పూరణ బాగుంది. అభినందనలు. ‘మది నగ్నిని దూకెను’ అంటే బాగుంటుందేమో! * మిస్సన్న గారూ, ఆనందాశ్రువులను రాల్చిన అహల్యను గురించిన మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు. * డా. ఆచార్య ఫణీంద్ర గారూ, మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.ల్ * శ్యామల రావు గారూ, ధన్యవాదాలు.
అయ్యా! మీ 2వ పద్యములో (శ్రీరఘురామ పాద రజ పావన....)1వ పాదములో యతి మైత్రి లేదు. ఆ సమాసము కూడా (పాద రజ పావన) వ్యాకరణ శుద్ధము కాదు. రజస్ (రజస్సు) అని శబ్దము కదా. పరిశీలించి సవరించండి. స్వస్తి.
నమస్కారములు నేనిప్పుడే చూసాను. నాపద్యం ఎలాగో తప్పులుం టాయి కదా అని గురువు గారు సవరణ చేయ లేదనుకుని చూడ లేదు .ఇప్పుడు ఒకసారి పాతవి చూద్దాం అని చూస్తె హబ్బ ......ఎంత సంతోషమో ! నేనూ రైటు గా వ్రాయ గలిగానని ! ధన్య వాదములు. తముడు ! ధన్య వాదములు. నిన్న మేము అయ్యప్పస్వామి గుడికీ వెళ్ళాము. అస్సలు నెట్ చూడ లేదు.
కారణజన్మురాలు, బహుకష్టములందిన దీమె గాన నో
రిప్లయితొలగించండిధీరగుణాభిరామ! విను, దివ్యచరిత్రయు నమ్ము నీవికన్
చేరు మయోధ్య కీమెనిదె చేకొని యంచును పుష్పసంతతుల్(వర్షముల్)
జార, గుణంబు గల్గు సతి, సాధ్వి యటంచు నుతించి రెల్లరున్.
మీరదు నీదుయానతిని మీరదు స్వప్నమునైననెప్పుడున్,
రిప్లయితొలగించండికోరి జపించు చుండు మఱి కూర్మిని నీదగు నామమెప్పుడున్,
ధీరత, నిష్ఠ గల్గి, పతి దేవుని గొల్చెడు దేవికెట్లు, యే
జారగుణంబు గల్గు? సతి సాధ్వి యటంచు నుతించి రెల్లరున్.
దుష్యంతుడు శకుంతలను గుర్తించక తిరస్కరించిన సందర్భంగా
రిప్లయితొలగించండిఆ రమణీలలామ హృదయంబున నిండిన బాధనంతటన్
భూరమణుండు కిమ్మనక పోల్చక నుండుట గాంచి యీమెకె
వ్వారలు దిక్కటంచు బహుభంగుల చింతిలి యశ్రుబిందువుల్
జార, గుణంబుగల్గుసతి, సాధ్వి యటంచు నుతించి రెల్లరున్.
ఆ రఘు రాము నమ్మి మది యగ్నిని దూకెను మాత సీతయే
రిప్లయితొలగించండిమీరిన కష్టముల్ గలిగి మీరక నాధుని మాట తా మదిన్
కోరక రాజ్య సౌఖ్యములు గొప్పగ నిల్చె నటంచు నశ్రువుల్
జార, గుణంబుగల్గుసతి, సాధ్వి యటంచు నుతించి రెల్లరున్.
శ్రీ రఘు రామ పాద రజ చిన్మయ భావము చేత కల్మషం-
రిప్లయితొలగించండిబారగ గౌతమాంగన మహా విభవమ్మున నొంది రూపమున్
సారెకు మ్రొక్కి రామునకు సంయమి జేరెను పొంగి బాష్పముల్
జార, గుణంబుగల్గుసతి, సాధ్వి యటంచు నుతించి రెల్లరున్
క్రూరుడు దుస్ససేను డతి ఘోరముగా ద్రుపదాత్మజన్ సభా
రిప్లయితొలగించండిద్వారము నుండి యీడ్చుకొని వచ్చి, మహాత్ముల మధ్య నిల్పియున్,
చీరను లాగు వేళ - తన చెంగును గట్టిగ బట్టి యొల్లదే
జార! గుణంబు గల్గు సతి సాధ్వి యటంచు నుతించి రెల్లరున్!
నదిసుతాది పదాలగురించి మరి కొంత. ఈ క్రింది పద్యం శ్రీనాథునిదనుకుంటాను. దీనిలో అవనీతలము బదులుగా అవనితలము అని వాడబడింది.
రిప్లయితొలగించండికం. మనుజేశ్వరు లెల్లను బో
రన దమయంతీస్వయంవరమునకు నొప్పన్
జనుదెంచిరి సైన్యస్యం
దనఘట్టన నవనితలము తల్లడపడగన్
Ref: http://www.koumudi.net/Monthly/2012/april/index.html
నిన్న డా.ఆచార్య ఫణీంద్రగారి వివరణ తరువాత మంచి స్పష్టతవచ్చింది.
రిప్లయితొలగించండిసత్యనారాయణ మూర్తి గారూ,
రిప్లయితొలగించండిసీతామాతపై పుష్పాలను, శకుంతల దురవస్థకు కన్నీటిని జారవిడిచిన మీ రెండు పూరణలు ఉదాత్తంగా ఉన్నాయి. అభినందనలు.
*
లక్ష్మీదేవి గారూ,
భర్తకు అన్నివిధాలా అనుకూలురాలైన సతిని గూర్చిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
సీత కోసం అశ్రువులు జార్చిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
‘మది నగ్నిని దూకెను’ అంటే బాగుంటుందేమో!
*
మిస్సన్న గారూ,
ఆనందాశ్రువులను రాల్చిన అహల్యను గురించిన మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
*
డా. ఆచార్య ఫణీంద్ర గారూ,
మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.ల్
*
శ్యామల రావు గారూ,
ధన్యవాదాలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅయ్యా! మీ 2వ పద్యములో (శ్రీరఘురామ పాద రజ పావన....)1వ పాదములో యతి మైత్రి లేదు. ఆ సమాసము కూడా (పాద రజ పావన) వ్యాకరణ శుద్ధము కాదు. రజస్ (రజస్సు) అని శబ్దము కదా. పరిశీలించి సవరించండి. స్వస్తి.
రిప్లయితొలగించండినేమాని పండితార్యా దోషమును సూచించినందుకు ధన్యవాదాములు.
రిప్లయితొలగించండిసవరించడానికి ప్రయత్నిస్తాను.
మీ పూరణకై ఎదురు చూస్తున్నాను.
శంకరార్యా ధన్యవాదములు.శ్రేష్టమైన సవరణ.
రిప్లయితొలగించండిసవరించిన నా రెండవ పూరణ:
రిప్లయితొలగించండిజారుడు మోసగించి యపచారము చేయ నహల్య కెట్టు లా
జారగుణంబు గల్గు? సతి! సాధ్వి! యటంచు నుతించి రెల్లరున్
శ్రీ రఘురామ పాదసరసీరుహ దివ్య రజో విభూతిచే
నారగ కల్మషంబు తనరారిన దివ్య పతివ్రతా మణిన్.
మిస్సన్న గారూ,
రిప్లయితొలగించండినేమాని వారి సూచనను పాటించి దోషసవరణ చేసినందుకు సంతోషం.
ఘోరము గాదె నేడిటుల గాదిలి కోడలు ద్రౌపదిన్ సభన్
రిప్లయితొలగించండిచీరలు లాగి వేయుటకు చేసిన నేరము దెల్ప కుండగా
వారిజ లోచనిన్ వెఱగు బొందెడి నిందల పాలుజేసి యీ
జార గుణంబు గల్గు సతి సాద్వ్హి యటంచు నుతించి రెల్లరున్ !
శ్రీగురుభ్యోనమ:
రిప్లయితొలగించండినీరజగర్భునిన్ గొలచి నింగిననుండెడి దేవ గంగకై
ఘోర తపంబు జేసెనట కోసల ఱేడు భగీరథుండు తాన్
పారుచు భీకరాకృతిగ పావని మేదిని జేర శీఘ్రమై
జార,గుణంబు గల్గు సతి సాధ్వి యటంచు నుతించి రెల్లరున్.
సవరణ
రిప్లయితొలగించండినీరజగర్భునిన్ గొలచి నింగిననుండెడి దివ్య గంగకై
రాజేశ్వరి అక్కయ్య,
రిప్లయితొలగించండిప్రశంసనీయమైన పద్యాన్ని వ్రాసారు. అభినందనలు.
*
శ్రీపతి శాస్త్రి గారూ,
గంగావతరణాన్ని ప్రస్తావించిన మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
నమస్కారములు
రిప్లయితొలగించండినేనిప్పుడే చూసాను. నాపద్యం ఎలాగో తప్పులుం టాయి కదా అని గురువు గారు సవరణ చేయ లేదనుకుని చూడ లేదు .ఇప్పుడు ఒకసారి పాతవి చూద్దాం అని చూస్తె హబ్బ ......ఎంత సంతోషమో ! నేనూ రైటు గా వ్రాయ గలిగానని ! ధన్య వాదములు. తముడు ! ధన్య వాదములు. నిన్న మేము అయ్యప్పస్వామి గుడికీ వెళ్ళాము. అస్సలు నెట్ చూడ లేదు.
తీరుగ బొచ్చుకుక్క కొక తియ్యని కౌగిలినిచ్చి త్రోలెడిన్
రిప్లయితొలగించండికారున నద్దమందుగని కమ్మగ పూయుచు లిప్పుస్టిక్కునున్
నీరుల స్టోరు నందునను నిక్కపు రీతిని బేరమాడు బం
జారగుణంబు గల్గు సతి సాధ్వి యటంచు నుతించి రెల్లరున్
నీరుల స్టోరు = Neerus Store @ Banjara Hills, Hyderabad