22, మే 2012, మంగళవారం

సమస్యాపూరణం - 712 (తప్పు లెన్నువాఁడె)

కవిమిత్రులారా...

ఈరోజు పూరించవలససిన సమస్య ఇది...

తప్పు లెన్నువాఁడె గొప్పవాఁడు.

ఈ సమస్యకు స్ఫూర్తి నిచ్చిన
గుండా సహదేవుడు గారికి

ధన్యవాదాలు.

21 కామెంట్‌లు:

  1. గొప్పగ శిశుపాలు డప్పట గోపాలుఁ
    గేలి జేయుచు పలుకెరుగక పలు
    కంగ నూరుమార్లు కాచి మోక్షం బిచ్చు
    తప్పు లెన్నువాఁడె గొప్పవాఁడు.

    రిప్లయితొలగించండి
  2. మూడవ పాదంలో మోక్షంబివ్వ అంటే బాగుంటుందేమో!
    గొప్పగ శిశుపాలు డప్పట గోపాలుఁ
    గేలి జేయుచు పలుకెరుగక పలు
    కంగ నూరుమార్లు కాచి మోక్షంబివ్వ
    తప్పు లెన్నువాఁడె గొప్పవాఁడు.

    రిప్లయితొలగించండి
  3. శ్రీ చంద్రశెఖర్ గారి పూరణ చాల బాగున్నది. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  4. విద్య విలువ దెలిపి విద్యార్థికే గరపి
    వాని జగతి గొప్ప వాని జేయ
    తప్పు దిద్దుకొనెడు ధైర్యంబు నిచ్చుచు
    తప్పు లెన్నువాఁడె గొప్పవాఁడు.

    రిప్లయితొలగించండి
  5. పండితోత్తముండు బాగుగా జెప్పినా
    మూర్ఖుడైన వదరుబోతు సభల
    పల్కు తప్పులంచు పామరుల్ మెచ్చగా
    తప్పు లెన్నువాడె గొప్ప వాడు

    రిప్లయితొలగించండి
  6. అయ్యా శ్రీ గోలి వారూ!
    మీ పద్యము బాగున్నది. అభినందనలు. 1వ పాదము చివర గణములు చూడండి - సరిజేయండి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  7. విమలమతిని సఖుని వెతలలో దరిజేరి
    పాలుపంచుకొనుచు పలుకరించి
    సతము హితముగోరి సదసత్తుఁ దెల్పుచు
    తప్పులెన్నువాడె గొప్పవాడు.

    రిప్లయితొలగించండి
  8. శ్రీ నేమాని వారికి ధన్యవాదములు. సవరణతో...

    విద్య విలువ దెలిపి విద్యార్థికే నేర్పి
    వాని జగతి గొప్ప వాని జేయ
    తప్పు దిద్దుకొనెడు ధైర్యంబు నిచ్చుచు
    తప్పు లెన్నువాఁడె గొప్పవాఁడు.

    రిప్లయితొలగించండి
  9. శంకరాభరణపుశంకరార్యులవారు
    పద్యకవులపాటవంబు బెరుగ
    సద్విమర్షజేయనద్వితీయముగను
    తప్పులెన్నువాడెగొప్పవాడు

    రిప్లయితొలగించండి
  10. పద్య రచన యందు పాటవంబును గల్గి
    సరిగ జూచు నట్టి శంక రుండు
    మమ్ము నుత్స హించి మంచి కవిని జేసె
    తప్పు లెన్ను వాడె గొప్ప వాడు .

    రిప్లయితొలగించండి
  11. విద్య లెన్నొ నేర్పి విద్వాంసునిగ జేసి
    నడత నేర్పు నట్టి నలువ యనగ
    అహము వీడు మనల రహదారి నడిపించు
    తప్పు లెన్ను వాడె గొప్ప వాడు !

    రిప్లయితొలగించండి
  12. ‘మనతెలుగు’ చంద్రశేఖర్ గారూ,
    తప్పులెన్ని మోక్షమిచ్చిన గోపాలునిపై మీ పూరణ బాగుంది. అభినందనలు.
    కాకపోతే నడక కాస్త తడబడతున్నది. (చంద్రభాసుర ప్రభావమా?) :-)
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    తప్పులు దిద్దే ఉపాధ్యాయునిపై మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    మీ పూరణ చాలా బాగున్నది. అభినందనలు.
    *
    సత్యనారాయన మూర్తి గారూ,
    సదసద్వివేకవంతునిపై మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.
    *
    సహదేవుడు గారూ,
    నన్ను రంధ్రాన్వేషణా తత్పరుణ్ణి చేసారు. ఏంచేయను అలవాటయింది వృత్తిధర్మంగా. మంచి పూరణ. అభినందనలు, ధన్యవాదాలు
    *
    సుబ్బారావు గారూ,
    పై సహదేవుడు గారికి చెప్పిన మాటలు మీకూ వర్తిసాయి. బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    సన్మార్గగామిగా మార్చే సద్గురువును గురించిన మీ పూరణ చాలా బాగింది. నిర్దోషంగా వ్రాసినందుకు సంతోషంగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  13. రాజకీయమందు రాణించు వారికి
    స్వాపరాధములను ప్రక్కన నిడి
    పట్టు వదలకుండ ప్రతిపక్షసభ్యుల
    తప్పు లెన్నువాఁడె గొప్పవాఁడు.

    రిప్లయితొలగించండి
  14. తప్పు చేయు చుంట తప్పదు మనిషికి
    తప్పు దిద్దు కొనుట ధర్మ మగును
    తప్పు కూడ దంచు నొప్పి కల్గని రీతి
    తప్పు లెన్నువాఁడె గొప్పవాఁడు.

    రిప్లయితొలగించండి
  15. అయ్యా శ్రీ మిస్సన్న గారూ!

    మీ పద్యములో 5 తప్పులున్నా ఎంతో బాగున్నది. అభినందనలు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  16. 1.నిప్పు వంటి నిజము చెప్పంగ వలయును
    మేలు గోరి నట్టి మిత్రుడెపుడు
    తప్పుదారి బోవు తన స్నేహితుని లోని
    తప్పులెన్నువాడె గొప్పవాడు.

    2.దోషములను గాయ తొంబది తొమ్మిది
    అత్తకిచ్చె మాట అచ్యుతుండు
    వంద మీర తప్పు ,వధియించె శిశుపాలు
    తప్పులెన్నువాడె గొప్ప వాడు.

    రిప్లయితొలగించండి
  17. తప్పు లెఱుగ కున్న నొప్పుల నరయునా
    తప్పుఁ దెలియు వాఁడె యొప్పు గనును
    ముప్పు రాక మున్ను ముప్పది నూరొక్క
    తప్పు లెన్ను వాఁడె గొప్ప వాఁడు !

    రిప్లయితొలగించండి
  18. నేమాని పండితార్యా కడుంగడు ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  19. మిస్సన్న గారూ,
    అన్ని ‘తప్పు’లతో ‘ఒప్పైన’ పూరణ రచించారు. చాలా బాగుంది. అభినందనలు.
    *
    కమనీయం గారూ,
    మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
    *
    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి