1, మే 2012, మంగళవారం

చమత్కార (చాటు) పద్యాలు - 194

శ్రీ బాలాత్రిపురసుందరీ స్తోత్రము 
(ఈ స్తోత్రాన్ని భారతుల పేరయ్య శాస్త్రి రచించాడు. ఈయనకు శ్రీరంగకవి అని నామాంతరం. కర్నూలు మండలం అన్నసముద్ర గ్రామవాసి. కాలం పందొమ్మిదవ శతాబ్దం)


                                   చూర్ణిక
    శ్రీమ త్కదంబతరు విడంబిత లస దంబురుహచర ద్వలమాన మానసౌక గరుత్పవమాన ప్లవమాన భాసమాన కంకేళీవన కేళీ సంజాత శ్రమబిందు కందళిత ముఖారవిందే! సంతతానందే! సర్వ సర్వంసహాఖర్వ ధూర్వహ దర్వీకర గర్వ నిర్వాపణ చణ దోర్వల్లీ సమారోపిత మౌర్వీ నిర్భర నిర్ఘోష నిర్భిద్యమాన పుర్వామర గుర్విణ్యుదర దరీ కుడుంగే! శౌర్యానుషంగే! శుంభ దంభా మఖారంభ సమయ సముజ్జృంభిత దిక్కుంభి ప్రకటకట స్రవద్దానాసవ పానోదిత గానాధిక నానా మధుపానీకకులీనాంచిత వినీల పతత్రప్రభా భాసమానాసమానాలకాభిరామే! మరకతశ్యామే! రంగదభంగ రణరంగ కళాభిషంగ చండముండాసురప్రకాండ ఖండ నోద్దం డాఖండల వేదండ తుండాయమాన భుజాదండ మండిత మండలాగ్ర రోచిః ప్రకీర్ణ బ్రహ్మాండ కరండే! చాముండే! యుగవిగమావసర సముద్భూత ప్రవాత సంఘాత జీమూత మధ్య ధగద్ధగాయమాన సౌదామినీ ద్యుతి వినిర్మితి కోమల సంహనన విశేషే! అపహృత దోషే! అసమసమయ వికసిత కుసుమ కిసలయ మసృణ ఘుసృణ విసరణ చరణాలంకరణ నిపుణ నూపుర కుహురావ లయ యుత కలకంఠ కంఠ కలరవానుకూల పంచమస్వర గ్రామానుకరణ విపంచికా వల్లరీ నినాదామోదిత సకల దిశావకాశే! సుప్రకాశే! తారాకర తారాధిప తారాద్రి సమీరాశన క్షీరాబ్ధి పటీరాంబుజ హీరాబ్జ సుధాధారా నిభ గౌరద్యుతి విద్యోతమాన యశోవిశాలే! శ్రీబాలే! చిదగ్ని కుండికార్ణవ సంజాత భువనమోహినీ గేహినీ సమస్త కుళ కౌళీ నిగర్భ రహస్యాతి రహస్య పరాపర రహస్య యోగినీ శ్రీమ త్కౌమార గిరీంద్ర సౌవర్ణ ప్రాకార మధ్య విటంక విన్యస్త నిస్తుల ప్రశస్త మణిగణ వ్యాకీర్ణ మండపాభ్యంతర వితర్దికారంగ వలభికాయంత్ర పాంచాలికాయమాన ప్రమథగణ సేవిత శ్రీ త్రిపురాంతకేశ్వరోత్సంగ నివాసే! విశదహాసే! సకల సుకవి వర్ణిత మృదుమధుర కవితా రచనాధురీణ భారతులాన్వయాంభోధి తుహినకర రంగయాభిధా నాంగ నాదెమాంబికా గర్భశుక్తి మౌక్తికాయమాన శ్రీరంగకవి విరచిత గద్యపద్యానుమోద మానసాంభోజే! నత సురసమాజే! శ్రీ త్రిపురాంబికాభిధే యావతీర్ణ జగదంబే! అధరజితబింబే! పులిన నితంబే! శ్రీశ్రీ త్రిపురాంబే! సదామాం పాహి, మాం పాహి.
 
                              (శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి ‘చాటుపద్య రత్నాకరము’ నుండి)

10 కామెంట్‌లు:

  1. గురువుగారూ అమ్మవారి అద్భుతమైన స్తోత్రాన్ని పరిచయం చేశారు. ధన్యవాదాలు.
    పేరయ్య శాస్త్రి గారు అమ్మవారి దయతో ఆమెలో ఐక్యం చెంది ఉంటారు.

    చూర్ణిక ఛందో లక్షణాలేమిటో.

    రిప్లయితొలగించండి
  2. మిస్సన్న గారూ,
    అమ్మవారి స్తోత్రం మీకు నచ్చినందుకు సంతోషం.
    ‘చూర్ణిక’ లక్షణం నా దృష్టికి రాలేదు. ప్రయత్నిస్తాను.

    రిప్లయితొలగించండి
  3. గురువుగారూ బహుశా చూర్ణిక, గద్యం ఒకటేనేమో.

    రిప్లయితొలగించండి
  4. మిస్సన్న గారూ,
    ‘చూర్ణిక" శబ్దానికి సూర్యరాయాంధ్ర నిఘంటువు ‘గద్య భేదము’ అని మాత్రమే అర్థం ఇచ్చింది.
    గూగుల్‌లో వెదికితే క్రింది అర్థం దొరికింది.
    chūrṇika. [Skt.] n. A sort of harmonious prose, not divided into prosodial feet, but with the unbroken sentence running on continously. గద్యభేదము.

    http://telugu.indiandictionaries.com/meaning.php?id=7180&lang=Telugu

    రిప్లయితొలగించండి
  5. నమస్కారములు.
    కను విందు చేస్తున్న అమ్మ వారి చిత్రం , చూర్ణిక ఎంతో బాగున్నాయి . నేనూ సరిగ్గా అదే ప్రశ్న అడగాలను కున్నాను " చూర్ణిక లక్షణాలు "
    అవునూ ! " కండిక " అని కవిత రూపంలో వ్రాస్తున్నారు కదా ! మరి ఖండిక లక్షణాలను వివరించ గలరు ఎన్నో తెలియ జేస్తున్నందుకు గురువులకు ధన్య వాదములు

    రిప్లయితొలగించండి
  6. అమ్మా రాజేశ్వరి గారూ ఏదైనా అంశాన్ని నాలుగైదు పద్యాల్లో (ఖచ్చితంగా నాలుగైదే కాదు అల్ప సంఖ్యలో) చెప్పడాన్ని ఖండిక అంటారు. ఖండ కావ్యాలు ఆ కోవ లోకే వస్తాయి. ఇది నా యెరుక.

    రిప్లయితొలగించండి
  7. నమస్కారములు
    ధన్య వాదములు మిస్సన్న గారు ! " ఏవైనా " అంటే ," తేట గీతి , ఆటవెలది , కందం " ఇలా నాలుగైదు " లేక వ్రుత్తములా ? , లేక ఆవీ ఇవీ కలిపా ? " ఎలా ? వ్రాయాలో తెలుప గలరు ఇంతకు ముందు చదివినవి నాకు సరిగా అర్ధం కాలేదు నేను ఎప్పుడో ఇంటర్ లొ స్పెషల్ తెలుగు తీసుకున్నాను . ప్చ్ ! అన్నీ ఈ సంసార సాగరంలో కొట్టుకు పొయాయ్ . అదన్న మాట అసల్....సంగతి

    రిప్లయితొలగించండి
  8. రాజేశ్వరి అక్కయ్యా,
    పరిమిత పద్యాలతో ఏ ఛందంలోనైనా ఒక అంశాన్ని గురించి వ్రాస్తే అది ఖండిక, ఖండకావ్యం, ఖండకృతి. ఉదాహరణకు ఒక విషయాన్ని గురించి పది పద్యాలు వ్రాసారనుకోంది. అని ఓకే ఛందంలో ఉండవచ్చు, లేదా వేరు వేరు ఛందాల్లో ఉండవచ్చు. అది ఐచ్ఛకం.

    రిప్లయితొలగించండి