1, సెప్టెంబర్ 2014, సోమవారం

నిర్వచన భారత గర్భ రామాయణము – 71


రావిపాటి లక్ష్మినారాయణ

రామాయణము-
సీ.      నిక్కంబు నామాట (నక్క యెక్కడ మఱి
నాక మెక్కడ, వారి)జాక్షుఁ డవని
జావరుండు; బలుండు; కావలవదు వాని
(పాలు; నెమ్మి నొసఁగు పాడి దలఁచి
యటులఁ గానియెడలఁ బటిమఁ దోషియయి దూ)
బ నినుగూల్చును రామభద్రుఁ; డతని
యనుజుఁ డట్టిడ; వార లరులను మించు శూ
(రు; లయిన నిడు, నీవు పొలియఁ బోవు)
గీ.      వనధి నిన్ను ముంచిన వాలి దునిమె రామ
విభుఁడు; నిన్ను వంచిన కార్తవీర్యుని మడి
పిన పరశురాముఁ గెల్చె; నీవనఁగ నెంత?
లీల గుడి మ్రింగువానికి లింగమెంత? (౮౬)

భారతము-
ఆ.      నక్క యెక్కడ మఱి నాక మెక్కడ వారి
పాలు నెమ్మి నొసఁగు పాడి దలఁచి,
యటులఁ గానియెడలఁ బటిమ, దోషి! యయి దూ
రులయిన నిదు నీవు పొలియబోవు. (౮౬)

టీక- (రా) తోషియయి = సంతోషముతో గూడినవాడయి, (భా) దోషి = దోషమయుఁడా; అయిదూరులు = (భా) అయిదు గ్రామములను; నాకము = స్వర్గము; దూబ = అధముఁడవగు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి