27, ఆగస్టు 2014, బుధవారం

నిషిద్ధాక్షరి - 6

నిరోష్ఠ్యంగా (ప,ఫ,బ,భ,మ అనే అక్షరాలను ఉపయోగించకుండా)
మద్యపానాన్ని మానుమని హితబోధ చేస్తూ
మీకు నచ్చిన ఛందంలో
పద్యం వ్రాయండి.

43 కామెంట్‌లు:

  1. త్రాగుడు చెడునే చేయును
    తూగుతు తూలుతు తిరిగిన దొసగులు కలుగున్
    త్రాగించక తా త్రాగక
    రోగాల ను చేరనీక రోతను విడుడీ!

    రిప్లయితొలగించండి
  2. సార సంసార కాసార ఘోర వారి
    అఖిల శాఖా శరీర వనాగ్ని కీల
    శారద సిత కీర్తి గగన జలద తుల్య
    నాశనకరి సారా వీడు నవ్య గతికి!!

    ఘోర వారి = కాలుష్య ద్రవము (poluted water)

    రిప్లయితొలగించండి
  3. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరింప నున్నవి !

    మద్యం - మహమ్మారి !
    మానుటే మేలుగద మానవులకు :

    01)
    ____________________________

    త్రాగ , స్వస్థత చెడునోయి ! - త్రాగ వలదు !
    త్రాగ , కాసులు నష్టియౌ ! - త్రాగ వలదు !
    త్రాగ , కన్నీరు గార్చురా - తల్లి, యాలి !
    త్రాగ కుండిన సర్వులు - ధన్యు లగుట
    త్రాగ వలదుర ! సోదరా - త్రాగ వలదు !
    ____________________________
    (దంత్యోష్ఠము మీద నిషేధము లేదు గావున విరివిగా ప్రయోగింపబడినది)

    రిప్లయితొలగించండి
  4. సురను త్రాగిన శిక్షను శుక్రు డిచ్చె
    కశుడు గతియించ నసురుల కారణమున
    కల్లు నానవలదు కన్న కలలనైన
    హానిఁజేయును తనువుకు హాలఁ గొనిన(నాన కల్లు)

    రిప్లయితొలగించండి
  5. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘తూగుచు తూగుచు’ అనండి.
    *
    జిగురు సత్యనారాయణ గారూ,
    దీర్ఘసమాసంతో శోభాయమానమై మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    ‘వారి + అఖిల’ అని విసంధిగా వ్రాశారు.
    *
    వసంత కిశోర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘తల్లి, యాలు’ అనండి.
    *
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    కచుడు టైపాటు వల్ల కశుడు అయినట్టుంది.

    రిప్లయితొలగించండి
  6. త్రాగుడు వలదుర నరుడా
    త్రాగించగ వలదు త్రాగి తరలిన వారిన్
    రోగుల జూడగ సరిగా
    త్రాగుడు వదలుచును భువిని త్యాగివవుదువే !

    రిప్లయితొలగించండి
  7. గురువులు శంకరయ్య గారికి, కవి వర్యులకు వందనాలు.
    .
    త్రాగవద్దు సారా ! త్రాగి తూగవద్దు !
    స్వస్థత చెడును ,సుజనులఙ్ఞానులగును !
    సతియు, సుతులకునెటువంటి గతులు గలుగు ?
    త్రాగుడును వదలిన వాడె ధన్యజీవి .
    .
    __________________జయసారథి.

    రిప్లయితొలగించండి
  8. త్రాగుడు ద్రాగకు తండ్రీ !
    త్రాగుడు నిక హాని జేయు దనువున కంత
    న్ద్రాగిన వారందరు నిల

    రోగులు గా నయ్యె గనవె ? రూకలు లేకన్

    రిప్లయితొలగించండి
  9. శ్రీగురుభ్యోనమ:

    కలుగును వ్యాధులు చాలా
    కలహాలను కలుగజేయు కదరా జగతిన్
    కలనైన కల్లు త్రాగకు
    వలదిక సారాను గ్రోలు వాంఛలదేలా

    రిప్లయితొలగించండి
  10. జీవనయాత్రను సుఖకర
    నావగ వాడంగ నొడల నలువ యొసంగెన్
    చావది దవ్వున యుండగ
    జీవుని యుసురు తినెడు సుర చేటది విడుడీ!

    రిప్లయితొలగించండి
  11. ఊకదంపుడు గారి పూరణ....


    ఆలి ఛీకొట్టు నటులనె యాత్మజులును
    వాడ ఛీకొట్టు నటులనె వైద్యులున్ను
    దాసతతి "ఛీ"యను తుదకు దైవతతియు
    విడవె సురను ద్రావుట? గతి వేఱులేదు

    రిప్లయితొలగించండి
  12. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ బాగునన్నది. అభినందనలు.
    *
    జయసారథి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    మీ పద్యానికి చిన్న సవరణలు......
    త్రాగుడు మానుము తండ్రీ !
    త్రాగుడు కడు హాని జేయు దనువున కంత
    న్ద్రాగిన వారంద రిలను
    రోగులుగా నగుట గనవె రూకలు లేకన్.
    *
    శ్రీపతి శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘చాలా’ అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. ‘పెక్కులు’ అనండి. పద్యాంతంలో ‘వాంఛ లవేలా’ అంటే సరి!
    *
    లక్ష్మీదేవి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘దవ్వున నుండగ’ అనండి.
    *
    ఊకదంపుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  13. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  14. సారా సేవించ వలదు
    సారాయే హానిజేయు సర్వుల కిలలో
    సారా కలతకు హేతువు
    సారాయిని త్రాగకున్న స్వస్థత గల్గున్

    రిప్లయితొలగించండి
  15. శైలజ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  16. కల్లు సారాయి త్రాగిన నొళ్ళుచెడును
    జీవన వహన కగచాట్లు చేరువగును
    గాన సేవించ వలదట్టి కైపు నిచ్చు
    వస్తువుల నీవు తప్పక వదల వలెను.

    రిప్లయితొలగించండి
  17. కల్లు సారాయి త్రాగిన నొళ్ళుచెడును
    జీవన వహన కగచాట్లు చేరువగును
    గాన సేవించ వలదట్టి కైపు నిచ్చు
    వస్తువుల నీవు తప్పక వదల వలెను.

    రిప్లయితొలగించండి
  18. కల్లు యనగ వేడుక యనుచు కొందరు
    నిరతి తోడ నిరత సురసేవ జేతురు
    ఆధునికతకిదొక ఆనవాలనరాదు
    శీలవంతుడైన చేకూరు సత్కృతి

    రిప్లయితొలగించండి
  19. మల్లెల వారి పూరణలు

    సారా త్రాగగ రాదల
    తేరాదది సరిగ, నిడగ ధర సద్గతినే
    చేరంగ నీయ దానిని
    కారాదది కీర్తి, నీకె కననెందైనన్

    రిప్లయితొలగించండి

  20. పూజ్యులుగురుదేవులు శంకరయ్య గారికి వందనములు
    సారా గ్రోలగనేలా
    తీరిక నీయాలి సుతుల తిట్టగనేలా
    కోరిరుజ కొనగనేలా
    సారా త్రాగుడు విడువుడు జనులార యికన్

    రిప్లయితొలగించండి
  21. కూడదు నీకు సీధువును గ్రోలుట స్వస్థత తగ్గు, స్నేహితుల్
    కూడరు, నాతి సంతతియు గూడ నినున్ గని రోయ సొత్తుకున్
    చీడలు తిన్న చెట్టువలె చేటగు, నా నుడు లాలకించు నే
    వేడెద సోదరా చెవుల వెట్టవె నా హితవున్ హితైషినిన్.

    రిప్లయితొలగించండి
  22. కం . వారుణి జేకొన( రాదని
    వారించెద దేశజనుల వర్ధత కొరకున్,
    సారాయిని గొన్న జనులు
    ధారణ గోల్పోయి వారు తావున్వీడున్
    కొరుప్రోలు రాధా కృష్ణ రావు

    రిప్లయితొలగించండి
  23. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ! నాలుగో పాదం లో 'భు' ఓష్ట్యము

    రిప్లయితొలగించండి
  24. మాస్టారూ శ్రీపతి శాస్త్రి గారికి మీసావరణ 'పెక్కులు' ఓష్ట్యం తో గూడినది

    రిప్లయితొలగించండి
  25. నీరే కరువై త్రాగగ
    నూరూరా త్రాగు నీరు నూడ్చగ సిరులన్
    సారా నీకేటికిరా?
    దారా సుతలు బ్రతుకంగ త్రాగుట మానోయ్!

    రిప్లయితొలగించండి
  26. మిత్రులు కంది శంకరయ్యగారికి, సుకవి పండిత మిత్రబృందమునకు నమస్కారములు

    (౧)
    సుర సేవించుట హానియ
    నరులకు నద్దాని విడువనౌ వేగముగన్
    ద్వరిత విదూర రహితుఁడగు
    సురాసువును మెచ్చఁ డెవఁడు క్షోణితలానన్!

    (౨)
    శీధు గ్రహణ వ్యసనుఁడు
    సాధువగునె? దుర్జన సృతి సంచారియగున్!
    శోధనతో విడువ వలయు
    శీధువు సేవించుటెల్ల శీఘ్రగతినిఁ దా!

    (దంత్యోష్ఠ్యమగు "వ"కారము నిషేధింపకుండుటచే నిందు విరళముగఁ బ్రయోగింపఁబడినది)

    రిప్లయితొలగించండి

  27. అడుగులేని గొయ్యి ఆలోచనలు రొయ్యి
    ఇంటి గౌరవాల కంటి ముల్లు
    జాతి నీతి వీడి చైతన్య హీనుడై
    వాడి చావవద్దు వలదు కల్లు

    రిప్లయితొలగించండి

  28. శ్రీ గుండు మధుసూదన్ గారి పూరణలు ఎప్పటిలాగే ఉత్సాహదాయకము. అభినందనలు. మొదటి పూరణలో రెండు ’మ’కారాలున్నాయి

    రిప్లయితొలగించండి
  29. మిత్రులు మత్తకూరు రాజణ్ణ చంద్రమౌళిగారికి ధన్యవాదములు. ససిగాఁ బరిశీలింపమి దోషములు దొరలినవి. వానినిట్లు సవరించుచున్నాను:

    ముందుగాఁ బ్రకటించిన పద్యము:

    సుర సేవించుట హానియ
    నరులకు నద్దాని విడువనౌ వేగ(ము)గన్
    ద్వరిత విదూర రహితుఁడగు
    సురాసువును (మె)చ్చఁ డెవఁడు క్షోణితలానన్!

    సవరింపఁబడిన పద్యము:

    సుర సేవించుట హానియ
    నరులకు నద్దాని విడువనౌ వేగానన్
    ద్వరిత విదూర రహితుఁడగు
    సురాసువును నెంచఁ డెవఁడు క్షోణితలానన్!

    రిప్లయితొలగించండి
  30. మిత్రులు శ్రీ మత్తకూరు రాజణ్ణ చంద్రమౌళిగారి పూరణము బాగున్నది. ఇంటి-కంటి, గొయ్యి-రొయ్యి, కంటిముల్లు-వలదు కల్లు...అనుచు శబ్దాలంకార విలసితమైయున్నది. అభినందనలు! కాని..."ముల్లు"నందు ’మ’కారాగమమును గమనింపలేదుకాఁబోలు...సవరింపఁగలరు.

    రిప్లయితొలగించండి
  31. మిత్రులు గుండు మధుసూదన్ గారికి ధన్యవాదాలు. ఔను. నా తప్పె నా కన్నుగప్పె. "కంటి ఱెల్లు" అని దయచేసి చదువమని ప్రార్థన.ఇలా పరస్పర విమర్శన సవరణ ఆహ్లాదనీయము - శ్రీ శంకరయ్యగారికి మన ఉడుత తోట్పాటవుతుందా!

    రిప్లయితొలగించండి
  32. సుబ్బారావు గారి పూరణకు నేను సూచించిన సవరణలో ‘మ’కారం దొర్లింది. పొరపాటుకు క్షంతవ్యుడను. అక్కడ ‘త్రాగుడు కూడదు తండ్రీ’ అని సవరిస్తున్నాను.
    అలాగే శ్రీపతి శాస్త్రి పూరణలో నేను సూచించిన సవరణలో ‘పెక్కులు’ అని ఓష్ఠ్యం వచ్చింది. ‘కలుగును నానావ్యాధులు’ అందాం.
    గోలి హనుమచ్ఛాస్త్రి గారి పూరణలో ‘భువిని’కి బదులు ‘ధరను’ అంటే సరి.
    *
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘కైపు, తప్పక’ అని ఓష్ఠ్యాలను ప్రయోగించారు.
    *
    ప్రయాగ శ్రీరామచంద్ర మూర్తి గారూ,
    మీ పూరణ బాగున్నది.
    మీరు వ్రాసినది ఆటవెలది అనుకుంటే 2, 4వ పాదాలలో గణదోషం... నా సవరణతో మీ పద్యం...
    కల్లనంగ వేడ్కగా నెంచి కొందరు
    నిరతి తోడ కోరి సురను గ్రోల
    ఆధునికతకిదొక ఆనవాలనరాదు
    శీలవంతుడైన చేర్చు సుకృతి.
    *
    మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    చివరిపాదంలో ‘మానోయ్’ అని మకారాన్ని ప్రయోగించారు. ‘త్రాగవల దికన్’ అందామా?
    *
    గుండు మధుసూదన్ గారూ,
    సవరించిన మొదటి పూరణ, రెండవ పూరణ బాగున్నవి. అభినందనలు.
    *
    మత్తకూరు రాజణ్ణ చంద్రమౌళి గారూ,
    సవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    మిత్రులు పరస్పరం సుహృద్భావంతో పరస్పర గుణదోష విచారణ చేయడాన్ని స్వాగతిస్తున్నాను. ఇది నాకు సంతోషదాయకం.

    రిప్లయితొలగించండి
  33. మిత్రులు M.R.చంద్రమౌళిగారూ...తప్పక కాఁగలదు!

    ఇతర సాహితీ మిత్రులకు కొన్ని సూచనములు...

    ౧. మిత్రులు కంది శంకరయ్యగారు శ్రీపతిశాస్త్రిగారి పూరణలో సవరణమునకై "పెక్కులు" పదమును సూచించినారు. ’పె’ ఓష్ఠ్యము కావున "నెక్కుడు"గా సవరించిన సరిపోవును.

    ౨. మిత్రులు Lakshminarayana Ganduriగారి పూరణలో 3వ పాదమున "కైపు", 4వ పాదమున "తప్పక" పదములలో ’ప’కారములు దొరలినవి. సవరింపఁగలరు.

    ౩. మిత్రులు కొరుప్రోలు రాధాకృష్ణ రావుగారి పూరణలోని 4వ పాదమున "గోల్పోయి"లో ’ప’కారము వచ్చినది. సవరింపఁగలరు.

    ౪. మిత్రులు గుండా వెంకట సుబ్బ సహదేవుడుగారి పూరణలో 4వ పాదము చివరన "మానోయ్"లో ’మ’కారము వచ్చినది. సవరింపఁగలరు.

    మిత్రులందఱును అన్యథా భావింపవలదని ప్రార్థన.

    రిప్లయితొలగించండి
  34. గుండు మధుసూదన్ గారూ,
    ధన్యవాదాలు. మీ వంటి మిత్రులు ఈ విధంగా సహకరిస్తే నాకు కొద్దిగా భారం తగ్గినట్టవుతుంది. వయోభారంతోను, అలసటతోను కొన్ని దోషాలు నా దృష్టికి రాకపోవచ్చు. వాటిని ఎత్తి చూపుతూ సవరణలను కూడా సూచిస్తే ఇంకా బాగుంటుంది.
    కొరప్రోలు వారి పూరణలో ‘ధారణ లేకుండ నగును..’ అని సవరణ సూచిస్తే ఎలా ఉంటుందంటారు?

    రిప్లయితొలగించండి
  35. మిత్రులకు మనవి...
    పరస్పర గుణదోష విచారణ ఆహ్వానించదగినది. నాకుకూడా కొంత వెసులుబాటు కల్పించిన వారవుతారు.
    దోషాలను ఎత్తి చూపినప్పుడు ‘ఫలానా వారి పద్యంలో ఫలానా పాదంలో గణాలు సరిపోయాయా? ఫలానా పాదంలో యతి సరియైనదేనా? .... అని సమాసం చేయడం కరెక్టేనా? అని ఈవిధంగా ఆక్షేపణ, దోషారోపణ, ఎగతాళిగా చెప్పకండి. అది దోషమని మీకు స్పష్టంగా తెలిసింది కనుక ‘ఫలానా వారి పద్యంలో ఫలానా పాదంలో గణదోషం ఉంది, ఫలానా పాదంలో యతి తప్పింది. .....అనడం దుష్టసమాసం అని స్పష్టంగా తెలియజేసి అవకాశముంటే సవరణకూడా సూచించండి. మనం ఎవరి మనస్సునూ నొప్పించవద్దని మనవి. స్వస్తి!

    రిప్లయితొలగించండి
  36. గుండు మధుసూదన్, యం.ఆర్.చంద్రమౌళి గారల పరస్పర గుణదోషవిచారణ సౌహార్దంగా సాగింది. అందరికీ అనుసరణీయం.

    రిప్లయితొలగించండి
  37. ఊకదంపుడు గారి పూరణలో ‘ఆత్మజులు’ అని మకారాన్ని ప్రయోగించిన విషయాన్ని శ్రీఆదిభట్ల వారు తెలియజేశారు. అక్కడ ‘అనుగు సుతులు’ అని నా సవరణ...

    రిప్లయితొలగించండి
  38. గురుదేవులకు ధన్యవాదాలు. సవరించిన పద్యం :
    నీరే కరువై త్రాగగ
    నూరూరా త్రాగు నీరు నూడ్చగ సిరులన్
    సారా నీకేటికిరా?
    దారా సుతలు బ్రతుకంగ త్రాగుట వలదోయ్!

    రిప్లయితొలగించండి