4, ఆగస్టు 2014, సోమవారం

పద్యరచన - 641

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

12 కామెంట్‌లు:

  1. పున్నమి నాటి వెన్నెల అపూర్వపు దృష్యము సూర్య బింబమా
    యన్నటు లున్న చందురుని యాకృతి సంద్రపు తీరమందునన్
    మిన్ను, వసుంధరాతలము నేకము చేయుచు నున్న యట్టులన్
    కన్నుల విందు చేయుచును కాంతిని జిమ్ముచు గానిపించెగా!

    రిప్లయితొలగించండి
  2. పున్నమి చంద్రోదయమం
    దన్నుకొను మనంబు మిగుల యానందముతో
    వెన్నెల వన్నియ తిన్నన
    కన్నుల పండుగ గొలుపుచు గగనము నిండెన్

    రిప్లయితొలగించండి
  3. మూడవ పాదమును ఈ విధంగా చదువ ప్రార్థన!

    మిన్నులు భూతలంబును మమేకము చేయుచు నున్న యట్టులన్

    రిప్లయితొలగించండి
  4. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరింప నున్నవి !

    ప్రప్రథమ చంద్రోదయం :

    01)

    _____________________________

    పాలకడలిని మథియించు - వేళ యందు
    లక్ష్మి తరువాత ప్రభవించె - రాజరాజు !
    అమృతకిరణముల్ వర్షింప - నవని పైన
    నవని నివసించు ప్రాణులా - నందమొంద !
    _____________________________

    రిప్లయితొలగించండి
  5. చంద మామయె పుట్టెను సంద్రమందు
    వెండి రూపున రూపమ్ము వెలుగు చుండ
    నింగి సాగుచు పోనుండ, నీలి కడలి
    సంతసమ్మున నవ్వుఛు సాగనంపె.

    రిప్లయితొలగించండి
  6. పున్నమి దినమ్ము చంద్రుడు ముదము గొల్ప
    క్రొత్త జంటలు చేరిరి కోర్కె లడర
    చందురుని వంటి బిడ్డను పొంద గోరి
    చూచు చున్నారు రేరేని సొంపుగాను

    రిప్లయితొలగించండి
  7. బొడ్డు శంకరయ్య గారూ,
    మీ ఉత్పలమాల బాగున్నది. అభినందనలు.
    *
    చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    వసంత కిశోర్ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  8. చంద్రుడు పుట్టువేళయది! జంటలునొంటరి వారునెల్లరున్
    సంద్రముఁజేరి చూడదగు చక్కని దృశ్యము కానవచ్చు, నా
    యింద్రుడు కానవచ్చునొకొ నిద్ధర నెన్నడు నైన? నేత్రమీ
    యింద్రియ సౌఖ్యమున్ విడువ నెంచగ లేదన చిత్రమౌనొకో!

    రిప్లయితొలగించండి
  9. పున్నమి చంద్రుని జూడుము
    మిన్నున నట వెలుగు చుండె మిలమిల తోడన్
    చెన్నుగ రూప్యము వోలెను
    వెన్నుని సరి బొమ్మ యుండె బింబము లోనన్

    రిప్లయితొలగించండి
  10. చంద్రోదయ వేళల నడి
    సంద్రంబున తేలియాడు చక్కని బంతిన్,
    మంద్రంబగు కాంతి వెలుగు
    సాంద్రంబగు చీకటింటి చంద్రుని గనరే!

    రిప్లయితొలగించండి
  11. లక్ష్మీదేవి గారూ,
    చక్కని పద్యాన్ని వ్రాసారు. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  12. సంద్రమునకేమి భాగ్యమొ?
    చంద్రుని సుతునిగ బడసెను జగముల్ మురియన్!
    చంద్రుని భాగ్యంబేమియొ?
    యింద్రాదులతరము గాని యీశుని బడయన్!

    రిప్లయితొలగించండి