14, ఆగస్టు 2014, గురువారం

పద్యరచన - 648

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

7 కామెంట్‌లు:


  1. తళుక్కులతో పెట్టుకో చార్మీ ఐడీ,
    వేసుకో బుక్కులో క్యూట్ ప్రొఫైల్
    రాసుకో e-గద్య హైకూ జిలేబి
    చూసుకో ఇక లైకుల లెవి టేషన్ !!

    చీర్స్
    జిలేబి

    రిప్లయితొలగించండి

  2. ఘటనాఘటన సమర్థుడ
    ' నెటిజన్లే ' భువిని నీవు నెట్టిన జనులే
    చిటికెన్ వారికి తగు సం
    ఘటనలజూపించి ' లైకు ' గైకొను నీవే.

    రిప్లయితొలగించండి
  3. జగము నాడించు కృష్ణుడు సంతసమున
    ఫేసు బుక్కును నన్నకు బ్రియ సతులకు
    దనకు వచ్చిన "కామెంటు " తతిని చూపు
    చుండె నచ్చట చక్కగ జూడు డార్య !

    రిప్లయితొలగించండి
  4. కవిమిత్రులకు మనవి...
    ఈరోజు మా పిన్ని చనిపోయింది. పైడిపెల్లి అనే గ్రామానికి పోతున్నాను. ఏరాత్రికి తిరిగి వస్తానో... దయచేసి పూరణ, పద్యాల పరస్పర గుణదోష విచారణ చేసికొనవలసిందని కోరుతున్నాను.

    రిప్లయితొలగించండి
  5. లక్కిది నెటి జన్లకు పేస్
    బుక్కును గలుగుట ముదమగు బుద్ధిగ వాడన్
    చక్కగ సందేశము నే
    దిక్కున కైనను క్షణమున తిన్నగ చేర్చున్

    లైకులు షేరులు ట్యాగులు
    మూకుమ్మడి చాట్ల తోడ ముచ్చట గొలుపున్
    లోకంబంతయు కెవ్వున
    కేకను పెట్టించి మంచి కిక్కెక్కించెన్

    కన్నులు తప్పక పాడవు
    నెక్కువగా ఫేసు బుక్య ధే చ్చగవాడన్
    పెక్కగు కష్టములబ్బును
    తిక్కగ కామెంట్లు వ్రాయ తిరకాసు సుమా

    మక్కువ నెక్కువ చేయకు
    మిక్కిలి జాగ్రత్త తోడ మెలుగుము సుమ్మా
    కక్కును విషమునపుడపుడు
    గ్రక్కున ముఖ పుస్తకంబు గాసిప్పులతో

    రిప్లయితొలగించండి
  6. హరికాకృతి ప్రకటించగ
    తరమే 'ముఖ పుస్తకంపు' త్రాతల కైనన్
    పురుషోత్తము సుగుణంబుల
    సరి మెచ్చని వారి జన్మ సార్థక మౌనే?
    ఆకృతి = profile
    ముఖపుస్తకము = face book
    మెచ్చు = like

    రిప్లయితొలగించండి