17, ఆగస్టు 2014, ఆదివారం

పద్యరచన - 650

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

7 కామెంట్‌లు:

  1. తులలకు కవలల వలెనూ
    కలువల జంటగనిరువురుఁ గనబడుచుండెన్
    తులకించెడి మేనుల లో
    తెలి నలుపుల భేధమేల తెలియగ రాదే !
    (తుల = పోలిక, తులకించు= ప్రకాశించు )

    రిప్లయితొలగించండి
  2. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    లకారావృత్తి గలిగిన వృత్త్యనుప్రాసతో మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  3. నలుపు తె లుపుల రంగున నచట నుండు
    పిల్ల లిద్దరు చక్కని బేర్మి తోడ
    చూచు చుండిరి మనలను సూర్య !కనుము
    ముద్దు లొలికించు మోముల ముద్దరాళ్ళు

    రిప్లయితొలగించండి
  4. సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  5. దాగుడుమూతల నాడుచు
    దాగుంటిర మీరలిచట తమ్ముండెటనో
    దోగాడుచు వెదకును గద
    సాగింపకనక్కలార సరగున జనరే !

    రిప్లయితొలగించండి
  6. ఆటలు కాదని దోచెన్
    నాటికలోన బరువైన నాయిక పాత్రల్
    పాటవ మొప్పగ మెరుపుల
    దీటుగ మెరిపించి తీర్చి తేలగ పిల్లల్!

    రిప్లయితొలగించండి
  7. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *
    సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి