23, ఆగస్టు 2014, శనివారం

పద్యరచన - 655

కవిమిత్రులారా,
ఈరోజు టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

15 కామెంట్‌లు:

  1. భరత మాత సంకెళ్ళను వదల గొట్ట
    శత్రులకు సహాయము నిల్పు సమయ మందు
    క్రూర వైరి తూటాలకు గుండెఁ జూపె
    నాంధ్ర కేసరి యను పేర నలరె నతడు

    రిప్లయితొలగించండి
  2. పుట్టితి వట యీ రోజున
    పుట్టిన శ్రీ టంగుటూరి !పొ లుపుగ నీ కున్
    బిట్టున నిడుదును నతులను
    పట్టును సాధించి తీవు పర పాలన లోన్

    రిప్లయితొలగించండి
  3. నిన్నటి పద్యరచన :
    కొమ్మల్లో కువకువ రా
    వమ్ములకు మురిసి విరిసె ధవళ సుమదళముల్ !
    కమ్మని రాగాలకు జీ
    వమ్మేదైన పులకించ ప్రకృతి వరమ్మౌ !

    నేటి పద్యరచన :
    చెంగు చెంగున దూకగా సింగ మనుచు !
    బెంగ పడరె తెల్లదొరలు? కంగు తినుచు !
    తెగువ గలిగిన నాయక ధీరుడ వీవె !
    మరువ లేదయ్య మా జాతి మాన నీయ !
    సు"ప్రకాశమా" నీవె మా స్ఫూర్తి దాత !

    రిప్లయితొలగించండి
  4. అన్నపరెడ్ది సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *
    సహదేవుడు గారూ,
    మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
    ఈనాటి పద్యంలో ‘ధీరుడ వీవె’ అన్నచోట గణదోషం. ‘ధీరు డీవె’ అంటే సరి!

    రిప్లయితొలగించండి
  5. గురుదేవులకు ధన్యవాదాలు సవరించిన పద్యం :
    చెంగు చెంగున దూకగా సింగ మనుచు !
    బెంగ పడరె తెల్లదొరలు? కంగు తినుచు !
    తెగువ గలిగిన నాయకధీరుడీవె !
    మరువ లేదయ్య మాజాతిమాననీయ !
    సు"ప్రకాశమా" నీవె మాస్ఫూర్తి దాత!

    రిప్లయితొలగించండి
  6. కం అద్దము నిలిచెను ముందర
    హద్దులు లేనట్టి చూపు ఆంధ్రుల కొరకున్
    నిద్దుర లేపుచు యువతను
    సద్దుగ సమరముననాడు సత్తువ తోడన్
    కొరుప్రోలు రాధాకృష్ణ రావు

    రిప్లయితొలగించండి
  7. guruvu gariki namaskaramulu
    pusthakalu yekkuva chadava ledu ika mundu chaduvuthanu

    రిప్లయితొలగించండి
  8. గుండు కెదురు జూపె గుండెను తెలుపుల
    గుండె జారిపోయి క్రుంగి పోవ
    మొదటి ముఖ్య మంత్రి మొనగాడు తెలుగుల
    మదిని దోచినట్టి మానధనుడు

    రిప్లయితొలగించండి
  9. సకల మంగళములు నీకు జనని వాణి!
    శబ్ద రసరమ్య సామ్రాజ్ఞి జయము జయము!
    దివ్య వస్త్రధరి! సరస్వతీ! శుభమ్ము
    కలుగ జేయవె, జగతి సద్గతిని పొందు.

    రిప్లయితొలగించండి
  10. వైరినెదిరించి పోరాడి పౌరులెల్ల
    తెచ్చిరిదె స్వేచ్ఛ; మనకెల్ల దీని మహిమ
    తెలియ వచ్చిన మంచిది దేశమునకు;
    నుతుల పలుకుదు వారలను మది దలచి.

    రిప్లయితొలగించండి
  11. కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ‘చూపు + ఆంధ్రుల’ విసంధిగా వ్రాశారు. అక్కడ సంధి జరుగుతుంది. ‘చూపు లాంధ్రుల’ అనండి.
    *
    మిస్సన్న గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  12. తెలుగు రాష్ట్ర మునకు తొలిముఖ్యమంత్రిగ
    యాంధ్రకే సరియైన నాయకుండు
    అడలించి ఎదిరించి యాంగ్లేయ ప్రభువుల
    నాంధ్రకేసరియైన యాణిపూస
    స్వారాజ్య పత్రిక స్థాపించి యాంగ్లేయ
    దుశ్చర్య లన్నింటి దూఱినాడు
    మద్రాసు ప్రావిన్సు మంత్రిగ ప్రజలను
    యభివృద్ధి పనులతో యాదుకొనెను

    గుండె ధైర్యము గలిగిన మొండి వాడు
    దేశ భక్తి మెండుకొనిన దిట్టవీడు
    భావి పౌరుల కాదర్శ ప్రాయుడైన
    శ్రీ ప్రకాశం పంతులుగారు చిరయశస్వి

    రిప్లయితొలగించండి
  13. తెల్లవారల పొగరేమొ తెల్లబోవ
    తెలుగు ' వాడి ' ని జూపిన తెలుగు వాడ
    గుండు కెదురుగ నిలిచిన గుండె నీది
    ఆంధ్ర కేసరి జేజేలనందుకొమ్మ.

    రిప్లయితొలగించండి
  14. లక్ష్మీదేవి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *
    చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ సీసపద్యం బాగున్నది. అభినందనలు.
    ‘ముఖ్యమంత్రిగ నాంధ్రకే..’, ‘ప్రజల తా నభివృద్ధి పనులతో నాదుకొనెను’ అనండి. ‘ప్రకాశం పంతులు’ అన్నచోట గణదోషం. ‘శ్రీ ప్రకాశము పంతులు చిరయశస్వి’ అనండి.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  15. అంగమంగమంకితంబహా మహాంధ్ర సేవకై
    పొంగితీవు గంగవోలె పోరునందు స్వేచ్ఛకై
    టంగుటూరి సింగమా! హటాచ్చలద్భుజంగమా
    మంగళమ్ములందుకొమ్ము మా ప్రకాశమూర్తివై!!

    రిప్లయితొలగించండి