24, ఆగస్టు 2014, ఆదివారం

పద్యరచన - 656

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

10 కామెంట్‌లు:

  1. శ్రీగురుభ్యోనమ:

    జాడ లేదాయె వనములు బీడులాయె
    గూడు గోల్పోయె మృగరాజు కోపముడుగె
    దీనమైపోయె బ్రతుకులు దినదినంబు
    చింత జేసెడి సింగపు చిత్ర మిదియె

    దాహము తీరెడి మార్గము
    నూహింపగ శక్తిలేక నుస్సురుమనుచు
    న్నీహరి చతికిల బడినది
    శ్రీహరి నీవేను దిక్కు శీఘ్రము రావే

    మానవ మృగముల మధ్యన
    మా మనుగడ సాగుటెట్లు మాధవ గనుమా
    క్షేమము గూర్చుచు రయమున
    స్వామీ! కరుణింపుమయ్య సరసిజనేత్రా

    రిప్లయితొలగించండి
  2. శ్రీగురుభ్యోనమ:
    సవరణ
    జాడ లేదాయె వనములు బీడులాయె
    నీడ గోల్పోయె మృగరాజు నీరసించె
    దీనమైపోయె బ్రతుకులు దినదినంబు
    చింత జేసెడి సింగపు చిత్ర మిదియె

    తరువాఇ పద్యములు సింహము మదిలోని భావనలుగా ఊహించి వ్రాసినాను.

    రిప్లయితొలగించండి
  3. 'మోదీ మోదీ'అలసి సొలసి నది బెంగాలు టైగరు
    గుజరాతు జూలు సింహము సరసన అణగి మణగి
    అదిగో , దీదీ 'సింహపుర' విజయము
    కలసివచ్సినచో బెంగాలు టైగరు వీర విహారము !!

    చీర్స్
    జిలేబి

    రిప్లయితొలగించండి
  4. రెండుసింహములచ్చటపండుకొనుట
    చూడ ముచ్చట గలిగించుజూపరులకు
    వాని పొత్తులుజూడగవాహవహహ
    భేషుగాగని పించెనుబ్రీతి జూడు

    రిప్లయితొలగించండి
  5. వేటయు లేక తిన వేళకు మేతయు లేక యాకటన్
    కూటికి దేబిరించు గతిగూడెను పెంటియు సొమ్మసిల్లె యె
    చ్చోటనుగాంచినన్ వనులు శూన్యములయ్యెను గహ్వరంబు లున్
    చేటయె జంతుజాలములు చేడ్పడి క్రుస్సెను దిక్కులేమిచేన్

    రిప్లయితొలగించండి
  6. సేద దీరెడు వేళలో చేర సుతుని
    తండ్రి సింగము జిహ్వతో తాకి నిమిరె
    తల్లి దండ్రుల సాంగత్య తన్మయమ్ము
    తనివి దీర్చదు పుడమిన ననుభవించ!

    రిప్లయితొలగించండి
  7. హరియందురు మనుజులు కే
    సరియందురు మనల నెప్డు సరి దరి జేరన్
    హరిమనిపింతురు తమకే
    సరిపోవని హరిణ గణము చంపుకు తినగా !

    రిప్లయితొలగించండి
  8. ధీర గంభీరమైనట్టి దేహమున్న
    సింహరాజుకు ఎదురొడ్డి చేవతోడ
    నిలువ గల్గిన ధైర్యము నేలపైన
    నేరికి గలదు సృష్టిని ?యెఱుక లేదు.

    రిప్లయితొలగించండి
  9. శ్రీపతి శాస్త్రి గారూ,
    మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *
    చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    మొదటి పాదంలో గణదోషం. ‘వేటకు వీలులేక...’ అనండి.
    *
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి