28, ఆగస్టు 2014, గురువారం

పద్యరచన - 660 (శాపము)

కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశం...
“శాపము”

12 కామెంట్‌లు:

  1. శాపగ్రస్తుని స్వగతము :
    శాపము కాక యేమిటిది చచ్చుచు బ్రత్కుచు యీ భువిన్ యే
    లోపము లేక పోయినను లోకులు లోకువ చేసి చూచుచున్
    పాపము చేసినట్లు పెను బాధలు పెట్ట సహించుచున్ మన
    స్తాపము బొంది మార్కొనగ శక్తియు చాలక తల్లడిల్లితిన్

    రిప్లయితొలగించండి
  2. చందమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    మొదటిపాదం చివర గణదోషం. ‘బ్రత్కుచు’ అనడం సరికాదు. ‘చచ్చుచు బుట్టుచు భూమిపైన నే/ లోపము...’ అని అందామా?

    రిప్లయితొలగించండి
  3. శాపమునిచ్చెడు ఋషులకు
    బాపెడు శక్తియును గలిగి పక్వత తోడన్
    కోపము పైన నియంత్రణ
    చూపగలిగియుండిరనుట చొక్కపు నిజమౌ.

    రిప్లయితొలగించండి
  4. లక్ష్మీదేవి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  5. ధర్మ నిరతి భువిని గలిగిన క్రీడిలా
    శాపమేను వరము సజ్జనులకు
    పాప బుద్ధి గలుగ భస్మాసురునివలె
    శాపమౌను వరము సత్యమిదియె.

    రిప్లయితొలగించండి
  6. పాపముఁ జేసిన గతమున
    శాపముగా తాకు మీది జన్మమునైన
    న్బాపగ గత పాప ఫలము
    నాపరమేశుని భజించు డారాధనతో

    రిప్లయితొలగించండి
  7. మునులకు గోపము వచ్చిన
    వెనువెంటనె శాప మీయ వెనుకాడరుగా
    మనసంతయు రాజగుటను
    కనలేకను మునియు రాక కలిగెను శాపమ్

    ముని =దూర్వాసుడు
    మనసంతా రాజు =శకుంతలకు
    రాజు =దుష్యంతుడు

    రిప్లయితొలగించండి
  8. కోపము వచ్చిన మునులకు
    శాపము లిచ్చెదరుగాదె శాంతము లేకన్
    తాపసులిడు శాపములకు
    పాపము దశరధుడు కర్ణ భాధల నొందెన్

    రిప్లయితొలగించండి
  9. శ్రీగురుభ్యోనమ:

    కోపావేశము కలిగిన
    తాపములే మిగులుగాని దనురుగ జూడన్
    కోపము లుడిగిన వారికి
    శాపములే వరములగును శాంతినిగూర్చున్

    శిక్షను శిక్షగ తలచిన
    కక్షలు కలహములె కల్గు కలతలు మిగులున్
    శిక్షను శిక్షణ యనుకొన
    రక్షించును విద్యనొసగి రక్షకుని వలెన్

    రిప్లయితొలగించండి
  10. కం. మణు బూరెలు, గారెలు మరి
    చణకము మింగిన గణపతి జటరము బగులన్,
    అణకము లాడిన తారా
    గణ నాధుని కినుక బూని గౌ రి శపించెన్
    కొరుప్రోలు రాధా కృష్ణ రావు
    guruvu gariki namaskaramulu jataramu lo ta ane aksharam otthu ta ravatam ledu

    రిప్లయితొలగించండి
  11. పాపముఁ జేసితి నేమో?
    శాపముగా దాపురించె సంఘటనంచున్
    కోపము జెందకు మోయీ
    దీప మనెడు తెలివిఁ జూపి తీరుము మహిలో!

    రిప్లయితొలగించండి


  12. కవిమిత్రులు మన్నించాలి...
    హైదరాబాదుకు పోయి ఇప్పుడే తిరిగి వచ్చాను. ప్రయాణపు బడలిక వల్ల ఈనాటి పద్యాలను సమీక్షించలేకపోతున్నాను.
    వీలైతే రేపు ఉదయం పరిశీలిస్తాను.
    పద్యాలను పంపిన కవిమిత్రులందరికీ అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి