22, డిసెంబర్ 2011, గురువారం

సమస్యాపూరణం - 568 (గంగ మునిఁగిపోయె)


 కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది
గంగ మునిఁగిపోయె గంగలోన.

37 కామెంట్‌లు:

  1. శ్రీగురుభ్యోనమ:

    కర్షకులకు మిగిలె కష్టములు,తెలుగు
    గంగ మునిఁగిపోయె గంగలోన
    తెలుగునేల లోని తేటనైన జలము
    తమిళనాడు జేర తరలి పోగ

    రిప్లయితొలగించండి
  2. గంగ యనెడు పడవ గంగయ్య నడుపును
    పొంగు వచ్చి నదికి పోటు పెరిగి
    సుడిని జిక్కె నయ్యొ చూడగా నొకనాడు
    గంగ మునిఁగిపోయె గంగలోన.

    రిప్లయితొలగించండి
  3. గంగ గౌరి యనెడు కన్నెలు నెచ్చెలు
    లేగు పడవ మునుగ నీత రాని
    గంగ మునిగిపోయె గంగలోనను గాని
    యామె నాదుకొనియె నంత గౌరి

    రిప్లయితొలగించండి
  4. గంగ పేరు గలుగు గారాబు పట్టియ
    బోటు షైరు కేగ విటుని తోడ
    వెఱ్ఱి కేకలిడుచు వేమాఱు నఱు వంగ
    గంగ మునిగి పోయె గంగ లోన.

    రిప్లయితొలగించండి
  5. మాఘమందున స్నానమ్ము మరణ మొసగు
    ------------
    భక్తి శ్రధ్ధల గావించ భాగ్య మిచ్చు
    మాఘ మందున స్నాన మ్ము ,మరణ మొసగు
    రోగ పీడితు డైనట్టి రోగి కయ్య !
    పొల్లు గాదిది నిజమునె బల్కు చుంటి .

    రిప్లయితొలగించండి
  6. మాఘ మందున స్నానమ్ము మరణ మొసగు .
    -------------
    మాఘ మాసపు తానమ్ము మంచి దనుచు
    తల్లి తోడన నేగిన తనయ నదికి
    స్నాన మాడుచు జని పోయె సలిలమందు
    మాఘ మందున స్నానమ్ము మరణ మొసగు .

    రిప్లయితొలగించండి
  7. వెంకట రాజారావు . లక్కాకులగురువారం, డిసెంబర్ 22, 2011 10:00:00 AM

    మంగళ కరమైన మాహేశ్వరుని శిర
    స్సంగ పావన సుర గంగ భరత
    భూమివరము తొలగిపోయె నఘము మును
    గంగ మునిగి పోయె గంగ లోన

    రిప్లయితొలగించండి
  8. ఓం స్వామియే శరణమయ్యప్ప
    గురువు గారికి ధన్యవాదములు.
    -----------
    చదువు కొనెడి వారు చట్టములను జేయ
    గాడిద, శునకములు బడికి పోయె,
    వారిమధ్యనలిగి పారిపోయిన జ్ఞాన
    గంగ, మునిగిపోయె గంగలోన

    రిప్లయితొలగించండి
  9. నమస్కారం !

    ఆర్యా ! ఇది నా పూరణ ,

    ఊపిరున్ననాడు యుర్వినేలెదమంచు
    తిరిగినట్టి నృపులు తెలుసుకొనగ
    బ్రతుకు యంతమవ్వ భస్మంబుగనిక వే
    గంగ మునిగిపోయె గంగలోన

    రిప్లయితొలగించండి
  10. ఓం స్వామియే శరణమయ్యప్ప
    గురువు గారికి ధన్యవాదములు.
    -----------
    వ్యర్థములను విడువ వార్థక్యమును బొంది
    కంపుగోట్టె నేడు కంచ బంధ
    దమము దీర తాను తరళిపోయిన సుర
    గంగ ,మునిగి పోయె గంగ లోన

    (దమము = క్లే శమునోర్చుగుణము , కంచ బంధ = గంగ)

    రిప్లయితొలగించండి
  11. కాశివిశ్వనాథు కనులార గాంచంగ
    వారణాసికేగె వనిత మంగ
    పడతి ముక్కు పుడక పడిజారి,తా మును
    గంగ, మునిగి పోయె గంగ లోన !!!

    రిప్లయితొలగించండి
  12. ఈఁతరాని యొక్కఁ డెక్కె నాటుపడవ
    జారిపడెను, రక్ష కోరినాఁడు;
    కాని పడవవాఁడు గమనించకుండ సా
    గంగ, మునిఁగిపోయె గంగలోన.

    రిప్లయితొలగించండి
  13. శ్రీపతి శాస్త్రి గారూ,
    ‘తెలుగు గంగ’ను ముంచిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    గంగ పేరున్న పడవను ముంచి చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
    *
    పండిత నేమాని గారూ,
    అద్భుతమైన పూరణ. ఆటవెలది చివరి పాదాన్ని మూడవపాదంగా మార్చిన మీ నేర్పుకు వందనాలు.
    *
    సుబ్బారావు గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    ‘మాఘమందున స్నానమ్ము ..’ రెండు పూరణలూ బాగున్నాయి. అభినందనలు.
    మొదటి పూరణ చివరి పాదంలో యతి తప్పింది. ‘పొల్లు గాదిది నిజము చెప్పుదును నేను’ అంటే సరి!
    *
    లక్కాకుల వెంకట రాజారావు గారూ,
    ప్రశస్తమైన పూరణ. అభినందనలు.
    *
    వరప్రసాద్ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    రెండవ పాదంలో ప్రాసయతి తప్పింది. ‘గాడిద శునకములు కదలె బడికి’ అందాం.
    మీ రెండవ పూరణ కూడా బాగుంది.
    *
    కళ్యాణ్ గారూ,
    మీ ‘చితాభస్మం’ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    *
    మంద పీతాంబర్ గారూ,
    మీ ముక్కుపుడక మునక బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  14. మిత్రులకు నమస్కారములు.
    అప్పుడప్పుడు "ఈ పోస్టును బ్లాగు రచయిత తొలగించారు."
    అని కనబడు చున్నది.పోస్టును తొలగిం చడము ఎలాగో తెలియ జేయగలరు

    రిప్లయితొలగించండి
  15. విష్ణు పదము వీడి వెల్లువై ప్రవహించి
    శివుని శిరము పైన సుడులు తిరిగి
    భువిని మలిన మందు దివిజ పావన
    గంగ మునిఁ గి పోయె గంగ లోన
    -----------------------
    జలక మాడ నెంచి జలజాక్షి నదికేగె
    లోతు తెలుసు కొనక ప్రీతి గాను
    పెద్ద చేప యొకటి పెనుభూత మైపట్టి లా
    గంగ మునిఁగి పోయె గంగ లోన

    రిప్లయితొలగించండి
  16. నమస్కారములు
    సుబ్బారావు గారూ ! మనం వ్రాసిన దాని క్రింద " తారీకు టైము వస్తాయి కదా ! వాటి పక్కనే ఒక చిన్న టోపీ లాగ వస్తుంది . దానిని క్లిక్ చేస్తే , మీకు శంకరాభరణం బ్లాగు వస్తుంది అక్కడ " " వ్యాఖ్య తొలగించు " అని ఉంటుంది .అక్కడ క్లిక్ చేస్తే తొలగినట్టు వస్తుంది అప్పుడు మళ్ళీ తిరిగి మన శంకరాభరణం కి వచ్చెయ్యండి. అంతే. పైగా ఇంకొక సంగతి " ఆలస్యం అయితే ఆ గుర్తు ఉండదు. అప్పుడు , మీరు మళ్ళీ వ్రాయ దలుచుకున్నది వ్రాసి పోస్ట్ చేస్తే , పైన రాసిన దానికి అదీ రీతిగా గుర్తు వస్తుంది .అప్పుడు వద్దనుకున్నది చెరిపి వేయండి. అంతే .

    రిప్లయితొలగించండి
  17. సుబ్బారావు గారూ,
    మొన్న కూడ మీరీ విషయాన్ని ప్రశ్నించారు. సాంకేతిక నిపుణులైన మిత్రు లెవరైనా సమాధానం ఇస్తారేమో అని ఎదురుచూసాను. రేపు ఉదయంలోగా ఎవరైనా స్పందించకుంటే నాకున్న అల్పపరిజ్ఞానంతో వివరించడానికి ప్రయత్నిస్తాను.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    రెండు వైవిధ్యమైన పూరణలు పంపారు. చక్కగా ఉన్నాయి. అభినందనలు.
    కాకుంటే మొదటి పూరణ రెండవ పాదంలో యతి తప్పింది. ‘మృడుని శిరముపైన సుడులు తిరిగి’ అంటే సరి!

    రిప్లయితొలగించండి
  18. రాజేశ్వరి గారికి నమస్కారములు. మీరు చెప్పినట్లు చేయుదును.
    మీకు కృతజ్ఞతలు .

    రిప్లయితొలగించండి
  19. సోదరి రాజేశ్వరి గారూ!
    మీ 2 పూరణలలోను 3వ పాదములలో చివరి గణములు సరిపోలేదు. సరిజేసుకొనండి.

    రిప్లయితొలగించండి
  20. పండిత నేమాని వారూ,
    నేను గమనించలేదు సుమా! రాజేశ్వరి గారి ఆ దోషాలను ఇలా సవరిస్తున్నాను.
    ‘భువిని మలిన మందు దివిజాత పావన ’
    ‘పెద్ద చేప యొకటి పెనుభూత మగుచు లా’

    రిప్లయితొలగించండి
  21. పాపములను,దొలగి పావన జీవమ్ము
    ననుసరింప కాశి నభవు దలచి
    భక్తి తోడ సతియు బతియు ను,మును
    గంగ, మునిగిపోయె గంగ లోన.
    -------------

    రిప్లయితొలగించండి
  22. పురిటికందును గొనిపోయి కరుణమాలి
    గంగను విడువంగ గంగ, బెంగఁ
    జూచు శంతనునకు శోకమ్ము పొరలిపొం
    గంగ, మునిఁగి పోయె గంగ లోన.

    రిప్లయితొలగించండి
  23. ఆరోగ్యం దోబూచు లాడుతూ మిత్ర దర్శనానికి దూరం చేస్తోంది !

    అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    01)
    ______________________________

    గంబుర వలె నుండు - గంభీర మైనట్టి
    గంగ యనెడి యొక్క - గంగి గోవు
    గంగ ద్రావు చుండ - గ్రాహము పట్టంగ
    గంగ, మునిఁగి పోయె - గంగ లోన !
    ______________________________
    గంబుర = కర్పూరము
    గంగ = నీళ్ళు
    గ్రాహము = మొసలి

    రిప్లయితొలగించండి
  24. రాజేశ్వరక్కయ్య స్ఫూర్తితో :

    02)
    ______________________________

    గరుడి రవుతు పాద - కమలాల విడివడి
    గరళ కంఠు శిరము - గంతు లేసి
    గంధవతిని జేరి - గబ్బు నొంది ,గగన
    గంగ, మునిఁగి పోయె - గంగ లోన !
    ______________________________
    గరుడి రవుతు = విష్ణువు
    గరళకంఠుడు = శివుడు
    గంతు లేయు = దుముకు
    గంధవతి = భూమి
    గబ్బు = దుర్వాసన
    గగనగంగ = ఆకాశగంగ
    గంగలో మునిగి పోవు = పాడై పోవు

    రిప్లయితొలగించండి
  25. 03)
    ______________________________

    గాలవుం డొకండు - గాల మేసి నదిని
    గండె మీను పడిన - గంతు లిడెను !
    గట్టి గాను వాని - గజ జలచరము, లా
    గంగ; మునిఁగి పోయె - గంగ లోన !
    ______________________________
    గాలవుడు = జాలరి
    గండుమీను = మత్స్య విశేషము
    గజ జలచరము = పెద్ద జలచరము
    మునిఁగి పోయె గంగ లోన = నీళ్ళల్లో పడ్డాడు

    రిప్లయితొలగించండి
  26. సోదరులు వసంత కిషోర్ గారికి ధన్య వాదములు. నాకు రాయాలన్న తపనే గానీ సరిగా రాదు. ఇంత వరకు రాగలి గానంటే మీ రందరు అభి మానంతో పెట్టిన బిక్ష ఇంత మంచి పండితులకు నేను సోదరిని కావడం నా అదృష్టం. . మీ ఆరోగ్య మును జాగ్రత్తగా చూసు కోండి. ఈ వయసులో మనందరికీ శ్రద్ధ వహించడం చాలా అవుసరం.

    రిప్లయితొలగించండి
  27. 04)
    ______________________________

    గంగ గౌరి కలసి - గంగా నదిని జేరి
    గట్టు మీద బిందె - పెట్టు కొఱకు
    కలహ మాడి , తుదకు - గౌరితో పెనగిన
    గంగ, మునిఁగి పోయె - గంగ లోన !
    ______________________________

    రిప్లయితొలగించండి
  28. `కమనీయం’ గారూ,
    మంచి పూరణ. అభినందనలు.
    *
    ఊకదంపుడు గారూ,
    చక్కని పూరణ. అభినందనలు.
    నిన్న గంగ చిత్రం కోసం గూగుల్ లో వెదికితే మొదట దొరికింది శంతనుడు చూస్తుండగా గంగ పసికందును నీటిలో విడుస్తున్న చిత్రం. అదే విషయంగా పూరణ వస్తుందని ఎదురు చూసాను. అది మీ నుండి వచ్చించి. సంతోషం. అభినందనలు.
    *
    వసంత కిశోర్ గారూ,
    నిన్ననే అనుకున్నాను మీ గురించీ, గన్నవరపు వారి గురించీ.
    ఇప్పుడు ఆరోగ్యం కుదుటపడిందని భావిస్తాను. మీకు ఆయురారోగ్యాలను చేకూర్చాలని భగవంతుణ్ణి వేడుకుంటున్నాను.
    మీ నాలుగు పూరణలూ దేనికదే వైవిధ్యంగా చక్కగా ఉన్నాయి. అభినందనలు.

    పెక్కు దినంబులనుండియు
    చక్కని మీ పూరణముల జాడయె లేకన్
    నిక్కముగ లోటుఁ గంటిమి
    చొక్కముగా స్వాస్థ్య మంది శోభిల్లు మయా!

    పూర్వపు వడి యుత్సాహము
    లిర్వంకలఁ జూపుచున్ రచింపగఁ బద్యాల్
    సర్వశుభస్వాస్థ్యము లిడ
    శర్వుని ప్రార్థించెదన్ వసంత కిశోరా!
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  29. అక్కయ్యా ! నేనే నీకు ధన్యవాదాలు చెప్పాలి !
    యతుల వద్ద చిన్న చిన్న తప్పులున్నా , నీ భావావేశం అమోఘం !
    ఇంత వయసులో కూడా , అదీ విదేశాల్లో ఉంటూ
    తెలుగు కళామ తల్లికి సమర్పిస్తున్న నీ పద్య పుష్పాలు అనన్యం !
    నీ ఆరోగ్యం కూడా జాగ్రత సుమీ !

    రిప్లయితొలగించండి
  30. మాస్టరు గారు!ధన్యవాదములు.
    కిషోర్ జీ ! మీకు ఆరోగ్యం త్వరగా కుదుటపడి ప్రతి రోజు మీ కవితా ఝరి లో మమ్ములను మరింతగా తడపాలని కోరుకుంటున్నాను.

    రిప్లయితొలగించండి
  31. సోదరుల ఆదరాభి మానాలకు ఆనందంతో కళ్ళు చెమరుస్తున్నాయి విదేశ మన్న సంగతే గుర్తు రావటల్లేదు. అందరికీ ధన్య వాదములు

    రిప్లయితొలగించండి