3, జూన్ 2012, ఆదివారం

విశేష వృత్తము - 21

సరసాంకము -

లక్షణము -
గణములు - స జ స స య 
యతి : 10వ అక్షరము 
ప్రాస నియమము కలదు.


ఉదా:
పరమాంతరంగ నిలయా! పరమార్థతేజా!
పరితోష రూప విభవా! పరిపూర్ణ! రామా!
పరమేశ వర్ణిత కథా ప్రకర! ప్రశస్తా!
సరసీరుహాప్త వరవంశ శశాంక! రామా!

ఉత్పలమాల పాదమున మొదటి గురువును రెండు లఘువులుగా మార్చిన చంపకమాల అయినట్లు, వసంతతిలక లోని మొదటి గురువును రెండు లఘువులుగా మార్చిన సరసాంకము అగును, స్వస్తి!
పండిత నేమాని రామజోగి సన్యాసి రావు

14 కామెంట్‌లు:

  1. నిను నే దలంతు కలలో నిలలోననైనన్
    కనిపించినంత మదిలో కరువయ్యె చింతల్
    క్షణమైన నిన్ను గనినన్ చలియించె దానే
    మనసింక నన్ను విడి నీ మదిచేరెనేమో!

    రిప్లయితొలగించండి
  2. అల రాధ వేచెను కదా యమునానదిన్, దా
    నలవోక గానట సదా హసితమ్ములన్ , కో
    కిల గాన మాధురి వలెన్ కిలవాణియై, సే
    వల జేయ నెంచుచు సదా వలరాజ! నీకై!

    రిప్లయితొలగించండి
  3. తెలుగింటి యాడ పడుచూ తెలుగేల రాదూ
    తెలుగిల్లు కన్నఘనుడా తెలుగేల రాదూ
    తెలుగన్న మీకు వెగటా తెలుగన్న చేదా
    తెలుగన్న తీపి పలుకౌ తెలియంగ లేరా

    రిప్లయితొలగించండి
  4. ఆర్యా!నమస్తే. మీ బ్లాగులో పండిత నేమాని రామ జోగి సన్యాసిరావు గారు వివరిస్తున్న బంధకవిత్వాలు, విశేష వృత్తాలు చదివి స్పందించి సందర్భ వశాత్తు నా మిత్రుని గూర్చి వ్రాసిన సీసపద్యమును ఆంధ్రామృతంలో ఈ క్రింది లంకెలో చూడవచ్చును. మీకు, శ్రీ నేమాని వారికి ధన్యవాదాలు తెలిపుకొంటున్నాను.
    ఈ సీస పద్యంలో ఎన్ని విభిన్న ఛందస్సులు గల పద్యాలు గర్భితమై ఉన్నాయో గుర్తించారా?
    http://andhraamrutham.blogspot.in/2012/06/blog-post_4301.html

    రిప్లయితొలగించండి
  5. సరదాగా......

    ఉదయమ్మునందు శుచియై యుదకమ్ము స్టౌపై
    ముదమార కాచి పొడిలో మునుగంగ ఫిల్టర్
    పదిలమ్ము చేసి పనిలో పని కాచి పాలన్
    మదిగోరు చక్కెరనిడన్ మహ మంచి రంగై
    ఎద దోచు నా ఘుమఘుమల్ యిడు జిహ్వ కెంతో
    తుదిలేని కమ్మదనమున్ స్తుతి నీకు కాఫీ.

    రిప్లయితొలగించండి
  6. శ్రీమతి లక్ష్మీ దేవి గారి పద్యములు చాల బాగున్నవి.

    శ్రీ మిస్సన్న గారి తెలుగు కబురుల పద్యము చాల బాగున్నది. ఈనాడు వారికి కాఫీ మంచి రుచిలో మంచి డోసు పడినటులున్నది. పద్యము బాగున్నది.

    శుభాభినందనలు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  7. శ్రీమతి లక్ష్మీ దేవి గారికి:
    శ్రీ మిస్సన్న గారికి:

    పరువెత్తె మీ కలములున్ బహు తేజమొప్పన్
    సరసాంక వృత్తములతో సరసార్థ రీతిన్
    పరితోష మొందితిని మీ ప్రతిభల్ వెలుంగన్
    విరిజల్లులే కురియు దీవెనలౌచు మీపై

    శుభాభినందనలు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  8. లక్ష్మీదేవి గారూ,
    మీ రెండు పద్యాలూ చక్కగా ఉన్నవి. అభినందనలు.
    ‘కిలవాణి"...?
    *
    మిస్సన్న గారూ, ‘తెలుగు’ భాష, పద్యం వర్ధిల్లాలి!
    తెలుగు తియ్యందనాన్ని తెలిపిన మొదటి పద్యం, కాఫీపై షట్పది చాలా బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  9. గురువుగారు,
    ధన్యవాదాలండి. కిలవాణి అనే పదమునకు బదులుగా (నెమలి ) కృకవాకువు అని మారుస్తున్నాను. మన్నించండి.

    అల రాధ వేచెను కదా యమునానదిన్, దా
    నలవోక గానట సదా హసితమ్ములన్ , కో
    కిల గాన మాధురులతో; కృకవాకువై ; సే
    వల జేయ నెంచుచు సదా వలరాజ! నీకై!

    రిప్లయితొలగించండి
  10. యమునాతటిన్ అంటే సమంజసంగా ఉంటుంది.

    రిప్లయితొలగించండి
  11. అవును లక్ష్మీదేవి గారూ యమునా తటిన్ అనడమే సరైనది.

    రిప్లయితొలగించండి