11, జూన్ 2012, సోమవారం

సమస్యాపూరణం - 732 (వికలాంగుఁడు రథము నడిపె)

కవిమిత్రులారా...

ఈరోజు పూరించవలససిన సమస్య ఇది...


వికలాంగుఁడు రథము నడిపె వినువీథిపయిన్.

25 కామెంట్‌లు:

  1. అకటా వినతా సుతునకు
    నిక కాళ్ళే లేవు వాని నిన సారథిగా
    ప్రకటింపగ సంతసమున
    వికలాంగుఁడు రథము నడిపె వినువీథిపయిన్.

    రిప్లయితొలగించండి
  2. పురాణ ప్రవచనము వింటూ వినతాసుతుని అంగవైకల్యము గురించి విని మనోవైకల్యము చెందిన శ్రోతలతో, వక్త ......

    వికలముఁ జెందక వినుడీ
    సుకరముగను జనులు మెచ్చ సూర్యుని సేవల్
    చకచక జేయగ నెంచుచు
    వికలాంగుఁడు రథము నడిపె వినువీథిపయిన్.

    రిప్లయితొలగించండి
  3. ప్రకటితముగ రవి రథమున
    కొక అశ్వము.బాట లేదు.ఉజ్వలుఁడతఁడున్
    చకచకననూరుడనఁబడు
    వికలాంగుఁడు రథము నడిపె వినువీథిపయిన్.

    రిప్లయితొలగించండి
  4. ఒక "పర్యాయము""పంగువు"
    నకుఁ జెప్పుడు, కృష్ణుడేమి నడిపెను? తారా
    దిక మెచ్చటనో? యనగా
    వికలాంగుడు, రథము నడిపె, వినువీధిపయిన్.

    రిప్లయితొలగించండి
  5. అహో చూతము రారండి సాయిన్సు ఘనత
    గూగులు వారి ఆటో నావిగేషన్ తనకు తానై
    చతుశ్చక్ర వాహనమును నడుపు చందము
    వికలాంగుఁడు రథము నడిపె వినువీథిపయిన్

    జిలేబి.

    రిప్లయితొలగించండి
  6. సకలేంద్రియములు హయములు
    వికాలంగం బాత్మయె రథి విజ్ఞానముతో
    చకచక చిన్మయమగునా
    వికలాంగుడు రథము నడిపె వినువీధి పయిన్

    రిప్లయితొలగించండి
  7. టైపు పొరపాటునకు చిన్న సవరణతో:

    సకలేంద్రియములు హయములు
    వికలాంగం బాత్మయె రథి విజ్ఞానముతో
    చకచక చిన్మయమగునా
    వికలాంగుడు రథము నడిపె వినువీధి పయిన్

    రిప్లయితొలగించండి
  8. అకటా ! నడువ న శక్తుడు
    వికలాంగుడు , రధము నడిపె విను వీధి పయిన్
    వికల మనస్కు డ నూరుడు
    పకపకలే నాపి మీరు పలుకుడు జేజేల్.

    రిప్లయితొలగించండి
  9. పండిత శ్రీనేమాని వారి పూరణ అద్భుతం. నాకు చాలా నచ్చింది. ఐతే, నేను కూడా ఆ ఐడియాతోనే పూరిద్దామనుకొన్నాను, ఇప్పుడు మార్చుకోవాలి.

    రిప్లయితొలగించండి
  10. అయ్యా శ్రీ చంద్రశేఖర్ గారూ!
    శుభాశీస్సులు. మీరూ ప్రయత్నించండి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  11. గుండు మధుసూదన్ గారి పూరణ......

    కికురించి రావణియె మా
    యకు దిగి రథము వినువీథియం దిడె; సౌమి
    త్రి కినిసి స్థపతి చెయిఁ దఱుగ
    వికలాంగుఁడు రథము నడిపె వినువీథి పయిన్.
    (రావణి = ఇంద్రజిత్తు; స్థపతి = సారథి)

    రిప్లయితొలగించండి
  12. అకటా! సురాధిపతియే
    నకలంకితయౌనహల్యనక్కునఁజేర్చన్
    వికటిత మనంబునఁ మనో
    వికలాంగుఁడురధమునడిపెవినువీధిపయిన్.

    రిప్లయితొలగించండి
  13. శ్రీనేమనిగురువర్యులకు, నమస్సులు,చిన్నసందేహము: ఆత్మనువికలాంగమనవచ్చునా? మనస్సీ వికలాంగము కావచ్చునని నాకని పిస్తుంది.దయతోవివరించగలరు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  14. శ్రీ సహదేవుడు గారూ!
    ఆత్మ వికలాంగము కాదు సకలాంగము కాదు. అంగములతో సంబంధము ఉందా లేదా అని కూడా చెప్పలేము. ఒక్కొకచోట ఆత్మ అంటే మనస్సు అనే అర్థము కూడా చెప్పబడుతూ ఉంటుంది వేదాంత వాఙ్మయములో. కొన్ని వ్యవహారములలో చరాచర ప్రపంచమంతా ఆత్మగనే చెప్పబడుతూ ఉంటుంది. ఆత్మ కానిది ఏదీ లేదు కదా. అందుచేత ఆత్మను (లేక మనస్సును) వికలాంగము అని చెప్పేను(విదేహము అని అంటారు కదా). స్వస్తి.

    రిప్లయితొలగించండి
  15. వికలము చెందిన యరుణుడు
    సకలము త్యజియించి చనెను సూర్యుని సేవన్ !
    వికసితము నొంద గోరుచు
    వికలాంగుడు రధము నడిపె వినువీధి పయిన్ !

    రిప్లయితొలగించండి
  16. వికసింపగ నబ్జమ్ములు
    మకరములున్ మీనరాశి మనసిజుఁ జేరన్
    కృకవాకువు కో రవముల
    వికలాంగుడు రథము నడిపె వినువీధి పయెన్ !

    రిప్లయితొలగించండి
  17. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    *
    చింతా రామకృష్ణారావు గారూ,
    మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు, ధన్యవాదాలు.
    *
    సత్యనారాయణ మూర్తి గారూ,
    క్రమాలంకారంలో మీ పూరణ వైవిధ్యంగా ఉంది. అభినందనలు.
    *
    జిలేబీ గారూ,
    క్షమించాలి. మీ భావం అవగాహన కాలేదు.
    *
    పండిత నేమాని వారూ,
    మీ పూరణ సర్వోత్కృష్టంగా ఉంది. అభినందనలు.
    *
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    గుండు మధుసూదన్ గారూ,
    మీ పూరణ వైవిధ్యంగా చక్కగా ఉంది. అభినందనలు.
    *
    సహదేవుడు గారూ,
    వైవిధ్యంగా ప్రశస్తంగా ఉంది మీ పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  18. రాజేశ్వరి అక్కయ్యా,
    ఆహా! ఎంత చక్కని పూరణ... అభినందనలు.
    *
    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    ‘మకరములున్ మీనరాశి మనసిజుఁ జేరన్’ ఉదాత్తమైన భావన! మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  19. అకళంకుడు నలుడాయెన
    టకుడిపి; పిదప ఋతుపర్ణు డాదేశించన్
    సకలాశ్వ హృదయ మెరిగిన
    వికలాంగుఁడు రథము నడిపె వినువీథిపయిన్.

    రిప్లయితొలగించండి
  20. అక్కయ్య గారు,
    మీ పూరణ రెండవ పాదంలో యతి సరిపోయిందా?అయితే అది ఎలాగో అర్థం కావటంలేదు. దయచేసి చెప్పగలరు.

    రిప్లయితొలగించండి
  21. చంద్రశేఖర్ గారూ,
    మీ పూరణ వైవిధ్యంగా మనోహరంగా ఉంది. అభినందనలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    నిజమే స్మీ! నేను గమనించనేలేదు. ధన్యవాదాలు.
    ‘సూర్యుని సేవన్’ అన్నదాన్ని ‘సవితృని సేవన్’ అని సవరిస్తే సరి!

    రిప్లయితొలగించండి
  22. అకటా! ఒక వస్త్రముతో
    నొక సేనయు లేని గాంధి యొందెను జయమున్
    సుకవీ! అదియెట్లన్నన్
    వికలాంగుఁడు రథము నడిపె వినువీథిపయిన్

    రిప్లయితొలగించండి
  23. అకటా! కుమార సామిగ
    తికమక గాతెలివి లేక తిట్టుల తోడన్
    చకచక కర్ణాటకమున
    వికలాంగుఁడు రథము నడిపె వినువీథిపయిన్

    రిప్లయితొలగించండి