14, జూన్ 2012, గురువారం

రవీంద్రుని గీతాంజలి - 43

రవీంద్రుని గీతాంజలి

తెనుఁగు సేత

శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యులు

43

THE day was when I did not keep my-
self in readiness for thee ; and entering
my heart unbidden even as one of the
common crowd, unknown to me, my
king, thou didst press the signet of
eternity upon many a fleeting moment
of my life.

And to-day when by chance I light
upon them and see thy signature, I
find they have lain scattered in the
dust mixed with the memory of joys
and sorrows of my trivial days forgotten.

Thou didst not turn in contempt
from my childish play among dust, and
the steps that I heard in my playroom
are the same that are echoing from star
to star. 


చిలుకమఱ్ఱి రామానుజాచార్యుల అనువాదము....

నాథ! నీకోసమై యలనాడు నేను
చేయలే దించుకంతయు సిద్ధపాటు,
ఐన సామాన్య వేషముతోన నీవు
పిలుపు లేకుండ నాకును దెలియకుండ
మనసులోఁ జొచ్చి నాదు జీవనమునందు
వడివడిగఁ బోవు క్షణములపైఁ ద్వదీయ
నిత్యతాపూర్ణముద్రలు నిలిపినావు ||

వానిపైని హఠాత్తుగ వచ్చిపడిన
కాంతిలో నేడు నేనటు గాంతు నేని
గుర్తు చెడి మరపునఁ బడు కొన్నినాళ్ళ
క్రింది సుఖదుఃఖ విశ్లథస్మృతులతోడఁ
గలిసి తన్ముద్రలుం దుమ్ము గ్రమ్మి చెదరె ||

మట్టితో బొమ్మరిండ్లను గట్టి మురియు
నా పసితనంపు టాటల నడిమి నుండి
నీవు మరలిపోలేదు తృణీకరించి,
ఆటగదిలోన నాడు నే నాలకించు
నీ యడుగుసవ్వడి ప్రతిధ్వనించుచుండె
సూర్యచంద్రులలోఁ జుక్కచుక్కలోను ||

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి