మిస్సన్న గారూ, చాలా బాగుంది మీ పద్యం. అభినందనలు. ‘నాయికామణి’ అనాలికదా! ‘నాయిక వఁట!’ అంటే ఎలా ఉంటుంది? * పండిత నేమాని వారూ, సావిత్రి యశస్సును విశదీకరించిన మీ పద్యం మనోహరంగా ఉంది. అభినందనలు. * సుబ్బారావు గారూ, మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు. * రాజేశ్వరి అక్కయ్యా, చాలా మంచిపద్యం చెప్పారు. అభినందనలు. * లక్కరాజు వారూ, క్రమంతప్పకుండా బ్లాగును వీక్షిస్తూ, నచ్చినప్పుడు తప్పక స్పందించే మీ సౌజన్యానికి ధన్యవాదాలు.
సాటి లేరు నీకు సహజ నటీమణీ !
రిప్లయితొలగించండిమరువ గలమె ఎన్ని తరము లైన
మరల రావె భువికి మా ప్రియ సావిత్రి !
నాక మేలు చున్న నాయిక మణి!
చిత్ర పరిశ్రమన్ ప్రథమ శ్రేణి నటీమణిగా రసాఢ్యమౌ
రిప్లయితొలగించండిపాత్రలలో నటించి ప్రతిభా విభవమ్ము నభమ్ము దాక స
ర్వత్ర ప్రశంసలం గనిన భవ్య చరిత్ర పవిత్రమూర్తి సా
విత్రి యశమ్ము నిల్చు పృథివిన్ జిరకాలము సుస్థిరమ్ముగా
నీది యగు శైలి నొకదాని నిర్వ హించి
రిప్లయితొలగించండిపాత్ర లన్నియు, సెహబాసు బలుకు నట్లు
చిత్ర రంగాన రాణించు పుత్రి వమ్మ !
అందు కోవమ్మ ! సావిత్రి ! వంద నాలు .
కవుల కలమందు కదలాడు కావ్య మీవు
రిప్లయితొలగించండినవ రసమ్ములు కురిపించు నవ్య చరిత
మరపు రానట్టి ముత్యాల సరము గాదె
ఎదను పులకించు నచ్చర యంద మనగ
రాజేశ్వరి నేదునూరి గారూ
రిప్లయితొలగించండికవుల కలమందు కదలాడు కావ్య మీవు
నవ రసమ్ములు కురిపించు నవ్య చరిత
సావిత్రి మీద మీ పద్యం బాగుంది.
నమస్కారములు
రిప్లయితొలగించండి.లక్కరాజు గారికి ధన్య వాదములు
కన్నులతోనే భావము
రిప్లయితొలగించండిలన్నియుఁ బలికించునట్టి యభినయమున ని
న్నెన్ని మహానటిగా తెలుఁ
గన్నలు గుర్తింత్రు మేటి వని, సావిత్రీ!
మిస్సన్న గారూ,
రిప్లయితొలగించండిచాలా బాగుంది మీ పద్యం. అభినందనలు.
‘నాయికామణి’ అనాలికదా! ‘నాయిక వఁట!’ అంటే ఎలా ఉంటుంది?
*
పండిత నేమాని వారూ,
సావిత్రి యశస్సును విశదీకరించిన మీ పద్యం మనోహరంగా ఉంది. అభినందనలు.
*
సుబ్బారావు గారూ,
మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.
*
రాజేశ్వరి అక్కయ్యా,
చాలా మంచిపద్యం చెప్పారు. అభినందనలు.
*
లక్కరాజు వారూ,
క్రమంతప్పకుండా బ్లాగును వీక్షిస్తూ, నచ్చినప్పుడు తప్పక స్పందించే మీ సౌజన్యానికి ధన్యవాదాలు.